Subscribed
-
ఆర్కియన్ కెమ్ ఐపీవో సక్సెస్
న్యూఢిల్లీ: స్పెషాలిటీ మెరైన్ రసాయనాల తయారీ కంపెనీ ఆర్కియన్ కెమికల్స్ పబ్లిక్ ఇష్యూ విజయవంతమైంది. రూ. 386–407 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూకి 32 రెట్లు అధిక స్పందన లభించింది. కంపెనీ 1.99 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచగా.. 64.31 కోట్లకుపైగా షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల నుంచి 49 రెట్లు, సంపన్న వర్గాల నుంచి 15 రెట్లు అధికంగా బిడ్స్ లభించగా.. రిటైల్ ఇన్వెస్టర్లు సైతం 10 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. 11న ముగిసిన ఇష్యూ ద్వారా రూ. 1,462 కోట్లకుపైగా సమకూర్చుకుంది. సోమవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 658 కోట్లు సమీకరించిన విషయం విదితమే. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 805 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.61 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు విక్రయించారు. తాజా ఈక్విటీ నిధులను కంపెనీ జారీ ఎన్సీడీల చెల్లింపునకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా బ్రోమైన్, ఇండస్ట్రియల్ సాల్ట్, పొటాష్ సల్ఫేట్ తయారీతోపాటు, ఎగుమతులను సైతం చేపడుతోంది. -
డీసీఎక్స్ సిస్టమ్స్ ఐపీవో అదిరింది
న్యూఢిల్లీ: కేబుళ్లు, వైర్ హార్నెస్ అసెంబ్లీల తయారీ కంపెనీ డీసీఎక్స్ సిస్టమ్స్ పబ్లిక్ ఇష్యూ విజయవంతమైంది. ఇష్యూ చివరి రోజు బుధవారానికల్లా దాదాపు 70 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయ్యింది. ఇష్యూలో భాగంగా 1.45 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా.. 101.27 కోట్ల షేర్లకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. వెరసి షేరుకి రూ.197-207 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా రూ.500 కోట్లు సమీకరించింది. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 61.8 రెట్ల అధిక స్పందన లభించింది. -
1.46 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయిన ఎమ్‌ఎస్‌టీసీ ఐపీఓ
న్యూఢిల్లీ: ఎమ్‌ఎస్‌టీసీ కంపెనీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) 1.46 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. ఈ ఐపీఓలో భాగంగా ఈ కంపెనీ 1.76 కోట్ల షేర్లను జారీ చేస్తోంది. దీనికి గాను 2.58 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. ఈ నెల 13న ప్రారంభమైన ఈ ఐపీఓ గత శుక్రవారమే ముగియాల్సి ఉంది. స్పందన పెద్దగా లేకపోవడంతో ఈ ఐపీఓను బుధవారం వరకూ పొడిగించారు. ప్రైస్‌బ్యాండ్‌ను కూడా రూ.121–128 నుంచి రూ.120–128కు సవరించారు. అయినా అంతంత మాత్రం స్పందన మాత్రమే లభించింది. ఈ కంపెనీ షేర్లు ఈ నెల 29న తేదీన స్టాక్ మార్కెట్లో లిస్టయ్యే అవకాశాలున్నాయి. ట్రేడింగ్ కంపెనీగా 1964లో ఏర్పాటైన ఈ కంపెనీ ప్రస్తుతం మూడు విభాగాల్లో–ఈ కామర్స్, ట్రేడింగ్, రీసైక్లింగ్ల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. -
చిన్మయి మరోసారి సంచలన ఆరోపణలు
మీటూ అంటూ ఉద్యమించిన ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ఇపుడు మరో పోరాటానికి సిద్ధమయ్యారు. తమిళ డబ్బింగ్ యూనియన్ నుంచి తొలగించిన రెండు వారాల అనంతరం ఆమె తన అధికారిక యూట్యూబ్ చానల్లో 19నిమిషాల వీడియోను పోస్ట్ చేశారు. అలాగే ట్విటర్లో వరుస ట్విట్లతో అనేక ప్రశ్నల్ని, విమర్శల్ని లేవనెత్తారు. ముఖ్యంగా డబ్బింగ్ యూనియన్ అక్రమాలు, డబ్బింగ్ ఫీజులో 10శాతం వసూలు తదితర విషయాలపై ఆమె స్పందించారు. ఈ వ్యవహారంపై స్పందిస్తూ పలు సంచలన విషయాలను ఆమె వెల్లడించారు. ఫీజు చెల్లించినా తప్పుడు ఆరోపణలతో తనను అక్రమంగా తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళ డబ్బింగ్ యూనియన్‌కు సంబంధించిన లైఫ్ మెంబర్షిప్ (జీవితకాల సభ్యత్వం) చెల్లించినట్టు వెల్లడించారు. 2016, ఫిబ్రవరి 11న బ్యాంక్ ద్వారా ఈ చెల్లింపు చేశానని తెలిపారు. అయితే ఆ సమయంలో యూనియన్‌వాళ్లు తనకు రసీదును ఇవ్వలేదని చెప్పారు. రిసీట్ చూపించని కారణంగా డబ్బింగ్ యూనియన్ గత ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని నిరాకరించారని తెలిపారు. అయితే అప్పట్లో ఈ విషయాన్ని తాను పెద్దగా పట్టించకోలేదన్నారు. తాను లైఫ్‌మెంబర్‌షిప్ చెల్లించినా, తనను యూనియన్ సభ్యురాలిగా తొలగించడంపైనా, అసలు ఎలాంటి నోటీసులు, హెచ్చరికలు లేకుండా తన సభ్యత్వాన్ని ఎలా రద్దు చేస్తారని ఆమె మరోసారి ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్లో బ్యాంకు స్టేట్మెంట్ను పోస్ట్ చేశారు. కేవలం రాధా రవి వేధింపులకు గురైన కొంతమంది బాధిత మహిళలకు మద్దతుగా ఉన్నందుకు ప్రతీకారంగానే ఇదంతా జరిగిందని ఆరోపించారు. అలాగే తమిళ డబ్బింగ్ యూనియన్‌కు సంబంధించి తనతో కలిసి మొత్తం 97మంది సభ్యులు గత రెండేళ్లుగా ఎలాంటి సభ్యత్వ రుసుమును చెల్లించలేదని యూనియన్ చెబుతోందన్నారు. యూనియన్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన వారి సభ్యత్వాన్ని తొలగించారని, అయితే వారు కోర్టుద్వారా కొంతమంది సభ్యత్వాన్ని తిరిగి తెచ్చుకున్నట్టు వెల్లడించారు. అంతేకాదు డబ్బింగ్ యూనియన్‌పై భూమా సుబ్బారావు అనే ఆర్టిస్టు చేస్తున్న పోరాటాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. దాదాపు 16 ఫిర్యాదులు నమోదైనట్టు తెలిపారు. దీంతోపాటు గత నెలలో నమోదైన ఎఫ్ఐఆర్, చార్జిషీటు వివరాలను కూడా చిన్మయి ట్వీట్ చేశారు. తమిళ సినీపరిశ్రమతో పాటు డబ్బింగ్ యూనియన్‌లో లైంగిక వేధింపులపై గాయని చిన్మయి శ్రీపాద ఆరోపణలు చేశారు. ముఖ్యంగా గీత రచయిత వైరముత్తుతో పాటు డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడు రాధారవిలపై పలు ఆరోపణలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో రెండు సంవత్సరాలుగా సభ్యత్వ రుసుము చెల్లించలేదంటూ యూనియన్ నుంచి తొలగించినట్టు అసోసియేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. Here is the video. The statement that I didn’t pay the dubbing union subscription fee is false. 👇🏼https://t.co/1TVsdgeasM — Chinmayi Sripaada (@Chinmayi) November 23, 2018 These are the list of writ petitions/ cases filed against the Dubbing Union. Plus there is an FIR and a chargesheet filed as well a few months ago. pic.twitter.com/HurRFhd4zo — Chinmayi Sripaada (@Chinmayi) November 24, 2018 -
షాల్బీ ఐపీవో: మొదటిరోజు 4శాతం
సాక్షి, ముంబై: అహ్మదాబాద్ కేంద్రంగా సేవలు అందిస్తున్న షాల్బీ హాస్సిటల్ పబ్లిక్ ఇష్యూ నేడు(డిసెంబర్ 5)న ప్రారంభమైంది. మూడు రోజులు కొనసాగనున్న ఈ ఐపీవోలో 4శాతం సబ్‌స్క్రిప్షన్‌ను సాధించింది. డిసెంబర్ 7న ముగియనున్న ఇష్యూ ద్వారా కంపెనీ దాదాపు రూ. 505 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. ఇష్యూలో భాగంగా సోమవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 150 కోట్లను సమీకరించింది. యాంకర్ ఇన్వెస్టర్లలో గోల్డ్‌మన్ శాక్స్, సిటీగ్రూప్, యాక్సిస్ ఎంఎఫ్ తదితర సంస్థలున్నాయి. ఇష్యూకి కంపెనీ ఇప్పటికే రూ. 245-248 ధరల శ్రేణిని ప్రకటించింది. ఆఫర్లో భాగంగా సంస్థ రూ. 480 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు ప్రమోటర్ విక్రమ్ షా రూ. 25 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. మధ్యాహ్నానికి 1,45,21,686 షేర్లకు గాను 5,80,320 షేర్లు బిడ్లు పొందింది. ఈ రంగం సంవత్సరానికి 17-18 శాతం పెరుగుతోంది. తాము గత మూడు, నాలుగు సంవత్సరాల్లో మా విస్తరణ ప్రణాళికలను సాధించగలిగామని షాల్బీ సీఈవో రవి భండారీ పేర్కొన్నారు. ఆర్ధిక కొలమానాలు, కార్యాచరణ పారామితుల నేపథ్యంలో తాము గణనీయమ వృద్ధినా సాధిస్తామనే ధీమావ్యక్తం చేశారు. కాగా ఐపీవో నిధులను రుణాల చెల్లింపు, సాధారణ కార్పొరేట్ కార్యకలాపాలకు వెచ్చించనున్నట్లు షాల్బీ ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. సంస్థకు రూ. 320 కోట్లమేర రుణభారముంది. -
ఇండిగో ఐపీఓకు రిటైల్ ఇన్వెస్టర్లు దూరం!
ఎఫ్ఐఐల మద్దతుతో గట్టెక్కిన ఇష్యూ 6 రెట్లు ఓవర్ సబ్స్రిప్షన్ ముంబై: ఇండిగో ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) 6 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. గురువారం ముగిసిన ఈ ఐపీఓ ద్వారా ఇండిగో మాతృకంపెనీ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ రూ.3,018 కోట్లు సమీకరించనున్నది. మూడేళ్లలో అతి పెద్దదైన ఈ ఐపీఓకు రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి ఆదరణ లభించలేదు. అయితే సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ కనిపించింది. ఈ ఐపీఓ ద్వారా 3 కోట్ల షేర్లను కంపెనీ జారీ చేయనున్నది. వీటికి రూ.18 వేల కోట్ల విలువైన 18.49 కోట్ల షేర్ల కోసం బిడ్లు వచ్చాయి. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్(క్విబ్)కు కేటాయించిన వాటాకు మంచి స్పందన లభించింది. ఈ వాటా 18 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. కానీ ఈ విభాగంలో అధిక శాతం బిడ్స్ విదేశీ సంస్థల నుంచే వచ్చాయని, భారత్‌కు చెందిన మ్యూచువల్ ఫండ్స్ నుంచి 0.48 శాతమే బిడ్స్ వచ్చినట్లు సమాచారం. నాన్-ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కేటగిరి 3.5 రెట్లు సబ్ స్క్రైబ్ అయింది. ఈ విభాగంలో అధికంగా బిడ్ చేసిన హైనెట్వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐలు)ల్లో రాకేష్ ఝున్‌ఝున్‌వాలా వంటి వారున్నారు. రిటైల్ ఇన్వెస్టర్లు వాటా 90 శాతం, ఉద్యోగుల కేటగిరి వాటా 12 శాతం చొప్పున మాత్రమే సబ్‌స్క్రైబ్ అయ్యాయి. రూ.4,000 కోట్ల భారతీ ఇన్ఫ్రాటెల్ ఐపీఓ తర్వాత మూడేళ్ల కాలంలో ఇదే అతిపెద్ద ఐపీఓ. వారెన్ బఫెట్‌తో సంబంధం ఉన్న ఆకేసియా పార్ట్‌నర్స్‌తో సహా వివిధ విదేశీ సంస్థలు ఈ విమానయాన షేర్లకు బిడ్ చేసినట్లు సమాచారం. ఈ ఐపీఓకు రూ.700-765ను ప్రైస్‌బాండ్‌గా కంపెనీ నిర్ణయించింది.