
డెట్రాయిట్:ఇండియన్ అమెరికన్ కూటమి ఆధ్వర్యంలో డెట్రాయిట్‌లో జరిగిన గవర్నర్ గ్రెట్‌చెన్ విట్మర్ ఫండ్ రైజర్ కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరిగింది. డెట్రాయిట్ మెసోనిక్ టెంపుల్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి 500ల మందికి పైగా అమెరికా, భారత సంతతికి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్య అథితిగా గవర్నర్ గ్రెట్‌చెన్ విట్మర్‌తో పాటూ, కాంగ్రెస్ ఉమన్ హ్యాలీ స్టీవెన్స్ , బ్రెండా లారెన్స్, మిచిగాన్ సెక్రటరీ అఫ్ స్టేట్ జోసెలిన్ బెన్సన్‌లు ఈ కార్యక్రమానికి అథితులుగా విచ్చేసారు.
గవర్నర్ ఫండ్ కోసం జరిగిన విరాళాల సేకరణలో మిచిగన్ బిజినెస్ కమ్యూనిటీ రికార్డు స్థాయిలో 238 వేల డాలర్లు సేకరించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ రెప్ పద్మ కుప్ప మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో విట్మర్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు. ఈ విధమైన సభలు ప్రవాస భారతీయుల ఉనికిని భవిష్యత్తు ప్రణాళికల్ని పటిష్టం చేస్తాయన్నారు. యూఎస్ రాజకీయాలలో ఎన్నారై ఇండియన్ల పాత్రను పటిష్టం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ధవల్ వైష్ణవ్, అశోక్ బడ్డి, మురహరి దేవబత్తిని తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment