సాక్షి, ముంబై: అహ్మదాబాద్ కేంద్రంగా సేవలు అందిస్తున్న షాల్బీ హాస్సిటల్ పబ్లిక్ ఇష్యూ నేడు(డిసెంబర్ 5)న ప్రారంభమైంది. మూడు రోజులు కొనసాగనున్న ఈ ఐపీవోలో 4శాతం సబ్‌స్క్రిప్షన్‌ను సాధించింది. డిసెంబర్ 7న ముగియనున్న ఇష్యూ ద్వారా కంపెనీ దాదాపు రూ. 505 కోట్లను సమీకరించాలని భావిస్తోంది.
ఇష్యూలో భాగంగా సోమవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 150 కోట్లను సమీకరించింది. యాంకర్ ఇన్వెస్టర్లలో గోల్డ్‌మన్ శాక్స్, సిటీగ్రూప్, యాక్సిస్ ఎంఎఫ్ తదితర సంస్థలున్నాయి. ఇష్యూకి కంపెనీ ఇప్పటికే రూ. 245-248 ధరల శ్రేణిని ప్రకటించింది. ఆఫర్‌లో భాగంగా సంస్థ రూ. 480 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు ప్రమోటర్ విక్రమ్ షా రూ. 25 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. మధ్యాహ్నానికి 1,45,21,686 షేర్లకు గాను 5,80,320 షేర్లు బిడ్లు పొందింది.
ఈ రంగం సంవత్సరానికి 17-18 శాతం పెరుగుతోంది. తాము గత మూడు, నాలుగు సంవత్సరాల్లో మా విస్తరణ ప్రణాళికలను సాధించగలిగామని షాల్బీ సీఈవో రవి భండారీ పేర్కొన్నారు. ఆర్ధిక కొలమానాలు, కార్యాచరణ పారామితుల నేపథ్యంలో తాము గణనీయమ వృద్ధినా సాధిస్తామనే ధీమావ్యక్తం చేశారు.
కాగా ఐపీవో నిధులను రుణాల చెల్లింపు, సాధారణ కార్పొరేట్ కార్యకలాపాలకు వెచ్చించనున్నట్లు షాల్బీ ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. సంస్థకు రూ. 320 కోట్లమేర రుణభారముంది.
Comments
Please login to add a commentAdd a comment