తప్పుదారి చూపిన గూగులమ్మ..
బురదలోకి దూసుకెళ్లిన కారు..
అన్నానగర్: గూగుల్ మ్యాప్స్‌పై ఆధారపడి పళని మురుగన్ ఆలయానికి బయలుదేరారు. ఈక్రమంలో డాక్టర్ దంపతులు కారు సహా బురదలో చిక్కుకున్నారు. వివరాలు.. ధర్మపురి జిల్లా నల్లంపల్లి ప్రాంతానికి చెందిన పళనిసామి (27). ఇతని భార్య కృతిక (27). ఇద్దరూ డాక్టర్లే. ఈ దంపతులకు 4 నెలల బాబు ఉన్నాడు. కృతిక తమ్ముడు పావేందర్ (25). ఇతను కూడా డాక్టర్. పళనిసామి తన కుటుంబంతో సహా పళని మురుగన్ ఆలయానికి వెళ్లి సామిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఆదివారం రాత్రి భార్య, 4 నెలల పాప, బావమరిదితో కలిసి ధర్మపురి నుంచి పళనికి కారులో బయలుదేరాడు. కారును వావేందర్ డ్రైవ్ చేశాడు. శ్రీగూగుల్ మ్యాప్‌శ్రీ సాయంతో ధర్మపురి నుంచి పళని వైపు వస్తున్నారు. కారు కరూర్–దిండుక్కల్ నాలుగు లైన్ల హైవేపైకి వచ్చింది. సోమవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో వేడచందూర్ సమీపంలోని తమ్మనంపట్టి ప్రాంతంలో కారు ఫ్లై ఓవర్ దాటింది.
నాలుగు లేన్ల రహదారిని తప్పించి కుడివైపున లింక్ రోడ్డులా ఉన్న మట్టిరోడ్డుపై తిరిగి వెళ్లాలని శ్రీగూగుల్ మ్యాప్‌శ్రీ సూచించినట్లు తెలుస్తోంది. ఇది నమ్మిన బావేందర్ కూడా కారును కుడివైపునకు తిప్పి నాలుగు లైన్ల రోడ్డును వదిలి మట్టిరోడ్డుపైకి వెళ్లాడు. ఈ క్రమంలో కారు ఒక్కసారిగా బురదలో చిక్కుకుంది. అనంతరం వేడచందూర్ అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. వారి సహాయంతో బురదలో కూరుకుపోయిన కారును రోడ్డుపైకి తీసుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment