Public toilets
-
సిటిజన్ ఫీడ్ బ్యాక్‌లో సిద్దిపేట టాప్
సాక్షి, సిద్దిపేట: స్వచ్ఛ సర్వేక్షణ్–2023లో భాగంగా పట్టణంలో చెత్త సేకరణ, పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయా, పబ్లిక్ టాయిలెట్లు ఉన్నాయా? అని ఇలా పది రకాల ప్రశ్నలతో స్వచ్ఛత యాప్ ద్వారా సిటిజన్ ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. లక్షకు పైగా జనాభా కలిగిన పట్టణాల ఫీడ్ బ్యాక్‌లో సిద్దిపేట మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 సంయుక్త ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా స్వచ్ఛ సర్వేక్షణ్–2023 పేరుతో పోటీలు నిర్వహిస్తోంది. దేశంలోని 4,355 పట్టణా లు ఇందులో మెరుగైన ర్యాంకింగ్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. గతేడాది స్వ చ్ఛ సర్వేక్షణ్–2022లో తెలంగాణలోని మున్సిపాలి టీలు, కార్పొరేషన్లు 16 అవార్డులు సాధించాయి. ఫీడ్ బ్యాక్‌లో టాప్‌లో సిద్దిపేట: సిటిజన్ ఫీడ్ బ్యాక్ స్వీకరణ ఆగస్టు 31వ తేదీతో ముగిసింది. దేశ వ్యాప్తంగా 4,355 పట్టణాలుండగా లక్షకు పైగా జనా భా ఉన్నవి 427, లక్షలోపు 3,928 పట్టణాలున్నాయి. లక్షకు పైగా జనాభా కలిగిన 427 పట్టణాల ఫీడ్ బ్యా క్లో తొలి స్థానంలో సిద్దిపేట నిలిచింది. సిద్దిపేట మున్పిపాలిటీలో 1,16,583 జనాభా ఉండగా 76, 283 మంది.. అంటే ఉన్న జనాభాలో 65.43 శాతం మంది ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. 32.61 శాతం మంది ఫీడ్ బ్యాక్‌తో 4వ స్థానంలో మహబూబ్‌నగర్, 8.88 శాతంతో 24వ స్థానంలో వరంగల్ ఉంది. ఫీడ్ బ్యాక్‌కు 600 మార్కులు: స్వచ్ఛ సర్వేక్షణ్ లో మొత్తం 9,500 మార్కులు కేటాయించనున్నా రు. అందులో సర్వీస్ లెవల్ ప్రోగ్రెస్‌కు 4,830, సర్టిఫికేషన్‌కు 2,500, సిటిజన్ వాయిస్‌కు 2,170 కేటాయించగా, సిటిజన్ ఫీడ్ బ్యాక్‌కు 600 మార్కులను కేటాయించనున్నారు. జిల్లాలోని ము న్సిపాలిటీలు ఇప్పటికే స్వచ్ఛ సర్వేక్షణ్–2023కు ఆన్లైన్లో డాక్యుమెంట్లను అప్లోడ్ చేశారు. వాటి ప్రకారం పట్టణం ఉందా? లేదా? అని ఫిజికల్‌గా వెరిఫికేషన్ చేయనున్నారు. -
అర్జంట్‌గా పోయాలి.. కానీ తాళం తీయట్లేదు.? ఇవ్వేం పబ్లిక్ టాయిలెట్లురా బాబోయ్
లగ్జరీ వాష్‌రూంల పేరిట కార్పొరేట్ స్థాయిలో నగరంలో నిర్మించిన లూకేఫ్ టాయిలెట్లు నిరుపయోగంగా మారాయి. అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా లక్ష్యం నెరవేరకపోవడంతో టాయిలెట్లకు వెచ్చించిన నిధులు వృథా అయ్యాయి. – వరంగల్ అర్బన్ లూకేఫ్ టాయిలెట్లు.. కార్పొరేట్ తరహాలో నిర్మించారు. గ్రేటర్ వరంగల్ నగరంలో రెండున్నర ఏళ్ల కిందట అవసరం పేరిట ఒకటి, రెండు కాదు.. 5 చోట్ల నిర్మించారు. దేశ వ్యాప్తంగా పేరు మోసిన బడా కాంట్రాక్టు సంస్థ రూ.కోటి వ్యయంతో వీటి నిర్మాణం చేపట్టింది. సగానికి పైగా బిల్లులు కూడా కట్టబెట్టారు. మిగతా సొమ్ము కోసం సదరు సంస్థ ప్రతినిధులు తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తుండటంతో ఓ ప్రజారోగ్య విభాగం అధికారి, మరో ఇంజనీర్ కలిసి ఆ బిల్లు కూడా ఇప్పించేందుకు తోడ్పాటు అందిస్తున్నారు. మరి ఇవి ఉపయోగంలో ఉన్నాయా అని బల్దియా అధికారులను అడిగితే ‘మాకేం తెలుసు’అన్న సమాధానం వస్తోంది. ఉత్సవ విగ్రహాలేనా..? నగరంలో ప్రజా మురుగుదొడ్ల నిర్వహణ నిధుల మేతగా మారింది. జీడబ్ల్యూఎంసీ ద్వారా నిర్మితమై న ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ టాయిలెట్లు చాలా వరకు మరుగున పడ్డాయి. లూకేఫ్ సంస్థ కంటైనర్ తరహాలో రూ.కోటితో కాజీపేట నిట్, కలెక్టరేట్, సర్క్యూట్ గెస్ట్‌హౌస్, వరంగల్ పోచమ్మమైదాన్, ఖిలా వరంగ ల్ ఖుష్‌మహల్ వద్ద టాయిలెట్లను నిర్మించింది. ఒక్కో ప్రాంతంలో ఆరు సీట్లతో ఏర్పాటు చేశారు. వీటిని వ్యాపార కేంద్రాలుగా మారుస్తూ బల్దియాపై ఎలాంటి భారం లేకుండా పలు సంస్థలకు, నిరుద్యోగులకు అప్పగించారు. లూకేఫ్ టాయిలెట్లను నిర్వహిస్తూ, ప్రజలు ఉచితంగా మరుగుదొడ్లు ఉపయోగించుకునేలా నిర్ణయించారు. వీటి పక్కన జిరాక్స్, టీ, పాన్‌షాపు తదితర చిన్న తరహా షాపులు ఏర్పాటు చేసుకున్నారు. కానీ అనువైన స్థలాల్లో నిర్మించకపోవడం.. ప్రజలకు అందుబాటులో లేకపోవడం, చిరు వ్యాపారాలు నడవకపోవడంతో చేతులెత్తేశారు. దీంతో లూకేఫ్ టాయిలెట్లు అలంకా ర ప్రాయంగా మారాయి. హనుమకొండ కలెక్టరేట్ కొత్తగా నిర్మాణం కావడం వల్ల లూకేఫ్ టాయిలెట్ ను కూల్చివేయడం పూర్తయింది. సమన్వయ లోపం.. నిధులు నిరుపయోగం బల్దియా టౌన్ ప్లానింగ్, ఇంజనీర్ల మధ్య సమన్వ య లోపం స్పష్టంగా కనిపిస్తోంది. జనరద్దీ కలిగిన ప్రాంతాల్లో కాకుండా ఇష్టమొచ్చిన, ప్రభుత్వ స్థలా లు ఉన్న చోట నిర్మాణాలు చేపట్టారు. దీంతో ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం, అవగా హనా రాహిత్యం తదితర కారణాల వల్ల లూకేఫ్‌లు మూలకు చేరాయి. బల్దియా పట్టణ ప్రగతి నిధులు మాత్రం నిరుపయోగంగా మారాయి. ఇవేకాకుండా నగరంలో నాలుగు చోట్ల నిర్మించిన కమ్యూనిటీ టాయిలెట్ల పరిస్థితీ దయనీయంగా మారింది. -
ప్రహారీకి అడ్డుగా ఉందని పక్కా ప్లాన్! జీహెచ్ఎంసీ పబ్లిక్ టాయిలెట్ కొట్టేసి..
సాక్షి, మల్కాజిగిరి: మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజల ఉపయోగార్థం జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్ మాయమైంది. అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓ నిందితుడిని అరెస్టు చేయగా, టాయిలెట్ చోరీ వెనుక ఉన్న అసలు కథ బయటకు వచ్చింది. రూ.45 వేలకు విక్రయం ఆనంద్‌బాగ్ చౌరస్తాలో కొన్నాళ్ల క్రితం ఇనుముతో చేసిన పబ్లిక్ టాయిలెట్ ఏర్పాటు చేశారు. అదే ప్రాంతంలో ఓ కన్స్ట్రక్షన్స్ సంస్థ భారీ మల్టీప్లెక్స్ నిర్మిస్తోంది. దీని ప్రహరీ నిర్మాణానికి సదరు టాయిలెట్ అడ్డుగా మారింది. ఈ నేపథ్యంలోనే దాన్ని తొలగించాలని కోరుతూ సదరు కన్స్ట్రక్షన్ కంపెనీ పలుమార్లు జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయానికి దరఖాస్తు చేసుకుంది. ప్రజల కోసం ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్‌ను తొలగించాలంటే ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉండాలని వాళ్లు తేల్చి చెప్పారు. చదవండి: డ్రెస్ కొనుక్కుంటానని చెప్పి బయటకు వెళ్లి.. నిర్మాణ సంస్థ సూపర్వైజర్ బిక్షపతికి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసే అరుణ్‌కుమార్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పబ్లిక్ టాయిలెట్ తొలగించే పని తాను చేస్తానంటూ చెప్పడంతో బిక్షపతి అంగీకరించాడు. టాటా ఏస్ వాహనం డ్రైవర్ చేస్తూ ఫ్లెక్సీ హోర్డింగ్స్ పని చేసే జోగయ్యకు ఆ పని అప్పగించాడు. ఈ నెల 16 ఆ టాయిలెట్ తీసుకెళ్లి ముషీరాబాద్‌లో రూ.45 వేలకు విక్రయించాడు. ఫిర్యాదు అందుకున్న జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ జి.రాజు ఆదేశాల మేరకు సానిటరీ సూపర్వైజర్ మల్కాజ్గిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 17న కేసు నమోదైంది. ప్రాథమిక ఆధారాలు, సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా పబ్లిక్ టాయిలెట్ తరలించడానికి వినియోగించిన వాహనాన్ని గుర్తించి జోగయ్యను అదుపులోకి తీసుకుని విచారించారు. టాయిలెట్ తొలగింపునకు సంబంధించి బిక్షపతి, అరుణ్‌కుమార్ మధ్య ఒప్పందం కుదిరిందని, అరుణ్ చెప్పడంతోనే తాను దాన్ని తీసుకుపోయానని విషయం చెప్పడంతో జోగయ్యను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న బిక్షపతి, అరుణ్ కోసం గాలిస్తున్నారు. -
Viral Video: అబ్బే ఏం లేదు.. నాకు కొంచెం సిగ్గెక్కువ.. అందుకే!!
అడవిలో పక్షులు, జంతువులకు వేటి సహజ అలవాట్లు వాటికుంటాయి. అందుకు ప్రత్యేకంగా ఏదైనా చేస్తేనే అది వండర్ అవుతుంది. కుక్క, పిల్లి వంటి పెంపుడు జంతువులైతే మామూలే అనుకోవచ్చు. కానీ అడవికే రారాజు అయిన సింహం తన అలవాట్లు మార్చుకుందేమోననే సందేహం కలిగేలా ఉన్న వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలేంచేసిందంటే.. ఒక కదులుతున్న కారులో నుంచి ఈ వీడియోను రికార్డు చేశారు. ఈ వీడియోలో కారు పబ్లిక్ టాయిలెట్ దగ్గర ఆగగానే లోపల్నుంచి బయటకు వస్తున్న సింహం కనిపిస్తుంది. వాళ్లను చూసిన సింహం ‘ఇది నాకు చాలా మామూలు విషయం’ అన్నట్టుగా నింపాదిగా బయటికి వచ్చి అడవిలోకి వెళ్లిపోతుంది. ఐతే ఈ సంఘటన ఎక్కడజరిగిందో తెలియదు కానీ దీనిని చూసిన నెటిజన్లు మాత్రం భిన్న కామెంట్లు చేస్తున్నారు. ‘మగ సింహం జంట్స్ టాయిలెట్స్ నుంచి బయటికి రావడం నిజంగా అభినందించదగిన విషయమే.. చదువుకున్న సింహం’ అని ఒకరు కామెంట్ చేస్తే, ‘చాలా సేపటినుంచి ఓపిక పట్టాను.. ఇప్పుడు ప్రశాంతంగా ఉందని’ మరొకరు కామెంట్ చేశారు. పబ్టిక్ టాయిలెట్స్‌లో జంతువులు కనిపించడం ఇది మొదటిసారేమీ కానప్పటికీ జంగిల్ సఫారీ టైంలో టాయిలెట్లకు వెళ్లాలంటే కొంచెం ఆలోచించి వెళ్లడం బెటర్ అనిపిస్తుంది ఈ వీడియోను చూస్తే! దీంతో ఈ వీడియోను వేలకొద్దీ నెటిజన్లు ఆసక్తిగా వీక్షిస్తున్నారు. చదవండి: చరిత్రలో పెద్ద మిస్టరీగా మిగిలిన మృత్యులోయ..! -
ఆ సమయంలో... భరోసా ఇస్తోంది!
తాను ఎదుర్కొన్న కష్టాన్ని మరెవరూ పడకూడదని కోరుకునే పెద్దమనసు ఇర్ఫానా జర్గర్ది. అది 2014 శ్రీనగర్‌లో ఉన్న అత్యంత రద్దీ బజారులో నడుచుకుంటూ వెళ్తోంది ఇర్ఫానా. సడెన్‌గా ఆమెకు నెలసరి (పీరియడ్స్) బ్లీడింగ్ అవ్వడం మొదౖలñ ంది. ఆ సమయంలో తన దగ్గర శానిటరీ ప్యాడ్లు లేవు. కొనుకుందామనుకున్నా డబ్బులు లేవు. దీంతో దగ్గర్లో ఉన్న పబ్లిక్ టాయిలñ ట్‌కు వెళ్లింది. అక్కడ కూడా ఆమెకు ఏమీ దొరకలేదు. దీంతో ఇంటికి వెళ్లేంత వరకు తీవ్రంగా ఇబ్బందికి గురైంది. ఆరోజు ఇర్ఫానా పడిన ఇబ్బందిని మరే అమ్మాయి పడకూడదని శ్రీనగర్‌లోని పబ్లిక్ టాయిలెట్లలో శానిటరీ న్యాప్కిన్స్ను ఉచితంగా అందిస్తోంది ఇర్ఫానా. అమ్మాయిలు, మహిళలు నెలసరి సమయంలో శారీరకంగా, మానసికంగా ఇబ్బందికి గురవుతుంటారు. ఇక నలుగురిలోకి వెళ్లాల్సి వచ్చినప్పుడు దృష్టి అంతా వెనుకాల ఎక్కడ మరకలు అంటుకున్నాయో? అని పదేపదే చూసుకుంటుంటారు. అది ప్రకృతి సిద్ధంగా జరిగే ప్రక్రియే అయినా ఇప్పటికీ అమ్మాయిలు దానికి గురించి మాట్లాడానికి కూడా సిగ్గుపడుతుంటారు. ఈ ధోరణి మార్చాలన్న ఉద్దేశ్యంతోనే ‘ఇవ సేఫ్టీ డోర్’ కిట్ కార్యక్రమాన్ని ఇర్ఫానా చేపట్టింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన శ్రీనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో హెల్పింగ్ అసిస్టెంట్ గా పనిచేస్తోన్న ఇర్ఫానా... నెల జీతంలో ఐదువేల రూపాయలను పొదుపు చేసి , వాటితో శానిటరీ ప్యాడ్స్ కొని నిరుపేదలకు ఉచితంగా అందిస్తోంది. ఇలా ఇప్పటిదాకా 20 వేలకు పైగా శానిటరీ ప్యాడ్స్ ఇచ్చింది. శానిటరీ న్యాప్కిన్స్, ప్యాంటీస్, హ్యాండ్ వాష్, బేబీ డయపర్స్తో కూడిన ‘ఇవ సేఫ్టీ డోర్’ కిట్‌ను పబ్లిక్ టాయిలెట్లలో ఉంచుతోంది. అత్యవసరంలో ప్యాడ్లు అవసరమైన మహిళలు ఎటువంటి టెన్షన్ పడకుండా వీటిని వాడుకునేలా పబ్లిక్ లేడీస్ టాయిలెట్స్‌లో అందుబాటులో ఉంచుతోంది. శ్రీనగర్‌లోని దాదాపు అన్ని పబ్లిక్ టాయిలెట్లలో ఇవ ప్యాడ్స్ కనిపిస్తాయి. వివిధ గ్రామాల నుంచి నగరానికి వచ్చే మíß ళలకు ఇవి ఉపయోగపడుతున్నాయి. సమాజానికి ఏదైనా చేయాలన్న మనస్తత్వం ఇర్ఫానాది. తనకి 21 ఏళ్లు ఉన్నప్పుడు తన తండ్రి హార్ట్ ఎటాక్‌తో మరణించారు. దీంతో తను చదువుకుంటూనే, కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు... మున్సిపల్ కార్పొరేషన్లో ఉద్యోగంలో చేరింది. తన జీతంలో కొంత మిగుల్చుకుని ఉచితంగా ప్యాడ్లు అందించే కార్యక్రమాన్ని చేపట్టింది. కరోనా సమయంలోనూ ఆసుపత్రులలో ప్యాడ్స్‌ను ఉచితంగా అందించింది. ఈ సమయంలో చాలామంది ఇర్ఫానాకు కాల్స్ చేసి శానిటరీ న్యాప్కిన్స్, కిట్స్ ఇవ్వమని అడిగితే వారికి పంపించేది. నిరుపేదలు, నిరక్షరాస్య మహిళలకు శానిటరీ ప్యాడ్స్ ప్రాముఖ్యత వివరిస్తూ, మెన్స్ట్రువల్ హైజీన్‌పై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తోంది.ఈ మొత్తానికి ఎవరి సాయం లేకుండా తన సొంత డబ్బులను వాడడం విశేషం. ఇర్ఫానా చేస్తోన్న పని గురించి తెలిసిన వారంతా అభినందిస్తున్నారు. ‘‘నేను ఈ పనిచేయడానికి ప్రేరణ మా నాన్నగారే. షాపుల నుంచి మా నాన్న గారే శానిటరీ ప్యాడ్స్ కొని తెచ్చి నాకు ఇబ్బంది లేకుండా చూసేవారు. అందుకే నాన్న మరణించాక ఆయన గర్వపడేలా ఏదైనా చేయాలనుకున్నాను. ఈ క్రమంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. కొన్నిసార్లు పీరియడ్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇంటికి దూరంగా బయట ఎక్కడో ఉన్నప్పుడు సడెన్‌గా మొదలవుతుంది. ఆ సమయంలో మన దగ్గర ప్యాడ్ లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ సమయంలో ఈ ప్యాడ్లు బాగా ఉపయోగపడుతాయి’’ అని ఇర్ఫానా చెప్పింది. -
బెంగళూరు ముందడుగు
కర్ణాటక రాష్ట్రం మహిళల సౌకర్యం కోసం ఒక వినూత్న ప్రయోగం చేసింది. పాతబడిపోయిన ఆర్టీసీ బస్సులను వాష్‌రూములుగా మార్చింది. వీటికి ‘స్త్రీ టాయిలెట్’ పేరు పెట్టింది. ఒక్కో బస్సులో మూడు వెస్టర్న్, మూడు ఇండియన్ టాయిలెట్లు ఉంటాయి. ముఖం కడుక్కోవడానికి వీలుగా వాష్ బేసిన్లు కూడా ఉన్నాయి. చంటి పిల్లల తల్లులకు ఉపయోగకరంగా పిల్లలకు పాలివ్వడానికి, డయాపర్లు మార్చడానికి వీలుగా మరొక అమరిక కూడా ఉంది. వీటితోపాటు పీరియడ్స్ సమయంలో ఉన్న మహిళలకు నాప్కిన్ వెండింగ్ మెషీన్ (డబ్బులు వేస్తే నాప్కిన్ వస్తుంది), నాప్కిన్ ఇన్సినేటర్ (భస్మం చేసే మెషీన్) కూడా ఉంది. ఈ బస్సు నిర్వహణకు అవసరమైన కరెంటు ఉత్పత్తి కోసం బస్సు పై భాగంగా సోలార్ ప్యానెల్ ఉంది. బస్సులోపలికి వెళ్లినప్పుడు లైట్లు వేసి, బయటకు వచ్చేటప్పుడు ఆపకుండా మర్చిపోవడం వంటి ఇబ్బంది లేకుండా సెన్సార్లు ఏర్పాటు చేశారు. మనిషి లోపలికి వెళ్లినప్పుడు లైట్లు వాటంతట అవే వెలుగుతాయి. మనిషి బయటకు రాగానే ఆరిపోతాయి. ప్రయోగాత్మకంగా మొదలు పెట్టిన ఈ బస్సులను మొదట బెంగళూరు నగరంలోని మెజిస్టిక్ బస్‌స్టాండ్‌లో పెట్టింది. మహిళల నుంచి మంచి స్పందన వచ్చింది. బస్సుగా నడపడానికి వీల్లేని, తుక్కు ఇనుము కింద అమ్మేయాల్సిన పరిస్థితి లో ఉన్న బస్సులను ఇలా ఉపయుక్తంగా మలిచింది కర్ణాటక ప్రభుత్వం. బస్సు లోపల పై ఏర్పాట్ల కోసం ఒక్కో బస్సుకు పన్నెండు లక్షలు ఖర్చయింది. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు అథారిటీ యాజమాన్యం కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీలో భాగంగా ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ఇది విజయవంతమై తీరుతుందని ఉద్యోగినులు సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రయత్నాన్ని మన తెలుగమ్మాయి సుష్మ గత ఏడాది హైదరాబాద్‌లో చేపట్టింది. ఆమె ఆటోలో నమూనా మొబైల్ టాయిలెట్‌ను తయారు చేసి, పాతబడిన బస్సును ఉపయోగించుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వానికి ప్రాజెక్ట్ రిపోర్టు కూడా అందచేసింది. సుష్మ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేసి, ఇండియాకు వచ్చిన తర్వాత సమాజానికి తనవంతుగా తిరిగి ఇవ్వాల్సిన బాధ్యతను ఈ రకంగా నిర్వర్తిస్తు్తన్నట్లు చెప్పింది. కోఠీ వంటి మార్కెట్ ప్రదేశాల్లో టాయిలెట్లు లేక మహిళలు ఇబ్బంది పడడం తనకు అనుభవపూర్వకంగా తెలుసని, ఆ సమస్యకు పరిష్కారంగా మొబైల్ టాయిలెట్లకు రూపకల్పన చేశానని చెప్పిందామె. సుష్మ తన సొంతూరు కోదాడలో మొబైల్ టాయిలెట్ ఆటోను జనానికి పరిచయం చేసింది. సుష్మ ప్రయత్నానికి ప్రభుత్వం నుంచి మద్దతు లభించే లోపు కటక ఓ ముందడుగు వేసింది. అయితే ఇందులో తొలి రికార్డు మాత్రం తెలుగమ్మాయి సుష్మదే. -
ఆకట్టుకునే స్మార్ట్ టాయిలెట్లు
టోక్యో : పబ్లిక్ టాయిలెట్లు అనగానే అపరిశుభ్రత, దుర్వాసనలతో జనం వాటికి దూరంగా జరిగే పరిస్ధితి నెలకొంటే టోక్యోలో ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ వాటిని అద్భుత డిజైన్‌తో ఆకట్టుకునేలా ఏర్పాటు చేశారు. పారదర్శక వాల్స్‌తో భిన్నమైన రంగుల్లో టాయిలెట్లను డిజైన్ చేశారు. బయటనుంచి పారదర్శకంగా కనిపించే మూత్రశాలలు, ఉపయోగించే సమయంలో డార్క్‌గా మారేలా ఏర్పాటు చేయడం ఆకట్టుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా పబ్లిక్ టాయిలెట్లు అంటే ముక్కు మూసుకునేలా ఉన్నా జపాన్‌లో రెస్ట్‌రూమ్స్ అత్యంత మెరుగైన పారిశుద్ధ్య ప్రమాణాలకు నిలువుటద్దంలా ఉంటాయి. పారిశుద్ధ్య పరిస్ధితి మెరుగ్గా ఉండే జపాన్‌లోనూ పబ్లిక్ టాయిలెట్లపై నెలకొన్న అపోహలను చెరిపివేసేందుకు నిప్పన్ ఫౌండేషన్ ది టోక్యో టాయిలెట్ ప్రాజెక్టును చేపట్టింది. టోక్యోలోని జనసమ్మర్ధం అధికంగా ఉండే ప్రాంతాల్లో 17 పబ్లిక్ టాయిలెట్లను పునరుద్ధరించే బాధ్యతను 16 మంది ప్రఖ్యాత ఆర్కిటెక్ట్‌లకు అప్పగించింది. వయసు, వైకల్యం, లింగ బేధాలతో నిమిత్తం లేకుండా పబ్లిక్ బాత్రూంలు అందరికీ అందుబాటులో ఉండేలా వినూత్న డిజైన్‌తో వీటిని చేపట్టాలని సూచించింది. వీటిలో హరునొవగ్వా కమ్యూనిటీ పార్క్ వద్ద ప్రిట్కర్ ప్రైజ్ గెలుపొందిన ఆర్కిటెక్ట్ షిగెరు బాన్ ఏర్పాటు చేసిన పారదర్శక పబ్లిక్ టాయిలెట్ల డిజైన్ ఆకట్టుకుంటోందని నిప్పన్ ఫౌండేషన్ తెలిపింది. బాన్ డిజైన్ చేసిన ఈ టాయిలెట్లలో ఒక్కో యూనిట్లో మూడు క్యూబికల్స్ ఉంటాయి. న్యూ స్మార్ట్‌గ్లాస్ టెక్నాలజీ వాడటంతో డోర్ లాక్ చేసి ఉన్న సమయంలో టాయిలెట్ గోడలు డార్క్‌గా మారతాయని నిప్పన్ ఫౌండేషన్ తెలిపింది. రాత్రి సమయాల్లో ఇవి అందమైన లాంతర్ల తరహాలో పార్కుల్లో వెలుగులు విరజిమ్ముతాయని పేర్కొంది. ప్రముఖ ఆర్కిటెక్టులు రూపొందించిన డిజైన్లతో ఆయా పబ్లిక్ రెస్ట్రూమ్లు దశలవారీగా ప్రారంభమవుతాయని వెల్లడించింది. చదవండి : నవ్వొద్దని ప్రభుత్వం ఆంక్షలు, కానీ.. -
ఇక స్మార్ట్ వాష్ రూమ్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అన్ని పట్టణ ప్రాంతాల్లో జనాభా అవసరాలకు తగ్గట్టు సమీకృత స్మార్ట్ వాష్ రూమ్స్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ నిర్ణయించింది. స్వచ్ఛ భారత్ (అర్బన్) మార్గదర్శకాల మేరకు పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) లేదా ఇతర పద్ధతుల్లో టాయిలెట్లు, యూరినల్స్, హ్యాండ్‌వాష్‌ల సదుపాయంతో సమీకృత వాష్‌రూమ్స్ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది. టాయిలెట్, యూరినల్స్, హ్యాండ్ వాష్‌లు ఒకే సముదాయంలో ఉండనున్నాయి. వీటికి అదనంగా ఏటీఎం, ఫొటో కాపీయింగ్ (జిరాక్స్), వైఫై, ఇంటర్నెట్, ప్రింటర్, మీ–సేవాలతో పాటు ఆహ్లాదకరమైన కేఫే సదుపాయాన్ని కల్పిస్తారు. స్మార్ట్ వాష్ రూమ్‌లో ఏర్పాటు చేసే ఇతర వాణిజ్య సముదాయాలతో పాటు ప్రకటనలతో ఆదాయం వచ్చే మార్గాలుంటే వాష్‌రూమ్‌ల వినియోగానికి చార్జీలు వసూలు చేయరు. హైదరాబాద్‌లో పలు చోట్ల వాష్‌రూమ్స్, ఏటీఎం, కేఫేలతో నిర్మించిన ‘లూ కేఫే’లను ఆదర్శంగా తీసుకుని వీటిని ఏర్పాటు చేయబోతున్నారు. జనాభాకు తగ్గట్టు.. పురుషుల కోసం 100 నుంచి 400 మందికి టాయిలెట్ సీట్ ఏర్పాటు చేయాలని, జన సంచారం 400 మందికి మించి ఉంటే, ఆపై 250 మందికి ఒక టాయిలెట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రతి 50 మందికి ఒక యూరినల్ నిర్మించేందుకు కసరత్తు చేస్తోంది. ప్రతి ఒక్క టాయిలెట్, యూరినల్‌కు ఒక హ్యాండ్‌వాష్‌ను ఏర్పాటు చేయనుంది. మహిళల కోసం 100 నుంచి 200 మందికి రెండు టాయిలెట్ సీట్లు, 200 మందికి మించితే ప్రతి 100 మందికి అదనంగా మరో ఒక టాయిలెట్ సీట్‌ను నిర్మించనుంది. మహిళల కోసం ప్రత్యేకంగా యూరినల్స్, హ్యాండ్ వాష్‌లు ఏర్పాటు చేయరు. సామూహిక మరుగుదొడ్ల విషయానికి వస్తే ప్రతి 35 మంది పురుషులకు ఒకటి, 25 మంది మహిళలకు ఒకటి చొప్పున టాయిలెట్లు నిర్మిస్తారు. వికలాంగులకు ప్రత్యేక సదుపాయాలు ఉండనున్నాయి. పీపీపీ భాగస్వామ్యంతో.. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో స్థానికంగా సమీకృత స్మార్ట్ వాష్ రూమ్స్, సామూహిక మరుగుదొడ్లకు ఉన్న అవసరాలను గుర్తించేందుకు అధ్యయనం చేసి అవసరమైన మేరకు టాయిలెట్ల నిర్మాణానికి ప్రణాళికలు తయారు చేయాలని మున్సిపల్ కమిషనర్లను పురపాలక శాఖ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ తాజాగా ఆదేశించారు. పీపీపీ విధానం లేదా ప్రైవేటు వ్యాపారవేత్తల భాగస్వామ్యంతో సుదీర్ఘ కాలం మన్నిక కలిగిన సమీకృత స్మార్ట్ వాష్ రూమ్స్ ఏర్పాటు చేయాలని కమిషనర్లను కోరారు. పీపీపీ భాగస్వామ్యంతో డిజైన్, బిల్ట్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (డీబీ ఎఫ్‌వోటీ) విధానంలో పురపాలికల్లోని వాణిజ్యపర ప్రాంతాల్లో స్మార్ట్ వాష్ రూమ్స్ ఏర్పాటు చేసేందుకు, ఇప్పటికే ఉన్న పాత టాయిలెట్ కాంప్లెక్స్‌లను రిహాబిలేట్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (ఆర్వోటీ) కింద స్మార్ట్ వాష్ రూమ్స్‌గా పునర్నిర్మించేందుకు ప్రైవేటు పార్టీలు ఆసక్తితో ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్మార్ట్ వాష్ రూమ్స్‌ల ఏర్పాటుకు ఆసక్తి గల ప్రైవేటు సంస్థలు, సొసైటీలు, స్వయం సహాయక సంఘాలు తదితర వాటి నుంచి ఆసక్తి వ్యక్తీకరణను (ఈవోఐ) ఆహ్వానించాలని కమిషనర్లను ఆదేశించారు. స్వచ్ఛ బారత్ మార్గదర్శకాల ప్రకారం ఒక స్మార్ట్ వాష్ రూమ్‌లో ఒక టాయిలెట్ నిర్మాణానికి రూ.98 వేలు, యూరినల్ ఏర్పాటుకు రూ.32 వేల వరకు వ్యయాన్ని అనుమతించనున్నారు. మూడు పద్ధతుల్లో నిర్మాణం.. ప్రైవేటు సంస్థల డిజైన్లకు అనుగుణంగా స్మార్ట్ వాష్ రూమ్స్‌ల నిర్మాణాన్ని అనుమతించనున్నారు. అయితే, డిజైన్లను స్థానిక పురపాలిక/జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా కమిటీ ఆమోదించాల్సి ఉంటుంది. పురపాలిక/జిల్లా కమిటీ రూపొందించిన డిజైన్ ప్రకారం స్మార్ట్ వాష్ రూమ్స్ ఏర్పాటు చేయవచ్చు. అయితే, స్థానిక లేఅవుట్‌కు తగ్గట్టు డిజైన్‌కు చిన్నచిన్న మార్పులు అనుమతిస్తారు. ఇప్పటికే ఉన్న పాత టాయిలెట్ సముదాయాల స్థానంలో కొత్తగా స్మార్ట్ వాష్ రూమ్స్‌ను నిర్మిస్తారు. సమయ పాలన.. సామూహిక టాయిలెట్లు ఉదయం 5 నుంచి మధ్యాహ్నం వరకు బాగా వినియోగంలో ఉంటాయి. రైల్వే స్టేషన్లు, బస్స్టేషన్లు, విమానాశ్రాయాల వద్ద ఉండే స్మార్ట్ వాష్‌రూమ్స్ 24 గంటలు వినియోగంలో ఉంటాయి. ప్రధాన వ్యాపార కూడళ్లలో ఉండే వాటికి ఉదయం 8 నుంచి రాత్రి 10 వరకు డిమాండ్ ఉండనుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని స్మార్ట్ వాష్ రూమ్స్ నిర్వహించనున్నారు. -
‘కరుప్పాయి.. సిగ్గుతో ఉరేసుకోవాలనిపిస్తుంది’
చెన్నై: బహిరంగ మరుగుదొడ్లు ఎంత పరిశుభ్రంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అవసరం నిమిత్తం ఓ పది నిమిషాలు వెళ్లాల్సి వస్తేనే.. ఏదో నరకంలోకి అడుగుపెడుతున్నట్లు భావిస్తాం. అలాంటిది ఓ మహిళ ఏకంగా 19 సంవత్సరాల నుంచి ఆ మరుగుదొడ్డిలోనే నివసిస్తుంది. వినడానికే జుగుప్సాకరంగా ఉంటే.. అక్కడే జీవనం సాగిస్తున్న సదరు మహిళ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. ఈ హృదయవిదారక సంఘటన తమిళనాడులోని మధురైలో వెలుగు చూసింది. వివరాలు.. కరుప్పాయి(65) అనే వృద్ధురాలు గత 19 ఏళ్లుగా మదురై రామ్నాద్ ప్రాంతంలో బహిరంగ మరుగుదొడ్లో నివాసం ఉంటుంది. టాయిలెట్ వినియోగించుకోవడానికి వచ్చే వారి వద్ద డబ్బులు వసూలు చేస్తూ.. మరుగుదొడ్లను శుభ్రం చేస్తూ అక్కడే జీవనం సాగిస్తుంది. న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ కరుప్పాయి దీనగాథ గురించి ప్రచురించడంతో ఆమె అవస్థ గురించి జనాలకు తెలిసింది. ఏఎన్ఐ కథనం ప్రకారం.. కరుప్పాయి భర్త మరణించాడు. ఓ కూతురు ఉంది కానీ ఆమె తల్లిని పట్టించుకోవడం మానేసింది. ఈ క్రమంలో ఎవరూ లేని కరుప్పాయి గత 19 ఏళ్లుగా బహిరంగ మరుగుదొడ్లను తన నివాసంగా చేసుకుని దాని మీద వచ్చే అతి తక్కువ ఆదాయంతో రోజులు వెళ్లదీస్తుంది. కరుప్పాయికి కనీసం వృద్ధాప్య పెన్షన్ కూడా లభించడం లేదు. Madurai: 65-year-old Karuppayi has been living in a public toilet in Ramnad for past 19 years, & earning her livelihood by cleaning the toilets & charging a meager amount from public for using it. #TamilNadu pic.twitter.com/UA1Zmo0pNS — ANI (@ANI) August 22, 2019 ఈ విషయం గురించి కరుప్పాయిని ప్రశ్నించగా.. ‘వృద్ధాప్య పెన్షన్‌కు అప్లై చేశాను. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. నాకొక ఇళ్లు మంజూరు చేయాల్సిందిగా ఎందరో అధికారులను కలిశాను. కానీ ఎవరు నా మొర ఆలకించలేదు. దాంతో ఈ మరుగుదొడ్లోనే ఒక దాన్ని నా నివాసంగా మార్చుకుని ఇక్కడే కాలం వెళ్లదీస్తున్నాను. వీటి మీద రోజుకు నాకు రూ.70-80 ఆదాయం లభిస్తుంది.అదే నా జీవనాధారం. నాకు ఓ కుమార్తె ఉంది కానీ తను నన్ను పట్టించుకోదు’ అంటూ కరుప్పాయి వాపోయింది. ప్రస్తుతం కరుప్పాయి కథనం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కొందరు నెటిజన్లు ఈ కథనాన్ని నరేంద్రమోదీకి ట్యాగ్ చేస్తూ.. ఆమెకు ఇంటిని, పెన్షన్‌ను మంజూరు చేసి ఆదుకోమ్మని కోరుతుండగా.. మరి కొందరు ‘నీలాంటి పేదలు, వృద్ధులను సరిగా పట్టించుకోని ఈ సమాజం సిగ్గుతో ఉరి వేసుకోవాలి. తమిళనాడు ప్రభుత్వం ఏం చేస్తుంది’.. ‘ఈ దేశం పేదలకోసం కాదు’ అంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. మరి తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికైనా ఈ దీనురాలి మొర ఆలకిస్తుందో లేదో చూడాలి. -
మరుగుదొడ్లలో అవినీతి దుర్గంధం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: అధికార పార్టీ నాయకులే దళారులుగా వ్యవహరించి వ్యక్తిగత మరుగుదొడ్ల నిధులను మింగేశారు. గడువు ముగుస్తుందన్న తరుణంలో ఎటువంటి మరుగుదొడ్ల నిర్మాణాలూ చేపట్టకుండానే బిల్లులు డ్రా చేసుకుని జేబులు నింపుకొన్నారు. అధికారుల లెక్కల ప్రకారం స్వచ్ఛభారత్ పక్కాగా అమలైందని ఎవరైనా అనుకుంటారు. కానీ క్షేత్రస్థాయిలో అక్రమాలు చూస్తే ఆ నిధులు పక్కదారి పట్టాయన్న విషయం స్పష్టమవుతోంది. రికార్డుల పరంగా నూరు శాతం మరుగుదొడ్లు నిర్మాణాలు జరిగాయని అధికారులు చెబుతున్నా.. అనేకచోట్ల వాస్తవంగా నిర్మాణాలు చేపట్టకుండానే నిధులు మింగేశారు. ఈవిధంగా జిల్లాలో రూ.100 కోట్లకు పైగా అవినీతి జరిగింది. అందుకు తగినట్టుగానే దాదాపు ప్రతి మండలంలోనూ మరుగుదొడ్ల అక్రమాలపై ఫిర్యాదులొచ్చాయి. అవినీతి ఉదంతాలివిగో.. మరుగుదొడ్ల నిర్మాణాల పేరిట రౌతులపూడి మండలంలో రూ.1.50 కోట్ల మేర మింగేశారు. నియోజకవర్గంలో ఓ టీడీపీ నేత, ఓ మండల అధికారి కుమ్మక్కై ఈ నిధులు దోచుకున్నారు. పరిమాణాన్ని అనుసరించి ఒక్కో మరుగుదొడ్డికి రూ.12 వేలు, రూ.15 వేలు, రూ.18 వేల చొప్పున కేటాయించారు. ఈ నిధులతో సొంతంగా మరుగుదొడ్లు నిర్మించుకోవాలని లబ్ధిదా రులు భావించారు. ఇలాగైతే ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి నిర్మాణాలు పూర్తి కావని పేర్కొంటూ ఆ నిధులు మింగేసేందుకు అధికార పార్టీ నాయకులు పథక రచన చేశారు. కాంట్రాక్టర్‌తో నిర్మిస్తామని, లేకుంటే మరుగుదొడ్డి మంజూరు కాదని పరోక్షంగా బెదిరించారు. తప్పనిసరి పరిస్థితుల్లో లబ్ధిదారులు అంగీకరించారు. ఇలా పనులు మొదలు పెట్టి, సగం నిర్మాణం కూడా పూర్తి చేయకుండానే ప్రభుత్వం విడుదల చేసిన నిధులు చాలలేదని చెబుతూ ఒక్కో లబ్ధిదారుని నుంచి రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకూ వసూలు చేశారు. చివరికి నిర్మాణాలను సగంలోనే వదిలేశారు. ఇలా రాజవరం, గంగవరం, ఎ.మల్లవరం, పారుపాక, ఎస్.పైడిపాల గ్రామాల్లో పెద్ద ఎత్తున మరుగుదొడ్ల నిధులు కైంకర్యం చేశారు. తొండంగి మండలంలో కూడా మరుగుదొడ్ల నిర్మాణాల్లో రూ.2 కోట్ల మేర అక్రమాలు జరిగాయి. నిర్మాణాలు చేపట్టకుండానే, లబ్ధిదారులకు తెలియకుండానే నిధులు డ్రా చేసేశారు. ఒక్క పైడికొండ పంచాయతీలో రూ.70 లక్షల వరకూ అవినీతి జరిగింది. నిర్మాణాలు పూర్తయినట్టు కాంట్రాక్టర్ ఆన్లైన్లో చూపించి నిధులు మింగేశారు. పైడికొండ పంచాయతీ పరిధి ఆనూరులో తొలుత అక్రమాలు వెలుగు చూడగా, పైడికొండ గ్రామస్తులు కూడా అనుమానంతో జాబితాలు పరిశీలించుకున్నారు. వారికి తెలియకుండానే కాంట్రా క్టర్లు, అధికారులు కుమ్మక్కై దోచుకున్నట్టు తేలింది. విచారణ జరపగా అవినీతి జరగడం వాస్తవమేనని అధికారులు కూడా వెల్లడించారు. చనిపోయిన వారి పేరిట కూడా మరుగుదొడ్లు నిర్మించినట్టు తేలింది. ఈ అక్రమాలపై ఆనూరు, పైడికొండ గ్రామాల వారు విజిలెన్స్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై జరిగిన ఉన్నత స్థాయి విచారణలో అవినీతి తేటతెల్లమయ్యింది. కిర్లంపూడి మండలం జగపతినగరం పంచాయతీ చిల్లంగి, కిర్లంపూడి, జగపతినగరం గ్రామాల్లో స్వచ్ఛభారత్ కింద సుమారు 1,957 మరుగుదొడ్లు మంజూరయ్యాయి. వీటి నిర్మాణంలో భారీ అవకతవకలు చోటు చేసుకున్నాయి. కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు యడ్ల మురళీకృష్ణ పేరిట ఎటువంటి నిర్మాణం చేపట్టకుండా 15 మరుగుదొడ్లకు రూ.1.35 లక్షలు ఒకసారి, రూ.90 వేలు మరోసారి జమయ్యాయి. ఈ గ్రామానికి ఎటువంటి సంబంధం లేని బూరుగుపూడి ఫీల్డ్ అసిస్టెంట్ పాటంశెట్టి వీరబాబు పేరిట 10 వ్యక్తిగత మరుగుదొడ్లకు రూ.90 వేలు ఒకసారి, రూ.60 వేలు ఒకసారి మొత్తం రూ.1.50 లక్షలు జమ అయ్యాయి. గ్రామంతో ఎటువంటి సంబంధమూ లేకుండా ఎక్కడో ఐఐటీ ఫ్యాకల్టీగా పని చేస్తున్న గుడిమెల్ల శ్రీలక్ష్మి అనే మహిళ పేరిట 11 మరుగుదొడ్లకు వివిధ తేదీల్లో రూ.1.65 లక్షలు జమయ్యాయి. కిర్లంపూడికి చెందిన ఎ.దుర్గా పోలారావు పేరిట 30 మరుగుదొడ్లకు సంబంధించి 2017 మార్చి 20న రూ.12 వేలు, మార్చి 27న రూ.42 వేలు, జూలై 17న రూ.1.80 లక్షలు, తిరిగి మార్చి 27న రూ.36 వేలు, జూలై 10న రూ.24 వేలు, జూలై 3న రూ.1.20 లక్షలు, జూలై 10న రూ.36 వేలు జమయ్యాయి. అలాగే మాజీ సర్పంచ్ పి.నాగశివరామారావు పేరుమీద కొన్ని వ్యక్తిగత మరుగుదొడ్లకు ఎన్జీవోల పేర్ల మీద బిల్లులు మంజూరయ్యాయి. ఇవేకాకుండా వందలాది వ్యక్తిగత మరుగుదొడ్ల బిల్లులు పంచాయతీ ఖాతాకు జమయినప్పటికీ లబ్ధిదారులకు చేరలేదు. అయినవిల్లి మండలంలో రూ.80 లక్షల పైనే అవకతవకలు జరిగాయి. వీటిని వెలికి తీయాలని పలువురు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. మండలంలోని 21 గ్రామాలకుగాను ఉపాధి హామీ పథకంలో 1,090, స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా 2,090 మరుగుదొడ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీటి సొమ్ములు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేయాలి. అలాకాకుండా పంచాయతీ ఖాతాల్లోను, కాంట్రాక్టర్ ఖాతాల్లోను, ఏజెన్సీ ఖాతాల్లోను జమ చేశారు. ఇదే అదునుగా లబ్ధిదారుల ఖాతాల్లో కాకుండా అధికార పార్టీ నాయకులు తమకు ఇష్టం వచ్చిన ఖాతాల్లో మరుగుదొడ్ల సొమ్ములు జమ చేశారు. మరుగుదొడ్లను నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని జిల్లా అధికారులు ఒత్తిడి తేవడంతో దానిని తట్టుకోలేక ఇచ్చిన టార్గెట్ పూర్తి చేసేందుకు అధికార పార్టీ నేతలు చెప్పినట్లుగా వారు చెప్పిన ఖాతాల్లో స్థానిక అధికారులు జమ చేశారు. పిఠాపురం మండలం కోనపాపపేటకు చెందిన బెణుగు బంగారమ్మ పేరున 2013లో ఒక వ్యక్తిగత మరుగుదొడ్డి మంజూరు కాగా, దానిని ఆమె సొంత ఖర్చుతో నిర్మించుకుంది. 2014లో ఆమె మరణించింది. కట్టుకున్న మరుగుదొడ్డికి బిల్లు మాత్రం రాలేదు. కానీ ఆమె పేరున రెండు మరుగుదొడ్లు కట్టినట్లు, నిధులు డ్రా చేసినట్టు రికార్డుల్లో చూపించాయి. ఐడీ నంబరు 04047220500400094తో 13.06.2013న ఒకటి పూర్తయినట్లు, రెండోది 040472205004000901 ఐడీ నంబరుతో 14.11.2013న ఆమోదం పొందినట్టు, ఒక్కోదానికి రూ.12,900 మంజూరైనట్లు, వాటిని డ్రా చేసినట్లు ఆన్లైన్లో ఉండడంతో బంగారమ్మ కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. ఆ సొమ్ము తాము తీసుకోలేదని, ఎవరు తీసుకున్నారని ప్రశ్నిస్తే ఎవ్వరూ సమాధానం చెప్పడం లేదని ఆమె కుమారుడు వాపోయాడు. కోనపాపపేటకు చెందిన వికలాంగుడు తిత్తి సింహాద్రి, వాసుపల్లి పంపమ్మ తదితరుల ఇళ్లవద్ద మరుగుదొడ్లు నిర్మించకుండానే నిర్మించినట్లు ఆన్లైన్లో చూపించి, వారి తరఫున వేరే వ్యక్తులు బిల్లులు డ్రా చేశారని ఫిర్యాదులొచ్చాయి. కాకినాడ దుమ్ములపేట మత్స్యకార ప్రాంతంలో మరుగుదొడ్లు నిర్మించకుండానే నిర్మించినట్టుగా రికార్డుల్లో చూపించి నిధులు కైంకర్యం చేశారు. లబ్ధిదారుల ఖాతాల్లో పడాల్సిన సొమ్మును ఇతర ఖాతాలకు మళ్లించి దిగమింగేశారు. ఓ ఏఈ, స్థానిక అధికార పార్టీ నేతలు కుమ్మక్కై ఈ వ్యవహారాన్ని నడిపారు. విషయం బయటికి పొక్కడంతో పాటు అప్పటి కలెక్టర్‌కు దీనిపై ఫిర్యాదు కూడా వెళ్లింది. దీంతో నాటి కమిషనర్ తీవ్రంగా హెచ్చరించడంతో సదరు అధికారి, నేతలు వెనక్కు తగ్గి, ఎవరికివ్వాల్సిన సొమ్ము వారికి ఇచ్చేసి అల్లరి కాకుండా చూసుకున్నారు. అక్రమాలను అడ్డుకోని టెక్నాలజీ వ్యక్తిగత మరుగుదొడ్లలో అక్రమాల నివారణకు జీపీఎస్ సిస్టమ్ అని, జియోట్యాగింగ్ అని ప్రభుత్వం గొప్పగా చెప్పింది. లబ్ధిదారుల ఖాతాలకే డబ్బులు జమ అని చెప్పారు. అవకతవకలకు ఆస్కారమే ఉండదని చెప్పారు. కానీ ఎంత టెక్నాలజీ వాడినా అక్రమార్కులకు అడ్డుకట్ట వేయలేకపోయారు. చివరికి గ్రామాల్లో మృతుల పేరిట కూడా మరుగుదొడ్లు నిర్మించినట్లు రికార్డుల్లో చూపించి రూ.లక్షల్లో నిధులు పక్కదారి పట్టించారు. భర్తలు బతికుండగా భార్యలకు వితంతు పింఛన్లు మంజూరు చేయించుకున్న అధికార పార్టీ నేతలు.. శవాలకు మరుగుదొడ్లు కట్టినట్టు రికార్డులు సృష్టించి నిధులను పక్కదోవ పట్టించారు. ఎక్కడ పనులు జరుగుతున్నాయో ఆన్లైన్లో చూడగలిగే జీపీఆర్ఎస్ సిస్టమ్ సహితం వారి అక్రమాలను నిఘా కన్నుతో చూడలేకపోయిందంటే వారు ఏవిధంగా చక్కబెట్టేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. -
స్త్రీలోక సంచారం
న్యూయార్క్‌లోని బుష్విక్ ప్రాంతంలో ఉన్న ‘హౌస్ ఆఫ్ ఎస్’ అనే పబ్‌కు వెళ్లిన ఓహియోలోని భారతీయ సంతతి అమెరికన్ యువతి అంకితా మిశ్రా.. పబ్‌లోని టాయ్‌లెట్స్ గుదుల గోడలపై ఉన్న హిందూ దేవతల చిత్రాలను చూసి దిగ్భ్రాంతి చెందారు. ‘‘గత నెలలో ఫ్రెండ్స్‌తో కలిసి ‘హౌస్ ఆఫ్ ఎస్’లో నౌట్ ఔట్‌కి వెళ్లాను. ఆ పబ్‌లోని వి.ఐ.పి.ల బాత్రూమ్కి వెళ్లినపుపడు.. లోపలి గోడలపై కాళీ మాత, సరస్వతి, శివుడు, విఘ్నేశ్వరుల బొమ్మలు కనిపించాయి. షాక్ తిన్నాను’’ అని ఆనాటి తన అనుభవాన్ని చెబుతూ.. పబ్ యాజమాన్యానికి హైందవ సంస్కృతి గొప్పతనాన్ని వివరించడంతో పాటు.. ఇతర మతస్థుల మనోభావాలను కించపరచడం నాగరికత అని గానీ, కళ అని గానీ అనిపించుకోదు’’ అంటూ అంకిత పెద్ద మెయిల్ పెట్టారు. ‘స్టాండప్ యువర్సెల్ఫ్’ అనే క్యాంపెయిన్‌తో మహిళలకు దేశవ్యాప్తంగా ఒక లక్ష ‘స్టాండ్ అండ్ పీ’ (నిలుచుని మూత్రవిసర్జన చేయడానికి అనువైన) సాధనాల ఉచిత పంపిణీ.. వరల్డ్ టాయ్‌లెట్ డే సందర్భంగా నవంబర్ 19న మొదలైంది. మురికిగా ఉండే పబ్లిక్ టాయ్లెట్లో మూత్రవిసర్జనకు అవస్థలు పడుతూ ‘కూర్చోవడం’ నుంచి విముక్తి కల్పిస్తూ, ఢిల్లీ ఐ.ఐ.టి. విద్యార్థులు కనిపెట్టిన శాన్ఫీ (శానిటేషన్ ఫర్ ఫిమేల్) అనే ఈ అట్టముక్క సాధనంతో మహిళలు నిలుచునే మూత్ర విసర్జన చేయవచ్చు. త్వరలోనే మార్కెట్లోకి రానున్న ఈ శాన్ఫీలు ఒక్కోటి పది రూపాయలకే లభ్యం అవుతాయట. -
సిటీకి స్మార్ట్ వాష్‌రూమ్స్
సాక్షి, సిటీబ్యూరో : ఉచిత వైఫై, ఏటీఎం సెంటర్, సోలార్ రూఫింగ్, బయో డైజెస్టర్, ఇన్సినరేటర్లు, శానిటరీ నాప్కిన్ల విక్రయ కౌంటర్ వంటి సదుపాయాలతో ‘స్మార్ట్ వాష్‌రూమ్స్’ రానున్నాయి. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా ఇప్పటికే పలు స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టిన జీహెచ్ఎంసీ.. నగరంలోని 25 ప్రాంతాల్లో స్మార్ట్ ఇంటిగ్రేటెడ్ వాష్‌రూమ్స్ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. స్వచ్ఛభారత్ ర్యాంకింగ్‌లో ఈ సంవత్సరం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన ఇండోర్‌తో పాటు వివిధ నగరాల్లోని స్వచ్ఛ కార్యక్రమాల అమలును పరిశీలించి వచ్చిన అధికారులు ఈ స్మార్ట్ వాష్‌రూమ్స్ ఏర్పాటు చేయాలని భావించారు. తొలిదశలో ఐటీ సంస్థలు, నిపుణులు ఎక్కువగా ఉన్న శేరిలింగంపల్లి జోన్ (పాత వెస్ట్‌జోన్)లో వీటిని ఏర్పాటు చేయాల్సిందిగా మున్సిపల్ మంత్రి కేటీఆర్ సూచించారు. దీంతో ఆ దిశగా గ్రేటర్ అధికారులు ఏర్పాట్లకు సిద్ధమయ్యారు. పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ)లో భాగంగా వీటిని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చే సంస్థల కోసం బిడ్లు ఆహ్వానించనున్నారు. ఉచిత సేవలందించే ఈ స్మార్ట్ వాష్‌రూమ్‌లు పురుషులకు, మహిళలకు, దివ్యాంగులకు వేర్వేరుగా ఉంటాయి. వీటిని ఏర్పాటు చేసే సంస్థలు వాటిపై ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని పొందడంతో పాటు, జీహెచ్ఎంసీకి కూడా కొంతమేర చెల్లించాల్సి ఉంటుంది. వీటి ఏర్పాటుకు ముందుకొచ్చే సంస్థల నుంచి ఓపెన్ బిడ్లు ఆహ్వానించేందుకు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ కూడా ఆమోదం తెలిపింది. త్వరలోనే వాటి నుంచి ఆర్ఎఫ్పీ (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్) స్వీకరించి ఏజెన్సీలను ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే శిల్పారామం ఎదుట ఇటీవల లగ్జరీ వాష్‌రూమ్స్ అందుబాటులోకి తేవడం తెలిసిందే. -
దేవుళ్లు చూస్తుండటంతో...
లక్నో : యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ స్వస్థలం గోరఖ్‌పూర్. జిల్లా న్యాయస్థానం, ఐజీ కార్యాలయాలు ఉన్న రోడ్లు ఎప్పుడూ జనసందోహంతో బిజీగా ఉంటాయి. కాస్త దూరంలో టాయ్లెట్లు ఉన్నా.. దారినపోయే కొందరు మాత్రం అదే పనిగా ఆ గోడలకే మూత్ర విసర్జన చేస్తుండేవారు. ఎన్ని చర్యలు తీసుకున్నా, చివరకు పోలీస్ కాపలాను ఉంచిన నివారించలేకపోయారు. తరచూ ఈ గోడల వద్ద కొందరు చెత్త చెదారం వేయటం.. మూత్ర విసర్జన చేసేవారు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. చివరకు లేడీకానిస్టేబుళ్లను మోహరించినా ప్రయత్నం లేకపోయింది. ఈ నేపథ్యంలోనే ఓ ఆలోచన చేశారు. వెంటనే ముంబైకి చెందిన బత్వల్ అనే చిత్రకారుడికి కబురు పెట్టారు. మూత్ర విసర్జన నివారణకు కోసం ఆ గోడలపై దేవుడి బొమ్మలను చిత్రీకరించాలని అతన్ని కోరారు. దేవుళ్లు, ఇతర మతాలకు సంబంధించిన చిత్రాలు, రామాయంలోని ఘట్టాలు, ప్రముఖుల ఫోటోలతో బత్వల్ గోడలపై అందమైన పెయింటింగ్‌లు వేశాడు. ‘‘దేవుళ్లు చూస్తున్నారు.. మీ చెండాలం ఆపండి’’... అంటూ కొటేషన్లు రాసేశారు. ఈ ఆలోచన బాగా పని చేసింది. ప్రస్తుతం వాటి చుట్టు పక్కల ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండటంతోపాటు ఆయా గోడల వద్ద సెల్ఫీల కోసం జనాలు ఎగబడిపోతున్నారని గోరఖ్‌పూర్ ఐజీ మోహిత్ అగర్వాల్ చెబుతున్నారు. ఇలా బహిరంగ ప్రదేశాల్లో మల, మూత్ర విసర్జన నివారించటం కోసం చేసే యత్నం సాధారణమైన అంశమే. కానీ, యూపీ సీఎం స్వస్థలంలోనే స్వచ్ఛ భారత్ విఫలం అవుతుందన్న విమర్శలు వెల్లువెత్తగా.. స్వయంగా యోగి ఆదిత్యానాథ్ కలుగజేసుకోవాల్సి వచ్చింది. గత ఆరు నెలలుగా మున్సిపల్ అధికారులకు ఆయన అదే పనిగా ఆదేశాలు జారీ చేస్తుండటంతో.. ఏం చేయాలో తెలీక అధికారులు తలలు పట్టుకున్నారు. చివరకు ఓ సామాజిక వేత్త సాయంతో ఐజీ మోహిత్ ఈ సమస్యకు పుల్‌స్టాప్ పెట్టారు. -
ఒట్టు.. వెదికినా దొరకదు టాయ్లెట్టు
ఇది మహానగరం బాస్.. ఆకాశాన్నంటే మేడలుంటాయ్.. అద్భుతాల జాడలుంటాయ్.. హైటెక్ రోడ్లుంటాయ్.. రాత్రికి, పగలుకు తేడా తెలియని విద్యుత్ వెలుగులుంటాయ్.. అడుగడుగునా జనం.. వారి అవసరాలు తీర్చుకోవడానికి ఒక్క మరుగుదొడ్డీ కనిపించదు. రోడ్డుపై కాలు కదపలేనంతగా వాహనాల తోరణాలు.. చేసేది లేక ఆ పక్కనే కడుపు ఉబ్బరం తీర్చుకునే వారు.. ఏం చేస్తారు పాపం.. కంపును ఇంపుగా భావించి పని కానిస్తారు. ఎందుకంటే ఇది మహానగరం.. ఎల్బీనగర్ నుంచి పటాన్చెరు వరకు.. కుత్బుల్లాపూర్ నుంచి గచ్చిబౌలి వరకు.. భూతద్దం పెట్టి వెదికినా ఒక్క పబ్లిక్ టాయ్‌లెట్టూ కనిపించదు. ఇక్కడే రాష్ట్రాన్ని పాలించే నేతలుంటారు.. శాసనాలు చేసే మేధావులుంటారు.. ప్రజా అవసరాలు తీర్చే అధికారులుంటారు.. వారెవరికీ సామాన్యుడి కష్టాన్ని అర్థం చేసుకునే తీరిక లేదు. వారంతా అంతర్జాతీయ సదస్సుల నిర్వహణకు వ్యూహాలు రచిస్తుంటారు. ఐటీలో అంతర్జాతీయ ఖ్యాతినార్జించే పనిలో ఉంటారు.. సామాన్య ప్రజల కోసం రోడ్డు పక్కన టాయ్లెట్లు కట్టాలనే చిన్న ఆలోచనే రాదు. కోటి మంది జనాభా అవసరాలు తీర్చేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. సిటీని అద్భుతంగా మార్చే యంత్రాంగం ఉంది. ‘స్వచ్ఛ హైదరాబాద్’ కోసం రేయింబవళ్లు తపన పడుతుంటుంది. నగరంలో బహిరంగ మలమూత్ర విసర్జన చేస్తే శిక్ష తప్పదంటుంది. అడుగడుగునా అందమైన టాయ్లెట్లు కట్టామంటుంది. కోటిమందికి 382 మూత్రశాలలు అందుబాటులో ఉన్నాయంటుంది. ఎక్కడున్నాయంటే కాగితంపై లెక్కలు చూపిస్తారు. ఎన్ని వినియోగంలో ఉన్నాయంటే మాత్రం సమాధానం ఉండదు. ప్రస్తుతం సిటీలో ఐదు కిలో మీటర్లకు ఒక్క టాయ్‌లెట్టూ కనిపించదు. ఉన్నవాటిలోకి వెళితే.. ముక్కు పగిలే కంపుతో కళ్లు తిరిగి పడిపోవాల్సిందే. మరి సామాన్యుడి కనీస కష్టం తీర్చుకునేదెలా..! రాష్ట్ర అభివృద్ధి కోసం ఏటా లక్షన్నర కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టే నేతలు.. అందులో పైసా వంతు విదిల్చితే చాలు.. రాష్ట్ర రాజధాని నగరంలో వేలాది పబ్లిక్ టాయ్లెట్లు నిర్మించవచ్చు. సామాన్యుల కష్టాలు తీర్చవచ్చు. సాక్షి, సిటీబ్యూరో/నెట్వర్క్: సైదాబాద్ నుంచి బంజారాహిల్స్‌కు బైక్‌పై బయల్దేరిన రాజేశ్‌కు చంచల్‌గూడ దాటాక టాయ్‌లెట్‌కు వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. కనుచూపు మేరలో ఎక్కడా కనబడలేదు. బంజారాహిల్స్ చేరేంతవరకు ఎక్కడైనా కనబడతాయేమోనని రోడ్డు పక్కన వెతుకుతూనే ఉన్నాడు. ఈ క్రమంలో తృటిలో ఒక యాక్సిడెంట్ తప్పింది. ...ఈ పరిస్థితి ఒక్క రాజేశ్‌దే కాదు. నగరంలో వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లేవారు, ఇతర ప్రాంతాలనుంచి వచ్చేవారు ఎందరో ఎదుర్కొంటున్న సమస్య ఇది. జీహెచ్ఎంసీ జనాభా దాదాపు కోటి దాటగా, నగర ప్రజలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారితో సహ ప్రతిరోజూ దాదాపు 15 లక్షల మంది రోడ్లపై ప్రయాణిస్తున్నారు. వీరికి సరిపడా పబ్లిక్ టాయ్లెట్లు లేక అవస్థలు పడుతున్నారు. కిలోమీటర్ల కొద్దీ పబ్లిక్ టాయ్లెట్లు కనిపించక అల్లాడుతున్నారు. గంటలకొద్దీ ఉగ్గబట్టుకుంటుండంతో మూత్ర సంబంధ వ్యాధుల బారిన పడుతున్నారు. మహిళల పరిస్థితి మరింత దుర్భరం. షీ టాయ్లెట్లంటూ ఇటీవల కొన్నిప్రాంతాల్లో మాత్రమే ఏర్పాటు చేసినా అవి ఏమూలకూ చాలడం లేవు. ఉన్నవాటిల్లో యాభై శాతం వరకు నిర్వహణ లోపంతో దుర్గంధం వెదజల్లుతున్నాయి. దీంతో కొందరు, యూజర్ ఛార్జీలు చెల్లించలేక మరి కొందరు బహిరంగ విసర్జనకు పాల్పడుతున్నారు. జీహెచ్ఎంసీలో ఉన్న 1450 పబ్లిక్ టాయ్లెట్ల యూనిట్లతోపాటు, హోటళ్లు, పెట్రోలు బంకుల వారిని ఒప్పించి మరో 500 పైగా పబ్లిక్ టాయ్లెట్లను ప్రజలు వినియోగించుకునేలా అందుబాటులోకి తెచ్చామని జీహెచ్ఎంసీ చెబుతోంది. హోటళ్లు, పెట్రోలు బంకుల్లోని వాటిని ఉచితంగానే వినియోగించుకునే ఏర్పాట్లు చేశామంటోంది. అయితే వాటిని వినియోగించుకోవచ్చుననే బోర్డులు లేకపోవడంతో ప్రజలకు తెలియడం లేదు. దీంతో ఎక్కడ పడితే అక్కడ మల, మూత్ర విసర్జనలతో నగరం అధ్వాన్నంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ ఫీల్డ్ విజిట్ నిర్వహించగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అర కిలోమీటర్‌కో యూరినల్స్ ఎక్కడ ? ♦ స్వచ్ఛభారత్ మిషన్ మార్గదర్శకాల మేరకు ప్రతి అర కిలోమీటరుకు యూరినల్స్, కిలోమీటర్‌కు మరుగుదొడ్లు ఉండాలి. కానీ నగరంలో ఏ ఒక్క మార్గంలోనూ ఈమేరకు లేవు. ఎల్బీనగర్ నుంచి గచ్చిబౌలి వరకు, కోఠి నుంచి మియాపూర్ వరకు, మల్కాజిగిరి నుంచి చార్మినార్ వరకు మార్గదర్శకాల కనుగుణంగా లేవు. దాదాపు 5 నుంచి 10 కిలోమీటర్ల వరకు కూడా ఒక్క టాయ్‌లెట్ కూడా లేని మార్గాలెన్నో. ♦ సైదాబాద్ నుంచి బంజారాహిల్స్‌కు 12 కి.మీ.ల దూరం ఉండగా, చంచల్‌గూడ జైలు వద్ద తప్ప మరెక్కడా పబ్లిక్ టాయ్లెట్లు లేవు. ♦ సాగర్ రింగ్‌రోడ్డు నుంచి బంజారాహిల్స్‌కు వచ్చేవారికి చంపాపేట, కోఠిలో తప్ప మరెక్కడా పబ్లిక్ టాయ్లెట్లు లేవు. ♦ చాదర్‌ఘాట్ నుంచి చైతన్యపురి వరకు లేవు. దిల్సుఖ్నగర్ నుంచి కోఠివైపు వచ్చేవారికి మూసారంబాగ్, మలక్‌పేటల్లో మాత్రం ఉన్నాయి. ఇతర ప్రాంతాల్లో లేవు. ♦ ఐడీపీఎల్వద్ద పబ్లిక్ టాయ్లెట్లోకి ప్రజలు వెళ్లడానికి వీల్లేకుండా ఆటోలు అడ్డు ఉంటున్నాయి. ♦ రాయదుర్గం నుంచి గోపన్‌పల్లి వరకు, రాయదుర్గం నుంచి బీహెచ్ఈఎల్ వరకు ఉన్న పది పెట్రోల్‌బంకుల్లో ‘జీహెచ్ఎంసీ టాయ్లెట్లు’ అని ఉన్నప్పటికీ, ఎక్కడా టాయ్లెట్లను ఉచితంగా వినియోగించుకోవచ్చునని బోర్డులు లేవు. ♦ కూకట్‌పల్లిలో పెట్రోల్ బంకుల్లో ఉచిత మూత్రశాలలు ఎక్కడా లేవు. సిబ్బందికోసం ఏర్పాటు చేసినివి సైతం ప్రజలకు కనిపించడం లేదు. ♦ టోలిచౌకి చౌరస్తా వద్ద మూడు ప్రధాన బస్టాపులున్నాయి. మెహదీపట్నం, గచ్చిబౌలి, గండిపేట వైపు వెళ్లే బస్సుల్లో ప్రతి గంటకు వేలాదిమంది రాకపోకలు సాగిస్తారు. ఇంత రద్దీ ప్రాంతంలో ఎలాంటి టాయ్లెట్లు లేవు. గోల్కొండ, టోలిచౌకి, షేక్పేటల వద్ద ఒక్క షీటాయ్లెట్ కూడా లేకపోవడంతో మహిళలు అవస్థలు వర్ణనాతీతం. ♦ కుత్బుల్లాపూర్ పరిధిలోని 14 పెట్రోల్ బంకుల్లో స్వచ్ఛ టాయ్లెట్లు ఏర్పాటు చేసినప్పటికీ, రెండు చోట్ల తప్ప మిగతా ప్రాంతాల్లో నిర్వహణ లేక ప్రజలు వినియోగించుకోవడం లేదు. ♦ రాయదుర్గం, సైబరాబాద్ కమిషనరేట్, అంజయ్యనగర్, సుదర్శన్నగర్లలో స్వచ్ఛ టాయ్లెట్లు ఏర్పాటు చేసినప్పటికీ కొద్దిరోజులకే వాటిని తొలగించారు. ♦ హిమాయత్‌నగర్ ప్రధాన రహదారిలో ఒక్క టాయ్‌లెట్ కూడా లేదు. ♦ నారాయణగూడ, బషీర్‌బాగ్, కింగ్‌కోఠి పరిసర ప్రాంతాల్లో విద్యార్థులతో సహ లక్షల మంది రాకపోకలు సాగిస్తుంటారు.వీరందరికీ ఇక్కడ ఉన్న రెండు పబ్లిక్ టాయ్‌లెట్లే దిక్కు ♦ ఉప్పల్‌లో స్వచ్ఛ టాయ్లెట్లు ఉన్నప్పటికీ డబ్బులు ఇవ్వలేక గ్రామాల నుంచి వచ్చే ప్రజలు రోడ్లపైనే మూత్రవిసర్జన చేస్తున్నారు. ♦ కాప్రా సర్కిల్లోని 20 హోటళ్లు, 12 పెట్రోలు బంకుల్లో ఎక్కడా ఉచిత సదుపాయం అనే సూచికలు లేవు. ♦ కుషాయిగూడలో హోటళ్లు, పెట్రోలు బంకుల వద్ద టాయ్లెట్లను ఉపయోగించుకోవచ్చునని బోర్డులు ఏర్పాటు చేసి, కొద్దిరోజులకే తొలించారు. ♦ పాతబస్తీలోని చాంద్రాయణగుట్టనుంచి నయాపూల్ వరకు 16 పెట్రోల్బంకులుండగా, నాలుగు చోట్ల బోర్డులున్నాయి. ♦ ఎర్రగడ్డనుంచి అమీర్‌పేట వరకు ప్యారడైజ్ నుంచి బేగంపేట్ వరుణ్‌మోటార్స్ వరకు ఎలాంటి టాయ్లెట్లు లేవు. ఈ ప్రాంతంలోని ఆయా రహదారుల్లో ఏడు పెట్రోల్‌బంకులు, 30 హోటళ్లలో ఏఒక్క దాంట్లోనూ ఉచిత సదుపాయం ఉన్నట్లు బోర్డులు లేవు. ఒక వేళ వెళ్దామనుకున్నా సిబ్బంది అడ్డుపడుతున్నారని ప్రజలు వాపోతున్నారు. ♦ నేరేడ్మెట్ చౌరస్తా నుంచి ఈసీఐఎల్ రహదారి, ఆర్కేపురం రహదారి, మల్కాజిగిరి నుంచి వాజ్‌పేయి నగర్ వరకు పబ్లిక్ టాయ్లెట్లు లేవు. షేక్‌పేట్ నాలా వద్ద ఫుట్‌పాత్ పై పని కానిస్తున్న దృశ్యం నిర్వహణ లోపం..దుర్గంధ భరితం.. పబ్లిక్ టాయ్లెట్ల నిర్వహణను ప్రైవేటుకిచ్చిన జీహెచ్ఎంసీ వాటిని తనిఖీలు చేయకపోవడంతో చాలా చోట్ల కనీస సదుపాయాలు లేక, దుర్గంధంతో, వినియోగానికి వీల్లేకుండా ఉన్నాయి. తక్కువ రద్దీ ప్రాంతాల్లో నిర్వహణకు ముందుకొచ్చే వారు కూడా లేకపోవడంతో మూతపడుతున్నాయి. జరిమానాల కొరడా..! పరిస్థితులిలా ఉండగా, బహిరంగ మూత్ర విసర్జన చేస్తే జరిమానాలు విధించనున్నట్లు జీహెచ్ఎంసీ మరోమారు హెచ్చరించింది. బహిరంగ మల,మూత్ర విసర్జన ప్రదేశాలు(ఓడీఎఫ్)గా దాదాపు 1800 ప్రాంతాల్ని ప్రకటించిన జీహెచ్ఎంసీ, ఆమేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. కేంద్రం నుంచి సర్టిఫికేషన్ కోసం ఈ చర్యలకు సిద్ధమైంది. ఇక పబ్లిక్ టాయ్లెట్ల నిర్వహణపై ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు ప్రతి టాయ్‌లెట్ వద్ద ప్రత్యేకంగా ఫీడ్ బ్యాక్ బటన్ ఏర్పాటు చేస్తామని అధికారులు గతంలో ప్రకటించారు. కానీ ఎక్కడా పెట్టిన దాఖలాలు లేవు. ముంబైలో అంతస్తుల్లో .. ముంబై నగర జనాభా దాదాపు 2.30 కోట్లు ముంబైలో ప్రస్తుతం 11,170 పబ్లిక్ టాయ్‌లెట్లున్నాయి. బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) వచ్చే సంవత్సరం వీటి సంఖ్యను 18,818కి పెంచేందుకు సిద్ధమైంది. ఇందుకుగాను దాదాపు రూ. 376 కోట్లు ఖర్చు చేయనున్నారు. స్థలాభావంతో రెండు, మూడు అంతస్తుల్లో వీటిని నిర్మించాలని ప్రతిపాదించారు. ♦ మొత్తం 307 పబ్లిక్ టాయ్లెట్లలో 1450 యూనిట్లున్నాయి. ♦ వీటిల్లో యూరినల్స్‌కు రూ.2, మరుగుదొడ్లకు రూ. 5 నుంచి రూ. 7 వరకు చార్జీలు వసూలు చేస్తున్నారు. ♦ సౌత్‌జోన్ పరిధిలోకి వచ్చే పాతబస్తీ కేవలం 25 పబ్లిక్ టాయ్‌లెట్లే ఉన్నాయి. ♦ పెట్రోలు బంకులు : 469 ♦ టాయ్లెట్ల వినియోగానికి అంగీకరించినవి: 259 ♦ టాయ్‌లెట్ సదుపాయాలున్న హోటళ్లు : 900 ♦ వినియోగానికి అంగీకరించినవి :257 + ఆయా నగరాల జనాభా, పబ్లిక్ టాయ్లెట్ల యూనిట్లు దాదాపుగా.. ♦ ఢిల్లీ జనాభా : 2.70 కోట్లు ♦ పబ్లిక్ టాయ్లెట్లు : 5776 ♦ ముంబై జనాభా : 2.30 కోట్లు ♦ పబ్లిక్ టాయ్లెట్లు : 11,170 ♦ చెన్నయ్ జనాభా: 1.01 లక్షలు ♦ పబ్లిక్ టాయ్లెట్లు: 900 ♦ హైదరాబాద్ జనాభా: 1.02 కోట్లు ♦ పబ్లిక్ టాయ్లెట్లు : 1450 ప్రజల్లో పరివర్తన రావాలి పబ్లిక్ టాయ్లెట్లు లేనందునే బహిరంగ మూత్ర విసర్జన అనేది ఒక సాకు మాత్రమే. చాలా చోట్ల ఉన్న వాటిని వినియోగించుకోవడం లేదు. ప్రజల్లో మార్పు రానంత వరకు ఏమీ చేయలేం. కొందరి చేష్టల వల్ల ఎందరో ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నవాటిని వినియోగించుకోకుండా నిందలు వేయడం తగదు. పెట్రోలు బంకులు, హోటళ్ల వారిని ఒప్పించి టాయ్లెట్లను వినియోగించుకునే అవకాశం కల్పించాం. టాయ్లెట్ల అటెండెంట్లు శుభ్రంగా ఉండేందుకు దాదాపు 600 మందికి రెండు జతల తెల్లని దుస్తులు, టోపీ, బూట్లను సీఎస్సార్ ద్వారా పంపిణీ చేశాం. నిర్వహణపై శ్రద్ధ తీసుకుంటూ, తనిఖీలు నిర్వహిస్తున్నాం. యూజర్‌చార్జీలు చెల్లించలేని వారి కోసం విరాళాలిచ్చే వారిని ఆహ్వానిస్తున్నాం. తద్వారా ఉచిత సదుపాయం కల్పిస్తున్నాం. – డా.బి.జనార్దన్‌రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ -
అత్యవసరమా.. గూగుల్ మ్యాప్స్ వెతకండి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో బయటకెళ్లేవారు అవసరమైనప్పుడు పబ్లిక్ టాయ్లెట్లు కనిపించక పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. నగర ప్రజలతోపాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే టూరిస్టులకూ ఇదే దుస్థితి. నగరంలో ప్రజలకు అవసరమైనన్ని పబ్లిక్ టాయ్లెట్లు లేకపోవడమే కాక, ఉన్నవాటి గురించి కూడా తెలియకపోవడంతో పడుతున్న ఇబ్బందులెన్నో. ఈ దుస్థితి నివారించి ప్రజలకు తామున్న ప్రదేశానికి ఎంత దూరంలో పబ్లిక్ టాయ్‌లెట్ ఉందో తెలుసుకునే సదుపాయాన్ని జీహెచ్ఎంసీ అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి గూగుల్ మ్యాప్స్‌లో జియోమ్యాపింగ్ చేయించింది. దీంతో ప్రజలకు తామున్న ప్రదేశం నుంచి పబ్లిక్/కమ్యూనిటీ టాయ్‌లెట్ ఎంత దూరంలో ఉందో రూట్‌మ్యాప్‌తో సహా ఎన్ని నిమిషాల్లో చేరుకోవచ్చో కూడా తెలుస్తుంది. మొబైల్ ఫోన్లో గూగూల్ మ్యాప్స్‌లోకి వెళ్లి స్వచ్ఛ్ పబ్లిక్ టాయ్‌లెట్ (swachh public toilet)అని టైప్ చేస్తే వివరాలు కనిపిస్తాయని జీహెచ్ఎంసీ పేర్కొంది. -
రాత్రి పూట టాయ్‌లెట్ రాకూడదా!
సాక్షి, న్యూఢిల్లీ : ‘టాయ్‌లెట్ ఏక్ ప్రేమ్ కథా’ చిత్రంలోని స్ఫూర్తి ఏమిటో దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు అర్థం కాకపోయి ఉండవచ్చు. అందులోని టాయ్‌లెట్ ప్రాధాన్యత గురించి, దాని అవసరం 24 గంటలపాటు ఉంటుందన్న విషయమైనా అర్థం కావాలి. అది అర్థమైతే ఢిల్లీలోని అన్ని పబ్లిక్ టాయ్లెట్లను రాత్రి 9 గంటలకే మూసివేస్తారు. రాత్రి పూటి వాటి అవసరం మనిషికి ఉండదనా, ఉండకూడదనా? అందరు ఒకే వేళల్లో పనిచేసి, అందరూ ఒకే వేళల్లో నిద్రించే పరిస్థితి ఉన్న పల్లెల్లో అది సాధ్యమేమోగానీ 24 గంటలపాటు జీవన చక్రం తిరిగే ఢిల్లీ లాంటి మెట్రో నగరాల్లో అదెలా సాధ్యం! దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ జాతిపిత మహాత్మా గాంధీ పుట్టిన రోజైన అక్టోబర్ రెండవ తేదీన తన పరిధిలోని మున్సిపల్ ప్రాంతాన్ని బహిరంగ విసర్జన నుంచి విముక్తి పొందిన ప్రాంతంగా ప్రకటించుకుంది. మరి ఆ పరిస్థితి కనిపిస్తుందా! రాత్రిపూట ఏరులై పారుతున్న బహిరంగ మూత్ర విసర్జన తాలూకు ఛాయలు మరుసటి రోజు మిట్ట మధ్యాహ్నం వరకు కూడా కనిపిస్తున్నాయి. వ్యక్తిగత మరుగుదొడ్లు ప్రాంతాల్లో 700 బహిరంగ మరుగుదొడ్లు కట్టించామని, 500 అడుగులకు ఒకటి చొప్పున 25 మొబైల్ మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేశామని మున్సిపల్ కార్పొరేషన్ గర్వంగా చెప్పుకుంది. ఇంతవరకు బాగానే ఉంది. అయితే వాటిలో ఎక్కువ మరుగు దొడ్లకు సీవరేజి కాల్వలకు కనెక్షన్లు ఇవ్వలేదు. ఇక మొబైల్ టాయ్లెట్ల విషయం మరింత దారుణంగా ఉంది. వాటిని తీసుకొళ్లి ఓ లోతైన గోతిలో పోస్తున్నారు. పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలనే సదుద్దేశంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన స్వచ్ఛ భారత్ స్కీమ్ కింద టాయ్లెట్ల నిర్మాణ పథకాన్ని తీసుకొస్తే కార్పొరేషన్ మరుగుదొడ్లతో పరిసర ప్రాంతాలను చెడగొడ్తున్నారు. ప్రజల అవసరాలను పట్టించుకోకుండా రాత్రి 9 గంటలకే మరుగుదొడ్లను మూసివేస్తే ఎలా అని మున్సిపల్ అధికారులను ప్రశ్నించగా, శానిటేషన్ సర్వీస్‌ను కాంట్రాక్టుకు తీసుకున్న బీవీజీ కంపెనీ రాత్రిపూట సర్వీసుకు ముందుకు రావడం లేదని చెప్పారు. ఉదయం ఐదు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, ఒంటి గంట నుంచి రాత్రి 9 గంటల వరకు రెండు షిప్టుల్లోనే కార్మికులను పంపిస్తున్నారని, రాత్రి షిప్టుకు పంపించడం లేదని చెప్పారు. రాత్రిపూట అల్లరి మూకలు తాగి గొడవ చేస్తాయన్న కారణంగా వీటిని మూసి ఉంచుతున్నట్లు తెలిపారు. ఇదంతా నిజమే కావచ్చు. పోలీసు భద్రతను తీసుకొనైనా వీటి సర్వీసులను కొనసాగించడం అధికారుల విధి. రాత్రి పూట కూడా శానిటేషన్ సర్వీసులను అందించే కంపెనీలకు కాంట్రాక్టు ఇవ్వడం కూడా వారి బాధ్యత. ఎక్కువ వరకు ఈ ప్రభుత్వ మరుగుదొడ్లు మురికి వాడల్లో ఉన్నాయి. రాత్రి పూట వీటి బాధ్యతను స్వీకరించేందుకు స్థానిక యువకులు ముందుకువస్తే వారికి అప్పగిస్తామని మున్సిపల్ అధికారులు అంటున్నారు. అసలే మురికి వాడల్లో బతికే బడుగు జీవులు. స్వచ్ఛంద సేవకు ముందుకు రమ్మంటే ఎలా వస్తారు. వారికి నెలసరి జీతం కింద ఉపాధి కల్పిస్తే తప్పకుండా ముందుకు వస్తారు. -
హలో కమిషనర్
నేడు ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఫోన్ ఇన్ ►ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ►తడి–పొడి చెత్త విడాకులు, పారిశుధ్యం హైదరాబాద్ వివిధ రంగాల్లో ప్రపంచస్థాయి నగరాల సరసన నిలుస్తున్నప్పటికీ, వివిధ అంశాల్లో అగ్రస్థానంలో ఉంటున్నప్పటికీ, చెత్త–స్వచ్ఛతకు సంబంధించి సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది. ఇందులో భాగంగా ఇంటింటికీ రెండు రంగుల చెత్తడబ్బాల పంపిణీ, చెత్త తరలింపునకు ఆటోటిప్పర్లు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త లేకుండా చర్యలు, పబ్లిక్ టాయ్లెట్ల పెంపు, షీ టాయ్లెట్లు, డ్రై రిసోర్స్ సెంటర్లు, సీఆర్పీల ఏర్పాటు,తదితర చర్యలెన్నో తీసుకున్నప్పటికీ ఇంకా బహిరంగంగా చెత్త కనిపిస్తూనే ఉంది. ఇళ్ల నుంచి తడి, పొడి చెత్త వేరు కావడం లేదు.. నగరం స్వచ్ఛంగా కనిపించడం లేదు. స్వచ్ఛ భారత్ మిషన్ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 5న దేశంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో ఇళ్లనుంచి తడి,పొడి చెత్తను వేరుచేసే కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ దిశగా ఇప్పటికే చర్యలు చేపట్టిన జీహెచ్ఎంసీ.. మరింత ముందుకెళ్తూ, మరింత విస్తృతంగా ఈనెల 5నుంచే శ్రీకారం చుడుతోంది. ఈ నేపథ్యంలో చెత్తను వేరుచేయడం, పారిశుధ్య కార్యక్రమాల అమలు, తదితర అంశాల గురించి ప్రజల సందేహాలు నివృత్తి చేసేందుకు, ప్రజల సూచనలు స్వీకరించేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి అంగీకరించారు. ‘సాక్షి’ ఆధ్వర్యంలో మీ అభిప్రాయాల్ని కమిషనర్‌తో ‘ఫోన్ ఇన్’ ద్వారా పంచుకోండి. గ్రేటర్ హైదరాబాద్‌ను స్వచ్ఛ హైదరాబాద్‌గా మార్చడంలో మనందరం భాగస్వాములవుదాం.. స్వచ్ఛహైదరాబాద్ సాధిద్దాం! ఒక్క ఫోన్‌కాల్‌తో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. -
నగరంలో బయోటాయిలెట్లు
పేదలు నివసించే ప్రాంతాల్లో ఏర్పాటుకు ప్రయత్నం కార్పొరేషన్, రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా చర్యలు నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధం విజయవాడ : నగరంలో పేదలు నివసించే మురికివాడలు, కొండప్రాంతాల్లో పారిశుధ్య సమస్య తీవ్రంగా ఉంది. మరుగుదొడ్లు లేక మహిళలు, వృద్ధులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని) కొండ ప్రాంతాలు, మురికివాడల్లో పర్యటించినప్పుడు అనేక మంది మరుగుదొడ్ల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. పబ్లిక్ టాయిలెట్లు ఉన్నప్పటికీ, వాటికి అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ సమస్యలు ఏర్పడుతున్నాయని పలువురు తెలిపారు. నీరు వెళ్లే పైపులైన్లు సరిగా లేకపోవడంతో మరుగుదొడ్లు నిరుపయోగంగా మారుతున్నాయని, సొంత ఇళ్లలో సెప్టిక్ ట్యాంకును నిర్మించుకున్నా, వాటిని శుభ్రం చేయించుకోవడం కష్టమవుతోందని పేదలు వివరించారు. తప్పని పరిస్థితుల్లో బహిర్భూమికి వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. బయో టాయిలెట్స్‌పై దృష్టి.. డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేని ప్రదేశాల్లో ఉపయోగించుకునే విధంగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) బయో టాయిలెట్లను తయారు చేసింది. వీటిని ఇప్పటికే దేశ రక్షణ రంగంలో ఉపయోగిస్తున్నారు. శబరిమలతో పాటు కేరళలోని అనేక పట్టణాల్లో ఉపయోగిస్తున్నారు. ఇదే తరహాలో దేశంలో బయో టాయిలెట్ల ఉపయోగం పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్వచ్ఛ భారత్ కింద బయో టాయిలెట్లు నిర్మించేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నిధులను కూడా మంజూరుచేస్తోంది. దీంతో నగరపాలక సంస్థ, రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు తన నియోజకవర్గ పరిధిలో మురికివాడల్లో బయో టాయిలెట్లు ఏర్పాటుచేయించాలని ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని) భావిస్తున్నారు. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేయడంతోపాటు వీటిని ఏర్పాటు చేసేందుకు సదరు కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. బయోటాయిలెట్లు ఉపయోగించడం ఇలా.. బయోటాయిలెట్లో కింద భాగంలో బయో డెజైస్టర్(ట్యాంక్)ను ఏర్పాటుచేస్తారు. ఇందులో మల వ్యర్థాలను తినే బ్యాక్టిరియాను ఉంచుతారు. టాయిలెట్‌ను ఉపయోగించినప్పుడు వచ్చే మలవ్యర్థాలను బ్యాక్టీరియా స్వీకరించడమే కాకుండా నీరు వాసన రాకుండా శుభ్రం చేస్తాయి. ఈ నీటిని సైడ్ కాల్వలోకి వదిలివేసినా ఏ విధమైన ఇబ్బందులు రావు. బయోటాయిలెట్‌లలో ఉపయోగించే బ్యాక్టీరియాను డీఆర్డీవోనే పంపిణీ చేస్తుంది. బయోటాయిలెట్లను తరచూ శుభ్రం చేయాల్సిన అవసరం ఉండదని వీటి తయారీదారులు చెబుతున్నారు. బయోటాయిలెట్ల వల్ల పర్యావరణ సమస్యలు ఉత్పన్నం కావని, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ అవసరం లేదని తెలిపారు. కార్పొరేట్ కంపెనీల సహాయం ఒకేచోట నాలుగైదు బయోటాయిలెట్లు నిర్మించేందుకు రూ.15లక్షల వరకూ ఖర్చు అవుతుంది. వీటిని రోజు కనీసం 200 నుంచి 300 మంది వినియోగించవచ్చు. బయోటాయిలెట్ల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోపాటు కార్పొరేట్ కంపెనీల సహాయం తీసుకోవాలని ఎంపీ కేశినేని నాని భావిస్తున్నారు. ఈ టాయిలెట్లను అందంగా తయారుచేయిస్తే వాటిపై వ్యాపార ప్రకటనలు వేసుకునే సౌకర్యం కల్పిస్తే దాని వల్ల ఆదాయం వస్తుంది. తొలుత నాలుగైదు చొట్ల 50 వరకు బయోటాయిలెట్లను ప్రయోగాత్మకంగా ఏర్పాటుచేయాలని ఎంపీ భావిస్తున్నారు. ఆ తర్వాత పరిశీలించి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కనీసం వెయ్యి బయోటాయిలెట్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కార్యరూపం దాల్చని ‘నమ్మ’ టాయిలెట్లు జనసమ్మర్థంగా ఉండే ప్రదేశాల్లో టాయిలెట్ల సమస్యను పరిష్కరించేందుకు తమిళనాడు ప్రభుత్వం ‘నమ్మ’ టాయిలెట్స్‌ను ఏర్పాటుచేసింది. వీటిని పరిశీలించిన నగరపాలక సంస్థ అధికారులు బందరురోడ్డులోని రాఘవయ్య పార్కు వద్ద నమ్మ టాయిలెట్లు ఏర్పాటుచేయాలని పనులు ప్రారంభించారు. అయితే దీనికి యూజీడీ సమస్యతోపాటు సెప్టిక్ ట్యాంకు ఏర్పాటుచేయాల్సి రావడంతో పనులు అర్ధంతరంగా నిలిపివేశారు. ఇటువంటి చోట కూడా బయో టాయిలెట్లు ఉపయోగపడతాయని తయారీదారులు చెబుతున్నారు. వీటిని నగర పాలకసంస్థ అధికారులు కూడా పరిశీలిస్తున్నారు.