హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐటీ సంస్థ రామ్ ఇన్ఫో లిమిటెడ్ భారీ నిధుల సమీకరణ ప్రణాళిక చేపట్టింది. ప్రాధాన్యతా షేర్ల కేటాయింపు ద్వారా రూ.62 కోట్ల నిధుల సమీకరణ ప్రణాళికకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపిందని కంపెనీ తాజాగా ప్రకటించింది.
సేకరించిన నిధులను కంపెనీ అభివృద్ధి, నాయకత్వ విస్తరణ, జాతీయ, అంతర్జాతీయ విస్తరణ కోసం ఉపయోగించాలని కంపెనీ భావిస్తోంది. టెక్నాలజీ, ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఉన్న తమ అనుబంధ, జాయింట్ వెంచర్‌లలో భవిష్యత్తు పెట్టుబడి అవసరాలను తీర్చడం రామ్ ఇన్ఫో లిమిటెడ్ లక్ష్యంగా పెట్టుకుంది.
"కంపెనీ ఆదాయం, స్థిరమైన వృద్ధిని మెరుగుపరచడానికి, సర్వీస్ పోర్ట్‌ఫోలియోను వైవిధ్యపరచడానికి, భౌగోళిక పరిధిని విస్తరించడానికి ఈ వ్యూహాత్మక చర్య ఉద్దేశించినది" అని రామ్ ఇన్ఫో మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనాథ్ రెడ్డి తెలిపారు. బలమైన ఆర్డర్‌లను, సర్వీస్ గ్రోత్‌ను పెంపొందించుకునేందుకు, తమ షేర్‌హోల్డర్‌లకు విలువను సృష్టించడానికి నిధుల సమీకరణ సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment