ఉడుపి (కర్ణాటక): మధ్యతరగతి వర్గాలకు కేంద్ర ప్రభుత్వం పన్నులపరంగా పలు ప్రయోజనాలు కలి్పంచిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వార్షికంగా రూ. 7.27 లక్షల వరకు ఆదాయం పొందే వారికి కొత్త పథకంలో పన్ను భారం నుంచి మినహాయింపు ఇవ్వడం కూడా ఇందులో ఒకటని వివరించారు.
2023–24 బడ్జెట్‌లో రూ. 7 లక్షల వరకు ఆదాయంపై మినహాయింపు ప్రకటించినప్పుడు ఆ పరిమితికి మించి కాస్తంతే ఎక్కువగా ఆర్జిస్తున్న వారి పరిస్థితి ఏమిటని కొన్ని వర్గాల్లో సంశయాలు తలెత్తాయని ఆమె తెలిపారు. దీంతో అదనంగా ఆర్జించే ప్రతి రూపాయిపై ఏ స్థాయి నుంచి పన్ను కట్టాల్సి ఉంటుందనే అంశం మీద తమ బృందం మళ్లీ కసరత్తు చేసిందని వివరించారు. మొత్తం మీద ప్రస్తుతం రూ. 7.27 లక్షల వరకు పన్ను లేదని, ఆ తర్వాతే ట్యాక్స్ వర్తిస్తుందని మంత్రి చెప్పారు. కొత్త స్కీములో స్టాండర్డ్ డిడక్షన్ లేదంటూ ఫిర్యాదులు రావడంతో దాన్ని కూడా చేర్చినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment