
సిరివెన్నెలకు అన్యాయం జరిగింది
పద్మ అవార్డుల ఎంపికలో తమకు అన్యాయం జరిగిందని కొందరు క్రీడాకారులు, సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్: పద్మ అవార్డుల ఎంపికలో తమకు అన్యాయం జరిగిందని కొందరు క్రీడాకారులు, సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ క్రీడాకారులు పంకజ్ అద్వానీ, గుత్తా జ్వాల తమను విస్మరించారని నేరుగా ఆరోపించగా.. సినీ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తరఫున సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ స్పందించారు.
పద్మ అవార్డుల ఎంపికలో సిరివెన్నెలకు అన్యాయం జరిగిందని పట్నాయక్ అన్నారు. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండూ సిరివెన్నెలను గుర్తించకపోవడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.