నా పెళ్లికి మిమ్మల్ని పిలుస్తా: రేణుదేశాయ్‌ | Renu Desai About Her Second Marriage | Sakshi

నా పెళ్లికి మిమ్మల్ని పిలుస్తా: రేణుదేశాయ్‌

Oct 19 2017 8:16 AM | Updated on Oct 19 2017 8:31 AM

Renu Desai About Her Second Marriage

సాక్షి, హైదరాబాద్‌: రేణు దేశాయ్ టాలీవుడ్లో పరిచయం అవసరం లేని పేరు. పవన్‌ కల్యాణ్‌ సతీమణిగా సుపరిచయం. వివాహం అనంతరం ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే పవన్‌, రేణు దేశాయ్‌లు విడాకులు తీసుకుని గత కొంత కాలంగా వేరుగా ఉంటున్నారు. విడాకుల అనంతరం పవన్ కళ్యాణ్ మరో వివాహం చేసుకోగా రేణు దేశాయ్ మాత్రం  పిల్లలు అకీరా నందన్‌, ఆద్యలతో కలిసి పూణే లో నివసిస్తున్నారు.

అనంతరం రేణు సినిమాలకు దర్శకత్వం వహించారు. అనంతరం తన అదృష్టాన్ని పరిక్షించకోవడానికి తెలుగు బుల్లి తెరపై అడుగు పెట్టారు. ఇందులో భాగంగా ప్రముఖ తెలుగు  టీవీ ఛానల్‌లో ప్రసారమవుతున్న డ్యాన్స్ షోకి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. తనదైన శైలిలో అలరిస్తున్నారు. తాజాగా ఈ షోలో ఓ జంట చేసిన డాన్స్‌కు రేణు ఫిదా అయ్యారు. వారిపై ప్రశంసలు కురిపించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు ప్రేమ మీద నమ్మకం పోయిందన్నారు.  'భవిష్యత్తులో మరో పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని పిలుస్తా' అంటూ కంటిస్టెంట్లను ఉద్దేశించి వ్యాఖ్యానించింది.

రేణుదేశాయ్‌ అంటే పవన్‌కల్యాణ్‌ అభిమానులకు ప్రత్యేక అభిమానం కనపరుస్తారు. పవన్‌ కల్యాణ్‌ను అభిమానించినట్లే ఆమెను అభిమానిస్తారు. ఆప్యాయంగా వదినమ్మా అంటూ పిలుచుకుంటారు. గతంలో రేణుదేశాయ్‌ సైతం ఈ విషయాన్ని ప్రస్తావించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement