ఈమెని మీరు కచ్చితంగా గుర్తుపట్టలేరు. ఎందుకంటే అప్పుడెప్పుడో 2002లో తెలుగులో ఫస్ట్ సినిమా చేసింది. అది కూడా నాగార్జునతో. కానీ బ్యాడ్ లక్. అదృష్టం కలిసి రాలేదు. సినిమా హిట్ కాలేదు. అయితేనేం మరో సినిమలో అవకాశమొచ్చింది. అదీ ఫెయిలైంది. దీంతో తెలుగు దర్శకనిర్మాతలు ఈమెని పట్టించుకోలేదు. మధ్యలో ఓ తెలుగు మూవీలో గెస్ట్ రోల్ చేసింది అంతే. అలాంటి ఆమె ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించింది. ఇంతకీ ఈ హీరోయిన్‌ని గుర్తుపట్టారా? లేదా చెప్పేయమంటారా?
పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ పేరు గ్రేసీ సింగ్. ఈ పేరు ఎక్కడో విన్నట్లు, ఈమెని ఎక్కడో చూసినట్లు ఉంది కదా! అవును మీలో కొందరు కరెక్ట్‌గానే గెస్ చేశారు. 'సంతోషం' సినిమాలో నాగార్జున పక్కన హీరోయిన్‌గా చేసింది ఈమెనే. దిల్లీలో పుట్టి పెరిగిన ఈమె.. చిన్నప్పుడే భరతనాట్యం, ఒడిస్సీ లాంటి క్లాసికల్ డ్యాన్స్ నేర్చకుంది. అలా డాన్స్ గ్రూప్‌తో ప్రదర్శనలు ఇస్తూ గుర్తింపు తెచ్చుకుంది. పదిహేడేళ్లకే ఓ సీరియల్‌లో నటిగా కెరీర్ మొదలుపెట్టింది. 19 ఏళ్లకే సినిమాల్లోకి వచ్చేసింది.
(ఇదీ చదవండి: ఆ రూమర్స్‌పై 'భోళా శంకర్' నిర్మాత ఆగ్రహం.. చిరు ఎప్పుడూ!)
అయితే 2001లో ఆమిర్ ఖాన్ 'లగాన్' సినిమా గ్రేసీ సింగ్‌కి కాస్త పేరు తీసుకొచ్చింది. తెలుగులో ఒకే ఏడాది(2002)లో 'సంతోషం', 'తప్పు చేసి పప్పుకూడు' సినిమాలు చేసింది కానీ కలిసి రాలేదు. దీంతో బాలీవుడ్‌కి వెళ్లిపోయింది. 2010లో మరోసారి టాలీవుడ్‌లో 'రామరామ కృష్ణ', 'రామ్ దేవ్' అనే చిత్రాల్లో యాక్ట్ చేసింది గానీ బ్యాడ్ లక్. దీంతో మళ‍్లీ హిందీ, పంజాబీలో 2015 వరకు సినిమాలు చేసింది. ఆ తర్వాత సీరియల్స్‌లో నటిస్తూ బిజీ అయిపోయింది.
ఈమె నటిగా చాలా పేరు తెచ్చుకున్నప్పటికీ డ్యాన్స్ మాత్రం అస్సలు విడిచిపెట్టలేదు. మొన్నీమధ్య ప్రధాని నరేంద్ర మోదీ ముందు బ్రహ్మకుమారీస్ తరఫున ఫెర్ఫార్మెన్స్ కూడా ఇచ్చింది. అందుకు సంబంధించిన వీడియోని తన ఇన్ స్టాలో షేర్ చేసింది. అప్పట్లో అందంగా ఉన్న గ్రేసీ.. వయసు పెరిగేకొద్ది చాలా మారిపోయింది. తాజాగా ఆమె ఫొటోలు చూసి తెలుగు ప్రేక్షకులు కాస్త తికమక పడ్డారు. ఎవరో గుర్తొచ్చి కింద కామెంట్స్ చేశారు.
(ఇదీ చదవండి: పెళ్లి చేసుకోబోతున్న రానా తమ్ముడు! అమ్మాయి ఎవరంటే?)
Comments
Please login to add a commentAdd a comment