
ఇంటి చుట్టూ పొగమంచు వీడనే లేదు. చలికి ఒళ్లంతా గజగజ వణుకుతోంది. అంతటి చలిలోనే అమ్మా వెళ్లొస్తా.. అంటూ వర్క్‌షాప్‌కి బయల్దేరుతున్న నా కొడుకు సన్‌బర్‌ఖాన్‌ని చూస్తేందే మనసంతా బాధతో నిండిపోయింది. ఇంత చలిలో బయటకు వద్దు.. ఇంట్లోనే ఉండిపో అని చెప్పాలని నోటి దాకా వచ్చిన మాటలను బయటకు రానీయలేదు. ఎందుకంటే వాడు పనికి వెళ్లక తప్పని పరిస్థితి మా కుటుంబానిది.
ఫర్జానా పుట్టినప్పుడు మా ఇంట్లో ఆనందానికి అవధుల్లేవ్. కొంత కాలానికే సన్‌బర్‌ఖాన్, ఆ తర్వాత రెహాన్ పుట్టారు. అంతా సజావుగా సాగిపోతున్న సమయంలో వాళ్ల నాన్న మాకు దూరమయ్యాడు. ఆయన చనిపోయినప్పటి నుంచి కుటుంబ బాధ్యతంతా నా మీదే పడింది. కుట్టు పని చేస్తే వచ్చే రూ.2000లే మా కుటుంబానికి ఆధారం. అక్కా పెళ్లికి తమ్ముడి చదువుకి అండగా ఉండేందుకు పదేళ్ల వయసులోనే బడి మానేసి వర్క్‌షాప్‌కి వెళ్తున్నాడు సన్‌బర్‌ఖాన్.
చలిలో వణుకుతూ బయటకు పోయిన బిడ్డ ఎలా ఉన్నాడో అనే ఆలోచన తొలిచేస్తుండగా... తెలియని నంబర్ నుంచి ఫోన్ వస్తే లిఫ్ట్ చేశాను. వర్క్‌షాప్‌కి వెళ్లిన సన్‌బర్‌ఖాన్‌కి యాక్సిడెంట్ అయ్యిందని, అతన్ని ఆస్పత్రి చేర్చారని డాక్టర్లు చెప్పారు. ఏం జరిగిందో ఏమో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆస్పత్రికి వెళ్లాను. అప్పటికే సన్‌బర్‌ఖాన్‌ని ఎమర్జెన్సీ వార్డుకి తరలించారు.
ప్రమాదం కారణంగా ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగిందని.. సన్‌బర్‌ఖాన్ కిడ్నీలు, జీర్ణవ్యవస్థకి బలమైన గాయాలు అయినట్టు డాక్టర్లు చెప్పారు. అయితే సకాలంలో ఆస్పత్రికి తీసుకురావడం వల్ల ప్రాణాలకు ప్రమాదం తప్పిందని డాక్టర్లు చెప్పారు. వారం రోజుల తర్వాత ఆస్పత్రి నుంచి డిస్‌చార్జ్ అయ్యాం.
ఆస్పత్రి నుంచి వచ్చిన తర్వాత కొన్ని రోజులకు.. నొప్పి భరించలేక మంచంలోనే పడి ఏడుస్తున్న సన్‌బర్ కనిపించాడు. ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాను. అక్కడ రకరకాల పరీక్షలు చేసిన డాక్టర‍్లు ఇంటర్నల్ ఇన్‌ఫెక‌్షన్ వచ్చినట్టు చెప్పారు. మరో 25 రోజులు పాటు ఆస్పత్రిలోనే ఉంచి ఖరీదైన వైద్యం చేయాలన్నారు. అందు కోసం రూ. 12 లక్షల వరకు ఖర్చు వస్తుందన్నారు. వైద్య చికిత్స అందకపోతే ప్రాణాలు దక్కవన్నారు.
బిడ్డలను చదివించే ఆర్థిక స్థోమత లేక పన్నెండేళ్ల పిల్లాడు పనికి పోతున్నా ఆపలేని దుస్థితి నాది. మూడు పూటల ఇంటిల్లిపాది తిండి తినడమే కష్టం మాకు. ఐనప్పటికీ సన్‌బర్ ఆపరేషన్ కోసం అమ్మాయి పెళ్లి కోసం దాచిన కొన్ని నగలు కూడా అమ్మేశాను. ఇప్పుడు ఊపిరి తప్ప మా కుటుంబం దగ్గర ఇంకేం లేదు. మరీ సన్‌బర్‌ఖాన్ కాపాడుకునేది ఎలా?
ఇన్‌ఫెక‌్షన్‌తో ప్రతీ రోజు నా కొడుకు పడుతున్న బాధ చూస్తూ తల్లిగా తట్టుకోలేకపోతున్నా. నా నిస్సహాయత వల్ల నా పిల్లలకు వచ్చిన పరిస్థితి తలచుకుంటే కన్నీరు ఆగడం లేదు. వెక్కివెక్కి ఏడుస్తున్న నాకు, మెడికల్ ఎమర్జెన్సీలో ఫండ్ రైజ్ చేసే కెట్టో సంస్థ గురించి తెలిసింది. వెంటనే వారిని సంప్రదించాను. నా కొడుకు సన్‌బర్ ఖాన్ ప్రాణాలు కాపాడేందుకు మీ వంతు సాయం చేయండి. నా కొడుక్కి కొత్త జీవితాన్ని అందించండి. (అడ్వెటోరియల్)
సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment