పాన్‌ కార్డులో మార్పులు చేసుకోండిలా.. | PAN Card Update Online offline name address details change | Sakshi
Sakshi News home page

పాన్‌ కార్డులో మార్పులు చేసుకోండిలా..

Published Sun, May 26 2024 7:18 PM | Last Updated on Sun, May 26 2024 7:18 PM

PAN Card Update Online offline name address details change

పర్మినెంట్ అకౌంట్ నంబర్ (పాన్) అనేది ఆదాయపు పన్ను ఫైలింగ్‌కు అవసరమైన కీలకమైన గుర్తింపు పత్రం. ఇందులో పేరు, పుట్టిన తేదీ, ఫోటో, సంతకం, తండ్రి పేరు, ఆధార్, లింగం, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ, చిరునామా లేదా సంప్రదింపు సమాచారం వంటి వివరాలు సరైనవి ఉండడం చాలా అవసరం.

ఈ వివరాల్లో ఏవైనా తప్పుగా ఉన్నా, మారినా వెంటనే సరిచేసి పాన్ కార్డును అప్డేట్ చేసుకోవడం మంచిది. ఎన్ఎస్‌డీఎల్ లేదా యూటీఐఐటీఎస్ఎల్ వెబ్‌సైట్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో పాన్ కార్డు వివరాలను అప్డేట్ చేసుకునే అవకాశం ఉంది. అయితే మీరు మొదట ఎన్ఎస్‌డీఎల్ వెబ్‌సైట్ ద్వారా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసి ఉంటే అదే వెబ్‌సైట్‌లోనే పాన్ వివరాలను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒక వేళ యూటీఐఐటీఎస్ఎల్ వెబ్‌సైట్ ద్వారా చేసినట్లయితే ఆ వెబ్‌సైట్‌ ద్వారానే పాన్ కార్డు వివరాలను అప్డేట్ చేయాలి.

NSDL e-Gov పోర్టల్‌లో.. 

  • స్టెప్ 1: NSDL e-Gov పోర్టల్‌ను ఓపెన్‌ చేయండి

  • స్టెప్ 2: 'సర్వీసెస్' ట్యాబ్‌లోకి వెళ్లి డ్రాప్‌డౌన్ మెనూ నుంచి 'పాన్' ఎంచుకోండి.

  • స్టెప్ 3: 'చేంజ్‌/కరెక‌్షన్‌ ఇన్‌ పాన్‌ డేటా' అనే విభాగం కోసం స్క్రోల్ చేసి 'అప్లై' మీద క్లిక్ చేయండి.

  • స్టెప్ 4: అవసరమైన వివరాలతో ఆన్‌లైన్ పాన్ అప్లికేషన్ ఫామ్‌ను పూర్తి చేయండి

  • స్టెప్‌ 5: విజయవంతంగా నమోదు చేసిన తర్వాత, ఈ-మెయిల్ ద్వారా టోకెన్ నంబర్‌ వస్తుంది. ఈ టోకెన్ నెంబరు సెషన్ సమయం ముగిసినట్లయితే ఫారం డ్రాఫ్ట్‌ వెర్షన్ కు తీసుకెళ్తుంది. ఇక్కడ 'కంటిన్యూ విత్ పాన్ అప్లికేషన్ ఫామ్' పై క్లిక్ చేయాలి.

  • స్టెప్ 6: ఈ-కేవైసీ, ఈ-సైన్ (పేపర్ లెస్) ద్వారా డిజిటల్ గా సబ్మిట్ చేయండి
    స్కాన్ చేసిన ఇమేజ్ లను ఈ-సైన్ ద్వారా సబ్మిట్ చేయండి
    అప్లికేషన్ డాక్యుమెంట్ లను భౌతికంగా ఫార్వర్డ్ చేయండి అని మూడు ఆప్షన్లు కనిపిస్తాయి.

  • ఆధార్ ఓటీపీ ద్వారా ఆన్‌లైన్‌లో ప్రక్రియను పూర్తి చేయడానికి, 'ఈ-కేవైసీ & ఈ-సైన్ (పేపర్లెస్) ద్వారా డిజిటల్‌గా సబ్మిట్ చేసే మొదటి ఆప్షన్‌ను ఎంచుకోండి.

  • స్టెప్ 7: అప్డేట్ చేసిన పాన్ కార్డు కొత్త ఫిజికల్ కాపీ మీకు అవసరమని సూచించండి. దీనికి నామమాత్రపు ఛార్జీలు వర్తించవచ్చు.

  • స్టెప్ 8: మీ ఆధార్ నంబర్ చివరి నాలుగు అంకెలను నమోదు చేయండి.

  • స్టెప్ 9: అవసరమైన వివరాలను అప్డేట్ చేసి, సంబంధిత దిద్దుబాటు లేదా అప్డేట్ ఎంచుకోండి. 'కాంటాక్ట్ ఇతర వివరాలు' పేజీకి వెళ్లడానికి 'నెక్ట్స్' మీద క్లిక్ చేయండి.

  • స్టెప్ 10: కొత్త చిరునామా, అప్డేటెడ్ మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్ చిరునామాను నమోదు చేయండి.

  • స్టెప్ 11: పాన్ కాపీతో పాటు అప్డేట్ చేసిన వివరాలకు సంబంధించిన ప్రూఫ్ డాక్యుమెంట్లను జతచేయండి.

  • స్టెప్ 12: మీ పేరును పేర్కొనడం ద్వారా డిక్లరేషన్ విభాగాన్ని పూర్తి చేయండి.

  • స్టెప్ 13: మీ ఫోటో, సంతకం కాపీని జతచేసిన తర్వాత 'సబ్మిట్' మీద క్లిక్ చేయండి.

  • స్టెప్ 14: ఫారం ప్రివ్యూను సమీక్షించుకుని,  మీ ఆధార్ నంబర్ మొదటి ఎనిమిది అంకెలను నమోదు చేయండి.

  • స్టెప్ 15: పాన్ కార్డ్ కరెక్షన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత పేమెంట్ పేజీకి వెళ్లండి. వివిధ పేమెంట్ గేట్ వేల ద్వారా పేమెంట్ చేయవచ్చు. విజయవంతంగా చెల్లించిన తరువాత, చెల్లింపు రశీదు జారీ అవుతుంది.

  • స్టెప్ 16: పాన్ కార్డ్ అప్డేట్ / కరెక్షన్ ప్రక్రియను ఖరారు చేయడానికి, 'కంటిన్యూ' మీద క్లిక్ చేయండి. నియమనిబంధనలను అంగీకరించి 'అథెంటికేట్' మీద క్లిక్ చేయడం ద్వారా కేవైసీ ప్రక్రియను పూర్తి చేయండి.

  • స్టెప్ 17: మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆన్‌లైన్ పాన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి.

  • స్టెప్ 18: తర్వాత స్క్రీన్‌పై ఈ-సైన్‌తో 'కంటిన్యూ' మీద క్లిక్ చేయండి.

  • స్టెప్ 19: నియమనిబంధనలను అంగీకరించి, మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, 'సెండ్ ఓటీపీ' పై క్లిక్ చేయండి.

  • స్టెప్ 20: వెరిఫికేషన్ కోసం మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపిన ఓటీపీని ఎంటర్ చేయండి. అక్నాలెడ్జ్ మెంట్ ఫారాన్ని డౌన్ లోడ్ చేసుకోండి. ఈ ఫైలును తెరవడానికి పాస్ వర్డ్ DD/MM/YYYY ఫార్మెట్ లో మీ పుట్టిన తేదీ ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.

UTIITSL పోర్టల్‌లో ఇలా..

  • స్టెప్‌ 1: UTIITSL వెబ్‌సైట్‌ను తెరవండి

  • స్టెప్ 2: 'చేంజ్‌/కరెక‌్షన్‌ ఇన్‌ పాన్‌ కార్డ్‌' ట్యాబ్‌ను ఎంచుకుని ‘క్లిక్‌ టు అప్లయి’ మీద క్లిక్‌ చేయండి

  • స్టెప్ 3: 'అప్లయి ఫర్‌ చేంజ్‌/కరెక‌్షన్‌ ఇన్‌ పాన్‌ కార్డ్‌ డీటెయిల్స్‌' ట్యాబ్‌ను ఎంచుకోండి

  • స్టెప్ 4: డాక్యుమెంట్ సబ్మిషన్ విధానాన్ని ఎంచుకుని, మీ పాన్ నంబర్ ఎంటర్ చేసి, పాన్ కార్డ్ మోడ్‌ను ఎంచుకుని, 'సబ్మిట్' బటన్‌పై క్లిక్ చేయండి.

  • స్టెప్‌ 5: విజయవంతంగా నమోదు చేసిన తర్వాత, మీకు రిఫరెన్స్ నంబర్ వస్తుంది. 'ఓకే' మీద క్లిక్ చేయండి.

  • స్టెప్ 6: ఎక్కడెక్కడ అప్డేట్స్ అవసరమో అక్కడ కచ్చితమైన వ్యక్తిగత వివరాలను నమోదు చేసి 'నెక్ట్స్ స్టెప్' పై క్లిక్ చేయండి

  • స్టెప్ 7: మీ ఆధార్ కార్డు ఆధారంగా చిరునామా అప్డేట్ అవుతుంది. మీ కాంటాక్ట్ వివరాలను నమోదు చేసి తదుపరి దశకు వెళ్లండి.

  • స్టెప్ 8: పాన్ నెంబర్ ఎంటర్ చేసి నెక్ట్స్ స్టెప్ బటన్‌ క్లిక్ చేసి వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.

  • స్టెప్ 9: అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.

  • స్టెప్ 10: ఫారంలోని వివరాలను సమీక్షించి, 'మేక్ పేమెంట్' బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా చెల్లింపు కొనసాగించండి.

  • స్టెప్ 11: నచ్చిన ఆన్‌లైన్ పేమెంట్ మోడ్‌ను ఎంచుకుని పేమెంట్ ప్రాసెస్ పూర్తి చేయాలి. విజయవంతంగా పేమెంట్ చేసినప్పుడు ఒక సక్సెస్ మెసేజ్ డిస్ ప్లే అవుతుంది. ఈ ఫారాన్ని ప్రింట్ తీసుకోవడం మంచిది.

  • సాధారణంగా పాన్ కరెక్షన్ ప్రక్రియలకు 15 రోజులు పడుతుంది. మీ పాన్ కార్డు పోస్ట్ ద్వారా పంపిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు నోటిఫికేషన్ వస్తుంది.


ఆఫ్‌లైన్‌లో పాన్ అప్డేట్ ఇలా..

» ఇంటర్నెట్ నుంచి పాన్ కార్డు కరెక్షన్ ఫామ్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి.

» ఫారం అన్ని విభాగాలను కచ్చితంగా పూర్తి చేసి అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోండి

» అవసరమైన డాక్యుమెంట్లతో నింపిన ఫారంను సమీపంలోని పాన్ సెంటర్లో సబ్మిట్ చేయాలి.

» సబ్మిట్ చేసి, రుసుము చెల్లించిన తర్వాత, కేంద్రం నుంచి అంగీకార స్లిప్ పొందండి.

» 15 రోజుల వ్యవధిలో, ఈ అంగీకార స్లిప్‌ను ఎన్ఎస్‌డీఎల్ ఆదాయపు పన్ను పాన్ సర్వీస్ యూనిట్‌కు పంపండి.

కావాల్సిన డాక్యుమెంట్లు

  • పాన్ కార్డు డూప్లికేట్

  • ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు వంటి గుర్తింపు రుజువులు. 

  • ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, ఆస్తిపన్ను రశీదులు, యుటిలిటీ బిల్లులు వంటి చిరునామా రుజువులు. 

  • పుట్టిన తేదీ, ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, బర్త్ సర్టిఫికేట్, మెట్రిక్యులేషన్ మార్క్ షీట్ తదితరాల ఆధారాలు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement