
న్యూఢిల్లీ: బీటూబీ ఈకామర్స్ సంస్థ(ప్లాట్‌ఫామ్) ఉడాన్ తాజాగా 34 కోట్ల డాలర్లు(సుమారు రూ. 2,822 కోట్లు) సమీకరించింది. సిరీస్–ఈ ఫండింగ్‌లో భాగంగా ఎంఅండ్‌జీ పీఎల్‌సీ అధ్యక్షతన పలు పీఈ సంస్థలు పెట్టుబడులను సమకూర్చాయి. కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన లైట్‌స్పీడ్ వెంచర్ పార్ట్‌నర్స్, డీఎస్‌టీ గ్లోబల్ సైతం నిధులు సమకూర్చాయి.
బిజినెస్ నిర్వహణకు అవసరమైన పూర్తిస్థాయి పెట్టుబడులను సమకూర్చుకోవడంతో రానున్న 12–18 నెలల్లో లాభాల్లోకి ప్రవేశించే లక్ష్యంతో సాగుతున్నట్లు ఈ సందర్భంగా ఉడాన్ తెలియజేసింది. ప్రస్తుత రుణాలను ఈక్విటీగా మార్పు చేయడంతోపాటు.. తాజా ఈక్విటీ జారీ ద్వారా నిధుల సమీకరణ చేపట్టినట్లు వెల్లడించింది. వెరసి బ్యాలన్స్‌షీట్ పటిష్టంకానున్నట్లు పేర్కొంది. కస్టమర్ సేవలు, మార్కెట్ విస్తరణ, వెండార్ భాగస్వామ్యాలు, సరఫరా చైన్, క్రెడిట్ తదితరాలపై నిధులను వెచ్చించనున్నట్లు వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment