
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మహిళల కోసం 'ఆధార్ శిలా' అనే పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. పథకంలో భాగంగా కట్టిన మొత్తానికి గాను అదనంగా రెండు రెట్లు నగదును సొంతం చేసుకోవచ‍్చు.
ఎల్‌ఐసీ మహిళలకు స్వావలంబన చేకూర్చేందుకు ఆధార్ శిలా పథకాన్ని ప్రవేశపెట‍్టింది. ఈ పథకంలో భాగంగా 8 సంవత్సరాల నుంచి 55 ఏళ్ల వయస్సున్న మహిళలు 20ఏళ్లపాటు ఏడాదికి రూ.10,959 అంటే రోజుకి రూ.29 చెల్లించాలి. ఇలా చెల్లించిన మొత్తం 20ఏళ్లకు రూ.2,19,180 అవుతుంది. మెచ‍్యూరిటీ సమయంలో రూ.4లక్షలు వస్తాయి.
అంతేకాదు ఈ పథకం రిటర్న్ ఎండోమెంట్ పాలసీ కిందకు వస్తుంది.అంటే పెట్టుబడి ప్రణాళికపై హామీనిచ్చే రాబడులతో పాటు, పెట్టుబడి పెట్టిన మొత్తానికి ఎల్‌ఐసీ సెక్యూరిటీ కవరేజీని అందిస్తోంది.ఉదాహరణకు పెట్టుబడిదారుడు మెచ్యూరిటీ వ్యవధికి ముందే మరణిస్తే మరణించిన వారి బంధువులకు ఎల్‌ఐసీ ఆర్థిక సహాయం అందిస్తుంది. పాలసీలో భాగంగా కుటుంబానికి కనీసం రూ .75,000 నుంచి గరిష్టంగా రూ.3,00,000 వరకు ఆర్ధికంగా భరోసా ఇస్తుంది.