anchor Udaya bhanu
-
క్యూట్‌గా నవ్వులు చిందిస్తున్న ఈ కవలలు ఎవరో తెలుసా?
ఎంతో క్యూట్‌గా నవ్వులు చిందిస్తున్న ఈ కవలలు ఎవరో తెలుసా? అలా అడిగితే గుర్తు పట్టడం కష్టం కానీ, మీకోసం ఈ ఫోటోకి సంబంధించి ఒక క్లూ ఇస్తే గుర్తు పట్టగలరేమో చెక్ చేసుకోండి. ఆ కవలల తల్లి టాలీవుడ్లో ఓ ప్రముఖ యాంకర్. అంతేకాదు హీరోయిన్గా కూడా కొన్ని సినిమాల్లో నటించింది. బుల్లి తెరపై తెలుగు తొలి తరం యాంకర్‌గా పేరు తెచ్చుకుంది. ఈ క్లూతో అయినా వారెవరో గుర్తించారా? గుర్తించటం కష్టంగా ఉందా..? ఓకే.. విషయం మేమే చెప్పేస్తాం. చిరు నవ్వులు చిందిస్తున్న ఈ క్యూట్ కవలలు.. యాంకర్ ఉదయభాను కూతుళ్లు. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఉదయం భాను. ఒకప్పుడు తెలుగులో టాప్ యాంకర్‌గా రాణించింది. ఆమెను ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది యాంకర్స్ బుల్లి తెరపైకి రంగ ప్రవేశం చేశారు. ఆమె నిన్న మొన్నటి వరకు కూడా ప్రేక్షకులను అలరిస్తూ వస్తూనే ఉంది. గర్భవతి అయినప్పటి నుంచి ఉదయ భాను యాంకరింగ్‌కి దూరంగా ఉంది. కవల పిల్లలకు జన్మనిచ్చిన చాలా రోజుల తర్వాత ఆమె కెమెరా ముందుకు వచ్చింది. ఆ మధ్య ఓ టీవీ చానల్ ప్రోగ్రామ్‌కి గెస్ట్‌గా వచ్చిన ఉదయ భాను.. తన ఇద్దరు పిల్లలను, భర్తను పరిచయం చేసింది. ఉదయభాను ఇప్పటి కూడా మునుపటి మాదిరే అందంగా ఉంది. దీంతో ఆమె మళ్లీ బుల్లి తెరపైకి వస్తుందేమో అని అంతా భావిస్తున్నారు. ప్రస్తుతం బుల్లి తెరపై సుమ, అనసూయ, రష్మీ, శ్రీముఖి వంటి వారు సత్తా చాటుతున్నారు. మరి వారికి పోటీగా ఈమె నిలుస్తుందా అనేది చూడాలి. -
ఆయన దేవుడులా కనిపించాడు : ఉదయభాను
నందమూరి బాలకృష్ణ పైకి గంభీరంగా కనిపించే వ్యక్తి అయినా.. మనసు మాత్రం అతిసున్నితం అంటారు అభిమానులు. నా అనుకున్నవారి సంతోషం కోసం ఏం చేయడానికైనా వెనుకాడరని అటు అభిమానుల్లో, ఇటు సినీ ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. తాజాగా అలాంటి బాలయ్యబాబు తన గొప్పదనం చాటుకున్నారు. ఆయన సున్నిత మనసును చాటిచెప్పే ఓ ఉదంతం గురించి యాంకర్ ఉదయభాను గుర్తు చేసుకున్నారు. తన కవల పిల్లల పుట్టిన రోజుకు బాలయ్య ఎంతో పెద్ద మనసుతో వచ్చి ఆశీర్వదించడం గురించి మాట్లాడుతూ ఉదయభాను ఉద్వేగానికి గురైంది. కుటుంబం కోసం చిన్న వయసులోనే సినీరంగానికి వచ్చానని చెప్పిన ఆమె... తన జీవితంలో వేడుకలు, సెలబ్రేషన్స్ అన్నవే లేవని వాపోయింది. జీవితంలోనే మొట్ట మొదటి పండగ తన కవల పిల్లల తొలి పుట్టిన రోజు అని, ఆ వేడుకలను పరిశ్రమకు చెందిన వాళ్లతో జరుపుకోవావలని ఉదయభాను అనుకున్నారట. ఆ సెలబ్రేషన్స్ కు రావాలని చాలామందికి ఫోన్ చేసినా ఎవరూ లిఫ్ట్ చేయలేదని ఆమె తెలిపారు. ‘ఆఖరిగా బాలయ్యకు ఒక మెసేజ్ పెట్టగా రావడానికి సంతోషంగా ఒప్పుకున్నారని... తర్వాతి రోజు ఆయనకు మీటింగ్ ఉన్నా కూడా ఫంక్షన్ కి వచ్చి వెళ్తానని చెప్పారట.’ కరెక్టుగా చెప్పిన సమయానికి సింహాంలాగా వచ్చారని, ఆ సమయంలో బాలయ్య తనుకు ఒక దేవుడులా కనిపించారంటూ ఉదయభాను తెలిపారు. అందరి సెలబ్రెటీల్లాగా ఐదు నిమిషాలు ఉండి వెళ్లిపోకుండా, 45 నిమిషాలు ఉండి అందరితో నవ్వుతూ ఫొటోలు దిగారని ... ఆయన లాంటి వాళ్లు ఇండస్ట్రీలో చాలా అరుదుగా ఉంటారంటూ... హ్యాట్సాఫ్ బాలయ్య అని ఉదయభాను అన్నారు. -
కేసీఆర్‌కు ఉదయభాను ఆహ్వానం
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును బుల్లితెర వ్యాఖ్యాత, నటి ఉదయభాను మర్యాదపూర్వకంగా కలిశారు. భర్తతో కలిసి బుధవారం సీఎం క్యాంప్ ఆఫీస్‌కు వచ్చిన ఆమె.. తమ పిల్లల పుట్టినరోజు వేడుకకు రావాల్సిందిగా సీఎంను ఆహ్వానించారు. ఉదయభాను దంపతుల విజ్ఞప్తికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్లో సెప్టెంబర 3న పిల్లల పుట్టిన రోజు వేడుక జరగనుంది. సీఎంతో భేటీ అనంతరం తన ఫేస్బుక్లో ఫొటోలు పోస్ట్ చేసిన ఉదయభాను.. ‘‘కేసీఆర్ దేశంలోనే డైనమిక లీడర్. మా పిల్లలకు ఆయన ఆశీర్వాదాలు వెలకట్టలేనివి’’ అని కామెంట్ పెట్టారు. ప్రేమ వివాహం చేసుకున్న ఉదయభాను గత ఏడాది కవలపిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.