రాష్ట్రంలోని పౌరులందరికీ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించే ‘తెలంగాణకు కంటి వెలుగు’కార్యక్రమాన్ని ఆగస్టు 15న ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. గజ్వేల్ నియోజకవర్గంలో మధ్యాహ్నం రెండు గంటలకు కార్యక్రమాన్ని కేసీఆర్ స్వయంగా ప్రారంభించనున్నారు. అదేరోజు గవర్నర్ నరసింహన్‌తో ఇంకో ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోరనున్నట్లు ఆయన తెలిపారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఇందులో భాగస్వాములు కావాలని కోరారు.