
నూతన ఆవిష్కరణలకు, స్టార్టప్‌లకు హబ్‌లుగా విరాజిల్లుతున్నాయి బెంగళూరు, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఢిల్లీ)లు. దేశంలో సక్సెస్ బాట పడుతున్న స్టార్టప్‌లలో సగం ఇక్కడి నుంచే వస్తున్నాయి. ఈ రెండు నగరాల బాటలోనే హైదరాబాద్ కూడ పయణిస్తోంది.
515 మిలియన్ డాలర్లు
ట్రాక్సన్స్ సంస్థ తాజాగా జారీ చేసిన నివేదిక ప్రకారం 2016 నుంచి 2019 వరకు హైదరాబాద్ నగరం కేంద్రంగా ఉన్న 933 స్టార్టప్ కంపెనీలు 515 మిలియన్ల డాలర్ల పెట్టుబడిని ఆకర్షించాయి. అంతకు ముందు 2016 నుంచి 2018 వరకు 1438 స్టార్టప్‌లు 274 మిలియన డాలర్ల పెట్టుబడిని ఆకర్షించినట్టు తెలిపింది.
బెంగళూరు ఫస్ట్
హురున్ ఇండియా ఇటీవల ప్రకటించిన స్టార్టప్‌ల జాబితాలో బెంగళూరు నగరం మరోసారి ఫస్ట్ ప్లేస్‌ని దక్కించుకుంది. బెంగళూరు నగరంలో ఉన్న స్టార్టప్ కంపెనీలు రికార్డు స్థాయిలో 12, 360 మిలియన్ డాలర్ల పెట్టుబడిని ఆకర్షించాయి. ఆ తర్వాత స్థానంలో ఎన్‌సీఆర్ దాదాపు 11,100ల మిలియన్ డాలర్ల పెట్టుబడిని సాధించాయి. ఆ తర్వాత ముంబై నగరం 4,810 మిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉంది.
హైదరాబాద్ సైతం
స్టార్టప్‌ల ప్రాధాన్యతను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం టీ హబ్, వీ హబ్‌ల పేరుతో ఇప్పటికే ఇంక్యుబేషన్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఆ వెంటనే కరోనా సంక్షోభం తలెత్తడంతో స్థానిక స్టార్టప్‌లకు ఇబ్బందులు ఎదురైనా క్రమంగా ఇక్కడ కూడా పరిస్థితులు చక్కబడుతున్నాయి. రాబోయే ఐదేళ్లలో బెంగళూరు, న్యూఢిల్లీలకు ధీటుగా హైదరాబాద్ స్టార్టప్‌లు కూడా ఫండ్ రైజ్ చేయగలవని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment