ఎల్ఐసీకి షోకాజ్ నోటీసులు
జీవిత బీమా సంస్థ ఎల్ఐసీకి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. వినియోగదారులకు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ఎల్ఐసీకి బీమా నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏ) నోటీసులు జారీచేసింది.
జీవన్ ఆనంద్, జీవన్ తరంగ్, బీమా బచత్ లాంటి మొత్తం 34 ఉత్పత్తులను జనవరి 1 తర్వాత ఎల్ఐసీ మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంది. కానీ, డిసెంబర్ నెలలోనే ఇందుకు సంబంధించిన ప్రకటనలను జారీచేసి, వినియోగదారులను తప్పుదోవ పట్టించింది. దీంతో ఎల్ఐసీని తప్పుపడుతూ ఐఆర్డీఏ షోకాజ్ నోటీసులు జారీచేసింది.