ముంబై, సాక్షి: ఇంజినీరింగ్ సొల్యూషన్స్ కంపెనీ ఎంటీఏఆర్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తు చేసింది. తద్వారా రూ. 600-650 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. కంపెనీ 7 తయారీ ప్లాంట్లను కలిగి ఉంది. వీటిలో తెలంగాణలోని హైదరాబాద్‌లో కంపెనీకి ఎగుమతుల కోసం ప్రత్యేకించిన యూనిట్ ఉంది. తద్వారా రక్షణ, వైమానిక, ఇంధన రంగాలకు అవసరమైన కీలక పరికరాలను సరఫరా చేస్తోంది. (ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్.. ఐపీవోకు రెడీ)
నాలుగు దశాబ్దాలుగా ఇంజినీరింగ్ విభాగంలో ఎంటీఏఆర్ టెక్నాలజీస్ కార్యకలాపాలు విస్తరిస్తూ వస్తోంది. ప్రధానంగా ప్రెసిషన్ ఇంజినీరింగ్ విభాగంలో కంపెనీకి పట్టుంది. న్యూక్లియర్, ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్లు, ఏరోస్పేస్ ఇంజిన్లు, మిసైల్ సిస్టమ్స్, ఎయిర్‌క్రాఫ్ట్ తదితరాలకు పలు కీలక విడిభాగాలను రూపొందిస్తోంది. న్యూక్లియర్ రంగంలో 14, అంతరిక్ష విభాగంలో 6, శుద్ధ ఇంధన రంగంలో 3 చొప్పున కీలక ప్రొడక్టులను తయారు చేస్తోంది. 2020 నవంబర్‌కల్లా రూ. 356 కోట్లకుపైగా విలువైన ఆర్డర్లను కలిగి ఉంది. (2020: ఐపీవో నామ సంవత్సరం)
Comments
Please login to add a commentAdd a comment