
మూడు నెలల నుంచి నా ప్రపంచమంతా నా పిల్లాడి చూట్టే తిరుగుతుంది. వాడు ఈ లోకంలోకి వచ్చాక మా జీవితమే మారిపోయింది. వాడి బోసి నవ్వులు చూస్తూ మురిసిపోవడం మాకు రోజువారీ పనిగా మారింది. కానీ గత కొన్ని రోజులుగా వాడు పాలు తాగడం లేదు, నిద్ర పోవడం లేదు, శ్వాస భారంగా తీసుకుంటున్నాడు. బోసి నవ్వులు వాడి పసి మోము నుంచి ఎందుకు దూరమవుతున్నాయి?
నా భర్త కూలిగా పని చేస్తుంటే నేను ఇంటి పనులకే పరిమితమయ్యాను. మాకు లేకలేక కలిగిన కొడుక్కి సత్యశరణ్‌గా పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాం. మాకు పెద్దగా సిరి సంపదలు లేకపోయినా సత్య రాకతో సంతోషానికి లోటు లేకుండా గడుపుతున్నాం.
ఉన్నట్టుండి సత్య బరువు తగ్గడం మొదలైంది. ఆ వయస్సు పిల్లలతో పోల్చితే బలహీనంగా కనిపిస్తున్నాడు. పాలు కూడా తాగడం తగ్గించాడు. నిద్ర పోవడం లేదు. ఏ కాసేపో పడుకున్నా.. అంతలోనే ఉలిక్కపడుతున్నాడు. శ్వాస తీసుకోవడానికి కష్టపడుతున్నాడు. బిడ్డకు ఏదో కష్టం వచ్చిందనిపించి ఆలస్యం చేయకుండా వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాను.
ఆస్పత్రిలో రకరకాల టెస్టులు చేసిన డాక్టర్లు నా బిడ్డకు గుండెకు సంబంధించిన వ్యాధి ఉందని తేల్చారు. లార్జ్ పీడీఏ విత్ ఫీచర్స్ ఆఫ్ కంజెస్టివ్ ఫెయిల్యూర్ అనే సమస్య ఉందన్నారు. ఆపరేషన్ చేసి ఈ సమస్యను తొలగించవ్చని చెప్పారు. అందుకు రూ. 5 లక్షల వరకు ఖర్చు వస్తుందని చెప్పారు.
మాకు పెద్ద ఆస్తిపాస్తులు లేవు. నా భర్త కూలి. లోన్లు, అప్పులు కూడా తెచ్చే పరిస్థితి లేదు. ఉన్నదాంట్లోనే విలువైన వస్తులు అమ్మగా వచ్చిన డబ్బులు ఆస్పత్రి ఖర్చులకే సరిపోయాయి. బిడ్డ ఆపరేషన్ చేయాలంటే రూ. 5 లక్షలు కావాలి. ఆలస్యమయ్యే ప్రతీ రోజు నా కొడుకు ప్రమాదానికి మరింత చేరువ అవుతున్నట్టే. అది తలచుకుంటే గుండె తరుక్కు పోతుంది.
గుండె సమస్యతో సత్య పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే కంట నీరు ఆగడం లేదు. ఇదే సమయంలో మెడికల్ ఎమర్జెన్సీలో ఫండ్ రైజింగ్ చేసే కెట్టో గురించి తెలిసింది. మా చిన్నారి సత్య శరణ్ ఆపరేషన్‌కి అవసరమైన సాయం చేయండి. వాడి ప్రాణాలను కాపాడండి. (అడ్వటోరియల్)
సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment