
సాక్షి, న్యూఢిల్లీ : ఒక దేశం-ఒకే రేషన్ కార్డు సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఏపీ, తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో బుధవారం ప్రారంభించింది. నూతన సంవత్సరం తొలిరోజున ఏపీ, తెలంగాణా, గుజరాత్, మహారాష్ట్ర, హరియాణ, రాజస్ధాన్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, గోవా, జార్ఖండ్, త్రిపురల్లో ప్రారంభించింది. ఈ 12 రాష్ట్రాల్లో ప్రజాపంపిణీ వ్యవస్థ లబ్ధిదారులు వారు ఏ రాష్ట్రంలో నివసిసున్నా తమ రేషన్ వాటాను పొందే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది.
2020 జూన్ నాటికి దేశంలోని అన్ని రాష్ట్రాలను ఒన్ నేషన్..ఒన్ రేషన్ సదుపాయానికి అనుసంధానిస్తారు. ఈ సదుపాయం కింద నూతన ఫార్మాట్‌లో రేషన్ కార్డును రూపొందించాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. జూన్ 1, 2020 నుంచి నూతన రేషన్ కార్డులు అందుబాటులోకి వస్తాయి. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు జారీ చేసే రేషన్ కార్డులు ఇక స్టాండర్డ్ ఫార్మాట్‌లో ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment