గూగుల్‌ మ్యాప్స్‌లో డైనింగ్‌ ఆఫర్లు | Google Maps Updated Shown Hotel Dining Offers | Sakshi
Sakshi News home page

గూగుల్‌ మ్యాప్స్‌లో డైనింగ్‌ ఆఫర్లు

Published Fri, Jul 12 2019 1:29 PM | Last Updated on Fri, Jul 12 2019 1:29 PM

Google Maps Updated Shown Hotel Dining Offers - Sakshi

న్యూఢిల్లీ: భారతీయ యూజర్స్‌ కోసం గూగుల్‌ మ్యాప్స్‌ తాజాగా మరో మూడు ఫీచర్స్‌ ప్రవేశపెట్టింది. 11 నగరాల్లోని స్థానిక హోటళ్లలో డీల్స్‌ను తెలుసుకునేందుకు ఉపయోగపడే ఆఫర్‌ ఫీచర్‌ వీటిలో ఉంది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పుణె మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. ఈజీడైనర్‌ సంస్థతో కలిసి ’ఆఫర్‌’ ఫీచర్‌ అందిస్తున్నట్లు గూగుల్‌ వెల్లడించింది. దీనితో 4,000 పైచిలుకు రెస్టారెంట్స్‌లో ఆఫర్స్‌ గురించి తెలుసుకోవచ్చు. ఎక్స్‌ప్లోర్‌ ట్యాబ్‌లో ఆఫర్స్‌ షార్ట్‌కట్‌ను క్లిక్‌ చేయడం ద్వారా ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. దీని కింద గురువారం మొదలు 15 రోజుల దాకా 1,500 పైచిలుకు రెస్టారెంట్లలో ఈజీడైనర్‌ ప్రత్యేక ప్రైమ్‌ ఆఫర్స్‌ను, కనీసం 25 శాతం డిస్కౌంట్‌ను కచ్చితంగా పొందవచ్చని గూగుల్‌ వివరించింది. ఇక దేశీ యూజర్స్‌ అభిరుచులకు అనుగుణంగా ఎక్స్‌ప్లోర్‌ ట్యాబ్‌ను తీర్చిదిద్దామని, ఇందులో కొత్తగా రెస్టారెంట్లు, పెట్రోల్‌ బంకులు, ఏటీఎంలు మొదలైన ఏడు విభాగాల షార్ట్‌కట్స్‌ చేర్చామని పేర్కొంది. అలాగే కొత్తగా ప్రవేశపెట్టిన ’ఫర్‌ యూ’ ట్యాబ్‌ ద్వారా కొత్త రెస్టారెంట్లు, వార్తల్లో ఉన్న ప్రదేశాలు, యూజర్ల అభిరుచులకు అనుగుణంగా అందించే సిఫార్సులను పొందవచ్చని గూగుల్‌ పేర్కొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement