న్యూఢిల్లీ: మొబైల్ టెలికం రంగ దిగ్గజం వొడాఫోన్ ఐడియా భారీ స్థాయిలో నిధుల సమీకరణ చేపట్టనుంది. ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత సెక్యూరిటీలు, ఇతర రుణ మార్గాల ద్వారా రూ. 45,000 కోట్లు సమీకరించేందుకు కంపెనీ బోర్డు తాజాగా ఆమోదముద్ర వేసింది. రూ. 2.1 లక్ష కోట్ల భారీ రుణ భారంతో కుదేలైన కంపెనీ మనుగడ కోసం పలు సమస్యలను ఎదుర్కొంటోంది. త్రైమాసికవారీగా నష్టాలు ప్రకటించడంతోపాటు.. వినియోగదారులను కోల్పోతోంది.
ఏప్రిల్‌లో బోర్డ్ భేటీ...
నిధుల సమీకరణ నిర్వహణ కోసం బ్యాంకర్లను ఎంపిక చేసేందుకు యాజమాన్యానికి అధికారాలనిస్తూ బోర్డు తీర్మానించింది. దీనిలో భాగంగా ఏప్రిల్ 24న వాటాదారుల సమావేశాన్ని నిర్వహించనుంది. వాటాదారుల అనుమతి తదుపరి త్రైమాసికంలో ఈక్విటీ నిధుల సమీకరణను పూర్తి చేయనున్నట్లు వొడాఫోన్ ఐడియా తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment