
న్యూఢిల్లీ: ఐదు కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన సౌర చరఖా పథకాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ నెల 27న ప్రారంభించనున్నారు. తొలి రెండేళ్లలో దేశవ్యాప్తంగా 50 క్లస్టర్లలో ఈ పథకాన్ని ప్రారంభిస్తామనీ, కేంద్రం రూ. 550 కోట్ల రాయితీని అందిస్తుందని సూక్ష, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ బుధవారం వెల్లడించారు. ఈ పథకంతో తొలి రెండేళ్లలోనే లక్ష వరకు ఉద్యోగాల సృష్టి జరుగుతుందని ఎంఎస్‌ఎంఈ కార్యదర్శి చెప్పారు. ఒక్కో క్లస్టర్‌లో 400 నుంచి 2,000 మంది వరకు చేతి వృత్తుల వారికి ఉపాధి దొరుకుతుందన్నారు.
దేశవ్యాప్తంగా 15 అత్యాధునిక సాంకేతిక కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందనీ, వాటిలో 10 వచ్చే మార్చికల్లా కార్యకలాపాలను ప్రారంభిస్తాయని చెప్పారు. ఈ పదింటిలో విశాఖపట్నం, పుదుచ్చేరి, బెంగళూరు కూడా ఉన్నాయి. బుధవారం ముంబైలోని ప్రభాదేవి ప్రాంతంలోని 33 అంతస్తుల ‘బ్యూ మాండ్’ ఆకాశహర్మ్యం నుంచి ఎగసిపడుతున్న మంటలు. ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ భవంతి 26వ అంతస్తులో బాలీవుడ్ నటి దీపికా పదుకొణె నివసిస్తున్నారు. 32, 33వ అంతస్తుల్లో మాత్రమే మంటలు వ్యాపించాయి. భవంతిలోని వారిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment