అత్యవసరమా.. గూగుల్‌ మ్యాప్స్‌ వెతకండి  | Search Google Maps if emergency of Public toilets | Sakshi
Sakshi News home page

అత్యవసరమా.. గూగుల్‌ మ్యాప్స్‌ వెతకండి 

Published Sat, Nov 11 2017 2:49 AM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM

Search Google Maps if emergency of Public toilets

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహానగరంలో బయటకెళ్లేవారు అవసరమైనప్పుడు పబ్లిక్‌ టాయ్‌లెట్లు కనిపించక పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. నగర ప్రజలతోపాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే టూరిస్టులకూ ఇదే దుస్థితి. నగరంలో ప్రజలకు అవసరమైనన్ని పబ్లిక్‌ టాయ్‌లెట్లు లేకపోవడమే కాక, ఉన్నవాటి గురించి కూడా తెలియకపోవడంతో పడుతున్న ఇబ్బందులెన్నో.

ఈ దుస్థితి నివారించి ప్రజలకు తామున్న ప్రదేశానికి ఎంత దూరంలో పబ్లిక్‌ టాయ్‌లెట్‌ ఉందో తెలుసుకునే సదుపాయాన్ని జీహెచ్‌ఎంసీ అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి గూగుల్‌ మ్యాప్స్‌లో జియోమ్యాపింగ్‌ చేయించింది. దీంతో ప్రజలకు తామున్న ప్రదేశం నుంచి పబ్లిక్‌/కమ్యూనిటీ టాయ్‌లెట్‌ ఎంత దూరంలో ఉందో రూట్‌మ్యాప్‌తో సహా ఎన్ని నిమిషాల్లో చేరుకోవచ్చో కూడా తెలుస్తుంది. మొబైల్‌ ఫోన్‌లో గూగూల్‌ మ్యాప్స్‌లోకి వెళ్లి స్వచ్ఛ్‌ పబ్లిక్‌ టాయ్‌లెట్‌ (swachh public toilet)అని టైప్‌ చేస్తే వివరాలు కనిపిస్తాయని జీహెచ్‌ఎంసీ పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement