గూగుల్ మ్యాప్స్ ఎప్పటికప్పుడు తన యూజర్స్ కోసం కొత్త కొత్త సేవలను ప్రవేశపెడుతుంది. తాజాగా మరో కొత్త ఫీచర్ ని యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. వచ్చే ఐదేళ్లలో భారతదేశం ఇంటర్నెట్ వినియోగించే జనాభా సంఖ్య 75 శాతం నుంచి 90 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. దింతో వినియోగదారులు తమ ఇష్టపడే ప్రదేశాల పేర్లను ప్రాంతీయ భాషలో సెర్చ్ చేసినప్పుడు కూడా ఆ ప్రదేశానికి సంబంధించిన సమాచారం సులభంగా తెలుసుకోవచ్చు గూగుల్ తెలిపింది. మ్యాప్స్ ఉపయోగించేప్పుడు వీధులు, ఇతర ప్రాంతాల పేర్లను 10 ప్రాంతీయ భాషల్లో తర్జుమా చేసి చూపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ హిందీ, బెంగాలీ, మరాఠీ, తెలుగు, తమిళం, గుజరాతీ, కన్నడ, మలయాళం, పంజాబీ, ఒడియా వంటి 10 భాషల్లో అందుబాటులో ఉంది. దీని కోసం యూజర్స్ గూగుల్ మ్యాప్స్ యాప్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్లి నచ్చిన భాషను సెట్ చేసుకోవచ్చు. ఇప్పటికే చాలా వరకు ప్రముఖ ప్రదేశాలకు ప్రాంతీయ భాషల్లో పేర్లు వచ్చేలా మార్పులు చేశారు.(చదవండి: రూ 1.8లక్షలు ఖరీదైన సోనీ మొబైల్ విడుదల)
Comments
Please login to add a commentAdd a comment