![Autocross Championship Held to Raise Funds for Heart Patients - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/5/Autocross%20Championship%201.jpg.webp?itok=z38o5ZtR)
మంచి పని కోసం క్రీడలను నిర్వహించడం.. ఇదీ రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ తలపెట్టిన కార్యక్రమం. హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు పూయించే దిశగా ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ తొలిసారిగా ఇండియన్ నేషనల్ ఆటోక్రాస్ ఛాంపియన్‌షిప్ 2023 ను నిర్వహించింది. దీని ద్వారా పుట్టుకతో వచ్చే గుండె జబ్బులతో బాధపడుతున్న పిల్లలకు సిద్దిపేట పట్టణంలోని శ్రీ సత్యసాయి ఆసుపత్రిలో గుండె శస్త్రచికిత్సల కోసం ఆపరేషన్ థియేటర్ కోసం ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నగరంలోని బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ కోర్స్‌లోని కస్టమ్-బిల్ట్ రేస్ ట్రాక్‌లో ఈ మోటార్ ఫెస్ట్ నిర్వహించింది. ఈ రేసులో ఎంతో మంది టాప్ రేసర్లు పాల్గొని వారి నైపుణ్యాన్ని ప్రదర్శించారు.
ఈ ఈవెంట్ ద్వారా వచ్చిన నిధులను రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే చిన్నారుల ఆపరేషన్ నిమిత్తం థియేటర్ నిర్మాణానికి ఉపయోగించనుంది. సిద్ధిపేట పట్టణంలోని శ్రీ సత్య సాయి ఆస్పత్రిలో ఈనిర్మాణం చేపడతారు. దీనికి దాదాపు 7.5 కోట్ల భారీ మొత్తం ఖర్చవుతుందని అంచనా. గుండె వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపే క్రమంలో నిర్వహిస్తున్న ఈ కార్ రేసింగ్ ఈవెంట్ విజయవంతం చేసింది రోటరీ క్లబ్.
Comments
Please login to add a commentAdd a comment