బెంగళూరు: ఇండియన్ ఈ- కామర్స్ బ్యూటీ కంపెనీ నైకా ఐపీవో ద్వారా సుమారు 500 మిలియన్ల డాలర్లను సమీకరించాలని ప్రణాళికలను రచిస్తోంది. నైకా స్టార్టప్ కంపెనీ నుంచి ఐపీవో ఇస్యూ వరకు ఎదిగింది. అందుకు సంబంధించిన పత్రాలను మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. 2012లో మాజీ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ ఫల్గుని నాయర్ నైకాను మొదలుపెట్టారు. నైకా సౌందర్య ఉత్పత్తులను సేల్ చేస్తోంది. అంతేకాకుండా ఈ కంపెనీకి సొంతంగా రిటైల్ స్టోర్లు కూడా ఉన్నాయి.
నైకా ఈ-కామర్స్ వెబ్‌సైట్‌కు కొన్ని రోజుల్లోనే గణనీయంగా మహిళల ఆదరణ పొందింది. గత ఆర్ధిక సంవత్సరంలో నైకా సుమారు రూ.1860 కోట్లను ఆదాయంగా చూపించింది. కంపెనీ డీఆర్‌హెచ్‌పీ కాపీ ప్రకారం ఐపీవోలో రూ. 525 కోట్ల ప్రైమరీ మార్కెట్ ఉంటుందని తెలుస్తోంది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో 1,500 కి పైగా బ్రాండ్‌లను కలిగి ఉంది. కోటక్ మహీంద్రా క్యాపిటల్, బోఫా సెక్యూరిటీస్, సిటీ, మోర్గాన్ స్టాన్లీ, ఐసిఐసిఐ సెక్యూరిటీలు కంపెనీ ఐపీఓ నిర్వహిస్తున్నాయి. 2021 మార్చి 31 వరకు నైకా యాప్‌ను సుమారు 43.7 మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. దేశవ్యాప్తంగా 38 నగరాల్లో 73 స్టోర్స్‌ను నైకా కలిగి ఉంది.
మగువలు మెచ్చిన ఈ-కామర్స్ కంపెనీ..ఐపీవో దిశగా అడుగులు..!
Published Tue, Aug 3 2021 9:22 PM | Last Updated on Tue, Aug 3 2021 9:25 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment