న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ నిధుల సమీకరణపై కన్నేసింది. గ్రూప్‌లోని రెండు కంపెనీలలో వాటాల విక్రయం ద్వారా 2.5 బిలియన్ డాలర్లు(రూ. 21,000 కోట్లు) సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. గ్రూప్‌లోని ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ రూ. 12,500 కోట్లు, అదానీ ట్రాన్స్‌మిషన్ రూ. 8,500 కోట్లు చొప్పున సమీకరించ నున్నట్లు స్టాక్ ఎక్స్ఛేజీలకు సమాచారమిచ్చాయి.
ఈ బాటలో అదానీ గ్రీన్ ఎనర్జీ సైతం శనివారం బోర్డు సమావేశాన్ని నిర్వహించ తలపెట్టినప్పటికీ ఈ నెల 24కు వాయిదా పడింది. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల విక్రయాన్ని చేపట్టనుంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం మధ్యప్రాచ్యం, యూరప్ నుంచి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. (కేంద్రం గుడ్ న్యూస్: మొబైల్ పోతే..మే 17 నుంచి కొత్త విధానం)
అదానీ గ్రూప్‌నకు వ్యతిరేకంగా యూఎస్ షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ నివేదిక వెలువరించడంతో అదానీ ఎంటర్‌ప్రైజెస్ చేపట్టిన రూ. 20,000 కోట్ల ఎఫ్‌పీవోను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇష్యూ పూర్తిగా సబ్‌స్క్రయిబ్ అయినప్పటికీ కంపెనీ ఇన్వెస్టర్లకు సొమ్మును వాపసు చేసింది. ఇది జరిగిన మూడు నెలల తదుపరి తిరిగి గ్రూప్ కంపెనీలు వాటా విక్రయం ద్వారా నిధుల సమీకరణకు తెరతీయడం గమనార్హం! (స్వీట్ కపుల్ సక్సెస్ స్టోరీ: తొలి ఏడాదిలోనే రూ.38 కోట్లు)
Comments
Please login to add a commentAdd a comment