తాను ఎదుర్కొన్న కష్టాన్ని మరెవరూ పడకూడదని కోరుకునే పెద్దమనసు ఇర్ఫానా జర్గర్‌ది. అది 2014 శ్రీనగర్‌లో ఉన్న అత్యంత రద్దీ బజారులో నడుచుకుంటూ వెళ్తోంది ఇర్ఫానా. సడెన్‌గా ఆమెకు నెలసరి (పీరియడ్స్) బ్లీడింగ్ అవ్వడం మొదౖలñ ంది. ఆ సమయంలో తన దగ్గర శానిటరీ ప్యాడ్‌లు లేవు. కొనుకుందామనుకున్నా డబ్బులు లేవు. దీంతో దగ్గర్లో ఉన్న పబ్లిక్ టాయిలñ ట్‌కు వెళ్లింది. అక్కడ కూడా ఆమెకు ఏమీ దొరకలేదు. దీంతో ఇంటికి వెళ్లేంత వరకు తీవ్రంగా ఇబ్బందికి గురైంది. ఆరోజు ఇర్ఫానా పడిన ఇబ్బందిని మరే అమ్మాయి పడకూడదని శ్రీనగర్‌లోని పబ్లిక్ టాయిలెట్లలో శానిటరీ న్యాప్‌కిన్స్‌ను ఉచితంగా అందిస్తోంది ఇర్ఫానా.
అమ్మాయిలు, మహిళలు నెలసరి సమయంలో శారీరకంగా, మానసికంగా ఇబ్బందికి గురవుతుంటారు. ఇక నలుగురిలోకి వెళ్లాల్సి వచ్చినప్పుడు దృష్టి అంతా వెనుకాల ఎక్కడ మరకలు అంటుకున్నాయో? అని పదేపదే చూసుకుంటుంటారు. అది ప్రకృతి సిద్ధంగా జరిగే ప్రక్రియే అయినా ఇప్పటికీ అమ్మాయిలు దానికి గురించి మాట్లాడానికి కూడా సిగ్గుపడుతుంటారు. ఈ ధోరణి మార్చాలన్న ఉద్దేశ్యంతోనే ‘ఇవ సేఫ్టీ డోర్’ కిట్ కార్యక్రమాన్ని ఇర్ఫానా చేపట్టింది.
కాంట్రాక్ట్ ప్రాతిపదికన శ్రీనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో హెల్పింగ్ అసిస్టెంట్ గా పనిచేస్తోన్న ఇర్ఫానా... నెల జీతంలో ఐదువేల రూపాయలను పొదుపు చేసి , వాటితో శానిటరీ ప్యాడ్స్ కొని నిరుపేదలకు ఉచితంగా అందిస్తోంది. ఇలా ఇప్పటిదాకా 20 వేలకు పైగా శానిటరీ ప్యాడ్స్ ఇచ్చింది. శానిటరీ న్యాప్‌కిన్స్, ప్యాంటీస్, హ్యాండ్ వాష్, బేబీ డయపర్స్‌తో కూడిన ‘ఇవ సేఫ్టీ డోర్’ కిట్‌ను పబ్లిక్ టాయిలెట్లలో ఉంచుతోంది. అత్యవసరంలో ప్యాడ్‌లు అవసరమైన మహిళలు ఎటువంటి టెన్షన్ పడకుండా వీటిని వాడుకునేలా పబ్లిక్ లేడీస్ టాయిలెట్స్‌లో అందుబాటులో ఉంచుతోంది. శ్రీనగర్‌లోని దాదాపు అన్ని పబ్లిక్ టాయిలెట్లలో ఇవ ప్యాడ్స్ కనిపిస్తాయి. వివిధ గ్రామాల నుంచి నగరానికి వచ్చే మíß ళలకు ఇవి ఉపయోగపడుతున్నాయి.
సమాజానికి ఏదైనా చేయాలన్న మనస్తత్వం ఇర్ఫానాది. తనకి 21 ఏళ్లు ఉన్నప్పుడు తన తండ్రి హార్ట్ ఎటాక్‌తో మరణించారు. దీంతో తను చదువుకుంటూనే, కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు... మున్సిపల్ కార్పొరేషన్లో ఉద్యోగంలో చేరింది. తన జీతంలో కొంత మిగుల్చుకుని ఉచితంగా ప్యాడ్‌లు అందించే కార్యక్రమాన్ని చేపట్టింది. కరోనా సమయంలోనూ ఆసుపత్రులలో ప్యాడ్స్‌ను ఉచితంగా అందించింది. ఈ సమయంలో చాలామంది ఇర్ఫానాకు కాల్స్ చేసి శానిటరీ న్యాప్‌కిన్స్, కిట్స్ ఇవ్వమని అడిగితే వారికి పంపించేది. నిరుపేదలు, నిరక్షరాస్య మహిళలకు శానిటరీ ప్యాడ్స్ ప్రాముఖ్యత వివరిస్తూ, మెన్‌స్ట్రువల్ హైజీన్‌పై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తోంది.ఈ మొత్తానికి ఎవరి సాయం లేకుండా తన సొంత డబ్బులను వాడడం విశేషం. ఇర్ఫానా చేస్తోన్న పని గురించి తెలిసిన వారంతా అభినందిస్తున్నారు.
‘‘నేను ఈ పనిచేయడానికి ప్రేరణ మా నాన్నగారే. షాపుల నుంచి మా నాన్న గారే శానిటరీ ప్యాడ్స్ కొని తెచ్చి నాకు ఇబ్బంది లేకుండా చూసేవారు. అందుకే నాన్న మరణించాక ఆయన గర్వపడేలా ఏదైనా చేయాలనుకున్నాను. ఈ క్రమంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. కొన్నిసార్లు పీరియడ్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇంటికి దూరంగా బయట ఎక్కడో ఉన్నప్పుడు సడెన్‌గా మొదలవుతుంది. ఆ సమయంలో మన దగ్గర ప్యాడ్ లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ సమయంలో ఈ ప్యాడ్‌లు బాగా ఉపయోగపడుతాయి’’ అని ఇర్ఫానా చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment