వాల్‌మార్ట్ యాజమాన్యంలోని భారతీయ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే (PhonePe) దూకుడు పెంచింది. వ్యాపార విస్తరణ కోసం నిధుల సమీకరణ చేపట్టిన ఫిన్‌టెక్ కంపెనీ అందులో భాగంగా తాజాగా మరో 100 మిలియన్ డాలర్లను (సుమారు రూ.820 కోట్లు) సమీకరించింది.
(గూగుల్ చీకటి ‘గేమ్’! రూ.260 కోట్ల భారీ జరిమానా..)
12 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ ఉన్న ఫోన్‌పే వ్యాపార విస్తరణలో భాగంగా 1 బిలియన్ డాలర్లను విడతలవారీగా సమీకరించినట్లు గత జనవరిలో ప్రకటించింది. అప్పటి నుంచి ఈ ఫిన్‌టెక్ కంపెనీ జనరల్ అట్లాంటిక్ నుంచి 350 మిలియన్ డాలర్లు, టైగర్ గ్లోబల్ మేనేజ్‌మెంట్, రిబ్బిట్ క్యాపిటల్, టీవీఎస్ క్యాపిటల్ నుంచి 100 మిలియన్ డాలర్లు, వాల్‌మార్ట్ నుంచి 200 మిలియన్ డాలర్లు సమీకరించింది.
(ఆండ్రాయిడ్ యూజర్లకు కొత్త ఫీచర్.. స్టోరేజ్ సమస్యకు పరిష్కారం)
భారతదేశంలో తమ చెల్లింపులు, బీమా వ్యాపారాలను విస్తరించడంతో పాటు బ్యాంకింగ్, స్టాక్‌బ్రోకింగ్, ఓఎన్‌డీసీ ( ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్) ఆధారిత షాపింగ్ వంటి కొత్త వ్యాపారాలను ప్రారంభించేందుకు సమీకరించిన నిధులను వినియోగించనున్నట్లు ఫోన్‌పే గత ప్రకటనల్లో పేర్కొంది. ఈ నెల ప్రారంభంలోనే ‘పిన్‌కోడ్’ అనే ఓఎన్‌డీసీ ఆధారిత ఈ-కామర్స్ వ్యాపారాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment