offline
-
రిలయన్స్ రిటైల్ భాగస్వామ్యంతో కొరియన్ స్కిన్‌కేర్ & మేకప్ బ్రాండ్ ఎంట్రీ
సౌందర్య ప్రియులు,బ్యూటీ ఇండస్ట్రీ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రముఖ కొరియన్ చర్మ సంరక్షణ మేకప్ సంచలనం టిర్టిర్( TIRTIR) ఇండియాలో లాంచ్ అయింది. రిలయన్స్ రిటైల్‌కు చెందిన టిరాతో కలిసి ఇది ఆఫ్‌లైన్ రిటైల్ మార్కెట్లో అరంగేట్రం చేసింది. భారతీయ బ్యూటి ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని రిలయన్స్ ప్రకటించింది. Tira స్టోర్లు, Tira యాప్ ద్వారా ఇది అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ సందర్బంగా కొనుగోలుదారులకు ఆఫర్లను కూడా అందిస్తోంది.ముఖ్యంగా మాస్క్ ఫిట్ రెడ్ కుషన్ ఫౌండేషన్,ఆకట్టుకునే 30 షేడ్స్‌తో తీసుకొచ్చింది. మిల్క్ స్కిన్ టోనర్, సిరామిక్ మిల్క్ ఆంపౌల్, మాస్క్ ఫిట్ మేకప్ ఫిక్సర్ లాంటి అద్భుతమైన ఉత్పత్తులను లాంచ్ చేసినట్టు కంపెనీ తెలిపింది.చర్మ సంరక్షణ-జాగ్రత్తలుఏ సీజన్లో అయినా చర్మ ఆరోగ్య సంరక్షణ చాలా అవసరం. చర్మాన్ని తేమగా ఉంచుకునేందుకు జాగ్రత్తలు పాటించాలి. తాజా పండ్లు, కూరగాయలతోపాటు సరిపడా నీళ్లు తాగాలి. చర్మ సంరక్షణకు హైడ్రేటింగా ఉండటం, రిఫ్రెషింగ్ చాలా కీలకం. చర్మం కాంతివంతంగా ప్రకాశించేలా ఉండాలంటే ఎండలో ఉన్నా, నీడలో ఉన్నా సన్ స్క్రీన్ లోషన్ వాడాలి.దుమ్ముధూళికి దూరంగా ఉండాలి. కెమికల్స్ వాడని సహజమైన సౌందర్య ఉత్పత్తులను వినియోగించాలి. నాణ్యమైన బ్రాండ్లను ఎంచుకోవాలి.ఒత్తిడికి, ఆందోళనకు దూరంగా ఉండాలి. మ్యాకప్ విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే మరిన్ని సమస్యలొచ్చే ప్రమాదం ఉంది. బ్యూటీ నిపుణులు, స్కిన కేర్ వైద్య నిపుణుల సలహాల మేరకు ఉత్పత్తులను వాడాలి.ఎప్పటికపుడు మేకప్‌ను రిమూవ్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం -
మూడు గంటల ముచ్చట..
నగర ప్రజలు యాంత్రిక జీవనానికి అలవాటుపడ్డారు. దైనందిన జీవితంలో ఫోన్ కూడా ఒక భాగమైపోయింది. దీంతో మొబైల్ ఫోన్లలో 24 గంటలూ ఇరుక్కుపోయి తమ అభిరుచులకు దూరమవుతున్నారు. ఎంతో విలువైన బంధాలను, అనుబంధాలను దూరం చేసుకుంటూ స్నేహాలను కోల్పోతున్నారు. ఇలాంటి ప్రస్తుత తరుణంలో కొంతమంది యువతీ యువకులు ఇన్‌స్టా వేదికగా ‘ఆఫ్‌లైన్ క్లబ్’ పేరుతో ఇటీవల ఓ గ్రూపును ఏర్పాటుచేసుకున్నారు. ఈ గ్రూపు సభ్యులు రోజులో మూడు గంటల పాటు గ్యాడ్జెట్లకు దూరంగా ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. ఈ క్లబ్లో కేవలం యువతీ యువకులే కాకుండా పెద్ద వాళ్లు కూడా చేరి తమ పేర్లను రిజిస్టర్ చేసుకుంటున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం.. వారంతా యువతీ యువకులు.. వీళ్లు వారంలో ఒకరోజు మూడు గంటల పాటు మొబైల్ ఫోన్లకు స్వస్తి పలుకుతారు.. కొత్త ఆలోచనలను సహచరులతో పంచుకుంటారు.. అభిరుచులను ఒకరి నుంచి ఒకరు పంచుకుంటారు.. ఇష్టమైన కార్యక్రమాల్లో నిమగ్నమవుతారు.. పుస్తకాలు చదివి అందులో సారాంశాన్ని, లోటుపాట్లను, మంచి చెడులను విశ్లేషిస్తారు.. బుక్ రీడింగ్.. ఆథర్మీట్, జ్యువెలరీ మేకింగ్..ఇష్టమైన సినిమా.. ఇలా నెలలో నాలుగు సార్లు లైఫ్ మైండెడ్ పీపుల్స్ (ఒకే రకమైన ఆలోచనలు ఉన్నవారు) ఒక చోట చేరి ముచ్చటించుకుంటారు.. ఆపై ఆడతారు..పాడతారు. 900కు పైగా సభ్యులు.. ఈ క్లబ్లో సుమారు 900 మందికి పైగా సభ్యులు ఉన్నారు. ఇందులో వివిధ అభిరుచులకు, ఆలోచనలకు ఆకర్షితులై గ్రూపులుగా ఏర్పడి ప్రతినెలా ఏదో ఒక చోట నాలుగు సార్లు కలుసుకుంటుంటారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ ప్రాంతాల్లో ప్రతివారం ఇన్‌స్టా వేదికగా సమయం, సందర్భం తెలిపేలా పోస్టులు పెట్టుకుని కలుసుకుంటుంటారు. పాత సినిమాలపై విశ్లేషణ చేస్తారు..అలాగే ఎవరైనా కొత్తగా నవలలు రాస్తే.. ఆ నవలను చదివే వారికి ఇచ్చి చదవమని 20 రోజులు సమయం ఇస్తారు. ఆ తర్వాత మరో కార్యక్రమాన్ని ఏర్పాటుచేసి రచయితతో ముఖాముఖి ఏర్పాటుచేయడమే కాకుండా, ఆ నవలలో తమ అభిప్రాయాలను విశ్లేషిస్తూ నిస్సంకోచంగా వెల్లడిస్తుంటారు. నెలలో నాలుగు సార్లు.. ఈ గ్రూపులో మెల్లమెల్లగా సభ్యుల సంఖ్య పెరిగింది. ప్రతినెలా నాలుగు సార్లు కెఫేలలో వీరు కలుసుకోవడమే కాకుండా మూడు గంటల పాటు చర్చలు, విమర్శలు, ప్రతి విమర్శలు, తమలో నైపుణ్యాన్ని వెలికితీస్తారు. తమ అభిప్రాయాలను 10 మందితో పంచుకుంటారు. విశేషమేమిటంటే ఈ మూడు గంటల పాటు మొబైల్ ఫోన్లను పక్కన పట్టేస్తారు. ఆ సమయంలో ఎటువంటి ఫోన్ కాల్స్ కూడా అటెంప్ట్ చేయరు.24 ప్రోగ్రామ్స్ చేశాం.. బుక్ ఆఫ్ మంత్, సినిమాలు, పుస్తకాల ఆవిష్కరణ, రీడింగ్ కమ్యూనిటీలలో రచయితలతో ముఖాముఖి, జ్యువెలరీ మేకింగ్ ఇలా పలు రంగాలపై ఇప్పటివరకూ 24 ప్రోగ్రామ్స్ నిర్వహించాం. వీటికి ఎంతో ఆదరణ లభించింది. ఒక్కో వారం ఒక్కో ప్రోగ్రాంతో ముందుకెళ్తున్నాం. ఎక్కడ కలుసుకోవాలో ముందుగా తెలియజేస్తాం. త్వరలోనే స్పోర్ట్స్ కూడా ప్రవేశపెట్టాలని అనుకున్నాం. ఆయా రంగాల్లో అభిరుచి ఉన్నవారు మాత్రమే ఆయా కార్యక్రమాలకు హాజరవుతుంటారు. ఇలా తమకు తెలిసిన థీమ్‌ను ఎంచుకుని నటించే అవకాశాన్ని కలి్పస్తున్నాం. బిశ్వరూప బారిక్, ఆఫ్‌లైన్ క్లబ్ వ్యవస్థాపకురాలు..గత జులైలో ప్రారంభం.. కరోనా తర్వాత హైదరాబాద్ రీడ్స్ పేరుతో కొంతమంది యువత ఇన్‌స్టా వేదికగా కేబీఆర్ పార్కు, బొటానికల్ గార్డెన్స్‌లో ప్రతి శనివారం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకూ 2 గంటల పాటు ఒకచోట చేరి తమకిష్టమైన పుస్తకాలను చదివే కార్యక్రమాన్ని చేపట్టారు. కేవలం పుస్తకాలు చదవడమే కాకుండా తమకు ఇష్టమైన వ్యాపకాలను పంచుకుంటే బాగుంటుందని ఆఫ్‌లైన్ క్లబ్ వ్యవస్థాపకురాలు బిశ్వరూప బారిక్‌కు పలువురు సూచించారు. దీంతో ఆమె గత జులైలో ఇన్‌స్టా వేదికగా ఆఫ్‌లైన్ క్లబ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనికి చాలామంది ఆకర్షితులయ్యారు. లైక్ మైండెడ్ పీపుల్స్ ఒక చోట చేరి తమ అభిప్రాయాలను, అభిరుచులను పంచుకోవడం ప్రారంభించారు. -
పాన్ కార్డులో మార్పులు చేసుకోండిలా..
పర్మినెంట్ అకౌంట్ నంబర్ (పాన్) అనేది ఆదాయపు పన్ను ఫైలింగ్‌కు అవసరమైన కీలకమైన గుర్తింపు పత్రం. ఇందులో పేరు, పుట్టిన తేదీ, ఫోటో, సంతకం, తండ్రి పేరు, ఆధార్, లింగం, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ, చిరునామా లేదా సంప్రదింపు సమాచారం వంటి వివరాలు సరైనవి ఉండడం చాలా అవసరం.ఈ వివరాల్లో ఏవైనా తప్పుగా ఉన్నా, మారినా వెంటనే సరిచేసి పాన్ కార్డును అప్డేట్ చేసుకోవడం మంచిది. ఎన్ఎస్డీఎల్ లేదా యూటీఐఐటీఎస్ఎల్ వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్లో పాన్ కార్డు వివరాలను అప్డేట్ చేసుకునే అవకాశం ఉంది. అయితే మీరు మొదట ఎన్ఎస్డీఎల్ వెబ్సైట్ ద్వారా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసి ఉంటే అదే వెబ్సైట్లోనే పాన్ వివరాలను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒక వేళ యూటీఐఐటీఎస్ఎల్ వెబ్సైట్ ద్వారా చేసినట్లయితే ఆ వెబ్సైట్ ద్వారానే పాన్ కార్డు వివరాలను అప్డేట్ చేయాలి.NSDL e-Gov పోర్టల్‌లో.. స్టెప్ 1: NSDL e-Gov పోర్టల్‌ను ఓపెన్ చేయండిస్టెప్ 2: 'సర్వీసెస్' ట్యాబ్‌లోకి వెళ్లి డ్రాప్‌డౌన్ మెనూ నుంచి 'పాన్' ఎంచుకోండి.స్టెప్ 3: 'చేంజ్/కరెక్షన్ ఇన్ పాన్ డేటా' అనే విభాగం కోసం స్క్రోల్ చేసి 'అప్లై' మీద క్లిక్ చేయండి.స్టెప్ 4: అవసరమైన వివరాలతో ఆన్లైన్ పాన్ అప్లికేషన్ ఫామ్‌ను పూర్తి చేయండిస్టెప్ 5: విజయవంతంగా నమోదు చేసిన తర్వాత, ఈ-మెయిల్ ద్వారా టోకెన్ నంబర్ వస్తుంది. ఈ టోకెన్ నెంబరు సెషన్ సమయం ముగిసినట్లయితే ఫారం డ్రాఫ్ట్ వెర్షన్ కు తీసుకెళ్తుంది. ఇక్కడ 'కంటిన్యూ విత్ పాన్ అప్లికేషన్ ఫామ్' పై క్లిక్ చేయాలి.స్టెప్ 6: ఈ-కేవైసీ, ఈ-సైన్ (పేపర్ లెస్) ద్వారా డిజిటల్ గా సబ్మిట్ చేయండిస్కాన్ చేసిన ఇమేజ్ లను ఈ-సైన్ ద్వారా సబ్మిట్ చేయండిఅప్లికేషన్ డాక్యుమెంట్ లను భౌతికంగా ఫార్వర్డ్ చేయండి అని మూడు ఆప్షన్లు కనిపిస్తాయి.ఆధార్ ఓటీపీ ద్వారా ఆన్లైన్లో ప్రక్రియను పూర్తి చేయడానికి, 'ఈ-కేవైసీ & ఈ-సైన్ (పేపర్‌లెస్) ద్వారా డిజిటల్‌గా సబ్మిట్ చేసే మొదటి ఆప్షన్‌ను ఎంచుకోండి.స్టెప్ 7: అప్డేట్ చేసిన పాన్ కార్డు కొత్త ఫిజికల్ కాపీ మీకు అవసరమని సూచించండి. దీనికి నామమాత్రపు ఛార్జీలు వర్తించవచ్చు.స్టెప్ 8: మీ ఆధార్ నంబర్ చివరి నాలుగు అంకెలను నమోదు చేయండి.స్టెప్ 9: అవసరమైన వివరాలను అప్డేట్ చేసి, సంబంధిత దిద్దుబాటు లేదా అప్డేట్ ఎంచుకోండి. 'కాంటాక్ట్ ఇతర వివరాలు' పేజీకి వెళ్లడానికి 'నెక్ట్స్' మీద క్లిక్ చేయండి.స్టెప్ 10: కొత్త చిరునామా, అప్డేటెడ్ మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్ చిరునామాను నమోదు చేయండి.స్టెప్ 11: పాన్ కాపీతో పాటు అప్డేట్ చేసిన వివరాలకు సంబంధించిన ప్రూఫ్ డాక్యుమెంట్లను జతచేయండి.స్టెప్ 12: మీ పేరును పేర్కొనడం ద్వారా డిక్లరేషన్ విభాగాన్ని పూర్తి చేయండి.స్టెప్ 13: మీ ఫోటో, సంతకం కాపీని జతచేసిన తర్వాత 'సబ్మిట్' మీద క్లిక్ చేయండి.స్టెప్ 14: ఫారం ప్రివ్యూను సమీక్షించుకుని, మీ ఆధార్ నంబర్ మొదటి ఎనిమిది అంకెలను నమోదు చేయండి.స్టెప్ 15: పాన్ కార్డ్ కరెక్షన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత పేమెంట్ పేజీకి వెళ్లండి. వివిధ పేమెంట్ గేట్ వేల ద్వారా పేమెంట్ చేయవచ్చు. విజయవంతంగా చెల్లించిన తరువాత, చెల్లింపు రశీదు జారీ అవుతుంది.స్టెప్ 16: పాన్ కార్డ్ అప్డేట్ / కరెక్షన్ ప్రక్రియను ఖరారు చేయడానికి, 'కంటిన్యూ' మీద క్లిక్ చేయండి. నియమనిబంధనలను అంగీకరించి 'అథెంటికేట్' మీద క్లిక్ చేయడం ద్వారా కేవైసీ ప్రక్రియను పూర్తి చేయండి.స్టెప్ 17: మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆన్లైన్ పాన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి.స్టెప్ 18: తర్వాత స్క్రీన్‌పై ఈ-సైన్‌తో 'కంటిన్యూ' మీద క్లిక్ చేయండి.స్టెప్ 19: నియమనిబంధనలను అంగీకరించి, మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, 'సెండ్ ఓటీపీ' పై క్లిక్ చేయండి.స్టెప్ 20: వెరిఫికేషన్ కోసం మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపిన ఓటీపీని ఎంటర్ చేయండి. అక్నాలెడ్జ్ మెంట్ ఫారాన్ని డౌన్ లోడ్ చేసుకోండి. ఈ ఫైలును తెరవడానికి పాస్ వర్డ్ DD/MM/YYYY ఫార్మెట్ లో మీ పుట్టిన తేదీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.UTIITSL పోర్టల్‌లో ఇలా..స్టెప్ 1: UTIITSL వెబ్‌సైట్‌ను తెరవండిస్టెప్ 2: 'చేంజ్/కరెక్షన్ ఇన్ పాన్ కార్డ్' ట్యాబ్‌ను ఎంచుకుని ‘క్లిక్ టు అప్లయి’ మీద క్లిక్ చేయండిస్టెప్ 3: 'అప్లయి ఫర్ చేంజ్/కరెక్షన్ ఇన్ పాన్ కార్డ్ డీటెయిల్స్' ట్యాబ్‌ను ఎంచుకోండిస్టెప్ 4: డాక్యుమెంట్ సబ్మిషన్ విధానాన్ని ఎంచుకుని, మీ పాన్ నంబర్ ఎంటర్ చేసి, పాన్ కార్డ్ మోడ్‌ను ఎంచుకుని, 'సబ్మిట్' బటన్‌పై క్లిక్ చేయండి.స్టెప్ 5: విజయవంతంగా నమోదు చేసిన తర్వాత, మీకు రిఫరెన్స్ నంబర్ వస్తుంది. 'ఓకే' మీద క్లిక్ చేయండి.స్టెప్ 6: ఎక్కడెక్కడ అప్డేట్స్ అవసరమో అక్కడ కచ్చితమైన వ్యక్తిగత వివరాలను నమోదు చేసి 'నెక్ట్స్ స్టెప్' పై క్లిక్ చేయండిస్టెప్ 7: మీ ఆధార్ కార్డు ఆధారంగా చిరునామా అప్డేట్ అవుతుంది. మీ కాంటాక్ట్ వివరాలను నమోదు చేసి తదుపరి దశకు వెళ్లండి.స్టెప్ 8: పాన్ నెంబర్ ఎంటర్ చేసి నెక్ట్స్ స్టెప్ బటన్ క్లిక్ చేసి వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.స్టెప్ 9: అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.స్టెప్ 10: ఫారంలోని వివరాలను సమీక్షించి, 'మేక్ పేమెంట్' బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా చెల్లింపు కొనసాగించండి.స్టెప్ 11: నచ్చిన ఆన్లైన్ పేమెంట్ మోడ్‌ను ఎంచుకుని పేమెంట్ ప్రాసెస్ పూర్తి చేయాలి. విజయవంతంగా పేమెంట్ చేసినప్పుడు ఒక సక్సెస్ మెసేజ్ డిస్ ప్లే అవుతుంది. ఈ ఫారాన్ని ప్రింట్ తీసుకోవడం మంచిది.సాధారణంగా పాన్ కరెక్షన్ ప్రక్రియలకు 15 రోజులు పడుతుంది. మీ పాన్ కార్డు పోస్ట్ ద్వారా పంపిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు నోటిఫికేషన్ వస్తుంది.ఆఫ్‌లైన్‌లో పాన్ అప్డేట్ ఇలా..» ఇంటర్నెట్ నుంచి పాన్ కార్డు కరెక్షన్ ఫామ్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి.» ఫారం అన్ని విభాగాలను కచ్చితంగా పూర్తి చేసి అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోండి» అవసరమైన డాక్యుమెంట్లతో నింపిన ఫారంను సమీపంలోని పాన్ సెంటర్లో సబ్మిట్ చేయాలి.» సబ్మిట్ చేసి, రుసుము చెల్లించిన తర్వాత, కేంద్రం నుంచి అంగీకార స్లిప్ పొందండి.» 15 రోజుల వ్యవధిలో, ఈ అంగీకార స్లిప్‌ను ఎన్ఎస్డీఎల్ ఆదాయపు పన్ను పాన్ సర్వీస్ యూనిట్‌కు పంపండి.కావాల్సిన డాక్యుమెంట్లుపాన్ కార్డు డూప్లికేట్ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు వంటి గుర్తింపు రుజువులు. ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, ఆస్తిపన్ను రశీదులు, యుటిలిటీ బిల్లులు వంటి చిరునామా రుజువులు. పుట్టిన తేదీ, ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, బర్త్ సర్టిఫికేట్, మెట్రిక్యులేషన్ మార్క్ షీట్ తదితరాల ఆధారాలు. -
రూ.800 కోట్ల అమ్మకాలే లక్ష్యం.. బ్యాగ్‌జోన్ ప్రణాళికలు ఇలా..
BRAND SUTRA: ప్రముఖ సంస్థ లావి ప్యారెంట్ బ్రాండ్ 'బ్యాగ్‌జోన్' (Bagzone) మల్టీ-కేటగిరీ, మల్టీ-బ్రాండ్ వ్యాపారంగా వృద్ధి సాధించాలనే లక్ష్యంతో ఉన్నట్లు కంపెనీ సీఈఓ 'ఆయుష్ తైన్వాలా' వెల్లడించారు. ఈ క్రమంలోనే బ్రాండ్ ఇటీవల వాచ్‌ల విభాగంలోకి కూడా ప్రవేశించింది. ఈ సంస్థ 2023 ఆర్ధిక సంవత్సరంలో ఏకంగా రూ. 500 కోట్ల అమ్మకాలను సాధించి రికార్డ్ క్రియేట్ చేసిందని, రానున్న రోజుల్లో కంపెనీ రూ. 800 కోట్లకు చేరటానికి సన్నద్ధమవుతోందని తెలిపాడు. ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ సుమారు 10 రెట్లు వృద్ధి సాధించడానికి.. మల్టీ-కేటగిరీ, మల్టీ-బ్రాండ్ వ్యాపారాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా సంస్థ 300 బ్రాండ్ అవుట్లెట్లను ప్రారంభించడం ద్వారా 70 శాతం స్థానిక సోర్సింగ్ లక్ష్యాన్ని సాధించడం, ఆఫ్‌లైన్ విధానం పెంచడానికి ఆలోచిస్తోంది. అనుకున్న విధంగా అన్ని సజావుగా జరిగితే.. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 1000 మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. నిధుల ప్రకటన సమయంలో, కంపెనీ తయారీ సామర్థ్యాలను విస్తరించే ప్రణాళికలను వెల్లడించింది. ఇందులో భాగంగా ఇగత్పురి జిల్లాలోని నాసిక్ వెలుపల, ప్రస్తుతం ఉన్న ఫ్యాక్టరీకి సమీపంలో రెండవ ఫ్యాక్టరీని నిర్మించే ప్రక్రియలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త ఫ్యాక్టరీ త్వరలోనే ప్రారంభమవుతుందని, దీంతో ఉత్పత్తి సామర్థ్యం నెలకు 5 లక్షలకు పెరుగుతుందని సమాచారం. ఇప్పటి వరకు నాసిక్ ప్లాంట్‌లో నెలకు సుమారుగా 2 లక్షల బ్యాగులను ఉత్పత్తి చేస్తున్నట్లు తైన్వాలా తెలిపారు. కంపెనీ హ్యాండ్‌బ్యాగ్‌లు, స్లింగ్ బ్యాగ్‌లు, టోట్ బ్యాగ్‌లు, మహిళల పర్సులు, ల్యాప్‌టాప్ హ్యాండ్‌బ్యాగ్‌లు, ఫ్యాషన్ బ్యాక్‌ప్యాక్‌లు, బాక్స్ బ్యాగ్‌లు వంటివి తయారు చేస్తోంది. కంపెనీ 2020లో తన బ్రాండ్ ఎక్స్టెన్షన్ లావి స్పోర్ట్ కింద యునిసెక్స్ బ్యాక్‌ప్యాక్‌లను ప్రారంభించింది. ఇప్పుడు డఫిల్ బ్యాగ్‌లు, బ్రీఫ్‌కేస్‌లు, వాలెట్లు, స్లింగ్ల వంటి యాక్సెసరీస్ కూడా తయారు చేస్తుంది. కాగా ఏడాది ప్రారంభంలో రీజనబుల్ ధరల వద్ద బ్రాండ్ బ్యాగులను అందించడానికి లావి లక్స్‌ను సృష్టించింది. వీటి ధర రూ. 3000 నుంచి రూ. 7000 మధ్య ఉంటుంది. మహిళల వాచ్‌ల ధరలు రూ. 5999 నుంచి ఉన్నాయి. బ్రాండ్ వాచ్‌లు లావి అధికారిక వెబ్సైట్లో లేదా దేశవ్యాప్తంగా ఉన్న లావి రిటైల్ అవుట్లెట్లలో అందుబాటులో ఉంటాయి. కంపెనీ ఈ ఉత్పత్తుల మీద ఏకంగా ఒక సంవత్సరం వారంటీ కూడా అందిస్తోంది. సర్వీస్ సెంటర్లు కూడా అందుబాటులో ఉంటాయి. కంపెనీ రిటైల్ విస్తరణకు కూడా ప్రణాళికలు ఉన్నాయని, దక్షిణాదిలో రిటైల్ ఉనికిని పెంచడానికి దృష్టి సారించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయుష్ తైన్వాలా తెలిపాడు. ఇందులో మెట్రో నగరాలు, చిన్న నగరాలు వంటి వాటితో పాటు టైర్ 1 నగరాల్లో బ్రాండ్ విస్తరణ గురించి ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. టైర్ 2, టైర్ 3 నగరాలను కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ.. టైర్ 1 నగరాలే ప్రధానమని తైన్వాలా వెల్లడిస్తూ.. పశ్చిమ దేశాలలో మా ఉనికి బలంగా ఉందని, దక్షిణాదిలో కొంచెం బలహీనంగా ఉన్నట్లు తెలిపాడు. ఈ నగరాలను వృద్ధి చేసుకోవాలంటే రిటైల్ స్టోర్లను పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే ఆలోచనను వ్యక్తం చేశారు. మొత్తం విక్రయాలు ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానంలో సాగుతున్నాయి. ఆఫ్‌లైన్ విధానంలో రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేసుకోవచ్చు, అయితే ఆన్లైన్ కొనుగోలు కోసం 'లావీవరల్డ్.కమ్'లో మాత్రమే కాకుండా అమెజాన్, మింత్రా, ఫ్లిప్‌కార్ట్, నైకా వంటివాటిని ఉపయోగించుకోవచ్చు. -
ఆన్లైన్ + ఆఫ్‌లైన్ పండుగలకు ‘హైబ్రిడ్ షాపింగ్’
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుత పండుగల సీజన్లో... ‘హైబ్రిడ్ షాపింగ్’నకు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది. ‘రాఖీ బంధన్’తో మొదలై వచ్చే ఏడాది ప్రథమార్థం దాకా ఈ ఫెస్టివల్ సీజన్ సుదీర్ఘంగా సాగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదలైన ఈ సీజన్లో హైబ్రిడ్ షాపింగ్నకే అధికశాతం మొగ్గుచూపుతున్నట్టు వివిధ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత వినియోగదారులు మరీ ముఖ్యంగా నవ, యువతరం ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంతో పాటు డిజిటల్ టెక్నాలజీని విరివిగా ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో...ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్లైన్లోనూ షాపింగ్‌కు కస్టమర్లు సిద్ధమవుతున్నారు. కోవిడ్ తెచ్చి న మార్పుచేర్పులతో... షాపింగ్, ఇతర విషయాల్లో కొత్త కొత్త విధానాలు, పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. గతేడాదితో పోల్చితే ఈసారి 84 శాతం వినియోగదారులు తమ షాపింగ్ బడ్జెట్‌ను గణనీయంగా పెంచినట్టు అడ్వర్టయిజ్మెంట్ యూనికార్న్ సంస్థ ‘ఇన్మోబీ’తాజా నివేదికలో వెల్లడైంది. నివేదికలో ఏముందంటే... చేతిలో ఇమిడిపోయే మొబైల్ ఫోన్లతోనే షాపింగ్ చేయడం, సంస్థల సైట్లను ఆన్లైన్లోనే వీక్షించి, సమీక్షించుకునే సౌలభ్యం ఉన్నందున పలువురు ఆన్లైన్ కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. ఐతే...ఆన్‌లైన్‌తో పాటు స్వయంగా షాప్‌లకు వెళ్లి వివిధరకాల వస్తువులు, ఇతరత్రా సామగ్రి కొనేందుకు ఇష్టపడుతున్న వారి సంఖ్య గణనీయంగా ఉన్నట్టుగా... అ రెండింటిని సమ్మిళితం చేసి హైబ్రిడ్ షాపింగ్ చేసే వారు 54 శాతం ఉన్నట్టుగా ఈ నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా మొబైల్ఫోన్లను వినియోగించే వారి నుంచి వివిధ అంశాల వారీగా ఈ సంస్థ సమాచారాన్ని సేకరించింది. ఆఫర్ల సమాచారం ఎలా తెలుసుకుంటున్నారు? మొబైల్లో సెర్చింగ్, ప్రకటనల ద్వారా.. 46% బ్రాండ్ వెబ్సైట్లు/ వివిధ యాప్‌ల ద్వారా.. 15% ప్రత్యక్షంగా షాపులకు వెళ్లి తెలుసుకునేవారు.. 11% కుటుంబం, స్నేహితుల ద్వారా.. 7% టీవీ ప్రకటనలు, ఇతర రూపాల్లో.. 7% వార్తాపత్రికలు, మ్యాగజైన్ల ద్వారా.. 6% ఈమెయిళ్లు, బ్రాండ్ల నుంచి న్యూస్లెటర్లతో.. 4% వాట్సాప్‌లో బ్రాండ్ల ద్వారా వచ్చే సమాచారంతో.. 3% తదనుగుణంగా మార్కెటింగ్ వ్యూహాలు... ‘తమ స్మార్ట్ఫోన్ల ద్వారానే షాపింగ్ చేయాలని 78 శాతం మంది భావిస్తున్నారు. దీనికి తగ్గట్టుగా వివిధ కంపెనీలు, సంస్థలు కూడా తమ మార్కెటింగ్ వ్యూహాలను రూపొందించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా ప్రస్తుత పండుగల సీజన్లో కస్టమర్లను ఆకర్షించేందుకు, వారు కోరుకున్న విధంగా ఆయా వస్తువులను అందించేందుకు, వారితో నేరుగా కనెక్ట్ అయ్యేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నాము’ - వసుత అగర్వాల్,చీఫ్ బిజినెస్ ఆఫీసర్, కన్జ్యూమర్ అడ్వర్టయిజింగ్ ప్లాట్‌ఫామ్, ఇన్మోబీ -
ఇంటర్నెట్ లేకుండా 'ఆఫ్‌లైన్ ట్రాన్సక్షన్'.. మీకు తెలుసా?
ప్రస్తుతం ఫోనేపే.. గూగుల్ పే వంటివి అందుబాటులోకి వచ్చిన తరువాత చేతిలో డబ్బులు పెట్టుకునే వారి సంఖ్య దాదాపు తగ్గిపోయింది. డబ్బు పంపించాలన్నా.. తీసుకోవాలన్నా మొత్తం ఆన్లైన్లో జరిగిపోతున్నాయి. అయితే ఈ ఆన్లైన్ ట్రాన్షాక్షన్స్ జరగటానికి తప్పకుండా ఇంటర్నెట్ సదుపాయం ఉండాలి, ఇందులో కొన్ని సార్లు నెట్వర్క్ సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆన్లైన్ కష్టాలు, నెట్వర్క్ సమస్యలకు స్వస్తి చెప్పడానికి ఆఫ్‌లైన్ విధానం కూడా అమలులో ఉంది. ఇది ప్రస్తుతం చాలామందికి తెలియకపోవచ్చు. కానీ ఈ విధానం ద్వారా సులభంగా ట్రాన్షాక్షన్స్ పూర్తి చేసుకోవచ్చు. భారతదేశంలోని దాదాపు అన్ని బ్యాంకులు UPI సేవలను ప్రాసెస్ చేయడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) '*99# సర్వీస్' ప్రారంభించింది. ఇందులో వినియోగదారుడు చేయవలసిందల్లా తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా *99# డయల్ చేయడం. వినియోగదారుడు తన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా *99# డయల్ చేసిన తరువాత మొబైల్ స్క్రీన్‌పై ఇంటరాక్టివ్ మెనూ కనిపిస్తుంది. దీని ద్వారా సులభంగా బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. ఇందులో బ్యాలెన్స్ విచారణ వంటి సర్వీసులతోపాటు యుపిఐ పిన్ సెట్ చేయడం / మార్చడం కూడా చేసుకోవచ్చు. *99# USSD కోడ్ ద్వారా యుపిఐ లావాదేవీ ప్రారంభించడం ఎలా? మొదట మీ బ్యాంకు అకౌంట్‌కి లింక్ అయిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి *99# డయల్ చేయండి. తరువాత మీకు కింద కనిపిస్తున్న మెనూ పాప్ వస్తుంది. సెండ్ మనీ రిక్వెస్ట్ మనీ చెక్ బ్యాలన్స్ మై ప్రొఫైల్ పెండింగ్ రిక్వెస్ట్ ట్రాన్సాక్షన్ యుపిఐ పిన్ ఇందులో మీరు డబ్బు పంపించడానికి సెండ్ మనీ సెలక్ట్ చేసుకుని సెండ్ చేయాలి. తరువాత మీరు ఏ అకౌంట్ నుంచి డబ్బు పంపాలనుకుంటున్నారో సెలక్ట్ చేసుకుని మళ్ళీ సెండ్ చేయాలి. మొబైల్ నంబర్ ద్వారా ట్రాన్సాక్షన్ ఎంచుకుంటే రిసీవర్ యుపిఐ ఖాతాకు లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌ను టైప్ చేసి సెండ్ చేయండి. మీరు పంపాలనుకుంటున్న మొత్తాన్ని ఎంటర్ చేసి, సెండ్ ఆప్సన్ మీద క్లిక్ చేయండి. చెల్లింపు కోసం రిమార్క్‌ని ఎంటర్ చేయండి. మొత్తం ట్రాన్సాక్షన్ పూర్తి చేయడానికి యుపిఐ పిన్ని ఎంటర్ చేయండి. ఇవన్నీ మీరు సక్రమంగా పూర్తి చేస్తే మీ ఆఫ్‌లైన్ ట్రాన్సాక్షన్ పూర్తవుతుంది. అంతే కాకుండా.. మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ నుంచి *99# ఉపయోగించి, సరైన సూచనలను అనుసరించడం ద్వారా UPI సేవలను ఆఫ్‌లైన్‌లోనే నిలిపివేయవచ్చు. ఇవన్నీ చేసేటప్పుడు తప్పకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. -
ఆధార్ అప్డేట్ చేయాలనుకుంటున్నారా? ఇవి తెలుసుకుంటే ఈజీ!
దేశంలో ఆధార్ కార్డ్ ప్రతిఒక్కరికీ చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) దీన్ని జారీ చేస్తుంది. గుర్తింపు పత్రంగా ప్రముఖంగా దీన్ని వినియోగిస్తుంటారు. వివిధ పథకాలకు కూడా ప్రభుత్వం ఆధార్ కార్డును తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డులో దొర్లిన తప్పులు, లేదా మార్పుల కోసం చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. ఇదీ చదవండి: ట్యాక్స్ ప్లానింగ్‌లో చేసే పొరపాట్లు ఇవే.. తెలుసుకుంటే పన్ను ఆదా పక్కా! ఇలాంటి తప్పులను సరి చేసుకునేందుకు, చిరునామాల్లో మార్పులకు ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో అవకాశం కల్పించింది. కొన్నింటిని మొబైల్ ద్వారా ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు. మరికొన్నింటికి మాత్రం ఆధార్ సీఎస్సీ కేంద్రాన్ని సందర్శించి ఆఫ్‌లైన్‌లో చేయించుకోవాలి. ఆన్లైన్లో చేసుకునే అప్డేట్లు ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీ, చిరునామా, జెండర్ వంటి వివరాలను ఆన్లైన్లోనే అప్డేట్ చేసుకోవచ్చు. మొబైల్ లేదా ఏదైనా ఆన్లైన్ సెంటర్లలో వీటిని చేసుకోవచ్చు. అయితే వీటికి సంబంధించిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే పోస్టల్ వెబ్సైట్ ద్వారా అయితే మొబైల్ నంబర్లను కూడా మార్చుకునే అవకాశం ఉంది. ఇదీ చదవండి: ఎయిర్టెల్ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్.. ఇక అన్లిమిటెడ్ 5జీ డేటా! తప్పనిసరిగా ఆఫ్‌లైన్‌లో చేసుకునేవి ఆధార్‌కార్డ్‌లో బయోమెట్రిక్ డేటా, మొబైల్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలను అప్డేట్ చేయడానికి తప్పనిసరిగా ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించాలి. ఇందు కోసం ముందుగా యూఐడీఏఐ వెబ్సైట్ ద్వారా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. బయోమెట్రిక్ డేటా, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీల అప్డేట్ కోసం ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం లేదు. మొబైల్ నంబర్లు, బయోమెట్రిక్ డేటా, ఆధార్ కార్డ్‌లోని ఫోటోలు వంటి మార్పులకు రుసుము రూ. 30 నుంచి రూ. 100 వరకు ఉంటుంది. ఇదీ చదవండి: SVB: దివాలా తీసిన బ్యాంకులో మనోళ్ల డిపాజిట్లు ఎంతంటే.. -
ఆఫ్‌లైన్‌లోనే ప్రీమియం ఎలక్ట్రానిక్స్: పెరుగుతున్న ఎక్స్‌పీరియెన్స్ సెంటర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా 2022లో 15 -16 కోట్ల స్మార్ట్‌ఫోన్స్ అమ్ముడయ్యాయి. ఇందులో ఆన్లైన్ వాటా ఏకంగా 53 శాతం కైవసం చేసుకుంది. ఆఫ్‌లైన్‌ను మించి ఆన్లైన్ విభాగం దూసుకెళ్తున్నప్పటికీ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు 2023లో ఎక్స్‌పీరియెన్స్ జోన్స్, స్టోర్ల ఏర్పాటుపై ఫోకస్ చేశాయి. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు డిమాండ్ మందగించడంతో తయారీ సంస్థలు ప్రీమియం ఉపకరణాలపై దృష్టిసారించాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అధిక సామర్థ్యం, వినూత్న సాంకేతికతతో తయారైన ప్రొడక్ట్స్‌కు డిమాండ్ పెరిగిందని ఎల్జీ చెబుతోంది. కొనుగోలు నిర్ణయాలు తీసుకునే ముందు వినియోగదారులు ఇలాంటి ప్రీమియం ఉత్పత్తులను స్వయంగా పరీక్షించి, అనుభూతి చెందాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎక్స్‌పీరియెన్స్ జోన్స్, ఔట్లెట్స్ ఏర్పాటు తప్పనిసరి అని కంపెనీలు నిర్ణయానికి వచ్చాయి. స్మార్ట్‌ఫోన్స్, స్మార్ట్ ఉపకరణాల తయారీతోపాటు కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న సంస్థలు ఆఫ్‌లైన్‌లో విస్తరణకు వరుస కట్టాయి. ఒకదాని వెంట ఒకటి.. దక్షిణ కొరియాకు చెందిన శామ్సంగ్ ప్రీమియం ఉపకరణాలను ప్రదర్శించేందుకు అతిపెద్ద ఎక్స్‌పీరియెన్స్ కేంద్రాన్ని గత నెలలో న్యూఢిల్లీలో ప్రారంభించింది. అలాగే బెంగళూరులోని శామ్సంగ్ ఓపెరా హౌజ్ స్టోర్‌లో కొత్త గేమింగ్, స్మార్ట్ హోమ్ ఎక్స్‌పీరియెన్స్ జోన్‌ను ఏర్పాటు చేసింది. పర్సనల్ కంప్యూటర్ల తయారీ దిగ్గజం హెచ్‌పీ ఈ నెలలోనే ఏడు ప్రధాన నగరాల్లో గేమింగ్ స్టోర్స్‌ను తెరిచింది. పీసీలు, యాక్సెసరీస్ అందుబాటులో ఉంచడమేగాక కస్టమర్లు గేమ్స్ ఆడుకోవడానికి ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. 2023లో ఇటువంటివి 40 కేంద్రాలు తెరవాలన్నది హెచ్‌పీ ఆలోచన. వన్‌ప్లస్, ఆసస్, రియల్మీ సైతం ఔట్లెట్లను స్థాపించాలని భావిస్తున్నాయి. మూడవ ఎక్స్‌పీరియెన్స్ కేంద్రాన్ని గత నెల ఢిల్లీలో ఆసస్ ప్రారంభించింది. ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో యాపిల్ స్టోర్లు ప్రారంభం అయ్యే చాన్స్ ఉంది. ప్రీమియం వైపునకు మార్కెట్.. దేశంలో ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్, టీవీలు, రిఫ్రిజిరేటర్స్, వాటర్ ప్యూరిఫయర్స్ అమ్మకాలు 2022లో విలువ పరంగా తొమ్మిది రెట్లు మెరుగ్గా నమోదయ్యాయి. ధరలు దూసుకెళ్తున్నప్పటికీ ఉన్నత మధ్య తరగతి, సంపన్న వర్గాలు ఖరీదైన ఉత్పత్తుల కొనుగోళ్లు కొనసాగిస్తున్నారు. విలువ పరంగా గతేడాది స్మార్ట్ఫోన్ల అమ్మకాల్లో 35 శాతం వృద్ధి నమోదైంది. రూ.30 వేలు ఆపైన ఖరీదు చేసే స్మార్ట్ఫోన్ల మొత్తం విక్రయాలు ఏకంగా 94 శాతం వృద్ధి సాధించాయి. టీవీ పరిశ్రమ 11 శాతం వృద్ధి చెందితే.. 55 అంగుళాలు, ఆపైన సైజులో ఉండే ప్రీమియం టీవీ మోడళ్లు 95 శాతం ఎగశాయి. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండీషనర్ల అమ్మకాలు 29 శాతం పెరిగాయి. ప్రీమియం విభాగంలో ఇవి 45 శాతం అధికం అవడం విశేషం. ప్రీమియం విభాగం పరిశ్రమ వృద్ధిని నడిపిస్తోందని ఎల్జీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ దీపక్ బన్సాల్ తెలిపారు. -
మెగా రిపబ్లిక్ డే సేల్స్.. ఆన్లైన్, ఆఫ్‌లైన్ షాపింగ్‌పై భారీ ఆఫర్స్
దసరా, దీపావళి, న్యూ ఇయర్.. ఇలా పండుగలు వస్తున్నాయంటే చాలు.. షాపింగ్ జోరు మొదలైపోతుంది. ఆఫ్‌లైన్ అయిన ఆన్లైన్ అయినా.. మనకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేయాల్సిందే. వినియోగదారులను ఆకర్షించేందుకు కంపెనీలు సైతం భారీ డిస్కౌంట్స్ ప్రకటించేస్తాయి. అయితే.. ఈసారి రిపబ్లిక్ డే షాపింగ్ డేగా మారిపోయింది. ఎలక్ట్రానిక్స్ నుంచి ఎయిర్ టికెట్స్ వరకూ భారీ ఆఫర్స్ అందిస్తున్నాయి పలు దిగ్గజ కంపెనీలు. వరల్డ్ టాప్ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ఈ నెల 15 నుంచి 20 వరకూ రిపబ్లిక్ డే మెగా సేల్స్ నిర్వహించింది. మొబైల్స్, స్మార్ట్ వాచెస్‌తో పాటు పలు ఎలక్ట్రానిక్స్, ఇతర వస్తువులపై 75 శాతం వరకు డిస్కౌంట్స్ ఇచ్చింది. ఇక ఫ్లిప్‌కార్ట్ కూడా గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ అందిస్తోంది. కేవలం ఆన్లైన్ ప్లాట్‌ఫామ్సే కాదు.. ఆఫ్లైన్లోనూ గ్రాండ్ రిపబ్లిక్ డే సేల్ అంటూ భారీ డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నాయి దిగ్గజ కంపెనీలు. టూ విలర్ కొనుగోలుదారులకు రూ.5 వేల క్యాష్ బ్యాక్ అందిస్తోంది బజాజ్ సంస్థ. అంతేకాదు.. వినియోగదారులకు సులభ వాయిదాలు కూడా అందిస్తోంది. విజయ్ సేల్స్ కూడా మెగా రిపబ్లిక్ డే సేల్ అంటూ ఆకర్షణీయమైన ఆఫర్స్ ఇస్తోంది. గాడ్జెట్స్, గృహోపకరణాలు వంటి వస్తువులపై 65 శాతం వరకూ డిస్కౌంట్ అందిస్తోంది. లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు కొనాలనుకుంటున్నారా..? అయితే.. ఇదే మంచి సమయం.. మా షోరూంలో భారీ డిస్కౌంట్స్ లభిస్తాయంటూ రిపబ్లిక్ సేల్స్‌ను ప్రారంభించింది క్రోమా సంస్థ. ఈ నెల 29 వరకు ఆఫ్‌లైన్, ఆన్లైన్ కొనుగోళ్లపై ఆఫర్స్ ప్రకటించింది. రిపబ్లిక్ డే సేల్స్ కేవలం ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లియన్స్కు మాత్రమే పరిమితం కాలేదు. దేశీయ విమానయాన సంస్థలు ఎయిర్ ఇండియా, గో ఆసియా సైతం.. టికెట్ల ధరలను భారీగా తగ్గించాయి. 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎయిర్ ఇండియా కేవలం రూ.1705 రూపాయలకే టికెట్లు విక్రయించింది. డొమెస్టిక్ ట్రావెల్ టికెట్ల ప్రారంభ ధర రూ.1199లకు.. ఇంటర్నేషనల్ ట్రావెల్ టికెట్ల ప్రారంభ ధర రూ.6599లకు అందిస్తోంది గో ఆసియా ఎయిర్ లైన్స్. జాతీయ దినోత్సవాలను పురస్కరించుకుని మెగా సేల్స్, క్లియరెన్స్ సేల్స్ అంటూ భారీ డిస్కౌంట్లు ప్రకటించే సంస్కృతి అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల్లో కనిపిస్తుంది. అమెరికా ఇండిపెండెన్స్ డే అయిన జూలై 4 వచ్చిందంటే.. అక్కడ షాపింగ్ మాల్స్ వినియోగదారులతో కిటకిటలాడుతుంటాయి. అయితే.. ఇప్పుడు ఆ పాశ్చాత్య సంస్కృతి మన దేశంలోనూ మొదలైపోయింది. రిపబ్లిక్ డే షాపింగ్ డేగా మారిపోయింది. -
సొంతంగా షేర్ల బదిలీ
బ్రోకర్ దగ్గర షేర్లు విక్రయిస్తే, ఆటోమేటిగ్గా అవి డీమ్యాట్ ఖాతా నుంచి డెబిట్ అవుతాయి. ఇందుకు ఖాతాను ప్రారంభించే సమయంలోనే అనుమతి (పవర్ ఆఫ్ అటార్నీ) తీసుకునే విధానం అమల్లో ఉంది. అయితే, కొన్ని సందర్భాల్లో బ్రోకర్ దగ్గర ఖాతా ద్వారా కాకుండా ఆఫ్‌లైన్‌లో షేర్లను విక్రయించుకోవడం లేదంటే కుటుంబ సభ్యులకు బహుమతిగా షేర్లను బదిలీ చేయాల్సి రావచ్చు. మరి అటువంటప్పుడు స్వయంగా ఎవరికి వారు ఆ బదిలీ బాధ్యతను నెరవేర్చాల్సి ఉంటుంది. దీని గురించి ఎక్కువ మందికి దాదాపుగా తెలియదు. ఒక డీమ్యాట్ ఖాతా నుంచి మరొక డీమ్యాట్ ఖాతాకు షేర్లను బదిలీ చేయడానికి ఆఫ్‌లైన్, ఆన్లైన్ మార్గాలున్నాయి. ఇవి ఎలా పనిచేస్తాయో అవగాహన కల్పించే ‘ప్రాఫిట్ ప్లస్’ కథనం ఇది... ఇదంతా డిజిటల్ యుగం. దాదాపు బ్యాంకు సేవలు, బ్రోకింగ్ సేవలను ఆన్లైన్లోనే చేసుకుంటున్నాం. అయినా కానీ, రెండు డీమ్యాట్ ఖాతాల మధ్య షేర్లను బదిలీ చేసేందుకు ఇప్పటికీ ఆఫ్‌లైన్ విధానాన్నే ఎక్కువ మంది ఆశ్రయిస్తున్నారు. నూతనతరం బ్రోకర్లు (డిపాజిటరీ పార్టిసిపెంట్) అయిన జెరోదా, ఏంజెల్ వన్ తదితర కొన్ని సంస్థలు ఆన్లైన్లోనే షేర్లను సులభంగా బదిలీ చేసుకునే సేవలను అందిస్తున్నాయి. ఆన్లైన్లో షేర్ల బదిలీని రెండు విధాలుగా చేపట్టొచ్చు. డీమ్యాట్ ఖాతా ద్వారా లేదంటే సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (సీడీఎస్ఎల్) ఈజీఎస్ట్ కోసం నమోదు చేసుకుని ఆన్లైన్లో షేర్లను బదిలీ చేసుకోవచ్చు. ఈజీఎస్ట్అనేది సెక్యూరిటీల సమాచారం తెలుసుకునేందుకు, లావాదేవీలు నిర్వహించుకునేందుకు ఉద్దేశించినది. అలాగని అన్ని బ్రోకరేజీ సంస్థలు ఆన్లైన్లో బదిలీ సేవలను అందించడం లేదు. చాలా డీపీలు, బ్యాంకులకు సంబంధించిన బ్రోకింగ్ విభాగాల్లో ఖాతా ఉన్న వారు ఆఫ్‌లైన్ (భౌతిక రూపంలో) విధానంలో చేసుకోవాల్సి వస్తుంది. ఆఫ్‌లైన్ మార్గం.. ఆఫ్‌లైన్‌లో అయితే ఫిజికల్ డెలివరీ ఇన్స్ట్రక్షన్ స్లిప్ (డీఐఎస్) బుక్లెట్ ఉండాలి. షేర్లను బదిలీ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ బుక్‌లెట్‌లోని ఓ స్లిప్పై బదిలీ చేయాలనుకుంటున్న కంపెనీ, ఐఎస్ఐఎన్ నంబర్, ఎన్ని షేర్లు తదితర వివరాలు నమోదు చేయాలి. ఏ డీపీ పరిధిలోని క్లయింట్‌కు బదిలీ చేయాలనుకుంటున్నారో, ఆ వివరాలు కూడా ఇవ్వాలి. అంటే క్లయింట్ ఐడీ, డీపీ ఐడీ వివరాలు నమోదు చేయాలి. ఐఎస్ఐఎన్ అన్నది ప్రతీ కంపెనీకి కేటాయించే ఓ యూనిక్ నంబర్. గూగుల్‌లో సెర్చ్ చేసినా ఈ నంబర్ తెలుస్తుంది. షేర్లను స్వీకరించే క్లయింట్ సీఎంఆర్ కాపీ జత చేయాలి. డీఐఎస్ అన్నది బ్యాంక్ చెక్ మాదిరిగా పనిచేస్తుంది. ఒక అకౌంట్ నుంచి మరొక అకౌంట్‌కు నగదు బదిలీకి చెక్ ఉపయోగపడినట్టే.. డీఐఎస్ అన్నది ఒక డీమ్యాట్ ఖాతా నుంచి మరొక డీమ్యాట్ ఖాతాకు షేర్లను బదిలీ చేసే సాధనం. ఆఫ్‌లైన్‌లో ఇలా షేర్ల బదిలీకి కొన్ని రోజుల సమయం పడుతుంది. కొన్ని సందర్భాల్లో, కొందరు బ్రోకర్ల వద్ద ఇందుకు నెల వరకు సమయం తీసుకోవచ్చు. బ్రోకర్ మొబైల్ యాప్ లేదా వెబ్సైట్ నుంచి లేదంటే బ్రోకర్‌కు ఈ మెయిల్ రూపంలో, బ్రోకర్ ఆఫీసుకు వెళ్లి డీఐఎస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకులకు సంబంధించిన డీమ్యాట్ ఖాతా కలిగి ఉన్న వారు నెట్ బ్యాంకింగ్ నుంచి లేదంటే బ్యాంకు శాఖకు వెళ్లి దీనికి దరఖాస్తు సమర్పించొచ్చు. రిజిస్టర్డ్ చిరునామాకు డీఐఎస్ బుక్లెట్ వస్తుంది. లేదా బ్రోకర్ ఆఫీసుకు వెళ్లి తీసుకోవచ్చు. బదిలీ చేయాలనుకున్నప్పుడు డీఐఎస్ స్లిప్‌లో అన్ని వివరాలు నమోదు చేసి, సీఎంఆర్ కాపీ జతచేసి బ్రోకర్ ఆఫీసులో సమర్పించాలి. లేదంటే కార్యాలయానికి పంపించాలి. బ్యాంకులు అయితే కేవలం కొన్ని శాఖల్లోనే ఈ సేవలు లభిస్తాయి. ఆన్లైన్లో షేర్ల బదిలీ ఆన్లైన్లో షేర్ల బదిలీకి రెండు విధానాలున్నాయి. ఒకటి డీమ్యాట్ ఖాతా ద్వారా చేసుకోవచ్చు. అలాగే, సీడీఎస్ఎల్ లేదా ఎన్ఎస్డీఎల్ వెబ్సైట్ ద్వారా బదిలీ చేసుకోవచ్చు. కొన్ని బ్రోకరేజీ సంస్థలు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ సేవను అందిస్తున్నాయి. కానీ, భద్రత రీత్యా ఈ ప్రక్రియ కొంత ఆన్లైన్, కొంత ఆఫ్‌లైన్‌తో కూడుకుని ఉంటుంది. ఉదాహరణకు ఐసీఐసీఐ డైరెక్ట్ ఈ ఇన్స్ట్రక్షన్ అన్నది కనీసం ఒక అకౌంట్ హోల్డర్ వ్యక్తిగతంగా దరఖాస్తు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కసారి రిజిస్ట్రేషన్ ఆమోదం పొందితే, ఏ డీమ్యాట్ ఖాతాకు అయినా ఆన్లైన్లోనే షేర్లను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కాకపోతే గరిష్టంగా ఐదు ఖాతాల వరకు ఆన్లైన్లో, అది కూడా నిర్ణీత విలువ మేరకే బదిలీకి అనుమతి ఉందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. సీడీఎస్‌ఎల్‌లో అకౌంట్ ఉండి, బదిలీ చేయాలనుకుంటున్న ఖాతా కూడా సీడీఎస్ఎల్ పరిధిలోనే ఉన్నట్టయితే బదిలీ ప్రక్రియ మరింత సులభంగా ఉంటుంది. ఇందుకోసం సీడీఎస్ఎల్ ఈజీఎస్ట్ వద్ద ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. అలాగే, ఎన్ఎస్డీఎల్ పరిధిలోనే రెండు ఖాతాల మధ్య బదిలీకి ఎన్ఎస్డీఎల్ స్పీడ్–ఈ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సీడీఎస్ఎల్ పరిధిలో జాయింట్ అకౌంట్ ఉంటే, ఖాతాను నిర్వహించే వ్యక్తికి అనుకూలంగా మిగిలిన జాయింట్ అకౌంట్ హోల్డర్స్ నుంచి డిక్లరేషన్‌తో భౌతికంగా దరఖాస్తు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కసారి రిజిస్ట్రేషన్ ముగిసి, బ్రోకర్ నుంచి అమోదం లభించిన తర్వాత సీడీఎస్ఎల్ లేదా ఎన్ఎస్డీఎల్ పరిధిలో ఏ ఖాతాకు అయినా షేర్లను బదిలీ చేసుకోవడం సాధ్యపడుతుంది. సీడీఎస్ఎల్ లేదా ఎన్ఎస్డీఎల్ పరిధిలోని రెండు ఖాతాల మధ్య ఆన్లైన్లో షేర్ల బదిలీ చాలా సులభం. కాకపోతే సీడీఎస్ఎల్ – ఎన్ఎస్డీఎల్ పరిధిలోని ఖాతాల మధ్య బదిలీ చేసుకోవాలంటే ఓటీపీ వంటి అదనపు భద్రతా రక్షణలు అమల్లో ఉన్నాయి. మోసపూరిత లావాదేవీలకు చెక్ పెట్టేందుకు వీటిని ఏర్పాటు చేశారు. అదనపు సమయం కూడా తీసుకుంటుంది. సొంత ఖాతాల మధ్య.. తన పేరిటే మరో ఖాతాకు షేర్లను బదిలీ చేయాలనుకుంటే అందుకు రెండు మార్గాలు ఉన్నాయి. మొదటిది క్లోజర్ కమ్ ట్రాన్స్ఫర్. అంటే ఒక డీపీ వద్ద డీమ్యాట్ ఖాతాను మూసేసి, మరో డీపి వద్ద ఖాతా ప్రారంభించడం. అలాంటప్పుడు క్లోజర్ కమ్ ట్రాన్స్ఫర్ విధానం అనుసరించాలి. ముందుగా మరో బ్రోకర్ వద్ద ఖాతాను తెరవాలి. అప్పుడు మూసి వేయాలని అనుకుంటున్న బ్రోకర్‌కు దరఖాస్తు ఇవ్వాలి. దాంతో అందులో ఉన్న అన్ని సెక్యూరిటీలను అదే క్లయింట్ వేరొక ఖాతాకు బదిలీ చేసిన తర్వాత, క్లోజ్ చేస్తారు. ఇందుకు ఎలాంటి చార్జీలు ఉండవు. ఒక బ్రోకర్ సేవలు నచ్చనప్పుడు, న్యూఏజ్ బ్రోకర్‌కు మారిపోవాలని అనుకున్నప్పుడు ఈ మార్గాన్ని అనుసరించొచ్చు. ఈ ప్రక్రియను భౌతికంగా చేసుకోవాల్సిందే. మరో విధానం పాక్షిక బదిలీ. అంటే అప్పటికే ఉన్న ఒక డీమ్యాట్ ఖాతాను కొనసాగిస్తూ, అందులోని షేర్లను మరో సొంత ఖాతాకు బదిలీ చేసుకోవడం ఈ విధానంలో ముఖ్యాంశం. వ్యయాలు, పన్నులు ఒక డీమ్యాట్ ఖాతాను మూసివేస్తూ, అందులోని షేర్లను అదే వ్యక్తికి సంబంధించి వేరొక డీపీ పరిధిలోని ఖాతాకు బదిలీ చేసేట్టు అయితే ఎలాంటి చార్జీల్లేవు. ఖాతా మూసివేయకుండా, వాటిని వేరొక ఖాతాకు బదిలీ చేసేట్టు అయితే షేర్ల విలువలో నిర్ణీత శాతం లేదంటే రూ.15–25 (స్క్రిప్ వారీ) ఫ్లాట్ చార్జీ పడుతుంది. ఒకవేళ ఆఫ్ మార్కెట్ విక్రయం ద్వారా బదిలీ చేస్తున్నట్టు అయితే స్టాంప్ డ్యూటీ కూడా చెల్లించాల్సి రావచ్చు. ఇలా షేర్లను బదిలీ చేస్తున్న వారు ధరసహా పలు వివరాలను నమోదు చేసుకోవాలి. ఎందుకంటే మూలధన లాభాల పన్నును చెల్లించేందుకు ఈ వివరాలు ప్రామాణికం అవుతాయి. భవిష్యత్తులో ఇలాంటి ఆఫ్ మార్కెట్ (స్టాక్ ఎక్సే్ఛంజ్లతో సంబంధం లేకుండా) లావాదేవీలపై ఏదైనా పన్ను వివాదం తలెత్తినప్పుడు ఈ రికార్డులు అవసరంపడతాయి. ఒక వ్యక్తి ఒక డీపీ పరిధిలోని ఖాతా నుంచి వేరొక డీపీ పరిధిలోని ఖాతాకు షేర్లను బదిలీ చేసుకున్నప్పుడు కొందరు బ్రోకర్లు ఈ వివరాలను రికార్డు చేస్తున్నారు. అటువంటప్పుడు దీర్ఘకాల మూలధన లాభం, స్వల్పకాల మూలధన లాభం పన్ను వివరాలు సులభంగా పొందొచ్చు. కొందరు బ్రోకర్ల పరిధిలో ఈ వివరాలు నమోదవడంలేదు. కనుక ఎంత కాలం పాటు సదరు సెక్యూరిటీని కలిగి ఉన్నామనే వివరాల కోసం పాత ఖాతాకు సంబంధించి (కొనసా గిస్తున్నా లేదా మూసివేస్తున్నా కానీ) అకౌంట్ స్టేట్మెంట్ జాగ్రత్త చేసి పెట్టుకోవాలి. జెరోదా వంటి కొందరు బ్రోకర్లు ఆఫ్‌లైన్‌లో బదిలీ ద్వారా డీమ్యాట్ ఖాతాలోకి కొత్తగా సెక్యూరిటీలు వచ్చి చేరినప్పుడు.. మాన్యువల్‌గా వాటిని కొనుగోలు చేసిన తేదీ, ధర వివరాలు నమోదు చేసే ఆప్షన్ ఇస్తున్నాయి. ఒక వ్యక్తి వేరొక వ్యక్తికి షేర్లను బదిలీ చేస్తున్నట్టు అయితే ఆ లావాదేవీ పన్ను పరిధిలోకి వస్తుంది. ఒకే కుటుంబం పరిధిలోని వేరొక సభ్యుడికి బదిలీ చేస్తే పన్ను లేదు. వేర్వేరు కుటుంబాల వారి మధ్య బదిలీ (ఆర్థిక సంవత్సరంలో రూ.50వేలకు మించినప్పుడు) గిఫ్ట్ ట్యాక్స్ పడుతుంది. సీడీఎస్ఎల్ పరిధిలో ఆన్లైన్ బదిలీకి... ► సీడీఎస్ఎల్ పరిధిలో డీమ్యాట్ అకౌంట్ ఉన్న వారు సీడీఎస్ఎల్ ఈజీఎస్ట్ పేజీకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవాలి. ► డీపీ ఐడీ, క్లయింట్ ఐడీ నమోదు చేసి సబ్మిట్ కొట్టాలి. ► అప్పుడు మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని అక్కడ ఇవ్వాలి. ► యూజర్ నేమ్, టైప్ ఆఫ్ అకౌంట్ సెలక్ట్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ► ట్రస్టెడ్ అకౌంట్ల వివరాలు ఇవ్వాలి. ► ట్రస్టెడ్ అకౌంట్ కింద 4 సీడీఎస్ఎల్ ఖాతాల వరకు వివరాలు నమోదు చేసుకోవచ్చు. ► అకౌంట్ ఆఫ్ చాయిస్ కింద సీడీఎస్ఎల్, ఎన్ఎస్డీఎల్ ఖాతాలకు బదిలీ చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ బదిలీ విధానం ► బ్రోకర్ నుంచి డీఐఎస్ బుక్లెట్ తీసుకోవాలి. ► బదిలీ చేయాలనుకుంటే డీఐఎస్ స్లిప్పై అన్ని వివరాలు నమోదు చేయాలి. ► మీ నుంచి షేర్లను పొందే డీమ్యాట్ ఖాతాకు సంబంధించి క్లయింట్ మాస్టర్ రిపోర్ట్ (సీఎంఆర్) కాపీని తెప్పించుకోవాలి. ► అప్పుడు డీఐఎస్ స్లిప్‌తోపాటు, సీఎంఆర్ కాపీని బ్రోకర్‌కు సమర్పించాలి. ► బ్రోకర్ అన్ని వివరాలను వెరిఫై చేసి బదిలీ ప్రక్రియ పూర్తి చేస్తారు. ► ఏ విధానంలో అయినా షేర్లు మీ ఖాతా నుంచి బదిలీ, జమ అయిన సమయంలో సీడీఎస్ఎల్ లేదా ఎన్ఎస్డీఎల్ నుంచి ఎస్ఎంఎస్ వస్తుంది. -
క్రికెట్ అభిమానులకు హెచ్సిఏ శుభవార్త
-
IND Vs AUS: జింఖానాలో ఇవాళ టికెట్ల విక్రయం
సాక్షి, హైదరాబాద్: భారత్, ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 25న ఉప్పల్ స్టేడియంలో జరిగే చివరి టి20 మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ‘ఆఫ్‌లైన్’లో అమ్మకానికి ఉంచింది. ఈ నెల 15న స్వల్ప సంఖ్యలో టికెట్లను ‘పేటీఎం ఇన్సైడర్’ యాప్ ద్వారా ఆన్లైన్లో హెచ్‌సీఏ అందుబాటులోకి తీసుకురాగా, కొద్ది సేపటిలోనే అవి పూర్తిగా అమ్ముడుపోయాయి. దాంతో పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో అభిమానుల విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుంటూ ‘పేటీఎం ఇన్సైడర్’తో చర్చలు జరిపిన హెచ్‌సీఏ టికెట్లను నేరుగా కౌంటర్లో అమ్మాలని నిర్ణయించింది. నేడు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో టికెట్ కౌంటర్ ఉంటుంది. ఒక వ్యక్తికి గరిష్టంగా రెండు టికెట్లు మాత్రమే ఇస్తారు. టికెట్లు కొనుగోలు చేసేందుకు వచ్చే అభిమానులు ఆధార్ కార్డు తీసుకురావాలి. అయితే టికెట్ల మొత్తం సంఖ్యతో పాటు ఆన్లైన్, ఆఫ్లైన్లలో వేర్వేరుగా ఎన్ని టికెట్లు అందుబాటులో ఉంటాయనే విషయంలో మాత్రం హెచ్‌సీఏ ఎలాంటి స్పష్టతనివ్వలేదు. బ్లాక్‌లో అమ్మితే చర్యలు: క్రీడా మంత్రి భారత్, ఆస్ట్రేలియా టి20 మ్యాచ్ టికెట్ల అమ్మకాలకు సంబంధించి చోటు చేసుకుంటున్న గందరగోళంపై తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ‘క్రీడల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇస్తేనే హెచ్‌సీఏ స్టేడియం కట్టుకుంది. ఇది తెలంగాణ ప్రజల కోట్ల విలువైన ఆస్తి. అలాంటప్పుడు రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు చేస్తే ఊరుకునేది లేదు. అభిమానుల ఉత్సాహాన్ని దెబ్బ తీయవద్దు. బ్లాక్‌లో టికెట్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే హెచ్‌సీఏను హెచ్చరించాం. దీనిపై అవసరమైతే విచారణ కూడా జరిపిస్తాం. అదే విధంగా బయటి వ్యక్తులు కూడా ఎవరైనా తనకు టికెట్లు కావాలంటూ బెదిరించినా చర్య తీసుకుంటాం’ అని ఆయన స్పష్టం చేశారు. గుజరాత్లో జరిగే జాతీయ క్రీడల్లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర బృందానికి క్రీడా మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ బుధవారం కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ‘శాట్స్’ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డితో పాటు ఒలింపిక్ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ నెల 29 నుంచి అక్టోబర్ 12 వరకు జరిగే జాతీయ క్రీడల్లో తెలంగాణ నుంచి 230 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వావ్! గూగుల్ యూజర్లకు శుభవార్త!
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ తన యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో ఇంటర్నెట్తో అవసరం లేకుండా ఆఫ్‌లైన్‌లో జీ మెయిల్‌ను ఉపయోగించుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొని రానున్నట్లు ప్రకటించింది. జీమెయిల్. పరిచయం అక్కర్లేని పేరు. గూగుల్‌కు చెందిన ఈమెయిల్ సర్వీస్‌ను 18శాతం ఈమెయిల్ క్లయింట్ మార్కెట్ షేర్‌తో గతేడాది 1.8 బిలియన్ల మందికిపై గా వినియోగించారు. 75శాతం మందికి పైగా వినియోగదారులు స్మార్ట్ఫోన్లలో జీమెయిల్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఈ తరుణంలో రూరల్ ఏరియాలు, నెట్ స్లోగా ఉన్న ప్రాంతాల్లో మార్కెట్ షేర్‌ను పెంచుకునేందుకు గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆఫ్‌లైన్‌లో జీమెయిల్ సర్వీసుల్ని అందుబాటులోకి తెస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. జీమెయిల్‌ను ఆఫ్ లైన్లో వినియోగించుకోవాలంటే ♦ముందుగా జీమెయిల్ సెట్టింగ్ ఆప్షన్లో ట్యాప్ చేయాలి. ♦కాగ్ వీల్ బటన్ పై క్లిక్ చేసి అందులో సీ ఆల్ సెట్టింగ్ ఆప్షన్ కనిపిస్తుంది. ♦మీరు ఆన్లైన్లో ఉంటే అక్కడ ఆఫ్‌లైన్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ♦అనంతరం చెక్ బాక్స్ ఎనేబుల్ ఆఫ్‌లైన్ మెయిల్ క్లిక్ చేయండి. ♦మీరు చెక్ బాక్స్ ను క్లిక్ చేసిన మరుక్షణం, జీమెయిల్ కొత్త సెట్టింగ్ లను చూపుతుంది. ♦ఆ సెట్టింగ్స్ ఎనేబుల్ చేస్తే జీమెయిల్ ఆఫ్‌లైన్ సర్వీసుల్ని వినియోగించుకోవచ్చు. -
ఆన్‌లైన్‌లోకి గోదావరి కట్స్
సాక్షి, బిజినెస్ బ్యూరో: మాంసాహార ఉత్పత్తులు విక్రయించే గోదావరి కట్స్ సంస్థ ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఏడు స్టోర్స్ ఉండగా, త్వరలోనే కొంపల్లి తదితర ప్రాంతాల్లో మరో నాలుగు ఏర్పాటు చేయనున్నట్లు సహ వ్యవస్థాపకుడు నిహాల్ వెల్లడించారు. 2 నెలల్లో హైదరాబాద్ వ్యాప్తంగా డెలివరీ సేవలను ప్రారంభిస్తున్నామని, సొంతంగా 50 మందితో డెలివరీ బృందాన్ని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఎక్స్‌ప్రెస్ డెలివరీ కింద 2 గంటల్లో ఇంటికి డెలివరీ చేస్తామన్నారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్‌లతో పాటు వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్ ఇవ్వొచ్చని నిహాల్ చెప్పారు. ప్రస్తుతం రోజుకు 1,000 వరకూ ఆర్డర్లు వస్తున్నాయని ఆయన తెలిపారు. కస్టమర్లకు ఆయా ఉత్పత్తులతో తయారు చేసే వంటకాల గురించి వివరించేందుకు ప్రతి స్టోర్‌లో ఒక చెఫ్ అందుబాటులో ఉంటారని నిహాల్ పేర్కొన్నారు. కరోనాతో హైజీన్ ఫుడ్‌కు ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో నాణ్యమైన మాంసాహార ఉత్పత్తులను అందించే లక్ష్యంతో గతేడాది జూన్‌లో గోదావరి కట్స్‌ను ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం 50కి పైగా మాంసాహార ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు వివరించారు. 20 రకాల సముద్ర ఉత్పత్తుల కోసం కాకినాడ, వైజాగ్ తదితర ప్రాంతాల్లో 200 మంది జాలర్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. సాల్మన్, లాబ్‌స్టర్ మొదలైన వాటిని నార్వే నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, అలాగే సీజన్‌ను బట్టి ఉత్పత్తులను గుజరాత్, ముంబై వంటి ప్రాంతాల నుంచి తెప్పిస్తున్నామని నిహాల్ వివరించారు. -
వైజాగ్ లో హాట్‌కేకుల్లా అమ్ముడైన మ్యాచ్ టికెట్లు
-
వామ్మో! భారతీయుల వాడకం మామూలుగా లేదుగా, క్రెడిట్ కార్డ్‌లతో వేల కోట్ల!
దేశంలో క్రెడిట్ కార్డ్ వినియోగదారుల సంఖ్య రోజు రోజుకీ రాకెట్ వేగంతో పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కరోనా కారణంగా ఆన్లైన్ వినియోగం పెరగడం, అదే సమయంలో కొనుగోళ్లు సైతం ఊహించని స్థాయిలో ఉన్నట్లు తేలింది. ఆఫ్‌లైన్ కంటే ఆన్లైన్లోనే ఎక్కువ ఇటీవల ఇండియన్ సెంట్రల్ బ్యాంక్, ఆర్బీఐలు విడుదల చేసిన నివేదికలో పెద్దమొత్తంలో ఫ్యాన్సీ ప్రొడక్ట్‌లను క్రెడిట్ కార్డ్‌లతో కొనుగోలు చేస్తున్నట్లు తేలింది. ఎంతలా అంటే మార్చి నెల నాటికి దేశీయ క్రెడిట్ కార్డ్ యూజర్లు యావరేజ్‌గా ఆఫ్‌లైన్‌లో స్వైప్ చేయడం కంటే ఆన్లైన్లో కొనుగోలు కోసం రెండు శాతం కంటే ఎక్కువగా స్పెండ్ చేస్తున్నారు. ఒక్క మార్చిలో 7.3 కోట్ల మంది క్రెడిట్ కార్డ్ హోల్డర్లు ఆన్లైన్ కొనుగోళ్లపై రూ. 68,327 కోట్లు ఖర్చు చేస్తే పీవోఎస్ మెషిన్లలో స్వైపింగ్ చేయడం ద్వారా ఖర్చు చేసింది రూ. 38,377 కోట్లు. పే లేటర్ నివేదిక ప్రకారం..సగటు క్రెడిట్ కార్డ్ లావాదేవీ విలువ రూ.9,600 కాగా, డెబిట్ కార్డ్‌ల విలువ కేవలం రూ. 3,900గా ఉంది. డెబిట్ కార్డ్‌లపై తక్కువ సమయాన్ని వెచ్చిస్తున్న యూజర్లు..క్రెడిట్ కార్డ్‌లపై 21 కంటే ఎక్కువ సార్లు టైమ్ స్పెండ్ చేస్తున్నారు. దీంతో యాజవరేజ్‌గా యూజర్లు క్రెడిట్ కార్డ్‌తో నెలకు రూ.14,500 కొనుగోళ్లు చేస్తుంటే..డెబిట్ కార్డ్‌పై కేవలం రూ.700 మాత్రమే ఖర్చు చేస్తున్నారు. -
హైబ్రిడ్ విద్యా విధానమే ఉత్తమం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: పాఠశాల విద్యార్థులు టెక్నాలజీకి విపరీతంగా అలవాటు పడకుండా హైబ్రిడ్ విద్యా విధానాన్ని అనుసరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్ రెండు రకాల పద్ధతుల ద్వారా బోధన జరగాలన్నారు. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) అమలుపై ప్రధాని శనివారం అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక ఆన్లైన్ విధానం ఎక్కువ కావడంతో పిల్లలు టెక్నాలజీకి ఎక్కువగా అలవాటు పడుతున్నారని ప్రధాని హెచ్చరించారు. సమానత్వం, సమగ్రత, అనుసంధానం, నాణ్యమైన విద్య వంటి లక్ష్యాలతో జాతీయ విద్యా విధానాన్ని రూపొందించి , అమలు చేస్తున్నట్టు మోదీ చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల్లో డేటాబేస్‌లన్నింటినీ, పాఠశాలల్లోని రికార్డులతో అనుసంధించాలని చెప్పారు. ఈ పరిజ్ఞాన సహకారంతో పాఠశాలల్లోనే పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించివచ్చునని ప్రధాని చెప్పినట్టుగా అధికారిక ప్రకటన వెల్లడించింది. డ్రాపవుట్ విద్యార్థుల్ని గుర్తించి బడి బాట పట్టించడానికి ఈ విధానం దృష్టి సారిస్తోందని ప్రధాని వివరించారు. -
ఇంటర్నెట్ షట్డౌన్లో టాప్ ఎవరంటే?
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ షట్డౌన్లో వరుసగా నాలుగో ఏడాది మన దేశం టాప్‌లో నిలిచింది. ఏ దేశానికి అందనంత ఎత్తులో ఉంది. 2021లో ప్రపంచవ్యాప్తంగా ఉద్దేశపూర్వకంగా 34 దేశాలలో కనీసం 182 సార్లు ఇంటర్నెట్ను మూసివేశారు. ఇందులో ఇండియావే 106 ఉన్నాయని టెక్ పాలసీ థింక్ ట్యాంక్ ‘యాక్సెస్ నౌ’ తన నివేదికతో పేర్కొంది. ఆందోళనలను అరికట్టడం, ఆన్లైన్ మోసాలను నిరోధించే క్రమంలో గతేడాది భారత్‌లో 106 పర్యాయాలు ఇంటర్నెట్ను నిలిపివేయగా.. జమ్మూకశ్మీర్లోనే 85 సార్లు ఇంటర్నెట్ షట్‌డౌన్ చేశారు. 2020తో పోల్చుకుంటే ఈ సంఖ్య కొంచెం తక్కువగా ఉంది. 2020లో భారత్‌లో 109 పర్యాయాలు ఇంటర్నెట్ బంద్ చేశారు. 2021 ఇంటర్నెట్ షట్‌డౌన్ జాబితాలో భారత్ తర్వాతి స్థానాల్లో మయన్మార్, సూడాన్, ఇరాన్ ఉన్నాయి. మయన్మార్‌లో కనీసం 15 సార్లు ఇంటర్నెట్ నిలిపివేశారు. సూడాన్, ఇరాన్ దేశాల్లో ఐదేసి పర్యాయాలు ఇంటర్నెట్ షట్‌డౌన్ నమోదయింది. (క్లిక్: క్షణక్షణం ఉత్కంఠ.. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో) సీమాంతర ఉగ్రవాదం ఎక్కువగా ఉండే జమ్మూకశ్మీర్‌లో నియంత్రణల కారణంగా అక్కడ ఎక్కువగా ఇంటర్నెట్ షట్డౌన్లు నమోదవుతున్నాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశమున్న సందర్భాల్లో రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శి, కేంద్ర హోం సెక్రటరీ అభ్యర్థనల మేరకు ఇంటర్నెట్ను నిలిపేస్తుంటారు. 2020లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 155 సందర్భాలలో ఇంటర్నెట్ను నిలిపివేయగా.. భారత్‌లో 109 సార్లు ఇంటర్నెట్ షట్‌డౌన్ చేశారు. (క్లిక్: ఈ ఏడుగురు అద్భుతం.. మీ అందరికీ సలామ్!) -
సైబర్ దాడుల కలకలం.. ఇంటర్నెట్ ఉన్నా ఉన్నట్లుండి ఆఫ్‌లైన్!
ఉక్రెయిన్ పరిణామాల నేపథ్యంలో సైబర్ దాడుల కలకలం కొనసాగుతోంది. భారీగా బ్యాంకింగ్, ప్రభుత్వ ముఖ్యంగా రక్షణ వ్యవస్థకు సంబంధించిన వెబ్సైట్లపై పడుతున్నారు హ్యాకర్లు. ఈ నేపథ్యంలో.. శుక్రవారం యూరప్ వ్యాప్తంగా వేలమంది ఇంటర్నెట్ యూజర్లకు ఒక్కసారిగా ఆఫ్‌లైన్ షాక్ తగిలింది. యూరప్‌లో జర్మనీ, ఫ్రాన్స్, హంగేరీ, గ్రీస్, ఇటలీ, పోలాండ్ దేశాల్లోని తమ క్లయింట్లకు ఇంటర్నెట్ సేవలకు విఘాతం ఏర్పడిందని, ఈ మేరకు 40వేలకు పైగా ఫిర్యాదులు వచ్చాయని, ఇదేం సాంకేతిక సమస్యకాదని ఒక ప్రకటన విడుదల చేసింది శాటిలైట్ ఇంటర్నెట్ సేవల కంపెనీ బిగ్‌బ్లూ. మరోవైపు ఆరెంజ్ కంపెనీ(నోర్‌డెంట్) కూడా 9వేల మంది ఫ్రాన్స్ సబ్స్క్రయిబర్లు ఇబ్బంది పడినట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. వీటితో పాటు మరో ఆరు ప్రధానమైన ఇంటర్నెట్ సేవల కంపెనీలు సైతం సేవలకు విఘాతం కలిగినట్లు ప్రకటన విడుదల చేశాయి. మరోవైపు బుధవారం కూడా ఇదే తరహాలో ఇబ్బందులు ఎదురయ్యాయని, ఇది కచ్చితంగా సైబర్ దాడులేనని యూఎస్‌కు చెందిన వయాశాట్ ప్రకటించింది. ప్రధానంగా హ్యాకర్లు శాటిలైట్ ఇంటర్నెట్ సేవలపైనే దృష్టి సారిస్తుండడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇదిలా ఉండగా.. యుద్ధ పరిస్థితుల్లో ఉక్రెయిన్‌లో కొత్త డేటా-నాశన వైరస్‌ని సైబర్ సెక్యూరిటీ కంపెనీలు గుర్తించాయి. అయితే దీని వాస్తవ ప్రభావాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
శ్రీవారి ఆఫ్‌లైన్ టికెట్లపై 15న అధికారులతో చర్చలు
తిరుమల: తిరుమలలో ఆఫ్‌లైన్‌లో సర్వదర్శనం టికెట్ల జారీపై ఈ నెల 15న సంబంధిత అధికారులతో చర్చించనున్నట్లు ఈవో కెఎస్ జవహర్ రెడ్డి చెప్పారు. వీలైనంత వరకు ఆన్లైన్లో సర్వదర్శనం టికెట్లను జారీ చేసేందుకే ప్రయత్నిస్తున్నామన్నారు. అదేరోజున ఆర్జిత సేవలను ప్రారంభించడం, పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించడంపైనా నిర్ణయం తీసుకుంటామన్నారు. మార్చి 1 నుంచి ఆర్జిత సేవలను భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. గతేడాది నవంబర్‌లో సంభవించిన వరదల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న శ్రీవారిమెట్టు మార్గాన్ని ఏప్రిల్ నెలాఖరుకల్లా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. టీటీడీ వెబ్సైట్లో బోర్డు తీర్మానాలు టీటీడీ ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాలను టీటీడీ వెబ్సైట్లో భక్తులకు, ప్రజలకు శుక్రవారం నుంచి అందుబాటులోకి తీసుకువచ్చింది. టీటీడీ ధర్మకర్తల మండలి గతేడాది నుంచి మూడు, నాలుగు బోర్డు సమావేశాల్లో చైర్మన్, బోర్డు సభ్యులు తీసుకున్న నిర్ణయాలను వెబ్సైట్లో భక్తులకు అందుబాటులో ఉంచలేదు. దీనిపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి టీటీడీ బోర్డు తీర్మానాలను వెంటనే వెబ్సైట్లో ఉంచాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో కేఎస్ జవహార్‌రెడ్డికి లాయర్ ద్వారా నోటీసులు పంపారు. దీంతో స్పందించిన టీటీడీ చైర్మన్, ఈవో టీటీడీ అధికారులతో చర్చించి టీటీడీ బోర్డు తీర్మానాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. -
TTD: ఆన్లైన్లో సర్వదర్శనం టికెట్లు విడుదల
తిరుమల/తిరుపతి తుడా/చంద్రగిరి: తిరుమల శ్రీవారి భక్తులకు త్వరలోనే ఆఫ్‌లైన్ ద్వారా దర్శనం టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. కోవిడ్ వ్యాప్తి చెందుతుందన్న ఆందోళనతో తిరుపతిలో ఆఫ్‌లైన్ ద్వారా టోకెన్ల జారీ విధానాన్ని గత ఏడాది సెప్టెంబర్ 25 నుంచి రద్దు చేశామని చైర్మన్ వివరించారు. ఆన్లైన్లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నప్పటికీ, అవి గ్రామీణ ప్రాంతంలో వున్న సామాన్య భక్తులకు అందడం లేదనే భావనలో టీటీడీ ఉందన్నారు. ఫిబ్రవరి 15వ తేదీ నాటికి ఒమిక్రాన్ తీవ్రత తగ్గుముఖం పడుతుందని నిపుణులు చెబుతుండటంతో ప్రస్తుతం ఆన్లైన్లో ఫిబ్రవరి 15వ తేదీ వరకు సంబంధించిన సర్వదర్శనం టోకెన్లు మాత్రమే జారీచేస్తున్నామని ఆయన తెలిపారు. శ్రీవేంకటేశ్వ రస్వామి దర్శనం కోసం ఫిబ్రవరికి సంబంధించిన రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లను శుక్రవారం ఉదయం ఆన్లైన్లో విడుదల చేయగా భక్తులు నిమిషాల్లోనే బుక్ చేసుకున్నారు. ఫిబ్రవరి నెలలో రోజుకి 12,000 చొప్పున టికెట్లను విడుదల చేశారు. ఫిబ్రవరి నెలకు సంబంధించి స్లాట్ సర్వదర్శనం టికెట్లను శనివారం ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేశారు. ఫిబ్రవరి 15 వరకు రోజుకు 10 వేల చొప్పున సర్వదర్శనం టికెట్లను విడుదల చేశారు. విశేష పర్వదినాల్లో వర్చువల్ సేవ శ్రీనివాస మంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ముఖ్య పర్వదినాల్లో నిర్వహించే కల్యాణోత్సవాన్ని వర్చువల్ సేవగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. సీఎం చేతులమీదుగా శ్రీనివాససేతు ప్రారంభం తిరుపతి స్మార్ట్ సిటీలో భాగంగా నిర్మిస్తున్న శ్రీనివాససేతు ఫ్లైఓవర్ తొలిదశ నిర్మాణాన్ని సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆయన శ్రీనివాససేతు ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను శుక్రవారం పరిశీలించారు. -
Sreemoyee Piu Kundu: సింగిల్ ఉమెన్‌గా ఉండటానికి ఎన్నో కారణాలు.. అయితే
‘హాయ్ శైలి... ఇన్నాళ్ల తరువాత నిన్ను చూసే భాగ్యం కలిగింది. ఎలా ఉన్నావు?’ ‘నన్ను గుర్తు పట్టావా?’ ‘నాకు అక్కలాంటిదానివి నువ్వు. ఎందుకు గుర్తుపట్టను!’ ‘కొత్త ఇల్లు కొన్నందుకు శుభాకాంక్షలు భార్గవి. ఫొటోల్లో కంటే సన్నగా కనిపిస్తున్నావు. ఇలాగే బాగున్నావు’ ... ఇవి ఏ ఫంక్షన్ హాల్లోనో వినిపించిన మాటలు కాదు. ఈ హాల్లో వివాహ వేడుకలాంటిదేమీ జరగడం లేదు. అందరూ ఒకరికి ఒకరు బాగా తెలుసు. అయితే ఎప్పుడూ ఒకరినొకరు ప్రత్యక్షంగా కలుసుకోలేదు. ఈ సమావేశానికి వచ్చిన వాళ్లు సింగిల్ ఉమెన్. వారు సింగిల్ ఉమెన్‌గా ఉండడానికి ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. అయితే వారందరిని ఒకటి చేసింది, ఒక కుటుంబంలా నిలిపింది స్టేటస్ సింగిల్. కొన్ని సంవత్సరాల క్రితం దేశవ్యాప్తంగా ఉన్న సింగిల్ ఉమెన్స్ ఆన్లైన్ వేదికగా ఒక బృందంగా ఏర్పడ్డారు. కష్టాలు, సుఖాలు, సంతోషాలు, సలహాలు...ఒకరితో ఒకరు పంచుకునేవారు. తమ గ్రూప్‌ను మరింత బలోపేతం చేయడానికి ఆన్లైన్ నుంచి ఆఫ్‌లైన్‌కు నడిచొచ్చారు. అందరూ దిల్లీలో సమావేశం అయ్యారు. ‘ఒకరినొకరం ప్రత్యక్షంగా కలుసుకోవడం చెప్పలేనంత సంతోషాన్ని ఇచ్చింది. కులం, మతం, ప్రాంతాలకు అతీతం గా మేమందరం ఒకే కుటుంబం అనే భావన కలిగింది’ అంటుంది రచయిత్రి, కాలమిస్ట్ శ్రీమోయి కుందు. అలా వచ్చిందే ఈ పుస్తకం.. ‘స్టేటస్ సింగిల్’ ఏర్పాటులో ఆమె కీలక పాత్ర పోషించింది. ‘రియల్ అకేషన్’ ‘హ్యాపియర్ టైమ్’ ‘యువర్ బిగ్డే’... తన ప్రతి పుట్టిన రోజు వేడుకల్లో తరచు వినిపించే మాటలు ఇవి. ఈసారి తన పుట్టిన రోజును ఒక వేడుకలా జరుపుకోకుండా, గుర్తుండి పోయే పని ఒకటి చేయాలనుకుంది. అలా వచ్చిందే ఆమె రాసిన ‘స్టేటస్ సింగిల్’ అనే పుస్తకం. దీని కోసం 30–40 సంవత్సరాల మధ్య వయసు ఉన్న అర్బన్ ఉమెన్స్ మూడువందల మందిని ఇంటర్వ్యూ చేసింది. వారి అనుభవాలను రికార్డ్ చేసింది. ఈ పుస్తకం సింగిల్ ఉమెన్ కష్టాలు, కన్నీళ్లనే కాదు... వారి పోరాట పటిమనూ కళ్లకు కట్టింది. సింగిల్ ఉమెన్‌పై రకరకాల అపోహలు ఉన్నాయి. వారికి కోపం ఎక్కువని. ఎప్పుడూ చిర్రుబుర్రులాడుతుంటారని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారని... ఇలాంటి ఎన్నో అపోహలకు ఈ పుస్తకం సమాధానం చెబుతుంది. ‘నేను రాసిన పుస్తకం సెల్ఫ్–హెల్ప్ బుక్లా ఉపయోగపడకపోవచ్చు. స్ఫూర్తిదాయక పుస్తకం కాకపోవచ్చు. కానీ ఏ ఒక్కరికైనా ఉపయోగపడితే అంతకంటే సంతోషం ఏముంటుంది’ అని కుందు చెబుతున్నప్పటికీ ఎంతోమంది సింగిల్ ఉమెన్‌కు ఈ పుస్తకం స్ఫూర్తిదాయకంగా, సెల్ఫ్–హెల్ప్ బుక్లా ఉపయోగపడుతుంది. తర్వాత ఏమిటి మరి? ఢిల్లీలోనే కాదు దేశం నలుమూలలా ‘స్టేటస్ సింగిల్’ సమావేశాలు ఏర్పాటు చేసి ఒకరికొకరు అండగా నిలవాలనేది లక్ష్యం. వారి లక్ష్యం ఫలించాలని ఆశిద్దాం. చదవండి: Vaccine RJ Aswathy Murali: టీవీ కంటే రేడియో ద్వారానే.. అలా మా కమ్యూనిటీలో -
ప్రత్యక్ష విధానంలో ఐసీఎస్ఈ పరీక్షలు
న్యూఢిల్లీ: 10, 12వ తరగతుల మొదటి టర్మ్ పరీక్షలను ఆఫ్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ (ఐసీఎస్ఈ) శనివారం ప్రకటించింది. ఈ పరీక్షలకు సవరించిన తేదీలను కూడా వెల్లడించింది. ఐసీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు నవంబర్ 29 నుంచి డిసెంబర్ 16 వరకు, 12వ తరగతి(ఐఎస్సీ) పరీక్షలు నవంబర్ 12వ తేదీన మొదలై డిసెంబర్ 20వ తేదీతో ముగుస్తాయని తెలిపింది. ప్రత్యక్ష విధానంలో సంబంధిత స్కూళ్లలోనే నిర్వహించే ఈ పరీక్షలను మార్గదర్శకాలను కూడా త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొంది. నవంబర్ 15, 16వ తేదీల్లో ఆన్లైన్లో ప్రారంభం కావాల్సిన ఈ పరీక్షలను అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లు బోర్డ్ గత వారం ప్రకటించింది. ఆన్లైన్ పరీక్షలకు కావాల్సిన కంప్యూటర్లు, విద్యుత్, బ్యాండ్ విడ్త్ కొరత వంటి వాటిపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వచ్చిన వినతుల మేరకు వాయిదా వేసినట్లు తెలిపింది. -
ఆఫ్‌లైన్‌లోనే సీబీఎస్ఈ టర్మ్–1 పరీక్షలు
న్యూఢిల్లీ: 10, 12వ తరగతుల టర్మ్–1 బోర్డు పరీక్షలను ఆఫ్‌లైన్ విధానంలోనే నిర్వహించనున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) గురువారం ప్రకటించింది. నవంబర్–డిసెంబర్లో ఈ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. పరీక్షల షెడ్యూల్‌ను ఈ నెల 18న ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది. ఆబ్జెక్టివ్ టైప్ పరీక్ష ఉంటుందని, ఒక్కో టెస్టు వ్యవధి 90 నిమిషాలని పేర్కొంది. చలి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఉదయం 10.30 గంటలకు కాకుండా 11.30 గంటలకు పరీక్షలు ప్రారంభించనున్నట్లు స్పష్టం చేసింది. టర్మ్–1, టర్మ్–2 పరీక్షల తర్వాత తుది ఫలితాలను ప్రకటించనున్నట్లు సీబీఎస్ఈ ఎగ్జామ్ కంట్రోలర్ భరద్వాజ్ తెలిపారు. టర్మ్–2 పరీక్షలను వచ్చే ఏడాది మార్చి–ఏప్రిల్‌లో నిర్వహించనున్నట్లు చెప్పారు. -
Digital Payments: నెట్ లేకున్నా పేమెంట్ ఎలా చేస్తారో తెలుసా?
టీ కొట్టు, హోటల్, రెస్టారెంట్, కిరాణ షాప్, మార్ట్లు, మెడికల్ షాప్, దుస్తుల షోరూం, క్యాబ్‌లు ఇలా ఏ సేవల్ని ఉపయోగించుకున్నా .. పది రూపాయలలోపు నుంచి వేల రూపాయల దాకా డిజిటల్ చెల్లింపులకే మొగ్గుచూపుతున్నాం. ఇక కార్డుల స్వైపింగ్ సంగతి సరేసరి. ఇంటర్నెట్ లేదంటే వైఫై సౌకర్యం ద్వారా ఈ చెల్లింపులు చేస్తున్నాం కదా. క్యాష్‌లెస్ ట్రాన్జాక్షన్స్ను ప్రొత్సహించడం కోసం కేంద్రం అమలు చేస్తున్న ప్రణాళికే ఇదంతా. మరి అసలు ఇంటర్నెట్తో సంబంధం లేకుండా డిజిటల్ చెల్లింపులు జరిపితే ఎలా ఉంటుంది!? ఇంటర్నెట్ లేకున్నా, ఆఫ్‌లైన్ ద్వారానే డిజిటల్ చెల్లింపులు జరిపే పద్ధతిని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మొదలుపెట్టింది. 2020 సెప్టెంబరు నుంచి ఈ ఏడాది జూన్ వరకు ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో ఆఫ్‌లైన్ రిటైల్ డిజిటల్ పేమెంట్ పద్దతిని అమలు చేసి పరిశీలించింది కూడా. ఈ ఫలితాలు సంతృప్తికరంగా రావడంతో ఈ విధానాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు ఆర్బీఐ ప్రయత్నాలు షురూ చేసింది. చెల్లింపులు ఎలాగంటే.. ఆఫ్‌లైన్ లావాదేవీలను వినియోగించుకోవాలనుకునే వారికి బ్యాంకులు లేదా ఫిన్‌టెక్ సంస్థలు ప్రత్యేక కార్డు లేదంటే టోకెన్లు ఇస్తాయి. ఒకరకంగా ఇవి డెబిట్ కార్డులాంటివే. నిర్ణీత మొత్తంలో చెల్లించాలని అనుకున్నప్పుడు.. ఈ కార్డును వాడుకోవచ్చు. పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) తరహాలో ఉండే ప్రత్యేక యంత్రాల ద్వారా చెల్లింపును పూర్తి చేయొచ్చు. మామూలుగా అయితే పీవోఎస్ యంత్రానికీ నెట్ అవసరం. కానీ, ఈ ప్రత్యేక పీవోఎస్ మెషిన్‌కు చెల్లింపుల టైంలో ఇంటర్నెట్తో పని లేదు. ఓటీపీ లేదంటే ఎస్ఎంఎస్ కన్ఫర్మేషన్ ద్వారా చెల్లింపు చేయొచ్చు. కాకపోతే ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చినప్పుడు వ్యాపారి ఈ యంత్రాన్ని అనుసంధానిస్తే, ఆయా చెల్లింపులన్నీ ఒకేసారి ప్రాసెస్ అవుతాయి. అంతేకాదు.. వాయిస్ బేస్డ్ చెల్లింపులనూ ఈ పద్ధతిలో చేసే వీలుంటుంది. ఐవీఆర్ ద్వారా సూచనలు ఇచ్చి కూడా చెల్లింపులను పూర్తి చేయొచ్చు. అయితే వాలెట్లు, కార్డులు, మొబైల్ డివైస్‌లు, యూపీఐ పేమెంట్స్(ఫోన్ పే, గూగుల్ పే..)తోనూ ఈ తరహా చెల్లింపులు సాధ్యమవుతుందని చెప్తున్నారు క్యాష్‌ప్రీ పేమెంట్స్ కో ఫౌండర్ రీజు దత్తా. అసలు కారణం.. నెట్వర్క్ సరిగ్గా లేకపోతే డిజిటల్ చెల్లింపులు ఆలస్యం కావడమే కాదు.. ఒక్కోసారి బ్యాంకు ఖాతాలో నగదు కట్ అయినా, వ్యాపారికి చేరడం లేదు. ఈ విషయంలో వివాదాలు తప్పడం లేదు. దీనికి పరిష్కారంగా ఈ ఆఫ్‌లైన్ విధానం తీసుకురాబోతున్నారు. వాళ్లను దృష్టిలో పెట్టుకునే.. ఆన్లైన్ డిజిటల్ చెల్లింపుల ప్రక్రియ.. గ్రామీణ ప్రాంతాల్లో, నిరక్షరాస్యులకు, వయసు పైబడిన వ్యాపారులకు కొంచెం ఇబ్బందికరంగా మారింది. ఈ ఆఫ్‌లైన్ చెల్లింపుల ప్రక్రియ ద్వారా వాళ్లకు ఊరట లభించనుంది. అంతేకాదు ఫిన్‌టెక్ సంస్థలకు ప్రత్యేకంగా కార్డులు జారీ చేయడంతో పాటు, యంత్రాలను తయారు చేయడం, వాటిని ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉండని గ్రామీణ ప్రాంతాలకు.. కొండ ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాల్లో అందించేందుకు వీలు ఉంటుంది. ఎన్ఎఫ్సీ (నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్) కార్డుల వాడకం కోసం ప్రత్యేక ఏర్పాట్లూ ఫిన్‌టెక్ సంస్థలకు సరికొత్త వ్యాపారావకాశాలను సృష్టించే వీలుంది. జాగ్రత్త అవసరమే.. ఆన్లైన్ పేమెంట్స్ వల్ల సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. అలాంటప్పుడు ఆఫ్‌లైన్ కార్డులతో ఆ రిస్క్ తక్కువ. అయినప్పటికీ మరింత అప్రమత్తత అవసరమని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అయితే, చెల్లింపులకు జియోట్యాగింగ్ చేయడంలాంటి వాటివల్ల వీటికి అడ్డుకట్ట వేసే వీలుందని అంటున్నారు. సాధ్యమేనా? ఇదేం కొత్త విధానం కాదు. ఇంటర్నెట్ అవసరం లేకుండా నగదు బదిలీ సేవలు దాదాపు దశాబ్దం కిందే ఉండేవి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ విధానాన్ని ప్రవేశ పెట్టింది. స్మార్ట్ ఫోన్లు అంతగా వాడకంలో లేనిటైంలో అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీసెస్ డేటా (యూఎస్ఎస్డీ)తో పనిచేసే *99H కు ఫోన్ చేయడం ద్వారా, సంక్షిప్త సందేశాల రూపంలో (ఎస్ఎంఎస్) బ్యాంకు లావాదేవీలను నిర్వహించే వీలును తీసుకొచ్చింది. యూఎస్ఎస్డీ ద్వారా బ్యాంకు ఖాతా నిల్వ తెలుసుకోవడం, నగదు బదిలీ చేయడం నిర్వహించుకోవచ్చు. ఇందుకు నెట్ అవసరం లేదు. కాబట్టి, ఆఫ్‌లైన్‌లో నగదు చెల్లింపు లావాదేవీలు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. చిన్నమొత్తం చెల్లింపులను సులభంగా, ఎలాంటి అంతరాయం లేకుండా చేసేందుకు వీలు కల్పిస్తుందంటున్నారు. 2020 సెప్టెంబరు నుంచి ఈ ఏడాది జూన్ వరకు ఆర్బీఐ ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ఆఫ్‌లైన్ డిజిటల్ పేమెంట్ ఇన్షియేటివ్‌లో మొత్తం 2.41 లక్షల లావాదేవీల ద్వారా రూ.1.16 కోట్ల నగదు బదిలీ జరిగింది. చదవండి: కార్డు చెల్లింపులు.. కొత్త రూల్స్ గుర్తున్నాయా?.. ఇవే! -
సమస్యల పరిష్కార వేదిక స్పందన..
కర్నూలు(సెంట్రల్) : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్దిష్ట గడువులోగా చర్యలు తీసుకొంటోంది. అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కారం రాకపోయినా, నిర్దేశించిన గడువులోగా ఇవ్వకపోయినా అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికారులు స్పందనలో అర్జీలు తప్పక దానికి సమాధానం చేయాల్సి ఉంటుంది. 2019 జూన్ 1 నుంచి 2021 అక్టోబర్ 03వ తేదీ నాటికీ స్పందనకు రాష్ట్ర వ్యాప్తంగా 3,27,8,844 అర్జీలు రాగా, అందులో 3,20,9,919 అర్జీలకు పరిష్కారం చూపారు. 68,325 అర్జీల పరిష్కార మార్గాలు ప్రాసెస్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్పందన అర్జీలను ఎన్ని మార్గాల ద్వారా ఇవ్వచ్చో చుద్దాం. ప్రధానంగా గ్రామ, వార్డు సచివాలయాలు, 1902 కాల్ సెంటర్, స్పందన మొబైల్ యాప్, వెబ్ అప్లికేషన్, ప్రతీ సోమవారం కలెక్టరేట్లలో కలెక్టర్లకు అర్జీలు ఇవ్వవచ్చు. గ్రామ, వార్డు సచివాలయాలు.. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రజల సమస్యల పరిష్కారం కోసం అర్జీలను స్వీకరిస్తారు. అక్కడ డిజిటల్ అసిస్టెంట్‌కు అర్జీలు ఇస్తే వాటిని స్పందన లాగిన్‌లో అప్లోడ్ చేస్తారు. తద్వారా మనం ఉన్న ప్రాంతం నుంచే అర్జీలు ఇచ్చేందుకు వీలు అవుతుంది. 1902 కాల్ సెంటర్.. ఈ కాల్ సెంటర్ కూడా స్పందనకు సంబంధించిందే. ఇది 24 గంటలు పనిచేస్తుంది. 1902 కాల్ ఉచితంగా ఫోన్ చేసి మాట్లాడి మన సమస్యను అధికారికి తెలపాలి. దీనికి ఫోన్ చేసే సమయంలో ఆధార్‌నంబర్ కచ్చితంగా ఉండాలి. ఈ కాల్ సెంటర్‌కు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఏపీలోని మన సమస్యలకు పరిష్కారం కొనుగోనవచ్చు. మొబైల్ యాప్, వెబ్ అప్లికేషన్... ఈ రెండింటికి ఆన్లైన్ ద్వారా అర్జీలు ఇవ్వవచ్చు. మొబైల్యాప్, వెబ్ అప్లికేషన్లను మన సెల్ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని మన పూర్తి వివరాలను నమోదు చేసి పంపవచ్చు. కలెక్టరేట్లలో నేరుగా ఇవ్వచ్చు... స్పందనకు ఎక్కువ సంఖ్యలో అర్జీలు వచ్చే మార్గం కలెక్టరేట్లలో ప్రతీ సోమవారం నిర్వహించే గ్రీవెన్స్. ఇక్కడ సమస్యను ఏ అధికారి అయితే పరిష్కరించగలుగుతాడో నేరుగా అతనికే మన అర్జీని ఇస్తే అక్కడిక్కడే చాలా సమస్యలకు పరిష్కారం చూపిస్తారు. ఇక్కడ కలెక్టర్, జేసీలు, జిల్లా ఉన్నతాధికారులు ఉండి అర్జీలు స్వీకరిస్తారు. ఇక్కడే ఇచ్చే అర్జీలకు చాలా వరకు పరిష్కారాలు అప్పటికప్పుడు వచ్చేస్తాయి. -
తాలిబన్ల వెబ్సైట్లు బంద్ !
బోస్టన్: తాలిబన్ల అధికారిక నిర్ణయాలను ప్రపంచానికి ఐదు భాషల్లో అందిస్తున్న వెబ్ సైట్లు శుక్రవారం హఠాత్తుగా ‘ఆఫ్‌లైన్’లోకి వెళ్లిపోయాయి. తాలిబన్లను ఆన్లైన్ వేదికపై అడ్డుకునేందుకే ఇలా వెబ్సైట్లను క్రియాశీలక స్థితి నుంచి పక్కకు నెట్టారని వార్తలొస్తు న్నాయి. తాలిబన్ల సందేశాలను ఈ వెబ్సైట్లు పష్తో, ఉర్దూ, అరబిక్, ఇంగ్లిష్, దారీ భాషల్లో ప్రపంచానికి అందిస్తున్నాయి. ఈ వెబ్సైట్లకు శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన కంటెంట్ డెలివరీ నెట్వర్క్, ప్రొటెక్షన్ ప్రొవైడర్ సేవలను ‘క్లౌడ్‌ఫ్లేర్’ సంస్థ అందిస్తోంది. వెబ్సైట్ల తాజా స్థితిపై ఆరా తీసేందుకు ‘ది వాషింగ్టన్ పోస్ట్’ వార్తా సంస్థ.. ‘క్లౌడ్‌ఫ్లేర్’ను సంప్రదించినా ఆ సంస్థ స్పందించలేదు. పలు ‘తాలిబాన్ గ్రూప్’లను వాట్సాప్ తొలగించిందని ఎస్ఐటీఈ నిఘా సంస్థ డైరెక్టర్ రీటా కట్జ్ వెల్లడించారు. ఆన్లైన్ వేదికలపై తాలిబన్ల దూకుడు నుంచి అల్‌ఖాయిదా, ఇతర ఇస్లామిక్ ఉగ్రసంస్థలు స్ఫూర్తి పొందకుండా కట్టడి చేయాలని టెక్ దిగ్గజాలను ఆమె కోరారు. ఫేస్బుక్, ట్విట్టర్లు కూడా పలు తాలిబన్ల ఖాతాలను తొలగించాయి. తాలిబన్ల ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్‌కు ట్విట్టర్లో ఏకంగా 3లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. -
గూడెం గ్రాడ్యుయేట్..ఆఫ్‌లైన్‌లో లైఫ్ ఇస్తోంది
సంధ్య తన గూడెంలో తొలి మహిళా గ్రాడ్యుయేట్. గతేడాదే డిగ్రీ అయింది. డిగ్రీ చదివిన అమ్మాయిలు చాలామంది ఈమధ్య పిల్లలకు ఉచితంగా ఆన్లైన్ క్లాస్ లు తీసుకుంటున్నారు. సంధ్య మాత్రం ఆఫ్‌లైన్ క్లాస్ లు తీసుకుంటోంది. గూడెంలో పిల్లలకు ఫోన్లు ఉంటాయా? నెట్ ఉంటుందా? అందుకే పిల్లల్ని గూడెంలోనే సేఫ్‌గా ఒక చోట చేర్చి, వారికి ఉచితంగా మేథ్స్, ఇంగ్లిష్ చెబుతోంది. మిగతా సబ్జెక్టులను.. పాఠాలుగా కాకుండా, జనరల్ నాలెడ్జిగా మార్చి చదువుపై ఆసక్తి, శ్రద్ధ కలిగిస్తోంది. కరోనా థర్డ్ వేవ్ గురించిన భయమే తప్ప, చతికిల పడబోతున్న చదువుల థర్డ్ వేవ్ గురించి ఆలోచించే పరిస్థితి ఇప్పుడు ఎక్కడా లేదు. స్థోమత కలిగిన పిల్లలు ఎలాగో ఆన్లైన్లో కుస్తీలు పడుతున్నారు. కంప్యూటర్, కనీసం ఫోన్ లేని పిల్లలు బడీ లేక, ఇంట్లో పాఠాల సడీ లేక అలా ఉండిపోతున్నారు. పట్టణాలు, గ్రామాల్లోనే ఇలా ఉంటే.. ఇక ఏ టెలిఫోన్ సౌకర్యమూ, నెట్ కనెక్షన్ లేని ఆదివాసీ గూడేలలోని పిల్లల చదువుల మాటేమిటి? ఏ ‘వేవూ’ లేని రోజుల్లోనే పిల్లల్ని బడికి కూడా పంపలేని పేదరికం ఉంటుంది ఆ మారుమూల ప్రాంతాల్లో! మరి వారి పిల్లల భవిష్యత్తు మాటేమిటి?! వారి భవిష్యత్తుకు మాట ఇస్తోంది అన్నట్లుగానే.. సంధ్య అనే ఓ అమ్మాయి.. ఈ మధ్యే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న ఆ అమ్మాయి.. తన గూడెం పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని మరీ ‘ఆఫ్‌లైన్’ పాఠాలు బోధిస్తోంది. ఆన్‌లైన్‌కి దారే లేనప్పుడు ఆఫ్‌లైన్‌లోనే కదా పిల్లల చేరువకు వెళ్లాలి. సంధ్య కూడా వాళ్ల గూడెం అమ్మాయే. తమిళనాడు, కోయంబత్తూరుకు సమీపంలోని చిన్నంపతి గూడెంలోనే ఆమె పుట్టింది. అక్కడే డిగ్రీ వరకు చదివింది. గూడెంలో తొలి పట్టభద్రురాలు సంధ్య. ఏడాదిన్నరగా పిల్లలు చదువుల్లేకుండా ఉండిపోవడం ఆమె చూస్తూనే ఉంది. అందుకు కారణం కరోనానే అయినా, అంతకన్నా పెద్ద కారణం పేదరికం. ఆ సంగతి గ్రహించింది కనుకనే తనే స్వయంగా చదువు చెప్పడానికి పిల్లల్నందర్నీ జమ చేసింది. చిన్నపిల్లల చేత అక్షరాలు దిద్దించడం, పెద్ద పిల్లలకు మేథ్స్, ఇంగ్లిష్ నేర్పించడం ఇప్పుడు ఆమె దినచర్య. ‘పాఠం’ అనే మాటెప్పుడూ పిల్లలకు ఆసక్తికరంగా ఉండదు. అందుకే మాటగా, ఆటగా పాఠాలను నేర్పిస్తోంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే సంధ్యకు ఏదో ఒక ఉద్యోగం రాకుండాపోదు. వర్క్ ఫ్రమ్ ఇవ్వకా పోరు. కానీ తన గూడెం పిల్లలకు దగ్గరగా ఉండి వారి చదువుల్ని చూసుకోవాలనుకుంది. ‘‘బడి వారికి దూరమైంది. బడి తెరిచేవరకు నేను వారికి దగ్గరగా ఉంటాను’’ అంటోంది సంధ్య. -
రిటర్నుల దాఖలుకు మార్గాలివే..
ఆదాయపన్ను రిటర్నుల (ఐటీఆర్) దాఖలుకు మరో రెండు వారాల వ్యవధే మిగిలి ఉంది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నుల దాఖలు గడువు వాస్తవానికి జూలైతోనే ముగియాలి. కానీ, కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన ప్రతికూతలతల నేపథ్యంలో గడువు కాస్తా డిసెంబర్ ఆఖరు వరకు పెరిగింది. దీంతో రిటర్నులను ఇప్పటి వరకు చేయని వారు.. డిసెంబర్ 31 నాటికి సమర్పించాల్సి ఉంటుంది. రిటర్నుల దాఖలుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆన్లైన్ వేదికలతోపాటు, ఆఫ్లైన్లోనూ రిటర్నుల దాఖలులో సాయపడేవారు ఉన్నారు. పన్ను అంశాల పట్ల మీకు అవగాహన ఉంటే స్వయంగా ఈ పనిని చేసుకోవచ్చు. లేదా అందుబాటులో ఉన్న ఇతర మార్గాలను ఆశ్రయించొచ్చు. ఆ వివరాలను ఈ వారం ప్రాఫిట్ ప్లస్ కథనంలో తెలుసుకుందాం. ఇంటర్నెట్ వినియోగంపై అవగాహన ఉండి, పన్ను విషయాలు కూడా తెలిసిన వారు అయితే నేరుగా ఆదాయపన్ను శాఖ ఈ ఫైలింగ్ వెబ్సైట్ (incometaxindiaefiling. gov. in) కు వెళ్లి రిటర్నులు ఫైల్ చేయవచ్చు. ఈ పోర్టల్‌లో ముందుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మీ పాన్ నంబరే యూజర్ ఐడీ అవుతుంది. పాస్‌వర్డ్‌ను ఏర్పాటు చేసుకుని నమోదు ప్రక్రియ పూర్తి చేసుకున్న అనంతరం.. తిరిగి లాగిన్ అయి రిటర్నులను దాఖలు చేసుకోవచ్చు. ఈ సేవ కోసం ఆదాయపన్ను శాఖ ఎటువంటి చార్జీలు వసూలు చేయదు. మీ ఆదాయ వివరాలు సమగ్రంగా సిద్ధం చేసుకుంటే రిటర్నుల దాఖలు పెద్ద కష్టమేమీ కాదు. ఐటీ పోర్టల్‌లో ఎంతో సమాచారం అందుబాటులో ఉంది. ఫామ్ 26ఏఎస్, ఈపే సెల్ఫ్ అసెస్మెంట్, ఈ వెరిఫై లింక్‌లు కూడా అక్కడే ఉంటాయి. ఫామ్ 26ఏఎస్‌లో టీడీఎస్, టీసీఎస్ వివరాలు ఉంటాయి. గతంలో దాఖలు చేసిన రిటర్నులను, వాటి పురోగతి తీరును, అవుట్‌స్టాండింగ్ ట్యాక్స్ డిమాండ్ (కట్టాల్సిన పన్ను బకాయిలు ఉంటే), రిఫండ్ అభ్యర్థన దాఖలు పురోగతి, ఐటీఆర్ 5 రసీదు వివరాలు కూడా అక్కడే లభిస్తాయి. దాఖలు సమయాన్ని తగ్గించేందుకు వీలుగా పన్ను లెక్కలను కూడా కొన్నింటిని ఆటోమేటెడ్ చేశారు. పాన్ డేటాబేస్ ఆధారంగా గతంలోని ఐటీఆర్‌లు, ఫామ్ 26ఏఎస్ ఆధారంగా ముందుగానే కొన్ని వివరాలు నింపిన రిటర్నులు కూడా అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా గత కొన్నేళ్ల కాలంలో కొన్ని అదనపు సౌకర్యాలను ఆదాయపన్ను శాఖ తీసుకొచ్చింది. భద్రతా కోణంలో లాగిన్‌కు రెండో దశ అథెంటికేషన్‌ను ‘ఈ ఫైలింగ్ వాల్ట్’ రూపంలో ప్రవేశపెట్టింది. యూజర్ ఐడీ, పాస్వర్డ్ సాయంతో కాకుండా.. మరింత భద్రత కోసం నెట్ బ్యాంకింగ్, ఆధార్ ఆధారిత ఓటీపీ రూపంలోనూ లాగిన్ కావొచ్చు. మధ్యవర్తుల సాయం.. స్వయంగా రిటర్నులు దాఖలు చేసుకునేంత అవగాహన లేని వారు లేదా అంత తీరిక లేని వారు మధ్యవర్తుల సాయం తీసుకోవచ్చు. ఇందు కోసం ఎన్నో వెబ్ పోర్టళ్లు (వెబ్‌సైట్స్) అందుబాటులో ఉన్నాయి. ఈ పోర్టళ్లు మీ నుంచి అవసరమైన సమాచారం అంతా తీసుకుని, పన్ను చెల్లింపు బాధ్యతలను మదింపు చేసిన అనంతరం మీ తరఫున రిటర్నులను ఆదాయపన్ను పోర్టల్ వేదికపై దాఖలు చేస్తాయి. కొన్ని పోర్టళ్లు ఉచితంగానూ ఈ సేవలను ఆఫర్ చేస్తున్నాయి. రూ.5లక్షల్లోపు ఆదాయం ఉన్న వారికి ‘ట్యాక్స్‌స్మైల్’ పోర్టల్ ఉచితంగా రిటర్నుల ఫైలింగ్ సేవను అందిస్తోంది. అదే విధంగా క్లియర్‌ట్యాక్స్ పోర్టల్ కూడా కొందరికి ఇటువంటి సేవను ఆఫర్ చేస్తోంది. ఒకటికి మించిన మార్గాల్లో ఆదాయం కలిగి ఉండి లేదా విదేశీ ఆదాయం ఉండుంటే నిపుణుల సేవలను రిటర్నుల ఫైలింగ్ కోసం తీసుకోక తప్పదు. ఈ విషయంలో చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) సేవలను వినియోగించుకోవచ్చు. ఒక వ్యక్తికి ఉన్న ఆదాయ వనరుల ఆధారంగా రిటర్నుల దాఖలుకు వెబ్ పోర్టళ్లు ఫీజులను నిర్ణయిస్తున్నాయి. అందించే సేవల ఆధారంగా రూ.699 నుంచి రూ.7,999 వరకు ఫీజుల కింద ట్యాక్స్‌స్పానర్ అనే సంస్థ తీసుకుంటోంది. రిటర్నుల దాఖలే కాకుండా పలు పోర్టళ్లు విలువ ఆధారిత సేవలను కూడా అందిస్తున్నాయి. ఐటీఆర్ దాఖలు తర్వాత వాటిల్లోని తప్పొప్పులను సరిచేసుకోవడం, డిమాండ్ నోటీసులకు స్పందించడం తదితర అంశాల్లో నిపుణుల సేవలను కూడా వీటి నుంచి పొందొచ్చు. పన్ను నిపుణులు లేదా సీఏలతో తమ సందేహాలను తీర్చుకునే సదుపాయాన్ని అందిస్తున్నాయి. మీ డాక్యుమెంట్లను భద్రంగా ఉంచుకునేందుకు వాల్ట్ సేవను కూడా అందుబాటులో ఉంచుతున్నాయి. రిటర్నుల దాఖలుతోపాటు ఈ సేవలను కూడా పొందే విధంగా ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి. టీఆర్పీలు ప్రభుత్వం నియమించిన పన్ను దాఖలు సన్నాహకుల (టీఆర్పీలు) సేవలను కూడా వినియోగించుకోవచ్చు. మీకు సమీపంలో ఉన్న టీఆర్పీల వివరాలను ఇన్కమ్ట్యాక్స్ఇండియా డాట్ జీవోవీ డాట్ ఇన్ పోర్టల్‌లో ‘ట్యాక్స్‌పేయర్ సర్వీసెస్’ ట్యాబ్ నుంచి పొందొచ్చు. టీఆర్పీలు మొదటి ఏడాది రిటర్నుల దాఖలు, పన్ను చెల్లింపులపై 3% సర్వీసు చార్జీ కింద తీసుకుంటారు. అదే వ్యక్తి రెండో ఏడాది రిటర్నుల దాఖలు సేవను కోరుకుంటే 2%, తర్వాతి ఏడాది ఒక శాతం చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. గరిష్ట చార్జీ రూ.1,000. ఒకవేళ ఏదేనీ సంవత్సరం ఈ చార్జీ రూ.250 కూడా మించకపోతే అప్పుడు టీఆర్పీలు కనీస చార్జీ తీసుకునేందుకు అర్హులు. కాకపోతే వీరి సేవలు పన్ను రిటర్నుల దాఖలు వరకే అని గుర్తుంచుకోవాలి. ఆన్లైన్ పోర్టళ్ల మాదిరి ఏడాది పొడవునా సేవలు, విలువ ఆధారిత సేవలు వీరి నుంచి లభించవు. గడువు దాటొద్దు.. కరోనా కారణంగా 2019–20 ఆర్థిక సంవత్సరం రిటర్నుల దాఖలు గడువును జూలై నుంచి తొలుత నవంబర్ ఆఖరుకు, ఆ తర్వాత డిసెంబర్ 31కు కేంద్రం పొడిగించింది. ఈ గడువులోపు రిటర్నులను దాఖలు చేయకపోతే.. ఆ తర్వాత వడ్డీ చార్జీలు, పెనాల్టీలను చెల్లించుకోవాలి. రిఫండ్లు కూడా ఆలస్యమవుతాయి. గతంలో పెనాల్టీలు విధించడం అన్నది పన్ను అధికారుల విచక్షణపైనే ఆధారపడగా, ఇప్పుడైతే అది చట్ట ప్రకారం అమలవుతోంది. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 234 ఎఫ్ కింద.. పన్ను వర్తించే ఆదాయం రూ.5లక్షలు, ఆలోపు ఉంటే డిసెంబర్ 31 తర్వాత రిటర్నుల దాఖలుకు రూ.1,000 పెనాల్టీ చార్జీగా చెల్లించాలి. పన్ను వర్తించే ఆదాయం రూ.5లక్షలు మించి ఉంటే ఈ పెనాల్టీ రూ.10,000. గడువు లోపు రిటర్నులు దాఖలు చేయకుండా, ఆలస్యంగా రిటర్నులు వేసి పన్ను చెల్లించినట్టయితే ఆ మొత్తంపై వడ్డీ కూడా వసూలు చేయాలని సెక్షన్ 234ఏ చెబుతోంది. ఆలస్యమైన ప్రతీ నెలకు ఒక శాతం చొప్పున వడ్డీ చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇది కూడా పన్ను బాధ్యత రూ.లక్ష వరకు ఉన్న వారికే. ఒకవేళ రూ.లక్షకు మించి పన్ను చెల్లించాల్సి ఉండి, డిసెంబర్ 31 తర్వాత రిటర్నులు వేసినట్టయితే.. అప్పుడు 2020 జూలై 31 తర్వాతి నుంచి రిటర్నులు వేసే నాటి వరకు ఈ మేరకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. మీరు రిటర్నులు వేయాల్సిందే..! కనీస మినహాయింపు పరిధిలో ఆదాయం ఉన్న వారు (60ఏళ్లలోపు వ్యక్తులకు రూ.2.5 లక్షలు) రిటర్నులు దాఖలు చేయక్కర్లేదు. కానీ, ఏదేనీ ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను వర్తించే స్థాయిలో ఆదా యం లభిస్తే ఆ ఏడాదికి రిటర్నులు వేస్తే సరిపోయేది. అయితే, ఇక మీదట పన్ను వర్తించే ఆదాయ పరిధిలో లేకపోయినా కానీ.. నిర్దేశిత లావాదేవీలలో ఏవైనా నిర్వహించినట్టయితే తప్పకుండా రిటర్నులు వేయాలి. డిపాజిట్లు రూ.కోటికి మించి చేసినా (ఒకటి లేదా అంతకుమించిన కరెంటు ఖాతాలలో), విదేశీ పర్యటన కోసం రూ.2లక్షలపైన ఖర్చు పెట్టినా, ఒక ఏడాదిలో విద్యుత్తు బిల్లు రూ.లక్ష దాటినా తమ ఆదాయంతో సంబంధం లేకుండా ఐటీఆర్ దాఖలు చేయాలి. ఎవరు ఏ రిటర్నులు వేయాలి? ఐటీఆర్–1: రూ.20 లక్షల ఆదాయం మించని వ్యక్తులు ఐటీఆర్–1 దాఖలు చేయాల్సి ఉంటుంది. అది కూడా ఒక్క వేతనం లేదా ఇంటిపై ఆదాయం లేదా వడ్డీ ఆదాయం, లేదా వ్యవసాయంపై ఆదాయం రూ.5,000 వరకు ఉన్న వారు, లేదా ఇవన్నీ కలిగిన వారు ఐటీఆర్–1 ఫైల్ చేయాలి. ఐటీఆర్–2: ఐటీఆర్–1 పరిధిలోని వారు కాకుండా.. ఒక వ్యక్తి కంపెనీలో డైరెక్టర్‌గా ఉంటే లేదా స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో నమోదు కాని కంపెనీలో ఇన్వెస్ట్ చేసినట్టయితే ఐటీఆర్–2 దాఖలు చేయాలి. అలాగే, క్రితం ఆర్థిక సంవత్సరాల్లోని మూలధన లాభాలను చూపించుకునేట్టు అయితే లేదా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని నష్టాలను తర్వాతి సంవత్సరాలకు కొనసాగించుకోవాలనుకుంటే, ఇతర వనరుల ద్వారా ఆదాయం వచ్చిన వారు కూడా ఇదే రిటర్న్ వేయాల్సి ఉంటుంది. ఐటీఆర్–3: వ్యక్తులు, హిందు అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్) వ్యాపారం లేదా వృత్తి రూపంలో ఆర్జించి ఉంటే ఐటీఆర్–3ను ఫైల్ చేయాలి. ఐటీఆర్–4: భారతీయ నివాసితులు, హెచ్‌యూఎఫ్‌లు, సంస్థలు (ఎల్ఎల్పీ కాకుండా) వ్యాపారం, వృత్తి రూపంలో రూ.50 లక్షల వరకు ఆదాయం ఉంటే ఐటీఆర్–4 వేయాల్సి ఉంటుంది. ఐటీఆర్–5/6/7: నిర్దేశిత వ్యక్తులు, ఎల్ఎల్పీలు, సంస్థలు, కంపెనీలకు ఇవి వర్తిస్తాయి. -
ఆఫ్‌లైన్‌లో వాహనాల రిజిస్ట్రేషన్
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరం ప్రాంతీయ రవాణా కార్యాలయంలో ఈ నెల 28 నుంచి మార్చి 7 వరకూ వాహనాల బదిలీ రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో కాకుండా ఆఫ్‌లైన్‌లో స్వయంగా లావాదేవీలు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు ఆర్టీఓ షేక్ కరీం తెలిపారు. ప్రాంతీయ కార్యాలయం పరిధిలో సుమారు 1500 వాహనాలు అమ్మకాలు జరిగిన తరువాత ఓనర్షిప్ మార్పులు చేసుకోకుండా ఉండిపోయాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 వేల వాహనాలు ఈ విధంగా యాజమాన్యం మార్పు లేకుండా ఉండిపోయాయన్నారు. ఈ విధమైన వాహనాలు రిజిస్ట్రేషన్‌లో స్వయంగా మార్పులు చేసుకునేందుకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఆన్లైన్ విధానంలో ఇప్పటి వరకూ అమ్మకం జరిపిన వాహనం ఓనర్షిప్ మారాలంటే అమ్మకందారుడు, కొనుగోలు దారుడు ఇద్దరూ ఉండాల్సి వచ్చేదన్నారు. కానీ వారం రోజుల పాటు ప్రభుత్వం ఈ విధానాన్ని పక్కన పెట్టి స్వయంగా ఆర్టీఓ కార్యాలయానికి వచ్చి వాహనాలు బదిలీని చేసుకునే వీలు కల్పించిందన్నారు. వాహనం సేల్ లెటర్‌తో పాటు పొల్యూషన్ సర్టి ఫికెట్, ఇన్సూరెన్స్, సీబుక్, మొదలగు సర్టి ఫికెట్లతో కొనుగోలుదారుడు కార్యాలయానికి వస్తే ఈ మార్పులు చేసుకోవచ్చన్నారు. సెకండ్ హ్యాండ్ వాహనాలు అమ్మకందారులు తమ దగ్గర ఉన్న ఆధారాలతో వాహన యాజమాన్యం మార్పులు చేసుకునేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆటో యజమానులు సైతం మార్పులు చేసుకోవడం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకునే అవకాశం కలుగుతుందన్నారు. ఈ లావాదేవీలు జరపడానికి దళారులను ఆశ్రయించవద్దన్నారు. స్వయంగా కార్యాలయానికి వచ్చి అధికారుల సహాయం పొందాలన్నారు. దీని కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. -
రిలయన్స్ డిజిటల్‌తో జతకట్టిన వన్‌ప్లస్
సాక్షి,న్యూఢిల్లీ: భారదేశంలో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలపై కన్నేసిన చైనా మొబైల్ తయారీదారు వన్‌ప్లస్ దేశంలోని దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థతో ఒక కీలక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. రిలయన్స్ డిజిటల్ ద్వారా వన్ ప్లస్ స్మార్ట్ఫోన్ల విక్రయాలకు ఈ ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం ఇక మీదట రిలయన్స్ డిజిటల్ ఆఫ్‌లైన్ స్టోర్లలో వన్‌ప్లస్ ఉత్పత్తులు లభ్యం కానున్నాయి. అంతేకాదు దేశంలోని పలు నగరాల్లో రిలయన్స్ డిజిటల్ స్టోర్ల ద్వారా వన్‌ప్లస్ తాజా స్మార్ట్‌ఫోన్ 6టీ ఆవిష్కరణ ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహించనుంది. దేశంలోనే నెంబర్‌వన్, అతి వేగంగా విస్తరిస్తున్న కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ సంస్థ రిలయన్స్ డిజిటల్‌తో వన్‌ప్లస్ ఒప్పందాన్ని చేసుకుందని రిలయన్స్ డిజిటల్ ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో తాజా భాగస్వామ్యంతో మరింత విస్తరించాలని భావిస్తున్నట్టు వన్‌ప్లస్ ఇండియా జీఎం వికాస్ అగర్వాల్ ప్రకటించారు. భారతీయ నగరాల్లోని తమ మొబైల్ ఫోన్లు వినియోగదారులకు అందుబాటులోఉండేలా మరిన్ని రిటైల్ టచ్ పాయింట్లను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. వన్ ప్లస్ సంస్థతో భాగస్వామ్యం పట్ల రిలయన్స్ డిజిటల్ సంస్థ సీఈవో బ్రయాన్ బేడ్ సంతోష వ్యక్తం చేశారు. తమ స్టోర్లలో వినియోగదారులకోసం ప్రత్యేక జోన్లను ఏర్పాటు చేస్తామని తద్వారా లైవ్ డెమో తోపాటు, కస్టమర్లు తమ సందేహాలను తమ సిబ్బంది ద్వారా పత్యక్షంగా నివృత్తి చేసుకోవచ్చని చెప్పారు. న్యూయార్క్‌లో అక్టోబరు 29 వ తేదీ వన్‌ప్లస్ 6టీ స్మార్ట్‌ఫోన్ ప్రారంభానికి ముందు ఈ భాగస్వామ్య ప్రకటన రావడం విశేషం. అలాగే అక్టోబర్ 30 న న్యూఢిల్లీలో లాంచ్ చేయనుంది. ఇప్పటివరకు టాటా గ్రూపునకు చెందిన క్రోమా ఆఫ్‌లైన్ స్టోర్లలో మాత్రమే లభ్యమయ్యే వన్‌ప్లస్‌స్మార్ట్‌ఫోన్లు ఇపుడు రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో కూడా అందుబాటులో ఉంటాయి. వన్‌ప్లస్ 6టీ ఫీచర్లు : 6.4 అంగుళాల డిస్ప్లే , 8జీబీ ర్యామ్, 256 జీబీస్టోరేజ్ 3700ఎంఏహెచ్ బ్యాటరీ ప్రధాన ఫీచర్లుగా ఉండనున్నాయి. -
అక్రమార్కులకు ఆఫ్‘లైన్ క్లియర్’
సాక్షి, అమరావతి: సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను గత రెండు దఫాలుగా ఆన్లైన్ విధానంలో భర్తీ చేసిన సర్కారు.. తాజా నోటిఫికేషన్లో ఆఫ్‌లైన్ ద్వారా భర్తీ చేస్తామనడంతో అభ్యర్థులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానం అక్రమార్కులకు వరం కానుందని, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఒత్తిళ్లు తెచ్చి తమ అభ్యర్థులను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందని.. దీనివల్ల ప్రతిభ కలిగిన వైద్యులకు నష్టం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. అసలే ఉద్యోగ నియామకాల్లేక నాలుగున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న వైద్యులకు.. ఈ నోటిఫికేషన్‌ను చూసి సంతోషించాలో.. బాధపడాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఆఫ్‌లైన్ ఎవరి కోసమో! ప్రజారోగ్యశాఖలో, బోధనాస్పత్రుల్లో కలిపి 1171 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు 2018 సెప్టెంబర్ 26న నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది పూర్తిగా ఆఫ్‌లైన్ ద్వారానే జరుగుతుందని స్పష్టం చేశారు. దీంతో అక్రమార్కులకు రాచబాట వేసినట్టుగా అర్థమవుతోందని పలువురు అభ్యర్థులు వాపోతున్నారు. గతంలో అంటే 2010లో ఒకసారి, 2013లో మరోసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు జరిపారు. అప్పట్లోనే ఆన్లైన్ పద్ధతిలో నియామకాలు చేపట్టారు. కానీ తాజా నోటిఫికేషన్లో ఆన్లైన్ అనే పద్ధతిని వాడలేదు. ఎవరికోసం ఆఫ్‌లైన్ పెట్టారో అర్థంకాని పరిస్థితి. ఒక్కో పోస్టుకు 12 మంది (1:12)లెక్కన 1171 పోస్టులకు.. 14 వేలకు పైగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్న ఈ ప్రక్రియ ఆన్లైన్లో లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మాన్యువల్‌గా నియామకాలు చేపడితే.. ఏ దశలోనైనా సర్టిఫికెట్లు గానీ, డాక్యుమెంట్లు గానీ మార్చేయడానికి అవకాశముందని, నియామక కమిటీ ఇష్టారాజ్యంగా వ్యవహరించేందుకు బాటలు వేసినట్లవుతుందని అభ్యర్థులు వాపోతున్నారు. అభ్యర్థులు కుటుంబ సంక్షేమశాఖ వెబ్సైట్లో దరఖాస్తును డౌన్లోడు చేసుకుని, దాన్ని పూరించి సర్టిఫికెట్లన్నీ జతచేసి ఈ నెల 25వ తేదీలోగా గొల్లపూడిలోని కుటుంబ సంక్షేమశాఖ కార్యాలయానికి చేర్చాలని పేర్కొన్నారు. తాము పంపిన దరఖాస్తుల్లో ఏదైనా సర్టిఫికెట్ లేకున్నా, కావాలని వాటిని తీసేసినా దానికి ఎవరు బాధ్యత వహిస్తారనేది అభ్యర్థుల ఆందోళన. ఆన్లైన్లో అయితే ఎవరి మార్కులు ఎన్ని, సర్వీసు ఎంత.. ఇలాంటివన్నీ తెలిసే అవకాశముందని, ఆఫ్‌లైన్ అయితే అన్నీ గుట్టుగా సాగే అవకాశముందనేది పలువురు వైద్యులంటున్నారు. జోనల్ వ్యవస్థపై స్పష్టత లేకుండానే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జోనల్ వ్యవస్థ అనేది దశాబ్దాల తరబడి ఉంది. రాష్ట్రప్రతి ఉత్తర్వులు (ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్) మేరకు కొనసాగుతున్న ప్రక్రియ ఇది. దీనిపై స్పష్టత ఇవ్వకుండానే నోటిఫికేషన్ జారీచేశారు. రాష్ట్రం విడిపోక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 6 జోన్లుగానూ, హైదరాబాద్ ఫ్రీ జోన్గానూ ఉండేది. ఈ జోనల్ వ్యవస్థపై చివరి సారిగా 2002లో జీవో ఎంఎస్ నం.124 ద్వారా సవరణలు చేసి అప్పట్లో నియామకాలు చేపట్టారు. ఆ తర్వాత ఇప్పటివరకూ ఎలాంటి సవరణలూ లేవు. 2014లో రాష్ట్రం విడిపోయాక దీనిపై స్పష్టత రాలేదు. ఫలితంగా ఏ జోన్లో ఎన్ని పోస్టులన్న వివరాల్లేవు. దీంతో కొన్ని జోన్లలో పోస్టుల్లేక, మరికొన్ని జోన్లలో పోస్టులు ఎక్కువగా ఉండి అసమానతలు ఏర్పడే అవకాశముందని అధికార వర్గాలంటున్నాయి. ఇలాంటి విషయాల్లో స్పష్టత లేకుండా హడావుడిగా నోటిఫికేషన్ జారీ చేశారని అధికారవర్గాల్లో చర్చజరుగుతోంది. -
దిగ్గజాల దొడ్డిదారి!!
(సాక్షి, బిజినెస్ విభాగం) : చిన్నచిన్న వర్తకులు అసంఖ్యాకంగా ఆధారపడిన దేశీ రిటైల్ రంగంలోకి భారీ సూపర్ మార్కెట్లు రావటమన్నదే అనేక వివాదాల నడుమ సాకారమయింది. వీటితో తమ బతుకుదెరువు పోతుందని భయపడి.. ఆందోళనలు చేసిన ఆయా వ్యాపారులంతా మెల్లగా పరిస్థితులకు అలవాటుపడ్డారు. ఆ తరవాత హోల్‌సేల్, సింగిల్ బ్రాండ్ రిటైల్‌లోకి విదేశీ సంస్థల్ని పూర్తిగా అనుమతించినా... మల్టీ బ్రాండ్ రిటైల్‌లో మాత్రం ఇప్పటికీ విదేశీ సంస్థలకు 49 శాతం వాటాల వరకే అనుమతి ఉంది. కాకపోతే ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు వెనుకచాటుగా దీనికి తూట్లు పొడుస్తున్నవేననేది నిపుణుల మాట. ఎందుకంటే ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ను ఇటీవల అమెరికన్ రిటైల్ స్టోర్ల చెయిన్ వాల్‌మార్ట్ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. నిజానికి వాల్‌మార్ట్ ఇప్పటికే హోల్‌సేల్ స్టోర్ల ద్వారా దేశంలోకి ఎంట్రీ ఇచ్చింది. కాకపోతే దీనికి రిటైలర్లకు విడివిడిగా వస్తువుల్ని అమ్మే అర్హత లేదు. ఇపుడు ఫ్లిప్‌కార్ట్ దీని చేతికొచ్చింది కనక... మున్ముందు ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసే వస్తువుల్ని కొనుగోలుదార్లకు వాల్‌మార్ట్ స్టోర్ల నుంచి డెలివరీ చేసే అవకాశం దీనికొస్తుంది. అలా చూస్తే ఇది నేరుగా మల్టీ బ్రాండ్ రిటైల్‌లోకి వచ్చేసినట్లే లెక్క. కానీ సాంకేతికంగా చూసినపుడు వాల్‌మార్ట్ హోల్సేల్కే పరిమితమవుతుంది. తాజాగా మోర్ సూపర్ మార్కెట్లను కొనుగోలు చేసేందుకు సమర క్యాపిటల్, అమెజాన్ కుదుర్చుకున్న డీల్ కూడా అలాంటిదే. తాజా డీల్ ప్రకారం మోర్లో 49 శాతం వాటాల్ని నేరుగా అమెజాన్ కొంటుంది. మిగతా 51 శాతం వాటాలు కొంటున్న సమర క్యాపిటల్‌కు చెందిన సంస్థలోనూ అమెజాన్‌కు వాటా ఉంటుంది. ఆ లెక్కన అమెజాన్ చేతికి మోర్ వచ్చేసినట్లే. అపుడు అమెజాన్‌లో కొనుగోలు చేసే వస్తువుల్ని మోర్ స్టోర్ల నుంచి డెలివరీ చేసే అవకాశం దానికి దక్కుతుంది. ఈ లెక్కన చూసినపుడు... ఆఫ్‌లైన్ స్టోర్లున్న వాల్‌మార్ట్.... ఆన్లైన్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్‌ను కొనుగోలు చేసింది. ఆన్లైన్లో అగ్రగామిగా ఉన్న అమెజాన్... ఆఫ్‌లైన్ స్టోర్లున్న మోర్ ను కొనుగోలు చేసింది. మున్ముందు దేశీ మల్టీ బ్రాండ్ రిటైల్‌లో రెండూ విదేశీ దిగ్గజాలే రాజ్యమేలుతాయన్నది ఈ రంగంలోని నిపుణుల మాట. ఇటీవలే అంతర్జాతీయ రిటైల్ దిగ్గజం ‘ఐకియా’ కూడా హైదరాబాద్‌లో స్టోర్ ద్వారా ఇండియాలోకి ప్రవేశించింది. ఐకియా నిజానికి ఫర్నిచర్, ఫర్నిషింగ్ వస్తువులమ్మే సంస్థ. కానీ ఫుడ్, దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు మినహా ఒక ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ దీన్లో లభ్యమవుతాయి. ఐకియా వీటన్నిటినీ వివిధ కంపెనీల ద్వారా తయారు చేయిస్తుంది. కాకుంటే తయారు చేసింది ఎవరైనా... వీటన్నింటికీ ‘డిజైన్డ్ బై ఐకియా’ అనే ట్యాగ్ మాత్రం ఉంటుంది. స్థూలంగా చూస్తే దేశీ రిటైల్ మార్కెట్లోకి విదేశీ దిగ్గజాలు రకరకాల మార్గాల్లో రానే వస్తున్నాయన్నది స్పష్టం కాకమానదు. -
పేటీఎం నుంచి సెకన్లలో ఆఫ్‌లైన్ పేమెంట్!
డిజిటల్ లావాదేవీల్లో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన పేటీఎం మరో కొత్త పేమెంట్ మోడ్‌ను లాంచ్ చేసింది. ట్యాప్ కార్డు పేరుతో భారత్‌లో తొలి ఆఫ్‌లైన్ పేమెంట్స్ సొల్యుషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కార్డు ద్వారా ఎన్ఎఫ్సీని వాడుతూ నగదును కంప్యూటర్ ఆథరైజ్డ్ పాయింట్ ఆఫ్ టర్మినల్స్‌కు బదిలీ చేయవచ్చు. నాన్-ఇంటర్నెట్ యూజర్లను టార్గెట్‌గా చేసుకుని పేటీఎం కార్డును పేటీఎం లాంచ్ చేసింది. పేటీఎం ట్యాప్ కార్డు ద్వారా ఎన్ఎఫ్సీని వాడుతూ సురక్షితంగా, తేలికగా డిజిటల్ పేమెంట్లను చేసుకోవచ్చు. సెకన్ల వ్యవధిలోనే ఈ పేమెంట్లను పూర్తి చేయవచ్చని కంపెనీ తెలిపింది. అయితే పేమెంట్లు జరుపడానికి యూజర్లు ట్యాప్ కార్డుపై ఉన్న క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేసి పేటీఎం అకౌంట్లలోకి మనీని యాడ్ చేయాల్సి ఉంటుంది. కన్జ్యూమర్లు, మెర్చంట్ల వద్ద ఉన్న అన్ని రకాల నెట్వర్క్ సమస్యలను ఇది అడ్రస్ చేస్తుంది. ట్యాప్ కార్డును వాడుతూ వెనువెంటనే డిజిటల్ పేమెంట్లు జరుపడం కోసం పేటీఎం ప్రస్తుతం ఈవెంట్లు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లు, కార్పొరేట్లతో భాగస్వామ్యం ఏర్పరచుకుంటోంది. పేమెంట్‌ను జరుపడానికి మెర్చంట్ టర్మినల్ వద్ద కస్టమర్ కార్డును ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఫోన్లను పట్టుకెళ్లకుండానే ఈ లావాదేవీలు జరుపుకోవచ్చు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి తాము కృషిచేస్తున్నామని, చాలా మందికి ఇంటర్నెట్ యాక్సస్ లేదని, దీంతో పాటు కొందరు ఆన్లైన్ పేమెంట్లు జరుపడానికి జంకుతున్నారని పేటీఎం సీఓఓ కిరణ్ వాసి రెడ్డి తెలిపారు. వారి కోసం పేటీఎం ట్యాప్ కార్డును తాము ఆఫర్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇది తమ యూజర్ల అవసరాల కోసం అంకితభావంతో తీసుకొచ్చామని, ఎప్పడికప్పుడు వినూత్నావిష్కరణలతో యూజర్ల ముందుకు వస్తున్నట్టు చెప్పారు. -
చదివినా...తెలియదు
న్యూ ఢిల్లీ : ఉదయం లేవగానే మనలో చాలామంది చేసే పని వాట్సాప్‌లో స్నేహితులకు గుడ్‌మార్నింగ్ అంటూ సందేశాలు పంపడం. సందేశాలు పంపి ఊరుకుంటామా...లేదు అవతలివారు మన సందేశం చూశారా, లేదా అని గమనిస్తాం. చూసి కూడా బదులు ఇవ్వకపోతే బాధపడతాం, తిట్టుకుంటాం, మరీ కోపమోస్తే బ్లాక్ చేస్తాం. ఇదంతా జరగడానికి కారణం వాట్సాప్‌లో ఉన్న రీడ్ రెసిప్ట్ ఫిచర్. దీనివల్ల అవతలి వారు మన మెసేజ్ చదివారో, లేదో మనకు తెలుస్తుంది. మనం వాట్సాప్‌లో మెసేజ్ పంపినప్పుడు ఒకటే యాష్ కలర్ టిక్ మార్కు వస్తుంది. మనం పంపిన మెసేజ్ అవతలి వారి మొబైలకు చేరగానే రెండు యాష్ కలర్ టిక్ మార్కులు వస్తాయి. మెసేజ్ చదవగానే రెండు నీలంరంగు టిక్ మార్కులు వస్తాయి. దీని వల్లనే అవతలి వారికి మనం మెసేజ్ చదివామో, లేదో తెలుస్తుంది. కానీ ఇప్పుడు వాట్సాప్‌లో వచ్చిన ఓ కొత్త ఫీచర్‌తో మనం మెసేజ్ చదివినా అవతలి వారికి తెలియదు. ఎంటా ఫీచర్, ఎలా సెట్ చేసుకోవాలని అనుకుంటున్నారా...అది చాలా సులభం. దానికోసం మీ మొబైల్లో సెట్టింగ్స్ ఏం మార్చక్కరలేదు. చాలా సులభంగా దీనిని సెట్ చేసుకోవచ్చు. అందుకు ముందుగా మీరు 1. మీకు వాట్సాప్‌లో మెసేజ్ రాగానే, ముందుగా నోటిఫికేషన్ పానెల్‌ను కిందికి స్ర్కోల్ చేసి, ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేయండి. 2. ఇప్పుడు మీరు ఆఫ్‌లైన్‌లో ఉన్నారు. వాట్సాప్ ఓపెన్ చేసి మెసేజ్‌లు చదవండి. 3. చదవడం అయిపోయాక వాట్సాప్ విండోను క్లోస్ చేయండి. 4. వాట్సాప్‌ను పూర్తిగా క్లోస్ చేసిన తర్వాత ఏరోప్లేన్ మోడ్‌ను ఆఫ్ చేయండి. చాలా సులభంగా ఉంది కదా... ఏరోప్లేన్ మోడ్ ఆన్‌లో ఉంటేనే ఇలా చేయడం కుదురుతుంది. ఇంకో విషయం ఏంటంటే వాట్సాప్ విండోను క్లోస్ చేయకుండా కేవలం బాక్ బటన్‌ను మాత్రమే ప్రెస్ చేస్తే మళ్లీ మీరు ఆన్‌లైన్‌లోకి వెళ్లగానే మీరు మెసేజ్ చదివినట్లు చూపించే బ్లూ టిక్ మార్క్స్ కనిపిస్తాయి. అందుకే వాట్సాప్ విండోను పూర్తిగా క్లోస్ చేయడం మరవకండి. -
రెడ్మి నోట్ 5 ఆఫ్‌లైన్‌గా...
ఫ్లాష్ సేల్కు వచ్చిన నిమిషాల్లో అవుటాఫ్ స్టాక్ అవుతున్న రెడ్మి నోట్ 5 స్మార్ట్‌ఫోన్‌ను ఇక నుంచి ఆఫ్‌లైన్‌గా కూడా బుక్ చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ స్టోర్లలో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రీ-బుకింగ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు షావోమి ప్రకటించింది. గత నెలలోనే రెడ్మి నోట్ 5, రెడ్మి నోట్ 5 ప్రొ స్మార్ట్ఫోన్లను షావోమి లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. లాంచ్ చేసిన అనంతరం వీటిని ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కామ్, ఎంఐ హోమ్ స్టోర్లలో అందుబాటులో ఉంచింది. ఫ్లాష్ సేల్కు వచ్చిన ప్రతీసారి ఈ స్మార్ట్ఫోన్లు నిమిషాల్లోనే అవుటాఫ్ స్టాక్ అవుతున్నాయి. త్వరలోనే ఆఫ్‌లైన్ రిటైల్ పార్టనర్ల వద్ద అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. ప్రస్తుతం రెడ్మి నోట్ 5 ప్రీ-బుకింగ్స్‌ను ఆఫ్‌లైన్ స్టోర్ల వద్ద షావోమి ప్రారంభించింది. వీటి డెలివరీని మార్చి 8 నుంచి మొదలుపెడుతుంది. రెండు వేల రూపాయలు కట్టి ఈ ఫోన్‌ను ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చని రిటైల్ వర్గాలు తెలిపాయి. అంతేకాక త్వరలో ఆఫ్‌లైన్ రిటైల్ పార్టనర్ల వద్ద విక్రయానికి రాబోతున్న ఈ స్మార్ట్‌ఫోన్ ధర ఆన్లైన్ కంటే రూ.500 ఎక్కువగా ఉండనుంది. థర్డ్ పార్టీ ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్ల ద్వారా రెడ్మి నోట్ 5ను కొనుగోలు చేస్తే, 3జీబీ ర్యామ్, 32జీబీ మోడల్ ధర 10,499 రూపాయలు. అసలు ఆన్‌లైన్‌గా ఈ మోడల్ ధర 9,999 రూపాయలు. అదేవిధంగా 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను ఆఫ్‌లైన్‌గా 12,499 రూపాయలకు అందుబాటులోకి తెస్తోంది. ఆన్‌లైన్‌గా ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.11,999గా ఉంది. అదేవిధంగా రెడ్మి నోట్ 5 ప్రొ ధర కూడా ఆన్‌లైన్‌గా కంటే ఆఫ్‌లైన్‌గా 500 రూపాయలు ఎక్కువగా ఉండనుంది. షావోమి రెడ్మి నోట్ 5 ఫీచర్లు 5.99 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ 2.5డి కర్వ్డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్ప్లే 2160 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్, విత్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ 3/4 జీబీ ర్యామ్ 32/64 జీబీ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 12 ఎంపీ బ్యాక్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ. షావోమి రెడ్మి నోట్ 5 ప్రొ ఫీచర్లు 5.99 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ 2.5డి కర్వ్డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్ప్లే 2160 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్, విత్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 12, 5 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు 20 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ -
లాట్ మొబైల్స్‌లోనూ రెడ్మి నోట్–4 స్మార్ట్ఫోన్లు
హైదరాబాద్: ప్రముఖ మల్టీ బ్రాండ్ మొబైల్ రిటైల్ చైన్ ‘లాట్ మొబైల్స్’ తాజాగా రెడ్మి నోట్–4 స్మార్ట్ఫోన్లను కస్టమర్లకు ఆఫ్‌లైన్‌లో విక్రయిస్తోంది. ఇందుకోసం షావోమి కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ‘లాట్ మొబైల్స్’ ఒక ప్రకటనలో తెలిపింది. రెడ్మి నోట్–4 స్మార్ట్ఫోన్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని లాట్ షోరూమ్‌లలో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా రెడ్మి నోట్–4లో 13 ఎంపీ రియర్ కెమెరా, 5.5 అంగుళాల స్క్రీన్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4,100 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి పలు ప్రత్యేకతలున్నాయి. -
ఆఫ్‌లైన్‌లో చెల్లింపులకు పేటీఎం టోల్‌ఫ్రీ నంబర్
హైదరాబాద్: ఇంటర్నెట్ అవసరం లేకుండా ఆఫ్‌లైన్‌లో నగదు స్వీకరణ, చెల్లింపుల కోసం ప్రముఖ ఈ వ్యాలెట్ సంస్థ పేటీఎం టోల్‌ఫ్రీ నంబర్ 180018001234ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వినియోగదారులు, వ్యాపారులు ముందుగా తమ మొబైల్ నంబర్‌తో పేటీఎంలో నమోదు చేసుకుని 4 అంకెలతో కూడిన పిన్ నంబర్‌ను సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. నగదు స్వీకరించాల్సిన వ్యక్తి మొబైల్లో... చెల్లించాల్సిన వ్యక్తి నగదు మొత్తం, పిన్ నంబర్‌ను ఎంటర్ చేయగానే ఒక వ్యాలట్ నుంచి మరో వ్యాలట్కు నగదు బదిలీ అయిపోతుంది. ఈ ప్రక్రియకు టోల్ ఫ్రీనంబర్ ఆధారంగా పనిచేస్తుంది. స్మార్ట్ఫోన్లు లేకపోయినా నగదు రహిత చెల్లింపులు, స్వీకరణలకు ఇది వీలు కల్పిస్తుందని పేటీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నితిన్మిశ్రా తెలిపారు -
నాలుగు రూకల కోసం నడకయాతన
అనంతపురం టౌన్ : ఎన్టీఆర్ భరోసా పథకం కింద జిల్లా వ్యాప్తంగా 3,86,826 మంది పింఛన్‌దారులు ఉన్నారు. వీరిలో వృద్ధాప్య 2,00,778 మంది, వితంతు 1,19,042, వికలాంగ 55,572, చేనేత 11,240, కల్లుగీత పింఛన్‌దారులు 194 మంది ఉన్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులతో పాటు వెలుగు సీసీలు మొత్తం 1,261 మంది పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. ప్రతి నెలా 1–5లోపు పూర్తి చేయాలని ఆదేశాలున్నా అది సాధ్యం కావడం లేదు. ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా ఎక్కడా అమలు కావడం లేదు. ఆఫ్లైన్పై దృష్టి పెట్టని అధికారులు పింఛన్ల పంపిణీలో పారదర్శకత కోసం ప్రభుత్వం ట్యాబ్‌లు పంపిణీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో సంకేతాలు (సిగ్నల్స్) అందకపోవడంతో పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సంకేతాలందే ప్రాంతాల్లో కార్యదర్శులు, సీసీలు కూర్చుని పింఛన్లు పంపిణీ చేయాల్సి వస్తోంది. సంకేతాలు సక్రమంగా అందకపోవడం, వేలిముద్రల సమస్యలతో ఒక్కో పింఛన్ అందించేందుకు 15 నిమిషాల వరకు పడుతోంది. మరికొన్ని చోట్ల రెండు, మూడు రోజుల పాటు నిరీక్షించాల్సి వస్తోంది. దీంతో పాటు పింఛన్ పంపిణీ సిబ్బంది వేరే ప్రాంతాల నుంచి వస్తుండడంతో సకాలంలో ప్రక్రియ పూర్తి కావడం లేదు. వాస్తవానికి సంకేతాలు అందని ప్రాంతాల్లో ఆఫ్‌లైన్‌లో పంపిణీ చేసి, ఆ తర్వాత డేటాను ఆన్లైన్లో నమోదు‡ చేసే అవకాశముంది. ఈ విషయంలో∙చాలా మంది ఎంపీడీఓలు నిర్లక్ష్యం వహిస్తున్నారు. పైగా సకాలంలో పూర్తి చేయాలన్న నిబంధనతో చాలాచోట్ల పంచాయతీ కేంద్రంలోనే పంపిణీ చేపడుతున్నారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల వృద్ధులు, వికలాంగులు వ్యయ ప్రయాసలకోర్చి అక్కడికి వెళ్లాల్సి వస్తోంది. కొన్ని పంచాయతీ కేంద్రాలు దూరంగా ఉండడం, రవాణా సౌకర్యాలు కూడా లేకపోవడంతో ఇలాంటి చోట్ల నరకయాతన అనుభవిస్తున్నారు. 22,936 మందికి అందని పింఛన్ ఆగస్టుకు సంబంధించి 3,86,826 పింఛన్లు మంజూరవగా.. పంపిణీ చేసింది 3,63,926. అంటే 22,936 మందికి అందలేదు. మిగులు మొత్తం రూ.2,63,07,00 0. ఆగస్టులోనే కాదు.. ప్రతి నెలా ఇలాంటి పరిస్థితే ఎదురవుతోంది. -
ఆన్లైన్లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు ఢమాల్
న్యూఢిల్లీ : ఒకప్పుడు ఆన్లైన్ లో స్మార్ట్ ఫోన్ల కొనుగోలకు ఎగబడిన వినియోగదారులు 2016 ప్రథమార్థంలో మాత్రం ఆ ఊపును తగ్గించారు. ఆన్లైన్లో స్మార్ట్‌పోన్ కొనుగోలపై ఆసక్తి తగ్గించారు. దీంతో ఆన్ లైన్ లో స్మార్ట్ ఫోన్ అమ్మకాలు ఢమాల్ మనిపించాయి. మార్చిలో ఈ-కామర్స్ సంస్థల ఆఫర్ చేసే డిస్కౌంట్లపై ప్రభుత్వం తీసుకొచ్చిన కఠినతరమైన నిబంధనలే ఈ అమ్మకాలు పడిపోవడానికి ప్రధాన కారకంగా నిలిచినట్టు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సంస్థ ప్రకటించింది. 2016 జూన్ తో ముగిసిన ఆరు నెలల కాలంలో ఆన్ లైన్లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు 32 శాతానికి కుప్పకూలినట్టు తెలిపింది. ఆన్‌లైన్‌తో పోలిస్తే ఆఫ్‌లైన్ అమ్మకాలు బాగున్నాయని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ సీనియర్ రీసెర్చ్ మేనేజర్ నవ్కేందర్ సింగ్ తెలిపారు. అయితే ఈకామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్ లపై మాత్రం స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో స్ట్రాంగ్‌గానే ఉన్నాయని కౌంటర్ పాయింట్ తెలిపింది. కస్టమర్లను ఎక్కువగా ఆకట్టుకుంటూ ఆన్లైన్ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు పెరగడానికి ప్రధాన కారకంగా నిలిచే డిస్కౌంట్ల ఆఫర్లకు ప్రభుత్వం కళ్లెంవేయడంతో స్మార్ట్ ఫోన్ అమ్మకాలు క్షీణించాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆన్ లైన్లో వస్తువుల కొనుగోలుకు సౌకర్యవంతం, ప్రత్యేకధర, డిస్కౌంట్ లే ప్రధాన కారకాలుగా నిలుస్తాయని లీఎకో స్మార్ట్ ఫోన్ల బిజినెస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అతుల్ జైన్ చెప్పారు. కానీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో భారీ డిస్కౌంట్లకు చెక్ పడిందన్నారు. వినియోగదారుల ప్రవర్తనకు అనుగుణంగా ఆఫ్‌లైన్, ఆన్లైన్లో నిర్ణయించే స్మార్ట్‌ఫోన్ ధరల్లో మార్పులు ఉంటుందని చైనీస్ స్మార్ట్‌ఫోన్ షియోమి ఇండియా హెడ్ మనూ జైన్ తెలిపారు. ఇండియాలో షియోమి మొదట ఆన్లైన్ బ్రాండుగా అరంగేట్రం చేసింది. తర్వాత ఆఫ్‌లైన్ వ్యాపారాల్లోకి అడుగుపెట్టింది. జనవరి-మార్చి త్రైమాసికంలో మొత్తం ఫోన్ల అమ్మకాల్లో ఆన్లైన్ అమ్మకాలు 33 శాతంగా ఉన్నాయి. అదేవిధంగా కొత్త మొబైళ్ల ఆవిష్కరణలు కూడా మూడేళ్ల కాలంలో మొదటిసారి నీరసించాయి. 2016 సగం ఏడాది కాలంలో ఈ ఆవిష్కరణలు 29 శాతం క్షీణించాయి. ముందటి రెండేళ్లలో కొత్త ఫోన్ల లాంచింగ్ యేటికేటికీ 32 శాతం పెరుగుదల నమోదైంది. -
అవసరమైతే ఆఫ్‌లైన్‌లో ఎస్పీఎస్ సర్వే
తుని (తునిరూరల్) : సాంకేతిక సమస్యలతో ప్రజా సాధికార సర్వే (ఎస్పీఎస్) సక్రమంగా జరగడం లేదని అవసరమైతే ఆఫ్‌లైన్‌లో ఈ సర్వే నిర్వహిస్తామని జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. ఆయన శుక్రవారం తుని పట్టణం దివాణం వీధిలో నిర్వహిస్తున్న ఎస్‌పీఎస్‌ను పరిశీలించారు. సర్వేలో ఎదురవుతున్న ఇబ్బందులు, సమస్యలను సిబ్బంది ని అడిగి తెలుసుకున్నారు. సమస్యలను అధిగమించేందుకు సాంకేతికతను జోడిస్తున్నట్టు తెలి పారు. ఆధార్, రేషన్, బ్యాంక్, ఓటర్, డ్రైవింగ్ లెసైన్స్ కార్డులు వంటి 14 సర్వీసులకు చెందిన 84 అంశాలను నమోదు చేయాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ఐరిష్ సేకరణతో సమస్య తలెత్తుతోందన్నారు. జిల్లాలో 42లక్షల మంది వివరాలను ఈ సర్వేలో సేకరించాల్సి ఉండగా ఇంతవరకూ 31వేల మంది వివరాలను ఆన్లైన్లో నమోదు చేయగలిగామన్నారు. ఆయనవెంట తహసీల్దార్ బి.సూర్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ ఎస్వీరమణ తదితరులు ఉన్నారు. ఆగస్టు 15 లోగా ప్రజాసాధికార సర్వే పూర్తి గొల్లప్రోలు: జిల్లాలో ప్రజాసాధికార సర్వే ఆగస్టు 15వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు జాయింట్ కలెక్టర్ ఎస్. సత్యనారాయణ తెలిపారు. ఆయన శుక్రవారం గొల్లప్రోలు, చేబ్రోలు గ్రామాల్లో ప్రజాసాధికారసర్వేను పరిశీలించారు. సాంకేతికంగా ఎదురవుతున్న ఇబ్బందులను ఆయన ఎన్యూమరేటర్లను ఆడిగి తెలుసుకున్నారు. మొదటి విడతగా 40మండలాలు, 12మున్సిపాల్టీల్లో 2,707 బృందాలు ఈ సర్వే చేస్తున్నాయన్నారు. మొదటి దశ సర్వే జూలై 30లోగా పూర్తి చేయాలని, నెట్‌వర్క్‌లేని ఏజెన్సీ తదితర 24మండలాల్లో సర్వేను ఆగస్టు 15లోగా పూర్తి చేస్తామన్నారు. ఆయన వెంట తహసీల్దార్ వై. జయ, ఎంపీడీఓ పి. విజయథామస్, డిప్యూటీ తహసీల్దార్ రామరాజు, గొల్లప్రోలు కమిషనర్ వేగి సత్యనారాయణదితరులు ఉన్నారు. -
ఎస్బీఐ ‘ఆఫ్‌లైన్’..!
► పది రోజులుగా సతాయిస్తున్న నెట్ బ్యాంకింగ్ ► రోజులో ఎప్పుడో కాసేపు పనిచేస్తున్న ఆన్లైన్ ► ముంబై సర్వర్‌లో సమస్యంటూ అధికారుల దాటవేత ► బ్యాంకు నుంచి ఇప్పటికీ రాని అధికారిక ప్రకటన హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎస్బీఐ అంటే... దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్. అంతేకాదు!! ప్రైవేటు బ్యాంకులతో పోల్చినా నంబర్ వన్ స్థానం దీనిదే. 22 వేలకు పైగా బ్రాంచీలు, 32 దేశాల్లో విస్తరించిన ఈ బ్యాంక్‌కు... దేశంలో కోట్ల మంది ఖాతాదారులున్నారు. మొత్తం దేశీ బ్యాంకింగ్‌లో 20 శాతం వాటా దీనిదే. ఇక ఆన్లైన్ విషయానికొస్తే లావాదేవీల సంఖ్యలో అగ్రస్థానం దీనిదే. అలాంటి బ్యాంక్... గడిచిన పది రోజులుగా ‘ఆఫ్‌లైన్’ అయిపోతోంది. రోజు మొత్తంలో ఎప్పుడైనా సమస్య వస్తే ఓకే అనుకోవచ్చుగానీ... రివర్స్‌లో ఈ బ్యాంక్ వెబ్సైట్ రోజు మొత్తంలో ఎప్పుడైనా కాసేపు మాత్రం పనిచేస్తోంది. మొబైల్ నుంచి లావాదేవీలు జరపాలన్నా అదే పరిస్థితి. పోనీ ఏదో ఒకటి రెండు రోజుల్నుంచి ఇలా ఉంటే... ఏదో సమస్య వచ్చిందిలే అనుకోవచ్చు. కానీ గడిచిన పది రోజులుగా ఇదే పరిస్థితి. లక్షల మంది ఆన్లైన్ ఖాతాదారులు లావాదేవీలు జరపలేక... బిల్లులు చెల్లించలేక నానా యాతనా పడుతున్నా బ్యాంకు నుంచి మాత్రం అధికారికంగా స్పందించటం గానీ, సమస్య ఎప్పటిదాకా ఉంటుందో చెప్పటం కానీ ఏమీ లేదు. ఖాతాదారులకు కలుగుతున్న కష్టంపైగానీ, తనకు వాటిల్లుతున్న నష్టంపైగానీ బ్యాంకు ఇప్పటిదాకా కనీసం స్పందించిందీ లేదు. ఎస్బీఐ దీనిపై స్పందించకపోయినా... ఆన్లైన్ మార్కెట్ సంస్థలు దీనిపై పలు సూచనలు చేస్తుండటం విశేషం. ‘‘మీరు ఎస్బీఐ ద్వారా మాకు చెల్లించాలని ప్రయత్నిస్తే కుదరకపోవచ్చు. ఎందుకంటే ఎస్బీఐ ఆన్లైన్ సరిగా పనిచేయటం లేదు. అంతగా కావాలంటే ఎస్బీఐ డెబిట్ కార్డునో, ఏటీఎం కార్డునో ఆన్లైన్లో వాడండి. ఇంకా చాలా మార్గాలున్నాయి కదా!!’’ అని ఆ సంస్థలు సూచిస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మంగళవారం మధ్యాహ్నం సతాయించిన ఆన్లైన్ ఎస్బీఐ... రాత్రికి కూడా అలాగే ఉండటంతో దీనిపై ఓ అధికారిని ‘సాక్షి’ ప్రతినిధి సంప్రతించారు. ‘‘రెండు రోజుల కిందటే ఈ సమస్య పరిష్కరించాం. ఇప్పుడు ఎలాంటి ఇబ్బందీ లేదు’’ అని ఆయన సమాధానమిచ్చారు. ఒకవేళ ఏవైనా సమస్యలుంటే ముంబాయి అధికారులతో మాట్లాడతానన్నారు. నిజానికి రాత్రి కూడా ఎంత ప్రయత్నించినా అటు మొబైల్లో, ఇటు వెబ్‌లో ఎస్బీఐ సైట్ తెరుచుకుంటే ఒట్టు. నాలుగు రోజల కిందట కూడా సమస్య తీవ్రంగా ఉన్నపుడు మరో అధికారిని సంప్రతించగా... ‘‘ప్రస్తుతం ఉన్న ఆన్లైన్ వ్యవస్థను రక్షణ పరంగా మరింత సమర్థంగా చేయటానికి చర్యలు తీసుకుంటున్నాం. అందుకని కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఒకటి రెండు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుంది’’ అని చెప్పారు. ఎస్బీఐ కూడా తన సర్వీస్ ప్రొవైడర్ టెక్ మహీంద్రా, ఇతర ఐటీ పార్ట్‌నర్స్‌తో కలసి సమస్యను పరిష్కరిస్తున్నట్లు తన వెబ్సైట్లో పేర్కొంది. కానీ ఇప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోవటం గమనార్హం. అడ్వాన్స్ ట్యాక్స్‌లు చెల్లించడానికి చివరి రోజైన డిసెంబర్ 15న కూడా ఆన్లైన్ బ్యాంకింగ్ పనిచేయకపోవడంతో అనేకమంది పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేశంలో అతిపెద్ద బ్యాంకైన ఎస్బీఐలో ఆన్లైన్ బ్యాంకింగ్ పది రోజులుగా పనిచేయడం లేదంటే మన బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ఒక ఐటీ ఉద్యోగి వ్యాఖ్యానించారు. -
ఆఫ్‌లైన్‌పైనా ఇన్‘ఫోకస్’
ఆన్లైన్లో ధరతోనే మొబైల్స్ విక్రయం త్వరలో 2 ఇన్ 1 ట్యాబ్లెట్స్, టీవీలు సాక్షితో ఇన్ఫోకస్ కంట్రీ హెడ్ సచిన్ థాపర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల రంగంలో ఉన్న అమెరికా కంపెనీ ఇన్ఫోకస్ భారత్‌లో ఆఫ్‌లైన్ మార్కెట్లోకి అడుగు పెట్టింది. ఇప్పటి వరకు ఈ-కామర్స్ కంపెనీలకే పరిమితమైన ఇన్ఫోకస్ మొబైల్స్ ఇక నుంచి రిటైల్ స్టోర్లలోనూ లభ్యం కానున్నాయి. జనవరికల్లా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రిటైల్ ఔట్లెట్లకు విస్తరించాలన్నది కంపెనీ ఆలోచన. ఇన్‌ఫోకస్‌కు చెందిన అన్ని మోడళ్లను ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ తయారీ దిగ్గజం ఫాక్స్‌కాన్ రూపొందిస్తోంది. ఇన్ఫోకస్ భారత్‌లో ప్రస్తుతం 6 స్మార్ట్ఫోన్లతోపాటు రెండు ఫీచర్ ఫోన్లను విక్రయిస్తోంది. ఫీచర్ ఫోన్లను కేవలం రిటైల్ ఔట్లెట్ల ద్వారానే అమ్మాలని కంపెనీ నిర్ణయించింది. ఒకే ధరలో లభ్యం.. ఇన్ఫోకస్ స్మార్ట్‌ఫోన్ల్ల ధర రూ.3,999 నుంచి ప్రారంభం. అయితే ఆన్లైన్లో ఉన్న ధరనే ఆఫ్లైన్లోనూ కొనసాగిస్తోంది. ఇది వ్మూహాత్మకంగా తీసుకున్న నిర్ణయమని సంస్థ ఇండియా హెడ్ సచిన్ థాపర్ సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. నాణ్యమైన మోడళ్లను విలువకు తగ్గట్టుగా కస్టమర్లకు అందించాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. ‘ఆన్లైన్, ఆఫ్‌లైన్ మార్కెట్లు రెండూ మాకు ముఖ్యం. భారత్‌లో ఇప్పటి వరకు 5 లక్షల స్మార్ట్ఫోన్లు విక్రయించాం. 2015-16లో 10 లక్షల యూనిట్లను అమ్మాలని లక్ష్యంగా చేసుకున్నాం. ఫాక్స్‌కాన్‌కు చెందిన శ్రీసిటీ ప్లాంటులో నాలుగు మోడళ్లు తయారవుతున్నాయి. భారత్ నుంచి సార్క్, ఆఫ్రికా దేశాలకు మోడళ్లను ఒకట్రెండు నెలల్లో ఎగుమతి చేయనున్నాం’ అని తెలిపారు. కంపెనీ తన ఉత్పత్తులపై 12 నెలల వారంటీ ఇస్తోంది. 134 సర్వీసింగ్ కేంద్రాలున్నాయి. డిసెంబర్లో 2 ఇన్ 1.. కంపెనీ భారత్‌లో 2 ఇన్ 1 హైబ్రిడ్ ట్యాబ్లెట్స్ను ప్రవేశపెడుతోంది. డిసెంబర్లో ఒక మోడల్ వస్తోంది. అలాగే అల్ట్రా హై డెఫినిషన్, ఫుల్ హై డెఫినిషన్ టీవీలు జనవరి నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంటాయని సచిన్ థాపర్ వెల్లడించారు. టీవీలు 24-60 అంగుళాల సైజులో ఉంటాయన్నారు. నెల రోజుల్లో మరో 5 స్మార్ట్ఫోన్లు రానున్నాయని పేర్కొన్నారు. టీవీలు ఫాక్స్‌కాన్‌కు చెందిన చెన్నై ప్లాంటులో తయారవుతాయని చెప్పారు. భారత్‌లో 2016 నాటికి బిలియన్ డాలర్ కంపెనీగా నిలవాలన్నది కంపెనీ లక్ష్యం. ఇందులో స్మార్ట్ఫోన్ల ద్వారా 70 శాతం సమకూరుతుందని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతం కంపెనీకి అమెజాన్, స్నాప్‌డీల్‌లు ఆన్లైన్ భాగస్వాములుగా ఉన్నాయి. -
కస్టమర్లదే అంతిమ నిర్ణయం!
షాపింగ్ ఆన్‌లైనా.. ఆఫ్‌లైనా అనే విషయంలో.. ఆన్లైనే కాదు ఆఫ్‌లైన్ స్టోర్లతోనూ ఒప్పందం చేసుకున్న మై స్మార్ట్ ప్రైస్ ధరలు, రివ్యూలు, రేటింగ్‌లు, ఈఎంఐ వంటి వివరాలెన్నో.. రూ.100 కోట్ల నిధుల సమీకరణపై దృష్టి పెట్టిన మై స్మార్ట్ ప్రైస్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో ‘‘జస్విత్.. రూ.10,624 పెట్టి ఆన్లైన్లో శామ్సంగ్ గెలాక్సీ ఎస్3 నియో సెల్‌ఫోన్ కొన్నాడు. అలా కొని ఇంట్లోంచి బయటికొచ్చాడో లేదా సరిగ్గా ఇంటికెదురుగా ఉన్న మొబైల్ స్టోర్‌లో దానికంటే రూ.500 తక్కువకే ఆ ఫోనుంది’’ ‘‘నందిత.. రూ.19,900 పెట్టి ఆన్లైన్లో 32 ఇంచుల ఎల్జీ ఎల్ఈడీ టీవీ కొన్నది. తనది అదే పరిస్థితి. ఆన్లైన్లో కంటే బయటే రేటు తక్కువుంది’’ ఇలాంటి సంఘటన లు మనలో చాలా మందికి అనుభవమే. సెల్‌ఫోన్, టీవీ వంటివి మాత్రమే కాదండోయ్.. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, కిడ్స్ అండ్ ఉమెన్ యాక్సెసరీలు, ఫ్యాషన్, బ్యూటీ ప్రొడక్ట్స్.. ఇలా ప్రతి ఒక్క ఉత్పత్తుల ధరలు ఆన్లైన్లో ఎంతున్నాయో? ఆఫ్‌లైన్‌లో ఎంతున్నాయో తెలిస్తే బాగుంటుంది కదూ!! అచ్చం ఇలాంటి అవకాశాన్నే కల్పిస్తోంది మై స్మార్ట్ ప్రైజ్. షాపింగ్ చేయాలనుకునే వాళ్లు ఆన్లైన్లో చేయాలా.. లేక ఆఫ్‌లైన్‌లో చేయాలా అనేది వారి నిర్ణయమేనంటున్నారు మై స్మార్ట్ ప్రైస్ కో- ఫౌండర్ సీతాకాంతా రాయ్. ఇంకా చెప్పాలంటే ఏ వస్తువును కొనాలి? ఎక్కడ కొనాలి? ఎప్పుడు కొనాలనేది అక్కడికక్కడే నిర్ణయించుకోవచ్చంటున్నారు. ఆన్లైన్లో షాపింగ్‌ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు ‘మై స్మార్ట్ ప్రైస్’. ఇప్పటివరకు ఇందులో వివిధ కంపెనీల ఉత్పత్తుల ధరలు ఎంతున్నాయో తెలుసుకోవచ్చు. కానీ, ఇకపై ఆఫ్లైన్లోనూ ఆ ఉత్పత్తుల ధరలెలా ఉన్నాయో తెలుసుకునే వీలుంది. ఏదైనా వస్తువును కొనాలంటే ఆన్లైన్లో ఎంతుందో.. ఆఫ్‌లైన్‌లో ఎంతుందో ముందుగానే తెలిస్తే కొనుగోలుదారులకు డబ్బు, సమయం రెండూ ఆదా అవుతాయి కదా. ధరలకే పరిమితం కాదు.. ప్రస్తుతం మై స్మార్ట్ ప్రైస్‌లో మొబైల్స్, కంప్యూటర్లు, ల్యాప్టాప్స్, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ ఉత్పత్తులు, కిడ్స్ అండ్ ఉమెన్ యాక్సెసరీలు, ఫ్యాషన్, బ్యూటీ ప్రొడక్ట్స్.. ఇలా సుమారు 250కి పైగా ఉత్పత్తుల ధరలు ఉంటాయి. కేవలం ధరలే కాదు ఆ ఉత్పత్తులకు సంబంధించిన రేటింగ్స్, రివ్యూలు, కొనుగోలు చేస్తే ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది? నెలసరి వాయిదా, సీఓడీ (క్యాష్ ఆన్ డెలివరీ) వంటివి ఉన్నాయా? స్టోర్ చరిత్ర, రాయితీలు, ఆఫర్లు, రాబోతున్న ఉత్పత్తుల గురించి వంటివి అన్ని వివరాలుంటాయి. టాప్ 30 ఈ-కామర్స్ కంపెనీలు మా కస్టమర్లే. విక్రయించిన ప్రతి వస్తువుపై 3 శాతం చార్జీ వసూలు చేస్తాం. పైలట్ ప్రాజెక్ట్‌గా హైదరాబాద్.. ఆన్లైన్లో ధరలు తెలుసుకుని ఆఫ్‌లైన్‌లో కొంటున్న కస్టమర్లు 75%కి పైనే ఉంటున్నారు. ఈ అంతరాన్ని కూడా తగ్గించేందుకు ఆఫ్‌లైన్ స్టోర్ల ధరలు కూడా మై స్మార్ట్ ప్రైస్‌లో ఇచ్చేందుకు నిర్ణయించాం. పైలట్ ప్రాజెక్ట్‌గా హైదరాబాద్‌ను ఎంచుకున్నాం. ప్రస్తుతం జంట నగరాల్లోని సుమారు 300లకు పైగా ఆఫ్‌లైన్ మొబైల్ స్టోర్లతో ఒప్పందం చేసుకున్నాం. సంగీత, ది మొబైల్ స్టోర్, బిగ్ సీ, ఎస్ మార్ట్, ఆర్‌ఎస్‌జీ వంటివి ఉన్నాయి. మై స్మార్ట్ ప్రైస్‌కు లాగిన్ అయిన కస్టమర్‌కు అతనుండే ప్రాంతం నుంచి 7 కి.మీ. పరిధిలో ఉన్న రిటైల్ దుకాణాల వివరాలు, అక్కడి ధరల వివరాలొస్తాయి. ప్రస్తుతం మొబైల్స్ వరకే పరిమితమయ్యాం. మరో ఆరు నెలల్లో ఇతర ఉత్పత్తులకు విస్తరిస్తాం. అలాగే ఆఫ్‌లైన్ స్టోర్ల సేవలను బెంగళూరు, ఢిల్లీ, ముంబై, చెన్నైలకూ విస్తరిస్తాం. ఇప్పటికే ఇతర నగరాల్లోని 150కి పైగా రిటైల్ దుకాణదారులతో ఒప్పందాలు పూర్తయ్యాయి. రెండేళ్లలో బేబీ ప్రొడక్ట్స్, ఫర్నిచర్, స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ ఉత్పత్తులు, కిరాణా వస్తువుల ధరల వివరాలు కూడా మై స్మార్ట్ ప్రైస్‌లో పొందుపరుస్తాం. మొబైల్స్‌దే మొదటి స్థానం.. మై స్మార్ట్ ప్రైస్ వినియోగదారుల్లో తొలి స్థానం ఢిల్లీ, రెండో స్థానంలో చెన్నై నిలిస్తే.. హైదరాబాద్‌ది మూడో స్థానం. ప్రస్తుతం నెలకు కోటి మంది కస్టమర్లు మై స్మార్ట్ ప్రైస్‌ను వీక్షిస్తున్నారు. ఇందులో 40 శాతం వాటా మొబైల్స్ కస్టమర్లదే. అయితే ఆన్లైన్లో ధరలు, రివ్యూలు చూసి ఆఫ్‌లైన్‌లో కొనేవాళ్లే ఎక్కువ. 25-34 ఏళ్ల మధ్య వయస్సున్న కస్టమర్ల వాటా 50 శాతం ఉంటుంది. మా కస్టమర్లలో 60 శాతం మంది రిటైల్ దుకాణాల్లోనే కొంటున్నారు. రూ.100 కోట్ల నిధుల సమీకరణ.. 2010 ఆక్టోబర్‌లో ప్రారంభించిన మై స్మార్ట్ ప్రైస్‌లో తొలిసారిగా గతేడాది ఆక్సెల్ అండ్ హెలియన్ వెంచర్ క్యాప్టల్ రూ.8 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుతం ఆఫ్‌లైన్ వ్యాపారం మీద ఆధారపడి నిధుల సమీకరణ చేపడుతున్నాం. ఒక్కో నగరంపై ఎంతలేదన్నా రూ.15 కోట్లు ఖర్చు చేస్తాం. తొలివిడత రూ.100 కోట్ల నిధుల సమీక రణపై దృష్టి పెట్టాం. గతేడాది రూ.24 కోట్ల టర్నోవర్‌కు చేరాం. ఈ ఏడాది రెండింతల వృద్ధిని సాధిస్తాం. -
ఐటీ రిటర్న్‌కు ఆన్లైనే మేలు!
- 1-3 నెలల్లోనే రీఫండ్ చేతికి - అదే ఆఫ్‌లైన్‌లో అయితే 5-10 నెలల సమయం రిఫండ్ అంటే... వెనక్కివ్వటం. ఆదాయపు పన్ను విషయంలో అయితే... చెల్లిం చాల్సిన పన్నుకన్నా ఎక్కువ చెల్లించినపుడు దాన్ని వెనక్కి తీసుకునేందుకు రిఫండ్ క్లెయిమ్ చేయొచ్చు. ఆన్లైన్లో, మాన్యువల్‌గా రెండు రకాలుగానూ పన్ను రిటర్న్‌లు దాఖలు చేసే అవకాశం ఉన్నా... ఆన్లైన్ ద్వారా దాఖలు చేసిన రిటర్న్‌ను పన్ను అధికారులు భౌతికంగా తనిఖీ చేయరు కనక 1-3 నెలల్లోపు రిఫండ్ మొత్తం చేతికొస్తుంది. మాన్యువల్‌గా దాఖలు చేసిన రిటర్న్‌ల విషయంలో దీనికి 5-10 నెలలు పడుతుంది. రిఫండ్‌ను వేగంగా తెచ్చుకోవటమెలా? రిటర్న్ వేసేవారు తొలుత ఐటీ విభాగ డాటాబేస్‌లో తాము చెల్లించిన పన్ను వివరాలు సరిచూసుకోవాలి. వ్యక్తిగతంగా లాగిన్ అయి... ఫారమ్ 26 ఎఎస్‌ను చూస్తే మనం చెల్లించిన పన్ను వివరాలు తెలుస్తాయి. సరైన చిరునామాతో పాటు ఫోన్ నంబరు, ఈ-మెయిల్, బ్యాంకు ఖాతా వివరాలు కరెక్టుగా ఇవ్వాలి. ఇక ఐటీఆర్-5 ఫారాన్ని బెంగళూరులోని సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్‌కు పంపటం తప్పనిసరి. అక్కడి నుంచి క్లియర్ అయ్యాకే రిఫండ్ వస్తుంది కనక. ఒకవేళ రిఫండ్ నేరుగా బ్యాంకు ఖాతాకే జమ కావాలనుకుంటే ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ పద్ధతి (ఈసీఎస్) ఎంచుకోవాలి. వేగవంతమైన రిఫండ్‌కు అదే కరెక్టు. ఒకవేళ చెక్కు ద్వారా పొందాలనుకుంటే మారే చిరునామా కాకుండా శాశ్వత చిరునామా ఇవ్వటం మంచిది. అయితే రిఫండ్ మొత్తం రూ. 50 వేలు దాటితే ఈసీఎస్ పద్ధతి పనికిరాదు. చెక్కు ద్వారానే అందుతుంది. అసలు సమస్య ఇక్కడే.. అసలు ఆదాయానికి, ఆదాయపు పన్ను చెల్లించడానికి లెక్కించిన ఆదాయానికి మధ్య తేడాలుండటం వల్లే చాలా రిఫండ్లు ఆలస్యమవుతుంటాయి. దీంతో ఈ విషయం ఐటీ విభాగం సెక్షన్ 143(1) కింద తెలియజేస్తుంది. ఐటీ రిటర్న్ దాఖలు చేయడానికి సరైన సాఫ్ట్‌వేర్‌ను ఎంచుకోవటం ద్వారా ఈ రిస్క్‌ను తగ్గించుకోవచ్చు. అవసరమైన వారు నిపుణుల సాయం కూడా తీసుకోవచ్చు. కొన్ని ఆన్లైన్ సంస్థలూ ఈ సౌకర్యం కల్పిస్తున్నాయి. అవి వేగంగా రిఫండ్ రావటానిక్కూడా సహకరిస్తాయి. -
ఆఫ్‌లైన్‌లో గూగుల్ మ్యాపులు...
కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు గూగూల్ మ్యాపులు తోడుంటే ఎంత భరోసాగా ఉంటుందో చెప్పలేం. మరి మీరు వెళ్లిన చోట నెట్ సిగ్నల్స్ రాకపోతే? ఇబ్బందేకదూ... ఆఫ్లైన్లోనూ గూగుల్ మ్యాపులను ఎలా చూడవచ్చో తెలుసుకుంటే ఈ చికాకు నుంచి కూడా తప్పించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. గూగుల్ ఈమధ్యనే ప్రవేశపెట్టిన కొత్త ఫీచర్ ద్వారా ఇది సాధ్యమవుతోంది. ట్రాఫిక్, నావిగేషన్ అడ్రస్‌లు వంటి కొన్ని ఫీచర్లు లేకపోయినప్పటికీ మీరు ఎక్కడున్నారో తెలుసుకునేందుకు, తద్వారా గమ్యాన్ని సులువుగా చేరేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇంకెందుకు ఆలస్యం... మ్యాప్‌లను ఆఫ్‌లైన్‌లో పొందండి ఇలా... ఆండ్రాయిడ్, ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. కాకపోతే ఐఫోన్ వినియోగదారులు తాజా మ్యాప్స్ ఆప్ (గూగుల్ మ్యాప్స్ వెర్షన్ 3), ఆండ్రాయిడ్ వినియోగదారులైతే (వెర్షన్ 8)ను ఉపయోగించాల్సి ఉంటుంది. 1. ముందుగా గూగుల్ అకౌంట్‌తో సైన్ ఇన్ కావాలి. 2. సెర్చ్బార్లో ‘ఓకే మ్యాప్స్’ అని టైప్ చేయండి. వెంటనే స్క్రీన్పైభాగంలో ‘సేవ్ దిస్ మ్యాప్’ అన్న డైలాగ్ కనిపిస్తుంది. 3. మ్యాప్‌ను అవసరమైతే జూమ్ ఇన్ లేదా జూమౌట్ చేసుకుని మీకు కావాల్సిన ప్రాంతాన్ని గుర్తించి సేవ్ చేసుకోండి. ఉదాహరణకు మీకు హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్ ప్రాంతంకు కావాలనుకుందాం. అక్కడి వరకూ జూమ్ చేసుని సేవ్ బటన్‌ను ప్రెస్ చేయాలన్నమాట. ఆ తరువాత మీరు ఆఫ్లైన్లోనైనా ఆ ప్రాంతాన్ని మరింత జూమ్‌ఇన్ చేసుకుంటూ చూసుకోవచ్చు. 4. మ్యాప్ సేవ్ బటన్ నొక్కగానే మ్యాప్‌కు పేరుపెట్టమని కోరుతూ ఓ డైలాగ్ బాక్స్ ప్రత్యక్షమవుతుంది. నచ్చిన పేరు టైప్ చేసి సేవ్ చేసుకోండి. అంతే... ఆఫ్లైన్లోనూ మీకు అవసరమైన మ్యాప్‌లు అందుబాటులోకి వచ్చేస్తాయి. మ్యాప్స్ స్క్రీన్‌పై కనిపించే వ్యక్తి బొమ్మను క్లిక్ చేస్తే మీ ప్రొఫైల్ అందుబాటులోకి వస్తుందికదా... దాంట్లోనే మీరు సేవ్ చేసుకున్న మ్యాప్‌లు కూడా ఉంటాయి. కావాల్సిన దాన్ని ఓపెన్ చేసుకుని చూసుకోవచ్చు. ఆఫ్‌లైన్ మ్యాప్‌లతో కొన్ని పరిమితులు ఉంటాయన్న విషయం ఎప్పుడూ గుర్తుంచుకోండి. ముందుగా మరీ ఎక్కువగా జూమ్ చేసుకోలేరు. రెండో పరిమితి. సేవ్ చేసుకున్న మ్యాప్‌లు నెల రోజులపాటు మాత్రమే అందుబాటులో ఉంటాయి. -
49 లక్షల ఖాతాలకే రుణమాఫీకి అర్హత
-
ఖాతాలు ఖతం
రైతన్నల జీవితాలతో ప్రకృతే కాదు ... పాలకులూ ఆడుకుంటున్నారు. అధికార దాహంతో అడ్డగోలుగా హామీలిచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు ఏరు దాటాక తెప్ప తగలేసిన చందంగా పాలన సాగిస్తుండడంతో అన్నదాతలు అవస్థల పాలవుతున్నారు. రుణం కట్టాలంటూ బ్యాంకర్లు ... ఆధార్, రేషన్ కార్డుల పేరుతో తొలగింపులకు పాల్పడుతుండడంతో అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. * 1.50 లక్షల ఖాతాల తిరస్కరణ? * జన్మభూమి కమిటీలో తుది నిర్ణయం * మళ్లీ రైతుల్లో టెన్షన్ ఒంగోలు: రైతుల్లో మళ్ళీ టెన్షన్ ప్రారంభమైంది. రుణమాఫీకి సంబంధించి తాజాగా జిల్లాలో 1.50 లక్షల ఖాతాలు తిరస్కరణకు గురైనట్లు సమాచారం. జన్మభూమి మండల కమిటీకి పంపి తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మండల కమిటీలు మళ్లీ వాటిని గ్రామసభలకు పంపి వారు ఇచ్చే నివేదికపై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించడంతో రైతుల్లో మళ్ళీ టెన్షన్ మొదలైంది. రుణమాఫీకి సంబంధించి అక్టోబరు 19వ తేదీనాటికి బ్యాంకర్లు తాము సేకరించిన సమాచారాన్ని ఆన్లైన్, ఆఫ్‌లైన్ రెండు విధానాలలో ప్రభుత్వం సూచించిన ఏపీ స్టేట్ రెసిడెన్షియల్ డేటా హబ్ (ఏపీఎస్‌ఆర్‌డీహెచ్)లో అప్లోడ్ చేశారు. ఆధార్ కార్డును జతపరచకపోవడంతో ప్రాథమికంగా 15631 ఖాతాలను ఏపీఎస్‌ఆర్‌డీహెచ్ ప్రాథమిక దశలోనే తొలగించింది. అవిపోను మిగిలిన మొత్తం రుణమాఫీకి అర్హత పొందిన ఖాతాల సంఖ్య 6,81,276 . కానీ తరువాత మరికొద్ది రోజులు గడువు ఇవ్వడంతో 19019మంది తమ ఆధార్, రేషన్ కార్డులను జతచేశారు. దీంతో మొత్తం రుణమాఫీకి అర్హత పొందిన ఖాతాల సంఖ్య 7,00,295కి చేరింది. రుణమాఫీకి సంబంధించి ఆధార్ కార్డు తప్పనిసరిగా పేర్కొంటూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణం. ఇదే సమయంలో కేవలం ఆధార్ కార్డు మాత్రమే కాకుండా రేషన్ కార్డును కూడా పొందుపరిచారు. ఒకే కుటుంబంలో ఒక్కరికే రుణం వర్తిస్తుందంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆధార్ నెంబర్, రేషన్‌కార్డులోని సభ్యుల వివరాలను పోల్చుకోవడం ద్వారా కొంతమందిని రుణమాఫీని తొలగించాలనేది ప్రభుత్వం లక్ష్యం. తాజాగా మరికొన్ని రోజులు అవకాశం కల్పించడంతో తాజాగా మరో చిక్కు వచ్చి పడింది. ఏపీస్టేట్ రెసిడెన్షియల్ డేటా హబ్ పరిశీలించిన వాటిలో బ్యాంకర్లు పంపే సమయంలో కొన్ని పొరపాట్లు జరిగినట్లు గుర్తించారు. దీంతో వాటిని సరిచేసి తిరిగి పంపాలంటూ ఇప్పటికే బ్యాంకర్లను ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలో పరిశీలిస్తే కొండెపి, తర్లుపాడు, ఉప్పలపాడు, వలేటివారిపాలెం, కొమరోలుతోపాటు పీడీసీసీబీకి చెందిన ఎనిమిది ఖాతాలు కూడా రూ10 లక్షలపైన రుణాలు తీసుకున్నట్లు ఏపీఎస్ఆర్డీహెచ్కు పంపించారు. అయితే వాస్తవానికి వారు అంత మొత్తం రుణం తీసుకొని ఉండరనేది ఏపీఎస్‌ఆర్‌డీహెచ్ భావన. దీంతో పొరపాటు జరిగి ఉంటుందని భావించి వాటిని పరిశీలించి పంపాలంటూ ఆదేశించారు. -
వ్యాపకం.. వ్యాపారమైతే..
గడప దాటకుండానే గడించడానికి ఆన్లైన్, ఆఫ్‌లైన్ మార్గాలనేకం ఉన్నాయి. వ్యాపకాన్ని వ్యాపారావకాశంగా మార్చుకోవడం కూడా వాటిల్లో ఒకటి. కమ్మని వంటకాలు చేయడం మీ హాబీనా? ఎంచక్కా క్యాటరింగ్ బిజినెస్ మొదలుపెట్టొచ్చు. మేకప్, ఫ్యాషన్, సౌందర్య సాధనాలపై మంచి అభిరుచి ఉంటే దాన్ని కూడా ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు. ఇదంతా జరగాలంటే హాబీని వ్యాపారావకాశంగా మల్చుకునేది ఎలా, ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైనవి తెలియాలి. అందులో కొన్ని ఇవి.. 1. సరదా కోసమే కాకుండా మనసుకు కాస్త సంతృప్తి కూడా కలిగించే వాటిని హాబీలుగా ఎంచుకుంటూ ఉంటాం. అలాంటి వాటికి వ్యాపారపరమైన రూపునిస్తున్న పక్షంలో ప్రశ్నించుకోవాల్సిన విషయం ఒకటుంది. మనస్సుకు సాంత్వననిచ్చే హాబీ కాస్తా హోమ్ బిజినెస్‌గా మారిన తర్వాత కూడా దానిపై ఆసక్తి కొనసాగించగలమా, ఆస్వాదించగలమా అన్నది ఆలోచించుకోవాలి. వ్యాపకంలో లాభనష్టాలు, ఆర్థిక కోణాల ప్రసక్తి ఉండదు. అదే వ్యాపారం అంటే.. అనేక లెక్కలు ఉంటాయి. అప్పటిదాకా హాబీగా ఉన్నది కాస్తా ప్రధాన ఆదాయ వనరుగా మారితే లాభనష్టాల గురించి ఆలోచించడం ఎక్కువవుతుంది కనుక.. దాన్ని ఆస్వాదించే అవకాశాలు తగ్గొచ్చు. కనుక ఇలాంటివన్నీ బేరీజు వేసుకుని ముందడుగు వేయాలి. 2. హాబీని బిజినెస్‌గా మార్చుకుందామని నిర్ణయించుకుంటే అసలు దానికి మార్కెట్ అనేది ఉందా అన్నది తెలుసుకోవాలి. మీరు చేసే వంటకాలను, తయారుచేసే ఆభరణాలు మొదలైన వాటిని మీ చుట్టుపక్కాలు, స్నేహితులు మెచ్చుకోవచ్చు. కానీ మార్కెట్లో వాటిని అమ్మితే డబ్బులిచ్చి కొనుక్కునేంత నాణ్యత, ప్రత్యేకత ఉందా అన్నది చూసుకోవాలి. మన ఇంటి దగ్గర అద్భుతంగా ఉందనుకున్నా మార్కెట్లోకి వెళ్లినప్పుడు అట్టర్‌ఫ్లాప్ కావొచ్చు. కనుక, ఇందుకోసం మార్కెట్ రీసెర్చ్ చేయాలి. మిగతా వాటికి ఎంత భిన్నంగా, ఎంత నాణ్యంగా మీరు ప్రొడక్టును అందించగలరన్నదానిపై దృష్టి పెట్టాలి. అప్పుడే కస్టమర్లు మీ వైపు వస్తారన్నది గుర్తుపెట్టుకోవాలి. 3. టెస్ట్ చేయండి. యెకాయెకిన వ్యాపారంలోకి దూకేయకుండా ముందుగా ఒకసారి మీ హాబీని వ్యాపారంగా మార్చుకుంటే వర్కవుట్ అవుతుందో లేదో టెస్ట్ చేసి చూడండి. ఒకవైపు జాబ్ మానకుండా కొనసాగిస్తూనే మరోవైపు పార్ట్‌టైమ్ వ్యాపారంగా హాబీని పరీక్షించండి. కొంతైనా సరే ఆదాయం ఎలా వస్తోంది, విస్తరిస్తే ఎలా వచ్చే అవకాశం ఉంది అన్నది పరిశీలిస్తే రంగంలోకి దిగొచ్చా లేదా అన్నదానిపై అవగాహన వస్తుంది. 4. ప్రణాళిక ఉండాలి.. టెస్ట్ డ్రైవ్‌ని బట్టి ముందుకెళ్లవచ్చు అనుకున్న పక్షంలో బిజినెస్ ప్లాన్‌ని ఒకటి తయారు చేసుకోండి. ఏ స్థాయిలో మొదలుపెడుతున్నారు, ఎప్పటికల్లా ఏ స్థాయికి చేర్చాలనుకుంటున్నారు వంటి లక్ష్యాలను నిర్దేశించుకోండి. ఏముందీ, ఇప్పటిదాకా పార్ట్‌టైమ్‌గా ఉన్నది కాస్తా ఫుల్‌టైమ్ అవుతుంది .. దీనికంటూ పెద్దగా ప్రణాళికలు వగైరా అంటూ హడావుడి అనవసరం అని తేలిగ్గా తీసిపారేయకండి. వ్యాపారం వృద్ధి చెందాలంటే ప్లానింగ్ చేసుకోవడం, సమీక్షించుకోవడం, బిజినెస్ వ్యూహంలో మార్పులు, చేర్పులు చేపట్టడం అనివార్యం. అలాగే, చట్టబద్ధంగా అనుమతులు మొదలైనవి తీసుకోవాల్సి ఉందేమో చూసుకోవాలి. 5. మార్కెటింగ్.. మార్కెటింగ్.. మార్కెటింగ్. హోమ్ బిజినెస్ విజయవంతం కావాలంటే కావాల్సినది నాణ్యమైన ఉత్పత్తి లేదా సర్వీసు అందించడమో మాత్రమే సరిపోదు. సాధ్యమైనంత ఎక్కువమందికి వాటి గురించి తెలియాలి. కనుక రోజువారీ వ్యాపార కార్యకలాపాల్లో మార్కెటింగ్ కచ్చితంగా భాగం కావాలి. ప్రస్తుతం ఫేస్బుక్ వంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లు ఇందుకు చాలా ఉపయోగపడుతున్నాయి. కేవ లం మీ చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితం కాకుండా ఇలాంటి వాటితో ఎక్కడెక్కడో ఉన్న కస్టమర్లకు కూడా చేరువ కావొచ్చు. వ్యాపారావకాశాలను ఎలా మెరుగుపర్చుకోవచ్చన్న దానిపై ఈ తరహా సైట్స్‌లో ఎక్స్‌పర్ట్‌ల నుంచి సలహాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే, దీని కన్నా ముందుగానే ఎవరు కొనే అవకాశం ఉంది, ఏ విధంగా వారి దృష్టిని ఆకర్షించాలి, ఎలా వారిని చేరాలి మొదలైన వాటి కోసం ఒక ప్రణాళిక అంటూ తయారుచేసుకోవాలి. -
మీ ఆధార్ కార్డులో తప్పులున్నాయా?
మెదక్ డెస్క్: అన్ని ప్రభుత్వ పథకాలను ‘ఆధార్’కు అనుసంధానం చేసే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. ఈ తరుణంలో అందరికీ ఆధార్ కీలకంగా మారనుంది. మరి అంత ప్రాధాన్యమున్న మీ ఆధార్ కార్డులో తప్పులేమైనా ఉన్నాయా..! అధార్‌లో నమోదు చేసిన మీ ఫోన్ నెంబర్ మారిందా..! మీ పుట్టిన తేదీ తప్పుగా నమోదయిందా..! సరిచేసుకోవాలంటే ఏం చేయాలి..! ►ఆధార్ కార్డ్‌లో మార్పులు, చేర్పులకు కొన్ని పరిమితులున్నాయి. ►కార్డ్‌లో ఫొటో మార్పు చేయలేము. ►ఆధార్ కార్డ్‌లో పేరు, లింగం (జెండర్), పుట్టిన తేదీ, చిరునామా, మొబైల్ నెంబర్లను మార్పు చేసుకునే అవకాశం ఉంది. ఆధార్‌లో మార్పులు చేసుకునేందుకు సందర్భాన్ని బట్టి రెండు (ఆన్లైన్, ఆఫ్‌లైన్) విధానాలున్నాయి. ఆన్లైన్ విధానంలో ఇలా.. ►ఇంటర్నెట్లో http://uidai.gov.in/updateyouraadhaardata.htmలింక్‌ను క్లిక్ చేయాలి. ►ఇక్కడ ‘అప్డేట్ డేటా ఆన్లైన్’ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి. ►ఇక్కడ కొన్ని ముఖ్యమైన సూచనలు వస్తాయి. వాటిని చదవాలి. ►తర్వాత అప్డేట్, కరెక్షన్ రిక్వెస్ట్ ప్లీజ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ►ఇక్కడ మీకిచ్చిన ఆప్షన్లో మీ ఆధార్ కార్డ్ నెంబరును ఎంటర్ చేయాలి. ►దాని కింద ఇచ్చిన వెరిఫికేషన్ కోడ్‌ను నమోదు చేయాలి. ►అప్పుడు మీ మొబైల్‌కు వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) వస్తుంది. ►ఈ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయగా మీరు ఏది మార్పు చేయాలనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేయాలి. ►ఇక్కడ సంబంధిత ఫారమ్ వస్తుంది. ►ఈ ఫారమ్‌ను పూరించాక సబ్మిట్ అప్డేట్ రిక్వెస్ట్‌ను క్లిక్ చేయాలి. ►తర్వాత డాక్యుమెంటేషన్ ఆప్షన్లో మీరు ఏదైతే మార్పు కోరుతున్నారో దానికి సంబంధించిన పత్రాలను అప్లోడ్ చేయాలి. ►తర్వాత మీకు అందుబాటులో ఉన్న సర్వీస్ ప్రొవైడర్‌ను సెలక్ట్ చేసుకుని ఎంటర్ చేయాలి. ►ఇప్పుడు మీకు అప్డేట్ రిక్వెస్ట్ నెంబరు వస్తుంది. ►ఈ నెంబరుతో మీరు మీ ఆధార్ ప్రస్తుత పరిస్థితి ఏమిటో తెలుసుకోవచ్చు. సూచనలు: వన్ టైమ్ పాస్‌వర్డ్‌కు కేవలం 15 నిమిషాలు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. ►ప్రాంతీయ భాషకు అనుగుణంగా సర్వీస్ ప్రొవైడర్‌ను ఎంచుకోవాలి. ►ఫారమ్ పూరించేటప్పుడు ప్రాంతీయ భాషలో తప్పులు వస్తుంటే సంబంధిత ఆప్షన్ వద్ద కర్సర్‌ను పెట్టి కీ బోర్డులోని ట్యాబ్‌ను ప్రెస్ చేయాలి. అప్పుడు మీకు అక్కడ కొన్ని ఆప్షన్లు వస్తాయి. అందులో సరైంది సెలక్ట్ చేసుకోవాలి. ►5 ఏళ్ల లోపు పిల్లలకు పేరెంట్స్ సంతకం చేస్తే సరిపోతుంది. ►ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సమయంలో రీఫ్రెష్ చేయకూడదు. ►మీరు దేనికైతే దరఖాస్తు చేసుకుంటున్నారో దాని డాక్యుమెంట్ పంపితే సరిపోతుంది. అన్ని పత్రాలు పంపాల్సిన అవసరం లేదు. ►పేరుకు ముందు ఎలాంటి విషయాన్ని ప్రస్తావించకూడదు. ఉదా: డా, శ్రీ, శ్రీమతి... ►అడ్రస్ చాలా స్పష్టంగా ఉండాలి. ఎందుకంటే అప్డేట్ అయిన ఆధార్‌ను ఆ అడ్రస్‌కు పంపుతారు. ►డేట్ ఆఫ్ బర్త్ మార్పునకు మాత్రం ఒక్కసారే అవకాశం ఉంటుంది. ►మొబైల్ నెంబరు మార్పు మాత్రం మీ ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. దీనికి ఎలాంటి పత్రాలు రావు. ఆఫ్ లైన్ విధానం (పోస్ట్‌ద్వారా...) ఇంటర్ నెట్లో http://uidai.gov.in /images/ applicationform11102012.pdf లింక్‌ను క్లిక్ చేస్తే మీకు సంబంధిత దరఖాస్తు వస్తుంది. ►అందులో మీ వివరాలు పూరించి, సంబంధిత దరఖాస్తులను జత చేయాలి. ►దరఖాస్తును నిర్దేశిత కాలమ్‌లలో ప్రాంతీయ భాషలో కూడా పూరించాలి. ►ఒక ఎన్వలప్‌పై ‘రిక్వెస్ట్ ఫర్ ఆధార్ అప్డేట్ అండ్ కరెక్షన్’ అని రాసి ప్రాంతీయ కార్యాలయానికి పోస్ట్‌లో పంపాలి. సూచన: ఆన్లైన్ విధానంలో ఫారమ్ నింపే సమయంలో కొన్ని ఆప్షన్స్‌లో కరెక్ట్ అయిన పిన్‌కోడ్, విలేజ్, టౌన్, సిటి, పోస్ట్ ఆఫీస్, జిల్లా, రాష్ట్రం రాకపోతేనే ఆఫ్‌లైన్ విధానంలో అప్లై చేయాలి. ►అటెస్ట్ చేయాల్సిన పత్రాలు, పాటించాల్సిన నిబంధనలు ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానాలకు ఒక్కటే.