మ్యాప్స్‌లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్
గూగుల్ మ్యాప్స్‌ను, మొబైల్ సెర్చ్‌లను మరింత సులభతరం చేసేందుకు గూగుల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫీచర్‌ను లాంచ్ చేసింది. యూజర్లు వారు వెళ్లాలనుకుంటున్న ప్రదేశ సమాచారం గురించి తెలుసుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడనుంది. గూగుల్ మ్యాప్స్ లేదా మొబైల్ సెర్చ్‌లో యూజర్లు తేలికగా లొకేషన్‌ను సెర్చ్ చేసి, ప్రదేశాల గురించి ప్రశ్నలు అడగవచ్చు లేదా సమాధానం చెప్పొచ్చు లేదా ఇప్పటికే కలిగి ఉన్న ప్రశ్నాసమాధాలను చెక్ చేసుకోవచ్చని గూగుల్ తెలిపింది.
ఎక్కువ ఓటు వేసిన ప్రశ్నలు, సమాధానాలు ఈ సెక్షన్‌లో టాప్‌లో కనిపిస్తాయి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెక్షన్‌లో ఉన్న సమాచారమంతా అత్యంత కచ్చితమైనదని, అవసరమయ్యే స్థానిక సమాచారం ఇచ్చేలా ఉంటామని గూగుల్ తెలిపింది. తరుచు అడిగే ప్రశ్నలు, సమాధానాలను వ్యాపార యజమానులు దీనిలో జతచేర్చవచ్చని పేర్కొన్నారు. ఒక ప్రదేశం గురించి యూజర్లు ప్రశ్నిస్తే, వెంటనే గూగుల్ ఈ విషయాన్ని వ్యాపార యజమానికి లేదా సమాచారం అందించే ఇతర యూజర్లకు నోటిఫై చేస్తుంది. వారు తమ సమాధాన రూపంలో యూజర్లకు సమాధానాన్ని అందించవచ్చు.