PM Vishwakarma Scheme: 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విశ్వకర్మ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. సంప్రదాయ నైపుణ్యాలు కలిగిన వారి కోసం 13 -15వేల కోట్ల రూపాయల కేటాయింపుతో విశ్వకర్మ పథకాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు. తాజాగా నైపుణ్యాలు కలిగినవ్యక్తులను ఆదుకునేందుకు ‘పీఎం విశ్వకర్మ’ పథకానికి బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రధానమంత్రి ఆమోదం తెలిపారని కేంద్ర మంత్రి అశ్విని వైష్షవ్ వెల్లడించారు.ఈ పథకం వల్ల 30 లక్షల మంది హస్తకళాకారులు మరియు వారి కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర మంత్రి తెలిపారు.
2028 వరకు ఐదు సంవత్సరాల కాలానికి రూ13,000 కోట్ల ఆర్థిక వ్యయంతో కూడిన ఈ పథకం, తొలి ఏడాది 18 సంప్రదాయ వ్యాపారాలను కవర్ చేస్తుంది. ఇందులో భాగంగా లక్ష రూపాయలను రుణాన్ని ఇవ్వనున్నట్టు కేంద్ర మంత్రి ప్రకటించారు. "పీఎం విశ్వకర్మ" కింద తొలి విడతగా వడ్రంగులు, పడవలు తయారు చేసేవారు, కమ్మరి, తాళాలు చేసేవారు, స్వర్ణకారులు, కుమ్మరులు, శిల్పులు, చెప్పులు కుట్టేవారు తాపీ పని వారికి లబ్ధి చేకూరనుంది. ఈ రుణాలపై కేవలం 5 శాతం వడ్డీని మాత్రమే వసూలు చేయన్నుట్టు తెలిపారు. చేతి వృత్తుల కళాకారులకు, మత్య్సుకారులకు, తాపీ పనిచేసే వారికి ఆర్థిక చేయూతనందించాలనేది లక్ష్యమన్నారు.
అలాగే మొబిలిటీ ఫండ్ కింద రూ.57వేల కోట్లు కేటాయించినట్టు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. పీఎం ఈ-బస్ సేవకు కేంద్రకేబినెట్ ఆమోదం తెలిపిందనీ, దీని కింద100 నగరాలు, పట్టణాలకు 10 వేల ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తేనున్నట్టు తెలిపారు.
ప్రైవేట్-పబ్లిక్ పార్టనర్‌షిప్ మోడల్‌లో సిటీ బస్సుల కార్యకలాపాలను 10,000 ఇ-బస్సులను అందించే పథకం అంచనా వ్యయం రూ. 57,613 కోట్లు. ఈ పథకంలో రెండు విభాగాలు ఉన్నాయి - ఒకటి సిటీ బస్ సేవలను పెంపొందించడానికి మరియు మరొకటి గ్రీన్ అర్బన్ మొబిలిటీ ఇనిషియేటివ్స్ కింద ఇన్‌ఫ్రా అభివృద్ధి చేయడానికి సిటీ బస్సు కార్యకలాపాల్లో సుమారు 10,000 బస్సులను ఏర్పాటు చేయడం ద్వారా ఈ పథకం 45,000 నుండి 55,000 ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టిస్తుంది.
The PM in Union Cabinet meeting today approved ‘PM Vishwakarma’ scheme to support people with traditional skills. Under this scheme, loans up to Rs 1 lakh will be provided on liberal terms: Union Minister Ashwini Vaishnaw pic.twitter.com/CcDkV5slX1
— ANI (@ANI) August 16, 2023
Comments
Please login to add a commentAdd a comment