చెన్నై: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ హమీ ఇచ్చిన కనీస ఆదాయ పథకాన్ని దశల వారీగా అమలు చేస్తామని, దాదాపు 5 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తామని కాంగ్రెస్ నేత చిదంబరం చెప్పారు. ఈ విషయంలో ఆర్థికవేత్తలు, నిపుణులతో చర్చించామని, ఈ పథకాన్ని అమలు చేసే సామర్థ్యం భారత్‌కు ఉందని చాలామంది అంగీకరించినట్లు ఆయన చెప్పారు. పథకం అమలుకు జీడీపీలో 1.8 శాతం మాత్రమే అవసరం అవుతుందని వివరించారు. ఈ పథకాన్ని తొలుత క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే అమలు చేస్తామని తెలిపారు. 2009లో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం అమలు చేసినప్పుడు.. దాని అమలు సాధ్యం కాదని బీజేపీ నేత జైట్లీ విమర్శించారని, కానీ దాన్ని విజయవంతంగా అమలు చేసినట్లు గుర్తుచేశారు. కుటుంబానికి అవసరమైన మొత్తం ఆదాయాన్ని ప్రభుత్వం ఇవ్వలేదని, అందుకే కనీస ఆదాయం అందజేస్తామని చెప్పారు.మహిళ పేరుపై బ్యాంకు ఖాతా తెరవాలని, ఆ ఖాతాలోకి ఏటా రూ.72 వేలు జమ చేస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment