
నందమూరి బాలకృష్ణ పైకి గంభీరంగా కనిపించే వ్యక్తి అయినా.. మనసు మాత్రం అతిసున్నితం అంటారు అభిమానులు. నా అనుకున్నవారి సంతోషం కోసం ఏం చేయడానికైనా వెనుకాడరని అటు అభిమానుల్లో, ఇటు సినీ ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. తాజాగా అలాంటి బాలయ్యబాబు తన గొప్పదనం చాటుకున్నారు. ఆయన సున్నిత మనసును చాటిచెప్పే ఓ ఉదంతం గురించి యాంకర్ ఉదయభాను గుర్తు చేసుకున్నారు. తన కవల పిల్లల పుట్టిన రోజుకు బాలయ్య ఎంతో పెద్ద మనసుతో వచ్చి ఆశీర్వదించడం గురించి మాట్లాడుతూ ఉదయభాను ఉద్వేగానికి గురైంది.
కుటుంబం కోసం చిన్న వయసులోనే సినీరంగానికి వచ్చానని చెప్పిన ఆమె... తన జీవితంలో వేడుకలు, సెలబ్రేషన్స్ అన్నవే లేవని వాపోయింది. జీవితంలోనే మొట్ట మొదటి పండగ తన కవల పిల్లల తొలి పుట్టిన రోజు అని, ఆ వేడుకలను పరిశ్రమకు చెందిన వాళ్లతో జరుపుకోవావలని ఉదయభాను అనుకున్నారట. ఆ సెలబ్రేషన్స్ కు రావాలని చాలామందికి ఫోన్ చేసినా ఎవరూ లిఫ్ట్ చేయలేదని ఆమె తెలిపారు. ‘ఆఖరిగా బాలయ్యకు ఒక మెసేజ్ పెట్టగా రావడానికి సంతోషంగా ఒప్పుకున్నారని... తర్వాతి రోజు ఆయనకు మీటింగ్ ఉన్నా కూడా ఫంక్షన్ కి వచ్చి వెళ్తానని చెప్పారట.’ కరెక్టుగా చెప్పిన సమయానికి సింహాంలాగా వచ్చారని, ఆ సమయంలో బాలయ్య తనుకు ఒక దేవుడులా కనిపించారంటూ ఉదయభాను తెలిపారు. అందరి సెలబ్రెటీల్లాగా ఐదు నిమిషాలు ఉండి వెళ్లిపోకుండా, 45 నిమిషాలు ఉండి అందరితో నవ్వుతూ ఫొటోలు దిగారని ... ఆయన లాంటి వాళ్లు ఇండస్ట్రీలో చాలా అరుదుగా ఉంటారంటూ... హ్యాట్సాఫ్ బాలయ్య అని ఉదయభాను అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment