మీ ఆధార్ కార్డులో తప్పులున్నాయా? | Aadhar Card changes of mistakes | Sakshi
Sakshi News home page

మీ ఆధార్ కార్డులో తప్పులున్నాయా?

Published Thu, Aug 14 2014 12:32 AM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM

మీ ఆధార్ కార్డులో తప్పులున్నాయా? - Sakshi

మీ ఆధార్ కార్డులో తప్పులున్నాయా?

మెదక్ డెస్క్: అన్ని ప్రభుత్వ పథకాలను ‘ఆధార్’కు అనుసంధానం చేసే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. ఈ తరుణంలో అందరికీ ఆధార్ కీలకంగా మారనుంది. మరి అంత ప్రాధాన్యమున్న మీ ఆధార్ కార్డులో తప్పులేమైనా ఉన్నాయా..! అధార్‌లో నమోదు చేసిన మీ ఫోన్ నెంబర్ మారిందా..! మీ పుట్టిన తేదీ తప్పుగా నమోదయిందా..! సరిచేసుకోవాలంటే ఏం చేయాలి..!  


ఆధార్ కార్డ్‌లో మార్పులు, చేర్పులకు కొన్ని పరిమితులున్నాయి.
కార్డ్‌లో ఫొటో మార్పు చేయలేము.
ఆధార్ కార్డ్‌లో పేరు, లింగం (జెండర్), పుట్టిన తేదీ, చిరునామా, మొబైల్ నెంబర్లను మార్పు చేసుకునే అవకాశం ఉంది.
 
ఆధార్‌లో మార్పులు చేసుకునేందుకు సందర్భాన్ని బట్టి రెండు (ఆన్‌లైన్, ఆఫ్‌లైన్) విధానాలున్నాయి.
 ఆన్‌లైన్ విధానంలో ఇలా..  
ఇంటర్‌నెట్‌లో http://uidai.gov.in/updateyouraadhaardata.htmలింక్‌ను క్లిక్ చేయాలి.
ఇక్కడ ‘అప్‌డేట్ డేటా ఆన్‌లైన్’ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి.
ఇక్కడ కొన్ని ముఖ్యమైన సూచనలు వస్తాయి. వాటిని చదవాలి.
తర్వాత అప్‌డేట్, కరెక్షన్ రిక్వెస్ట్ ప్లీజ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
ఇక్కడ మీకిచ్చిన ఆప్షన్‌లో మీ ఆధార్ కార్డ్ నెంబరును ఎంటర్ చేయాలి.
దాని కింద ఇచ్చిన వెరిఫికేషన్ కోడ్‌ను నమోదు చేయాలి.
అప్పుడు మీ మొబైల్‌కు వన్ టైమ్ పాస్‌వర్డ్  (ఓటీపీ) వస్తుంది.
ఈ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయగా మీరు ఏది మార్పు చేయాలనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేయాలి.
ఇక్కడ సంబంధిత ఫారమ్ వస్తుంది.
ఈ ఫారమ్‌ను పూరించాక సబ్‌మిట్ అప్‌డేట్ రిక్వెస్ట్‌ను క్లిక్ చేయాలి.
తర్వాత డాక్యుమెంటేషన్ ఆప్షన్‌లో మీరు ఏదైతే మార్పు కోరుతున్నారో దానికి సంబంధించిన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
తర్వాత మీకు అందుబాటులో ఉన్న సర్వీస్ ప్రొవైడర్‌ను సెలక్ట్ చేసుకుని ఎంటర్ చేయాలి.    
ఇప్పుడు మీకు అప్‌డేట్ రిక్వెస్ట్ నెంబరు వస్తుంది.
ఈ నెంబరుతో మీరు మీ ఆధార్ ప్రస్తుత పరిస్థితి ఏమిటో తెలుసుకోవచ్చు.
సూచనలు: వన్ టైమ్ పాస్‌వర్డ్‌కు కేవలం 15 నిమిషాలు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది.
ప్రాంతీయ భాషకు అనుగుణంగా సర్వీస్ ప్రొవైడర్‌ను ఎంచుకోవాలి.
ఫారమ్ పూరించేటప్పుడు ప్రాంతీయ భాషలో తప్పులు వస్తుంటే సంబంధిత ఆప్షన్ వద్ద కర్సర్‌ను పెట్టి కీ బోర్డులోని ట్యాబ్‌ను ప్రెస్ చేయాలి. అప్పుడు మీకు అక్కడ కొన్ని ఆప్షన్లు వస్తాయి. అందులో సరైంది సెలక్ట్ చేసుకోవాలి.
5 ఏళ్ల లోపు పిల్లలకు పేరెంట్స్ సంతకం చేస్తే సరిపోతుంది.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సమయంలో రీఫ్రెష్ చేయకూడదు.
మీరు దేనికైతే దరఖాస్తు చేసుకుంటున్నారో దాని డాక్యుమెంట్ పంపితే సరిపోతుంది. అన్ని పత్రాలు పంపాల్సిన అవసరం లేదు.
పేరుకు ముందు ఎలాంటి విషయాన్ని ప్రస్తావించకూడదు.
     ఉదా: డా, శ్రీ, శ్రీమతి...
అడ్రస్ చాలా స్పష్టంగా ఉండాలి. ఎందుకంటే అప్‌డేట్ అయిన ఆధార్‌ను ఆ అడ్రస్‌కు పంపుతారు.
డేట్ ఆఫ్ బర్త్ మార్పునకు మాత్రం ఒక్కసారే అవకాశం ఉంటుంది.
మొబైల్ నెంబరు మార్పు మాత్రం మీ ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. దీనికి ఎలాంటి పత్రాలు రావు.
 
ఆఫ్ లైన్ విధానం (పోస్ట్‌ద్వారా...)
ఇంటర్ నెట్‌లో http://uidai.gov.in /images/ applicationform11102012.pdf లింక్‌ను క్లిక్ చేస్తే మీకు సంబంధిత దరఖాస్తు వస్తుంది.
అందులో మీ వివరాలు పూరించి, సంబంధిత దరఖాస్తులను జత చేయాలి.
దరఖాస్తును నిర్దేశిత కాలమ్‌లలో ప్రాంతీయ భాషలో కూడా పూరించాలి.
ఒక ఎన్వలప్‌పై ‘రిక్వెస్ట్ ఫర్ ఆధార్ అప్‌డేట్ అండ్ కరెక్షన్’ అని రాసి ప్రాంతీయ కార్యాలయానికి పోస్ట్‌లో పంపాలి.
సూచన: ఆన్‌లైన్ విధానంలో ఫారమ్ నింపే సమయంలో కొన్ని ఆప్షన్స్‌లో కరెక్ట్ అయిన పిన్‌కోడ్, విలేజ్, టౌన్, సిటి, పోస్ట్ ఆఫీస్, జిల్లా, రాష్ట్రం రాకపోతేనే ఆఫ్‌లైన్ విధానంలో అప్లై చేయాలి.
అటెస్ట్ చేయాల్సిన పత్రాలు, పాటించాల్సిన నిబంధనలు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాలకు ఒక్కటే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement