lic of india
-
ఎల్ఐసీ.. ఆదాయం అదరహో
ముంబై: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 11 రెట్లు దూసుకెళ్లి రూ. 15,952 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 1,434 కోట్లు ఆర్జించింది. ఇందుకు భారీగా పెరిగిన పెట్టుబడుల విక్రయ లాభాలు దోహదం చేశాయి. ఈ కాలంలో మొత్తం ప్రీమియం ఆదాయం 27 శాతం పురోగమించి రూ. 1,32,632 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 1,04,914 కోట్లు మాత్రమే నమోదైంది. మొత్తం ఆదాయం సైతం రూ. 18,72,044 కోట్ల నుంచి రూ. 22,29,489 కోట్లకు జంప్‌చేసింది. వ్యాపార వృద్ధిని ప్రతిఫలించే తొలి ఏడాది ప్రీమియం రూ. 8,198 కోట్ల నుంచి రూ. 9,125 కోట్లకు బలపడింది. రెన్యువల్ ప్రీమియం స్వల్ప వృద్ధితో రూ. 56,156 కోట్లకు చేరగా.. సింగిల్ ప్రీమియం 62 శాతం అధికమై రూ. 66,901 కోట్లను తాకింది.ఫలితాల నేపథ్యంలో ఎల్ఐసీ షేరు ఎన్ఎస్ఈలో 1 శాతం బలపడి రూ. 627 వద్ద ముగిసింది. -
రూ. 5.41 లక్షల కోట్లకు..ఎల్ఐసీ ఇండియన్ ఎంబెడెడ్ విలువ!
ముంబై: బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) 2022 మార్చికల్లా ఇండియన్ ఎంబెడెడ్ విలువ(ఐఈవీ)ను రూ. 5,41,492 కోట్లుగా మదింపు చేసింది. గతేడాది(2021) ఇదే కాలానికి కంపెనీ ఐఈవీ రూ. 95,605 కోట్లుగా నమోదైంది. లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్‌లో వాటాదారుల కన్సాలిడేటెడ్ విలువను ఎంబెడెడ్ విలువ(ఈవీ)గా పేర్కొంటారు. ఐఈవీ మదింపును మిల్లీమ్యాన్ అడ్వయిజర్స్ పూర్తి చేసినట్లు ఎల్ఐసీ ఎండీ రాజ్ కుమార్ వెల్లడించారు. ఇకపై ఐఈవీని ఆరు నెలలకోసారి వెల్లడించనున్నట్లు తెలియజేశారు. కాగా.. 2021 సెప్టెంబర్ చివరికి ఐఈవీ రూ. 5,39,686 కోట్లకు చేరినట్లు ఎల్ఐసీ తెలియజేసింది. మార్చితో ముగిసిన గతేడాది(2021–22) కొత్త బిజినెస్ విలువ(వీఎన్‌బీ) రూ. 7,6019 కోట్లు చేరింది. 2020–21 మార్చికల్లా వీఎన్‌బీ రూ. 4,167 కోట్లుగా నమోదైంది. గతేడాది వీఎన్‌బీ మార్జిన్ 9.9 శాతం నుంచి 15.1 శాతానికి బలపడింది. ఇక వార్షిక ప్రీమియం(ఏపీఈ) రూ. 45,588 కోట్ల నుంచి రూ. 50,390 కోట్లకు బలపడింది. కాగా, ఎన్ఎస్ఈలో ఎల్ఐసీ షేరు 0.5 శాతం నీరసించి రూ. 715 వద్ద ముగిసింది. -
ఎల్ఐసీ పాలసీదారులకు శుభవార్త!
ఎల్ఐసీ తన పాలసీదారులకు శుభవార్త అందించింది. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) వ్యక్తిగత ల్యాప్స్ స్థితిలో ఉన్న పాలసీలను పునరుద్ధరించడానికి రెండు నెలల సమయాన్ని ఇచ్చింది. ఎల్ఐసీ గురుంచి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రజల దగ్గరికి చేరువ కావడం కోసం ఎప్పటికప్పుడు సరికొత్త పాలసీల ప్రకటిస్తూ ఉంటుంది. ఎవరైతే ఎల్ఐసీ పాలసీ తీసుకోని ప్రీమియం రెగ్యులర్‌గా చెల్లించకపోతే వారి ఎల్ఐసీ పాలసీలు ల్యాప్స్ అవుతాయి. ఎల్ఐసీ పాలసీ ల్యాప్స్ అయితే కనుక భీమా, ఇతర ప్రయోజనాలు లభించవు. అందుకే ఎప్పటికప్పుడు ప్రీమియం రెగ్యులర్‌గా చెల్లించాలని పేర్కొంటుంది. ఒకసారి పాలసీ ల్యాప్స్ అయితే పునరుద్ధరించడం కొంచెం కష్టం అవుతుంది. ఎల్ఐసీ నిర్వహించే ప్రత్యేక కార్యక్రమం కింద మాత్రమే రుసుము చెల్లించి పాలసీను పునరుద్ధరించుకోవచ్చు. తాజాగా అలాంటి 'స్పెషల్ రివైవల్ క్యాంపైన్' అనే కార్యక్రమాన్ని అక్టోబర్ 22 వరకు నిర్వహిస్తుంది. ఈ ప్రచారంలో భాగంగా, పాలసీదారులు తమ బీమా పాలసీలను పునరుద్ధరించడానికి ప్రోత్సాహకంగా ఎల్ఐసీ ఆలస్య రుసుము ఫీజులపై రాయితీ కూడా అందిస్తుంది.(చదవండి: వొడాఫోన్ ఐడియాకు గట్టి ఎదురుదెబ్బ!) pic.twitter.com/U5tTme79hY — LIC India Forever (@LICIndiaForever) August 23, 2021 ఎవరు అర్హులు నిర్దిష్ట అర్హత కలిగిన, కొన్ని నియమనిబంధనలకు లోబడి మొదటి ప్రీమియం చెల్లించని నాటి నుంచి ఐదేళ్లలో పాలసీ పునరుద్ధరించవచ్చని ఎల్ఐసీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ల్యాప్స్ స్థితిలో ఉన్న పాలసీలు గడువు పూర్తి కానీ పాలసీదారుల మాత్రమే అర్హులు అని తెలిపింది. అయితే, టర్మ్ అస్యూరెన్స్, హై రిస్క్ ప్లాన్లను దీని నుంచి మినహాయించింది. "ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా చెల్లించిన మొత్తం ప్రీమియంలను బట్టి టర్మ్ అస్యూరెన్స్, హై రిస్క్ ప్లాన్లు కాకుండా ఇతర పాలసీల ఆలస్య రుసుము ఫీజులపై రాయితీలు ఇవ్వబడుతున్నాయి" అని ఎల్ఐసీ ఆఫర్ కూడా ఇచ్చింది. హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ, మైక్రో ఇన్స్యూరెన్స్ ప్లాన్స్ కూడా రివైవ్ చేసుకోవచ్చు అని తెలిపింది. ఆలస్య రుసుము ఫీజులపై రాయితీ ఎంత ఎల్ఐసీ రూ.1,00,000 లోపు ప్రీమియంపై ఆలస్య రుసుములో 20 శాతం లేదా గరిష్ఠంగా రూ.2,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే, రూ.1-3 లక్షల మధ్య గల ప్రీమియంపై ఆలస్య రుసుములో 25 శాతం లేదా గరిష్ఠంగా రూ.2,500 వరకు తగ్గింపు లభిస్తుంది. ప్రీమియం రూ.3 లక్షలకు మించి ఉన్నట్లయితే ఆలస్య రుసుములో 30 శాతం లేదా గరిష్ఠంగా రూ.3,000 వరకు తగ్గింపు లభిస్తుంది. "అనివార్య పరిస్థితుల కారణంగా సకాలంలో ప్రీమియంలు చెల్లించలేకపోయిన పాలసీదారుల ప్రయోజనం కోసం ఈ ప్రచార కార్యక్రమం ప్రారంభించబడింది. భీమా కవరేజీ పునరుద్ధరించడం కోసం పాత పాలసీని పునరుద్ధరించడం మంచి నిర్ణయం" అని ఎల్ఐసీ తెలిపింది. -
రోజుకు రూ.29 పొదుపు చేస్తే చాలు..చేతికి రూ.4లక్షలు!
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మహిళల కోసం 'ఆధార్ శిలా' అనే పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. పథకంలో భాగంగా కట్టిన మొత్తానికి గాను అదనంగా రెండు రెట్లు నగదును సొంతం చేసుకోవచ్చు. ఎల్ఐసీ మహిళలకు స్వావలంబన చేకూర్చేందుకు ఆధార్ శిలా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా 8 సంవత్సరాల నుంచి 55 ఏళ్ల వయస్సున్న మహిళలు 20ఏళ్లపాటు ఏడాదికి రూ.10,959 అంటే రోజుకి రూ.29 చెల్లించాలి. ఇలా చెల్లించిన మొత్తం 20ఏళ్లకు రూ.2,19,180 అవుతుంది. మెచ్యూరిటీ సమయంలో రూ.4లక్షలు వస్తాయి. అంతేకాదు ఈ పథకం రిటర్న్ ఎండోమెంట్ పాలసీ కిందకు వస్తుంది.అంటే పెట్టుబడి ప్రణాళికపై హామీనిచ్చే రాబడులతో పాటు, పెట్టుబడి పెట్టిన మొత్తానికి ఎల్ఐసీ సెక్యూరిటీ కవరేజీని అందిస్తోంది.ఉదాహరణకు పెట్టుబడిదారుడు మెచ్యూరిటీ వ్యవధికి ముందే మరణిస్తే మరణించిన వారి బంధువులకు ఎల్ఐసీ ఆర్థిక సహాయం అందిస్తుంది. పాలసీలో భాగంగా కుటుంబానికి కనీసం రూ .75,000 నుంచి గరిష్టంగా రూ.3,00,000 వరకు ఆర్ధికంగా భరోసా ఇస్తుంది. -
ఈ స్కీమ్‌లో చేరితే ప్రతి నెల పదివేల పెన్షన్
కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి వయ వందన యోజన పథకం గడువును ఇటీవల పొడిగించింది. 2021 మార్చి 31తో ముగిసిన గడువును మరో మూడేళ్లు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ కొద్ది రోజుల క్రితం నిర్ణయం తీసుకుంది. ఈ స్కీమ్‌లో కొత్తగా చేరాలనుకునేవారికి 2023 మార్చి 31 వరకు అవకాశం ఉంది. 60ఏళ్ళు పైబడిన వృద్ధుల కోసం పెన్షన్ ద్వారా అసరా కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం 2017లో ప్రధాన మంత్రి వయ వందన యోజన పెన్షన్ స్కీమ్ ను ప్రారంభించింది. ప్రస్తుతం ఉన్న ఇతర పొదుపు పథకాలతో పోలిస్తే ప్రధాన మంత్రి వయ వందన యోజన స్కీమ్‌లోనే ఎక్కువ వడ్డీ లభిస్తుంది. ఇందులో చేరిన వారికీ 2020-21 ఆర్థిక సంవత్సరానికి 7.4 శాతం వడ్డీని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ప్రతీ ఏడాది కేంద్ర ప్రభుత్వం వడ్డీని నిర్ణయిస్తుంది కేంద్ర ప్రభుత్వం. భారత ప్రభుత్వానికి చెందిన బీమా రంగ సంస్థ లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ స్కీమ్ వివరాలను చేస్తోంది. ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ద్వారా ఈ స్కీమ్ కు దరఖాస్తు తీసుకోవచ్చు. ఈ పాలసీ తీసుకోవాలంటే ఆధార్ నెంబర్ తప్పనిసరి. దీని ద్వారా పెన్షన్ పొందాలనుకునే వారు రూ.1,56,658 నుంచి రూ.15,66,580 లోపు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ స్కీమ్‌లో పెట్టిన పెట్టుబడిని బట్టి నెలకు రూ.1,000 నుంచి రూ.10,000 మధ్య వడ్డీ రూపంలో పెన్షన్ పొందొచ్చు. నెలకు రూ.10,000 పెన్షన్ కావాలనుకునే వారు రూ.15,66,580 పెట్టుబడి పెట్టాలి. ఈ స్కిమ్ గడువు వ్యవధి 10 ఏళ్లు. 10 ఏళ్లు పూర్తైన తర్వాత పెట్టుబడి మొత్తం తిరిగివస్తుంది. ప్రధాన మంత్రి వయ వందన యోజన స్కీమ్‌లో చేరడానికి కనీస వయస్సు 60 ఏళ్లు కాగా గరిష్ట పరిమితి లేదు. ఈ స్కీమ్‌లో చేరిన వారికి నెలకు రూ.1,000, మూడు నెలలకు రూ.3,000, ఆరు నెలలకు రూ.6,000, ఏడాదికి రూ.12,000 కనీస పెన్షన్ లభిస్తుంది. ఏడాదికి రూ.12,000 పెన్షన్ పొందాలనుకుంటే రూ.1,56,658 పెట్టుబడి పెట్టాలి. ప్రతి నెల రూ.10,000 పెన్షన్ కావాలంటే రూ.15,66,580 ఇన్వెస్ట్ చేయాలి. పాలసీ ప్రారంభించి మూడేళ్లు పూర్తైన తర్వాత గరిష్టంగా 75 శాతం వరకు రుణం తీసుకోవచ్చు. వడ్డీ ఏడాదికి 10 శాతం చెల్లించాలి. ఒకవేళ 10 ఏళ్లు పూర్తికాక ముందే పెట్టుబడి పెట్టిన వ్యక్తి చనిపోతే పెట్టుబడి మొత్తం వారి జీవిత భాగస్వామి లేదా పిల్లలు లేదా నామినీకి వస్తాయి. 10 ఏళ్ల గడువు పూర్తికాక ముందే పాలసీ వద్దనుకుంటే మీరు ఇన్వెస్ట్ చేసిన దాంట్లో 98 శాతం మాత్రమే వెనక్కి వస్తుంది. చదవండి: అనధికారికంగా ఒక వ్యక్తి వద్ద ఎంత బంగారం ఉండవచ్చు? -
ఎల్ఐసీకి షోకాజ్ నోటీసులు
జీవిత బీమా సంస్థ ఎల్ఐసీకి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. వినియోగదారులకు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ఎల్ఐసీకి బీమా నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏ) నోటీసులు జారీచేసింది. జీవన్ ఆనంద్, జీవన్ తరంగ్, బీమా బచత్ లాంటి మొత్తం 34 ఉత్పత్తులను జనవరి 1 తర్వాత ఎల్ఐసీ మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంది. కానీ, డిసెంబర్ నెలలోనే ఇందుకు సంబంధించిన ప్రకటనలను జారీచేసి, వినియోగదారులను తప్పుదోవ పట్టించింది. దీంతో ఎల్ఐసీని తప్పుపడుతూ ఐఆర్డీఏ షోకాజ్ నోటీసులు జారీచేసింది.