
సాక్షి, తాడేపల్లి: ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఏమాత్రం వెనుకకు తగ్గకుండా ఏపీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. లాక్‌డౌన్ విపత్తు నుంచి మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రేపు (శుక్రవారం) వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డ్వాక్రా మహిళలతో సీఎం మాట్లాడనున్నారు. 8.78 లక్షల మహిళా స్వయం సహాయక సంఘాల్లో 93 లక్షల మంది ఆడ పడచులకు లబ్ధి చేకూరనుంది.
ఇప్పటికే రెండు దశల్లో వారి రుణాల వడ్డీ కోసం ప్రభుత్వం 1400 కోట్లు విడుదల చేసింది. శుక్రవారం ఆన్‌లైన్ ద్వారా వడ్డీ మొత్తాన్ని ఆయా బ్యాంకుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. లాక్‌డౌన్ సమయంలో స్వయం సహాయక సంఘాలకు సీఎం వైఎస్ జగన్ అండగా నిలవడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment