సీఎం కంటే ముందున్న గూగుల్! | google goes ahead of delhi chief minister in naming road | Sakshi

సీఎం కంటే ముందున్న గూగుల్!

Published Thu, Sep 3 2015 3:15 PM | Last Updated on Mon, Aug 20 2018 3:02 PM

సీఎం కంటే ముందున్న గూగుల్! - Sakshi

సీఎం కంటే ముందున్న గూగుల్!

దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంకు ఘనంగా నివాళులు అర్పించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భావించారు. కానీ ఆయన కంటే గూగుల్ ఓ అడుగు ముందుంది.

దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంకు ఘనంగా నివాళులు అర్పించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భావించారు. ఆయన స్మృత్యర్థం ఢిల్లీలో ఉన్న ఔరంగజేబ్ రోడ్డు పేరును ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డుగా మార్చాలని భావించారు. ఈ విషయాన్ని ముందే ప్రకటించారు. అయితే, గూగుల్ సంస్థ మాత్రం ఆయన కంటే ఒక అడుగు ముందే ఉంది.

ఇంతకుముందు ఢిల్లీలో ఉన్న ఔరంగజేబ్ రోడ్డు పేరును ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డుగా ముందుగానే తన గూగుల్ మ్యాప్స్లో మార్చేసింది. ఈ మేరకు గూగుల్ మ్యాప్స్లో చూస్తే.. దాని పేరు అబ్దుల్ కలాం రోడ్డుగా ఉంది. ఈ విధంగా దివంగత మాజీ రాష్ట్రపతి కలాంకు గూగుల్ నివాళులు అర్పించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement