Aata Geethika Now: Aata Geethika Shares Her Accident Story And Rumours She Faced - Sakshi
Sakshi News home page

'ఓ డ్యాన్స్‌ షోకు వెళ్తే అడుగు కూడా పెట్టనివ్వలేదు'.. గీతిక ఏమందంటే..

Published Tue, Jun 8 2021 11:28 AM | Last Updated on Wed, Jun 9 2021 3:58 PM

Aata Geethika Shares Her Accident Story And Rumours Ahe Faced - Sakshi

'ఆట' గీతిక మీకు గుర్తుంది కదా..అదేనండీ..సుందరం మాస్టార్‌ అంటూ ఎంతో బుజ్జిబుజ్జిగా మాట్లాడుతూ, చిన్న వయసులోనే డ్యాన్స్‌తో దుమ్మురేపిన చిచ్చరపిడుగే గీతిక. అప్పట్లో గీతిక పేరు మార్మోగిపోయింది. డ్యాన్స్‌ షో టైటిల్‌ గెలిచి మరింత పాపులర్‌ అయ్యింది. అయితే  ఆ తర్వాత చాలాకాలం వరకు తెరపై ఎక్కడా కనిపించలేదు. దీంతో గీతిక జీవితం ఎంత దుర్బరంగా మారింతో తెలుసా? ఆమె ఎంత దయనీయ స్థితిలో ఉందో చూడండి అంటూ పలు వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పరిస్థితులపై గీతిక స్పందించింది.

2012లో ఓ ఈవెంట్‌కు వెళ్లి వస్తుండగా తనకు పెద్ద ప్రమాదం జరిగిందని, దాంతో తన ఎడమకాలు, చేయి విరిగిపోయాయని తెలిపింది. తన తండ్రికి కూడా పెద్ద గాయాలు అయ్యాయని, కోలుకోవడానికి కొంత సమయం పట్టిందని పేర్కొంది. ఆ తర్వాత ఓ సినిమాతో పాటు పలు సీరియల్స్‌లో నటించానని, అయితే అనుకున్నంత గుర్తింపు రాలేదని పేర్కొంది. మరోవైపు ఉద్యోగ రీత్యా తన తల్లిదండ్రులు దుబాయ్‌కి వెళ్లాల్సి రావడంతో తాను అమ్మమ్మ-తాతయ్యల దగ్గర పెరిగానని, ఆ టైంలో తనతో పాటు షూటింగ్‌లకు రావడం వాళ్లకు కష్టం అయ్యేదని, అందుకే బ్రేక్‌ ఇ‍వ్వాల్సి వచ్చిందని తెలిపింది.

'ఆ సమయంలో నాపై రకరకాలుగా వీడియోలు పుట్టకొచ్చాయి. ‘గీతిక అవకాశాలన్నింటినీ వెనక్కి తీసుకున్నారు. ఓ షోకి వెళ్తే అడుగు కూడా పెట్టనివ్వలేదు‘, ‘గీతిక గురించి తెలిస్తే కన్నీళ్లు పెట్టకుండా ఉండలేరు’ లాంటి వీడియోలు చాలానే వచ్చాయి. అయితే అవన్ని అసత్య ప్రచారాలే. నాకు కూడా తెలియకుండా ఇలా ఎప్పుడు జరిగిందా అని ఆ వీడియోలు చూసి అనుకునేదాన్ని' అని గీతిక  వివరించింది. ప్రస్తుతం తాను ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ చదవుతున్నానని, ఇప్పటికీ డ్యాన్స్‌ని మర్చిపోలేదని చెప్పింది. డ్యాన్స్‌ తన డీఎన్‌ఏలోనే ఉందని, నెక్స్ట్‌ ఇయర్‌ కెరీర్‌ పరంగానూ ఆలోచిస్తానని పేర్కొంది. మంచి అవకాశాలు వస్తే తప్పకుండా చేస్తానని తెలిపింది. 

చదవండి : గుర్తుపట్టరాని విధంగా మారిపోయిన హీరోయిన్ మీనాక్షి
రోడ్డు దాటుతుండగా ప్రమాదానికి గురైన నటి.. పరిస్థితి విషమం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement