
పొద్దున అనగా బటయకు వెళ్లిన మనిషి ఎప్పుడు ఇంటికి వస్తాడా అని ఆలోచిస్తూ దిగాలుగా కూర్చున్నాను. పాలేమైనా పట్టాలేమో అని ఊయల్లో ఉన్న పిల్లాడి వైపు చూస్తూ కడుపుపై నిమిరాను. అలా నా చేతి వేలు శరీరాన్ని తాకిందో లేదో ఆరు నెలల వయసున్న నా కొడుకు తన చిట్టి చేతులతో నా వేలుని గట్టిగా పట్టుకున్నాడు. వాడికి మాటలు రావు, కానీ నా వేలిని వాడలా గట్టిగా పట్టుకోవడానికి గల కారణం నాకు తెలుసు. ‘అమ్మా... నొప్పి భరించ లేక పోతున్నా.. ఏదైనా చేయమ్మా’ అంటున్నాడు నా బిడ్డ. మాయదారి జబ్బు వల్ల ఆ పసిప్రాణం నొప్పితో విలవిలాడుతోంది.
నేను బినీషా, నా భర్త పేరు లిబిష్. మారి కేరళలోని కోజికోడ్. మాకిద్దరు పిల్లలు. కూలి పని చేస్తూ నెలకు రూ.5000 సంపాదిస్తూ నా భర్త కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. డబ్బులు లేకపోయినా పిల్లలే మా ఆస్తిగా భావించాం. మూడో బిడ్డగా విహాన్ మా కుటుంబంలో ఓ భాగమయ్యాడు. అయితే వాడికి రెండు నెలలు వయసప్పుడు ఆగకుండా గుక్కపట్టి ఏడుస్తున్నాడు. కడుబు దగ్గర వాపు కూడా కనిపిచింది. అంతే వెంటనే వాడిని ఆస్పత్రికి తీసుకెళ్లాం.
వివిధ పరీక్షలు చేసిన డాక్టర్లు విహాన్‌కి డీకాంపన్‌సేటెడ్ క్రానిక్ లివర్ డిసీజ్ ఉన్నట్టుగా నిర్థారించారు. బైలరీ ఆర్టేసియా అనే అరుదైన ఈ వ్యాధి కారణంగా పేగుల్లోకి చేరాల్సిన బైల్ కాలేయంలోనే ఉండిపోతుంది. దీని వల్ల కాలేయం వాచి.. చివరకు మరణం సంభవించవచ్చని వివరించారు. లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయడం మంచిదని, దానికి రూ. 19 లక్షల ఖర్చు వస్తుందని చెప్పారు. అంత డబ్బు మా దగ్గర లేదు కాబట్టి మరో మార్గం చూడమని డాక్టర్లకు కోరాం.
మా పరిస్థితి అర్థం చేసుకున్న డాక్టర్లు విహాన్‌కి కసాయ్ ప్రొసీడర్‌లో వైద్యం అందించారు. కాలేయంలో పేరుకు పోయిన బైల్‌ని వైద్య పరంగా బయటకు పోయేలా వైద్యం అందివ్వడం మొదలు పెట్టారు డాక్టర్లు. విహాన్ ఆరోగ్యం కొద్దిగా మెరుగవుతున్నట్టే అనిపించింది. వైద్యం కోసం ఇంట్లో నగలను, ఉన్న కొద్దీ ఆస్తులను ఆమ్మేసి రూ. 5 లక్షల వరకు ఖర్చు చేశాం. ఇక పరిస్థితి చక్కబడుతుందనే నమ్మకం కలగడం మొదలైంది. కానీ మాకు నిరాశే ఎదురైంది. మళ్లీ సమస్య మొదటి కొచ్చింది.
మరోసారి విహాన్‌ను పరీక్షించిన వైద్యలు లివర్ ట్రాన్‌ప్లాంటేషన్ ఒక్కటే మార్గమని తేల్చి చెప్పారు. నా లివర్ విహాన్‌కు మ్యాచ్ అవుతుంది డాక్టర్లు నిర్థారించారు. అయితే లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్‌కి రూ.19 లక్షలు కావాలి. లివర్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా ఆపరేషన్‌కి అయ్యే ఖర్చు భరించే స్థోమత మాకు లేదు. అప్పుడే మెడికల్ ఎమర్జెన్సీలో ఫండ్ రైజింగ్ చేసే కెట్టో గురించి తెలిసింది. రోజులు గడిచే కొద్ది విహాన్ మృత్యువుకి చేరువ అవుతున్నాడు. విహాన్‌కి ఆపరేషన్ జరిగేందుకు మీ వంతు సాయం అందించండి. వాడికి నొప్పితో విలవిలాడుతున్న ఆ ప్రాణాలకు ఓ భవిష్యత్తును ఇవ్వండి.(అడ్వటోరియల్)
సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి