
పబ్లిక్ ఫిగర్స్ (ప‍్రముఖులు) వేలకోట్ల వ్యాపార రంగాన్ని కనుసైగతో శాసిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అగ్గిపుల్ల నుంచి సబ్బు బిళ్ల వరకు ఆయా ప్రొడక్ట్ ల అమ్మకాలు జరిగేలా బ్రాండ్ అంబాసీడర్లుగా రాణిస్తున్నారు. ఆయా ఉత్పత్తుల అమ్మకాలు జరిగేలా ప్రచారం చేస్తున్నారు.
స్పోర్ట్స్ పర్సన్, సినిమా స్టార్లయినా బ్రాండ్ అంబాసీడర్‌గా వాళ్లు చేయాల్సిందల్లా మూమెంట్లు,డబ్బింగ్ చెబితే సరిపోతుంది. ఒక్కసారి సదరు బ్రాండ్ అంబాసీడర్ యాడ్ మార్కెట్ లోకి విడుదలైందా అంతే సంగతులు. ఊహించని లాభాల్ని చూడొచ్చు. అందుకే చిన్న చిన్న కంపెనీల నుంచి బడబడా కంపెనీల వరకు ఆయా రంగాల్లో రాణిస్తున్న వారిని తమ కంపెనీ ప్రొడక్ట్ ల అమ్మకాల కోసం బ్రాండ్ అంబాసీడర్ లు గా నియమించుకుంటాయి. వారికి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ చెల్లించుకుంటాయి.
తాజాగా, డిజిటల్ లావాదేవీల్లో దూసుకుపోతున్న ప్రముఖ ఫిన్ టెక్ కంపెనీ ఫోన్ పే యూజర్లను ఆకట్టుకునేందుకు వినూత్న ప్రయత్నం చేసింది. గత ఏడాది తన స్మార్ట్ స్పీకర్లకు బిగ్ బి అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్‌ను అందించిన 'ఫోన్ పే'.. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్‌ను జోడించింది. ఇకపై చెల్లింపులు చేసినప్పుడు మనీ రిసీవ్డ్ అనే కంప్యూటర్ జనరేటెడ్ వాయిస్ కి బదులు 'మహేశ్ బాబు' గొంతు వినిపిస్తుంది. ఇందుకోసం ఫోన్ పే ప్రతినిధులు మహేష్ వాయిస్ తీసుకుని కృత్రిమ మేధస్సు ద్వారా వాయిస్ను జనరేట్ చేశారు. ఈ ప్రకటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూజర్ చెల్లించిన మొత్తాన్ని ప్రకటించిన తర్వాత ధన్యవాదాలు బాస్ అనే వాయిస్ వినిపిస్తుంది.
Babu voice vasthundhi phone pay lo ma shop lo 💥💥😅🔥@urstrulyMahesh #GunturKaaram #SSMB29 pic.twitter.com/1lib8hIjl7
— babu fan ra abbayilu 💥💥🔥🤙 (@Vamsi67732559) February 20, 2024
బిగ్ బికి ఎంత రెమ్యునరేషన్ అంటే
బిగ్ బి అమితాబ్ బచ్చన్ సుమారు 30కి పైగా సంస్థలకు బ్రాండ్ అంబాసీడర్ గా పనిచేస్తున్నారు. కుర్ర హీరోలతో పోటీ పడి మరి బ్రాండ్ అంబాసీడర్ గా పని చేస్తూ తన ప్రచారంతో ఆయా కంపెనీలకు కనకవర్షం కురిపిస్తున్నారు. ఇందుకోసం ఆయన ఒక్కో సంస్థ నుంచి రూ.5కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment