
పెళ్లైన ఇరవై ఏళ్ల తర్వాత తల్లి కాబోతున్నాననే వార్త విని మేమిద్దరం ఎంతగానో సంతోషించాం. ఎప్పుడెప్పుడు మా ఇంట బోసినవ్వులు వినిపిస్తాయా అని ఎదురు చూస్తుండగానే కాన్పు జరిగింది. పుట్టిన బిడ్డ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. దగ్గు, జలుబు చేయడం ఒళ్లంతా నీలి రంగులోకి మారిపోతుండటంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాం.
నా చిన్నారికి అనేక పరీక్షలు చేశారు. చివరకు మా గుండెలు బద్దలయ్యే వార్త చెప్పారు డాక్టర్లు. కెనోటిక్ హార్ట్ డిఫెక్ట్, ఇంటర్‌వెంట్రిక్యూలమ్ సెప్టమ్ అనే గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్టు చెప్పారు. బాబుకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయకుంటే ప్రాణాలకు ప్రమాదమంటూ వివరించారు. ఈ ఆపరేషన్ కోసం రూ. 10 లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు డాక్టర్లు.
సాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
నా భర్త ట్రాక్టర్ డ్రైవరుగా పని చేస్తాడు. అతను తెచ్చే సంపాదనే మాకు ఆధారం. కరోనాతో గత రెండేళ్లుగా ఆయనకు పెద్దగా పని లేదు. పైగా పిల్లల కోసం ఐవీఎఫ్‌కి చాలా ఖర్చు అయ్యింది. ఉన్న నగలన్నీ అమ్మేశాను. అధిక వడ్డీలకు అప్పు తెచ్చాం. ఇప్పుడు మా బిడ్డ ఆపరేషన్‌కు డబ్బులు సర్థుబాటు చేయలేని స్థితిలో ఉన్నాం.
పెళ్లైన 20 ఏళ్లకు మా కలలు నెరవేరి మా ఇంట సంతాన భాగ్యం కలిగింది. కానీ ఆ సంతోషం లేకుండానే గుండె జబ్బు నా బాబు ప్రాణాలకు ప్రమాదకరంగా మారింది. నా కొడుకు గుండె ఆపరేషన్‌కి మీ వంతు సాయం అందించండి. వాడి ప్రాణాలకు కాపాడండి. (అడ్వెటోరియల్)
సాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment