
ప్రోత్సాహం ఉంటేనే... స్టార్ట్ ‘అప్స్’
స్టార్టప్‌లకు కొత్త సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఎందుకంటే 2016 వీటికి ఏమాత్రం కలిసిరాలేదు. దేశీ స్టార్టప్స్ నిధుల సమీకరణ 50 శాతం పడిపోయింది.
2016లో 50 శాతానికి పడిపోయిన నిధుల సమీకరణ
200లకు పైగా స్టార్టప్స్ సేవల నిలిపివేత కూడా..
ఈ ఏడాది ప్రభుత్వ ప్రోత్సాహం తప్పనిసరి
కస్టమర్ల కొనుగోళ్ల వ్యయం కూడా పెరగాలి
అలాగైతేనే స్టార్టప్‌ల వృద్ధి, మనుగడ: నిపుణులు
ఈ సారి లిస్టింగ్ చర్యలు వేగవంతమయ్యే అవకాశం!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టార్టప్‌లకు కొత్త సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఎందుకంటే 2016 వీటికి ఏమాత్రం కలిసిరాలేదు. దేశీ స్టార్టప్స్ నిధుల సమీకరణ 50 శాతం పడిపోయింది. కొత్తగా ప్రారంభమైనవి కూడా 2016లో తక్కువే. 2015లో రెండు మూడు రౌండ్లలో పెద్ద మొత్తంలో నిధులను సమీకరించిన ఫ్లిప్‌కార్ట్, క్వికర్, గ్రోఫర్స్ వంటి కంపెనీలు 2016లో చిల్లిగవ్వ కూడా సమీకరించలేకపోయాయి. పైపెచ్చు 1,031 కంపెనీల నిధుల ఒప్పందాలు రద్దయ్యాయి కూడా. కొన్ని సంస్థలు నిధులు సమీకరించాక కూడా అమ్మకాల్లేక, పోటీని తట్టుకోలేక బిచాణా ఎత్తేశాయి. వేల సంఖ్యలో ఉద్యోగులనూ తొలగించాయి వీటిలో పెప్పర్ ట్యాప్, పార్సిల్డ్, డోర్‌మింట్, బిల్డ్‌జర్, లోకల్‌బన్యా, గోజోమో, టైనీ ఊల్, డాజో, జూపర్‌మీల్, ఫ్యాషన్ ఎరా, పర్పుల్ స్క్విరల్, ఆస్క్‌మీ, ఆటోఆన్‌క్యాబ్, గ్రాక్‌షాప్, ఫ్రాంక్లీమీ వంటివి ఉన్నాయి. ఇవేకాదు. మహిళలు ఫౌండర్‌గా, కో–ఫౌండర్‌గా ఉన్న స్టార్టప్స్‌కు కూడా చేదు అనుభవమే ఎదురైంది. ఏప్రిల్ – డిసెంబర్ మధ్య 670 స్టార్టప్స్ నిధులను సమీకరిస్తే ఇందులో కేవలం 21 కంపెనీలే మహిళ స్టార్టప్స్. మహిళా స్టార్టప్స్ ఎక్కువగా ఫ్యాషన్, వెడ్డింగ్, ఫుడ్ రంగాల్లోనే ఉన్నాయి.
బడ్జెట్లో రాయితీలపై భారీ అంచనాలు: పెద్ద నోట్ల రద్దుతో ఆయా రంగాల్లో పారదర్శకత నెలకొంటుందని, ఇది 2017లో స్టార్టప్స్‌కు బాగా కలిసొస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పెరుగుతుందని వారు అంచనా వేస్తున్నారు. వచ్చే ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్‌లో స్టార్టప్స్‌తో సహా అన్ని రంగాలను ప్రోత్సహించేలా పథకాలు, రాయితీలను కల్పిస్తారనేది వారి ఆశ. ఇప్పటికే స్టార్టప్ ఇండియా స్టాండప్ ఇండియా పథకం కింద కేంద్రం 50 బిలియన్ డాలర్ల క్రెడిట్ గ్యారంటీ ఫండ్‌ను ఏర్పాటు చేసింది. మొత్తంగా 2017 సంవత్సరం దేశీయ స్టార్టప్స్‌కు వెన్ను దన్నుగా నిలుస్తుందని అన్ని వర్గాల్లోనూ ఆశాభావం వ్యక్తమవుతోంది. ఈ–కామర్స్ సంస్థలపై నుంచి దృష్టి మరల్చి వ్యవసాయం, డిజిటల్ పేమెంట్, పేమెంట్ గేట్‌వే, మొబైల్ వ్యాలెట్స్ వంటి విభాగాల వైపు ఇన్వెస్టర్లు, స్టార్టప్ పారిశ్రామిక వేత్తలు అడుగులు వేసే సూచనలు కనిపిస్తున్నాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఆర్థిక సాంకేతిక పరిజ్ఞానం, ఆరోగ్య సంరక్షణ, ఎంటర్‌ప్రైజెస్ టెక్నాలజీ వంటి రంగాల్లోని సంస్థల విలువ పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. స్టార్టప్‌ల లిస్టింగ్‌కు సంబంధించి కూడా చర్యలు వేగవంతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
నిధులు సమీకరించిన టాప్ 5 కంపెనీలు
కంపెనీ నిధుల మొత్తం పెట్టుబడిదారు/సంస్థ
(మిలియన్ డాలర్లలో..)
ఐబిబో గ్రూప్ 250 నాస్పర్
స్నాప్‌డీల్ 200 ఒంటారియా టీచర్స్ పెన్షన్ ప్లాన్, ఐరన్ పిల్లర్, బ్రదర్ ఫారచ్యన్ అపెరల్
హైక్ మెసెంజర్ 175 టెన్సెంట్, ఫాక్స్‌కాన్
బిగ్‌బాస్కెట్ 150 అబరాజ్ గ్రూప్, సాడ్స్ క్యాపిటల్, ఐఎఫ్‌సీ, హెలియన్ వీసీ, బీవీపీ, అసెంట్ క్యాపిటల్
కార్‌ట్రేడ్ 145 టీమ్‌సెక్, వార్‌బర్గ్ పిన్‌కుస్, మార్చే క్యాపిటల్
2016లో టాప్ 3 కొనుగోళ్లు
720 మిలియన్ డాలర్లకు ఐబిబోను మేక్‌మై ట్రిప్ కొనుగోలు చేసింది.
130 మిలియన్ డాలర్లకు సిట్రస్‌పేను
పేయుబిజ్ కైవసం చేసుకుంది.
70 మిలియన్ డాలర్లకు బజాంగ్‌ను
మింత్ర చేజిక్కించుకుంది.
సగానికే పరిమితమైన నిధుల సేకరణ
సంవత్సరం ప్రారంభమైన నిధులు నిధుల కొనుగోళ్లు
స్టార్టప్స్ పొందినవి మొత్తం
2015 9,462 1,024 7.5 150
2016 3,029 1,031 3.9 161
(బిలియన్ డాలర్లలో..)
ఎందుకు పెరిగాయంటే...
రానున్న బడ్జెట్లో సిగరెట్లపై సుంకాలు తక్కువ స్థాయిలోనే ఉంటాయన్న అంచనాలు, రెండు రకాల సిగరెట్ల ధరలను పెంచడంతో ఐటీసీ షేర్7 శాతం ఎగసింది. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల (ఎన్‌సీడీ)ల ద్వారా రూ.75 కోట్లు సమీకరించిన నేపథ్యంలో శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ షేర్ 6 శాతం లాభపడింది.ఛార్మ్ ఇండస్ట్రీస్‌లో 51 శాతం వాటాను వంద శాతానికి పెంచుకోవడంతో గోద్రేజ్ కన్సూమర్ ప్రొడక్టŠస్ షేర్ 6 శాతం పెరిగింది.
ఎందుకు తగ్గాయంటే...
దివీస్ ల్యాబ్స్‌కు చెందిన వైజాగ్ ప్లాంట్‌పై అమెరికా ఎఫ్‌డీఏ అభ్యంతరాల నేపథ్యంలో దివీస్ ల్యాబ్స్ నష్టాలు కొనసాగుతున్నాయి. ఈ వారం కూడా ఈ షేర్ 10% పతనమైంది. లాభాల స్వీకరణ కారణంగా కెనరా, పీఎన్‌బీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇం డియా, తదితర బ్యాంక్ షేర్లు, గ్లెన్‌మార్క్ ఫా ర్మా, సిప్లా వంటి ఫార్మా షేర్లు తగ్గాయి.
Appకీ కహానీ...
వెల్త్ ట్రస్ట్ ఫండ్
స్టాక్ మార్కెట్ గురించి అందరికీ అవగాహన ఉం డదు. కానీ వీరిలో కొంత మంది స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలని భావిస్తుంటారు. ఇలాంటి వారికి మ్యూచువల్ ఫండ్స్ అనువుగా ఉంటాయి. వీటిల్లో చాలా రకాల స్కీమ్స్ ఉన్నాయి. ఇలాంటప్పుడు దేనిలో ఇన్వెస్ట్ చేయాలో అర్థం కాదు. ఈ సమస్యకు సమాధానమే ఈ ‘వెల్త్ ట్రస్ట్’ యాప్. దీన్ని గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ప్రత్యేకతలు
భారతదేశపు తొలి డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ యాప్ ఇది. దీని ద్వారా దాదాపు 25 ఏఎంపీలకు చెందిన వివిధ రకాల డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ ప్లాన్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు.
నిమిషాల్లో రెగ్యులర్ ప్లాన్‌ను డైరెక్ట్ మ్యూచువల్ ప్లాన్‌గా మార్చుకొని ప్రతి ఏటా 1.5 శాతాన్ని పొదుపు చేసుకోవచ్చు.
మనం భరించగలిగే రిస్క్, ఆశించే రిటరŠన్స్ ప్రాతిపదికన దాదాపు 4,000కుపైగా స్కీమ్స్‌ను జల్లెడపట్టి ఏవి అనుకూలమైనవో తెలియజేస్తుంది ఈ యాప్.
ఎలాంటి కమిషన్ ఉండదు. కాగితాలతో పనిలేదు. భద్రతకు ఢోకా లేదు. స్మార్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ ఎలాగో ఉంది.
అలాగే వీటితోపాటు అనలైజర్, స్మార్ట్ సెర్చ్, ఆర్గనైజ్‌డ్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్, ఫండ్ రికమెండేషన్, సిప్ వంటి సౌలభ్యాలు కూడా అందుబాటులో ఉండటం గమనార్హం