
న్యూఢిల్లీ: కేబుళ్లు, వైర్ హార్నెస్ అసెంబ్లీల తయారీ కంపెనీ డీసీఎక్స్ సిస్టమ్స్ పబ్లిక్ ఇష్యూ విజయవంతమైంది. ఇష్యూ చివరి రోజు బుధవారానికల్లా దాదాపు 70 రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్ అయ్యింది. ఇష్యూలో భాగంగా 1.45 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా.. 101.27 కోట్ల షేర్లకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. వెరసి షేరుకి రూ.197-207 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా రూ.500 కోట్లు సమీకరించింది. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 61.8 రెట్ల అధిక స్పందన లభించింది.