
సాక్షి చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కొత్త పథకాన్ని ప్రకటించారు. ఆ పథకంలో భాగంగా స్టాలిన్ సోమవారం రాష్ట్రంలో రోడ్డు ప్రమాద బాధితులకు వైద్య సదుపాయాలను అందించడంలో సహాయపడే వ్యక్తులకు నగదు రివార్డులు, ధృవపత్రాలను ప్రకటించారు. రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్న వారికి గోల్డెన్ అవర్ వ్యవధిలో వైద్య సాయం అందిలే ఆసుపత్రులకు తరలించి సాయం చేసిన వ్యక్తులు ప్రశంసా పత్రం తోపాటు రూ.5 వేల నగదు పారితోషకం ఇస్తాం అని స్టాలిన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
గాయపడిన వారికి మొదటి 48 గంటల్లో ఉచిత వైద్యం అందించే 'ఇన్నుయిర్ కాప్పోన్' పథకాన్ని ముఖ్యమంత్రి గతంలోనే ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 609 ఆసుపత్రులు, 408 ప్రైవేట్ ఆసుపత్రులు, 201 ప్రభుత్వ ఆసుపత్రులు గోల్డెన్ అవర్‌లో వైద్యం అందించి ప్రాణాలను రక్షించడానికి నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నాయి. ఈ ఇన్నుయిర్ కాప్పోన్ పథకం బాధితునికి గరిష్టంగా సుమారు లక్ష రూపాయల వరకు దాదాపు 81 గుర్తింపు పొందిన ప్రభుత్వాసుపత్రులలో వైద్య భీమాను పొందగలుగుతారు.
అయితే మొదటి 48 గంటల్లో తమిళనాడు ప్రమాద బాధితులు లేదా తమిళనాడులో ప్రమాదం బారిన పడిని ఇతర రాష్రల వారికి ఉచిత వైద్యం అందించబడుతుంది. ముఖ్యమంత్రి సమగ్ర భీమా పథకం లబ్ధిదారులు అదే ఆసుపత్రిలో చికిత్స కొనసాగించడానికి అనుమతిస్తారు. అయితే ఈ పథకం లేదా ఏదైనా భీమా పథకం పరిధిలోనికి రానివారు అతడు లేదా ఆమె ప్రమాదం నుంచి కోలుకునేంత వరకు మాత్రమే ఉచిత వైద్యం అందిస్తారు.
(చదవండి: ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన హీరో విశాల్ జట్టు)
Comments
Please login to add a commentAdd a comment