పారిస్: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు టెక్ దిగ్గజం గూగుల్ ఆయా దేశాల ప్రభుత్వాలకు సహాయ పడేందుకు సిద్ధమవుతోంది. గూగుల్ సాఫ్ట్‌వేర్ వాడుతున్న ఫోన్ల ద్వారా వినియోగదారులు ఎక్కువగా తిరుగుతున్న ప్రాంతాల సమాచారం సేకరించి, దాన్ని ఒక వెబ్‌సైట్ ద్వారా బయట పెట్టనున్నట్లు గూగుల్ మ్యాప్స్ అధినేత జెన్ ఫిడ్జ్ పాట్రిక్ తెలిపారు. దాదాపు 131 దేశాల్లోని వినియోగదారుల కదలికలకు సంబంధించిన సమాచారాన్ని వెబ్‌సైట్ లో ఉంచనున్నట్లు వెల్లడించారు. అయితే ఇదంతా కేవలం ఒక నిర్ణీత ప్రాంతానికి వచ్చిన వారి సంఖ్య కేవలం పర్సంటేజ్ రూపంలో మాత్రమే ఉంటుందని తెలిపారు. కచ్చితంగా ఎంత మంది వచ్చారనే సంఖ్య ఉండదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment