ఆఫ్‌లైన్‌లో గూగుల్ మ్యాపులు... | Use Google Maps and GPS offline on your Android device | Sakshi
Sakshi News home page

ఆఫ్‌లైన్‌లో గూగుల్ మ్యాపులు...

Published Wed, Nov 19 2014 12:37 AM | Last Updated on Sat, Sep 2 2017 4:41 PM

ఆఫ్‌లైన్‌లో గూగుల్ మ్యాపులు...

ఆఫ్‌లైన్‌లో గూగుల్ మ్యాపులు...

కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు గూగూల్ మ్యాపులు తోడుంటే ఎంత భరోసాగా ఉంటుందో చెప్పలేం. మరి మీరు వెళ్లిన చోట నెట్ సిగ్నల్స్ రాకపోతే? ఇబ్బందేకదూ... ఆఫ్‌లైన్‌లోనూ గూగుల్ మ్యాపులను ఎలా చూడవచ్చో తెలుసుకుంటే ఈ చికాకు నుంచి కూడా తప్పించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. గూగుల్ ఈమధ్యనే ప్రవేశపెట్టిన కొత్త ఫీచర్ ద్వారా ఇది సాధ్యమవుతోంది. ట్రాఫిక్, నావిగేషన్ అడ్రస్‌లు వంటి కొన్ని ఫీచర్లు లేకపోయినప్పటికీ మీరు ఎక్కడున్నారో తెలుసుకునేందుకు, తద్వారా గమ్యాన్ని సులువుగా చేరేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇంకెందుకు ఆలస్యం... మ్యాప్‌లను ఆఫ్‌లైన్‌లో పొందండి ఇలా...
 
ఆండ్రాయిడ్, ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. కాకపోతే ఐఫోన్ వినియోగదారులు తాజా మ్యాప్స్ ఆప్ (గూగుల్ మ్యాప్స్ వెర్షన్ 3), ఆండ్రాయిడ్ వినియోగదారులైతే (వెర్షన్ 8)ను ఉపయోగించాల్సి ఉంటుంది.
1.    ముందుగా గూగుల్ అకౌంట్‌తో సైన్ ఇన్ కావాలి.
2.    సెర్చ్‌బార్‌లో ‘ఓకే మ్యాప్స్’ అని టైప్ చేయండి. వెంటనే స్క్రీన్‌పైభాగంలో ‘సేవ్ దిస్ మ్యాప్’ అన్న డైలాగ్ కనిపిస్తుంది.
3.    మ్యాప్‌ను అవసరమైతే జూమ్ ఇన్ లేదా జూమౌట్ చేసుకుని మీకు కావాల్సిన ప్రాంతాన్ని గుర్తించి సేవ్ చేసుకోండి. ఉదాహరణకు మీకు హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంకు కావాలనుకుందాం. అక్కడి వరకూ జూమ్ చేసుని సేవ్ బటన్‌ను ప్రెస్ చేయాలన్నమాట. ఆ తరువాత మీరు ఆఫ్‌లైన్‌లోనైనా ఆ ప్రాంతాన్ని మరింత జూమ్‌ఇన్ చేసుకుంటూ చూసుకోవచ్చు.
4.    మ్యాప్ సేవ్ బటన్ నొక్కగానే మ్యాప్‌కు పేరుపెట్టమని కోరుతూ ఓ డైలాగ్ బాక్స్ ప్రత్యక్షమవుతుంది. నచ్చిన పేరు టైప్ చేసి సేవ్ చేసుకోండి. అంతే...
 
ఆఫ్‌లైన్‌లోనూ మీకు అవసరమైన మ్యాప్‌లు అందుబాటులోకి వచ్చేస్తాయి. మ్యాప్స్ స్క్రీన్‌పై కనిపించే వ్యక్తి బొమ్మను క్లిక్ చేస్తే మీ ప్రొఫైల్ అందుబాటులోకి వస్తుందికదా... దాంట్లోనే మీరు సేవ్ చేసుకున్న మ్యాప్‌లు కూడా ఉంటాయి. కావాల్సిన దాన్ని ఓపెన్ చేసుకుని చూసుకోవచ్చు. ఆఫ్‌లైన్ మ్యాప్‌లతో కొన్ని పరిమితులు ఉంటాయన్న విషయం ఎప్పుడూ గుర్తుంచుకోండి. ముందుగా మరీ ఎక్కువగా జూమ్ చేసుకోలేరు. రెండో పరిమితి. సేవ్ చేసుకున్న మ్యాప్‌లు నెల రోజులపాటు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement