exemption limit
-
రూ. 7.27 లక్షల వరకు ఆదాయ పన్ను ఉండదు
ఉడుపి (కర్ణాటక): మధ్యతరగతి వర్గాలకు కేంద్ర ప్రభుత్వం పన్నులపరంగా పలు ప్రయోజనాలు కలి్పంచిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వార్షికంగా రూ. 7.27 లక్షల వరకు ఆదాయం పొందే వారికి కొత్త పథకంలో పన్ను భారం నుంచి మినహాయింపు ఇవ్వడం కూడా ఇందులో ఒకటని వివరించారు. 2023–24 బడ్జెట్లో రూ. 7 లక్షల వరకు ఆదాయంపై మినహాయింపు ప్రకటించినప్పుడు ఆ పరిమితికి మించి కాస్తంతే ఎక్కువగా ఆర్జిస్తున్న వారి పరిస్థితి ఏమిటని కొన్ని వర్గాల్లో సంశయాలు తలెత్తాయని ఆమె తెలిపారు. దీంతో అదనంగా ఆర్జించే ప్రతి రూపాయిపై ఏ స్థాయి నుంచి పన్ను కట్టాల్సి ఉంటుందనే అంశం మీద తమ బృందం మళ్లీ కసరత్తు చేసిందని వివరించారు. మొత్తం మీద ప్రస్తుతం రూ. 7.27 లక్షల వరకు పన్ను లేదని, ఆ తర్వాతే ట్యాక్స్ వర్తిస్తుందని మంత్రి చెప్పారు. కొత్త స్కీములో స్టాండర్డ్ డిడక్షన్ లేదంటూ ఫిర్యాదులు రావడంతో దాన్ని కూడా చేర్చినట్లు చెప్పారు. -
ఆదాయ పన్నుపరిధిలోకి రాకపోయినా, ఐటీఆర్ ఫైలింగ్ లాభాలు తెలుసా?
సాక్షి,ముంబై: ఇన్‌కం టాక్స్ రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలుకు సమయం దగ్గరపడుతోంది. ఈ నెల (జూలై,31) చివరి లోపు తప్పనిసరిగా పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ ఫైలింగ్‌ను కచ్చితంగా పూర్తి చేయాలి. నిర్దిష్ట పరిమితి కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు ITR ఫైలింగ్ తప్పనిసరిగా చేయాల్సిందే. అయితే ఆదాయ పన్ను పరిధిలోకి రాని వారు కూడా ఐటీఆర్ ఫైలింగ్ చేయవచ్చు. దాని వల్ల చాలా ప్రయోజనాలున్నాయి రూ.2.5లక్షల్లోపు ఉన్న వారుఐటీఆర్ ఫైల్ చేయడం తప్పనిసరికాదు. ఫైల్ చేయక పోయినా జరిమానా ఉండదు. 60 ఏళ్లు పైబడి 80 ఏళ్లలోపు పన్ను చెల్లింపుదారులకు, ఈ మినహాయింపు పరిమితి రూ. 3 లక్షలు. 80 ఏళ్లు పైబడిన వారికి పన్ను మినహాయింపు పరిమితి రూ. 5 లక్షలు ఈ నేపథ్యంలోనే సాధారణంగా చాలామంది ఐటీఆర్ దాఖలును పట్టించుకోరు. కానీ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం వల్ల ఈజీగా బ్యాంక్ రుణం పొందడం, క్రెడిట్ కార్డ్ లేదా వీసా అప్లికేషన్ ప్రాసెసింగ్ ఈజీ లాంటి ఇతర లాభాలు న్నాయి. ఐటీఆర్ ఫైలింగ్, లాభాలు ఈజీగా రుణాలు : ఏదైనా బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలంటే ఐటీఆర్ కీలకం. ఐటీఆర్‌ను బ్యాంకులు, ఇతర హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు ఆదాయ వనరుకు రుజువుగా భావిస్తాయి. సో.. రెగ్యులర్‌గా ఐటీఆర్ దాఖలు చేస్తూ ఉంటే రుణం పొందడం తేలిక. అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలో నష్టాన్ని చవిచూసి ఉంటే, తదుపరి ఏడాది సర్దుబాటు చేసుకునేందుకు వీలవుతుంది. గడువు తేదీకి ముందే ITRని ఫైల్ చేయడం ద్వారా ఈ నష్టాన్ని క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. వీసా ప్రాసెస్: అమెరికా, కెనడా,ఆస్ట్రేలియా, జర్మనీ వీసా ప్రాసెసింగ్ సమయంలోసంబంధిత ఇమ్మిగ్రెంట్ కార్యాలయంలో ఐటీ రిటర్న్స్ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. దాదాపు 3-5 ఏళ్ల ఐటీఆర్ హిస్టరీ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అంటే క్రమం తప్పకుండా ఐటీఆర్ ఫైల్ చేస్తే. ఈ ప్రాసెస్‌లో ఆటంకాలను తగ్గించు కోవచ్చు. టీడీఎస్,రాయితీ క్లెయిమ్: ఆదాయం పన్ను పరిమితికి లోబడి ఆదాయం ఉన్నా, ఐటీ విభాగం పన్ను విధించి ఉంటే దాన్ని క్లెయిమ్‌కు ఐటీఆర్ ఫైలింగ్ సాయపడుతుంది. పెట్టుబడిపై ఏదైనా పన్ను మినహాయింపు లభించిందా అని ఫారమ్ 26ASలో చెక్ చేసు కోవచ్చు. ఐటీఆర్‌ను ఆదాయం పన్ను విభాగం అధికారులు అంచనా తర్వాత, ఏమైనా రిఫండ్ ఉండే అది నేరుగా సంబంధిత వ్యక్తుల బ్యాంక్ ఖాతాలో జమవుతుంది. అలాగే, ప్రమాదవశాత్తు మరణించినా లేదా ప్రమాదంలో వైకల్యం సంభవించిన సందర్భాల్లో పరిహారం పొందేటప్పుడు కూడా ఐటీఆర్ ఒక ముఖ్యమైన ఆదాయ రుజువుగా ఉపయోగపడుతుంది. మ్యూచువల్ ఫండ్స్, షేర్లలో నష్టాలొచ్చినపుడు మీరు ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్, షేర్లలో పెట్టిన పెట్టుబడులపై నష్టాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం ఆదాయంలో సర్దుబాటు చేసుకోవచ్చు. నిర్ధిష్ట గడువులోగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారు ఈ పన్ను మినహాయింపును అభ్యర్థించవచ్చు.ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 70, 71 ఒక నిర్దిష్ట సంవత్సరంలోని నష్టాలను తదుపరి సంవత్సరానికి నష్టాలను క్యారీ ఫార్వర్డ్ చేయవచ్చు . దీంతోపాటు ఆధార్ కార్డ్ లేదా మరేదైనా డాక్యుమెంట్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఐటీఆర్ ఉపయోగపడుతుంది. ప్రభుత్వం దీన్ని అడ్రస్ఫూఫ్గా కూడా అంగీకరిస్తుంది. అలాగే స్వయం ఉపాధి పొందుతున్నవారికి, ఫారమ్ 16 అందుబాటులో లేని వారికి ఐటీఆర్ ఫైలింగ్ చాలా ఉపయోగపడుతుంది. -
‘బక్రీద్’ మినహాయింపులపై కేరళకు సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: బక్రీద్ సందర్భంగా కోవిడ్ నిబంధనలకు కేరళ ప్రభుత్వం మూడు రోజుల పాటు మినహాయింపు ఇవ్వడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మినహాయింపులపై సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టు స్పందించింది. పాజిటివిటీ రేటు కేరళలో 10% పైగానే ఉన్నా బక్రీద్ కోసం కోవిడ్ నిబంధనలకు మినహాయింపు ఇవ్వడం సరికాదని పిటిషనర్ తరఫు న్యాయవాది వికాస్ సింగ్ వాదించారు. ఈ పిటిషన్‌పై వెంటనే స్పందించాలని కేరళ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. తాజాగా మంగళవారం కూడా సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. వ్యాపారుల ఒత్తిడితో సడలింపులు ఇవ్వడమేమిటని అత్యున్నత న్యాయస్థానం నిలదీసింది. పౌరులు జీవించే హక్కుకు భగం కలిగించినట్టేనని న్యాయస్థానం పేర్కొంది. పౌరులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది. జూలై 21వ తేదీన బక్రీద్ పర్వదినం ఉండడంతో కేరళ ప్రభుత్వం మూడు రోజులు సడలింపులు ఇచ్చింది. 18 నుంచి 20వ తేదీ వరకు టెక్స్టైల్స్, ఫుట్‌వేర్, జ్యువెల్లరీ, ఫ్యాన్సీ స్టోర్ తదితర అన్ని దుకాణాలు ఉదయం 7 నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంచుకోవచ్చని కేరళ సీఎం విజయన్ ప్రకటించారు. కోవిడ్ కేసుల ఆధారంగా నిర్ధారించిన ఏ, బీ, సీ కేటగిరీ ప్రాంతాలకు ఈ మినహాయింపు వర్తిస్తుందని, పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న డీ కేటగిరీ ప్రాంతంలో 19న మాత్రమే ఈ మినహాయింపునిస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం ముందుకు వచ్చింది. -
మద్యం ప్రియులకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: ఈనెల 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మూడో విడత లాక్డౌన్లో మినహాయింపులపై కేంద్రం మరింత స్పష్టతనిచ్చింది. కోవిడ్ కంటైన్మెంట్ ఏరియాలు లేని గ్రీన్, ఆరెంజ్ జోన్లతోపాటు రెడ్ జోన్లలోనూ మద్యం విక్రయాలు జరుపుకోవచ్చని తెలిపింది. అయితే, ఇందుకు కొన్ని పరిమితులు విధించింది. మద్యం మాత్రమే విక్రయించే దుకాణాలు అయి ఉండాలి. విక్రయాల సమయంలో దుకాణం వద్ద కొనుగోలు దారులు భౌతిక దూరం(ఆరడుగుల ఎడం) పాటించాలి. అయిదుగురికి మించి దుకాణం వద్ద ఉండరాదు. ఈ మినహాయింపు ఈ నెల 4వ తేదీ నుంచి వర్తించనుంది. (ఇన్ఫెక్షన్లు తేల్చేందుకే ఎక్కువ పరీక్షలు) మార్కెట్ ఏరియాల్లో ఉన్న మద్యం దుకాణాలు, రెడ్ జోన్లలోని మాల్స్‌లో ఉన్న వాటికి ఈ వెసులుబాటు వర్తించదు. దీంతోపాటు గ్రీన్, ఆరెంజ్ జోన్లున్న ప్రాంతాల్లో సెలూన్లు తెరవొచ్చనీ, అత్యవసరం కాని వస్తువులను కూడా ఈ–కామర్స్ సంస్థలు బట్వాడా చేయవచ్చని వివరించింది. అయితే, రెడ్ జోన్లలో అత్యవసర వస్తువులను మాత్రమే సరఫరా చేసేందుకు ఈ–కామర్స్ సంస్థలకు అనుమతి ఉంటుంది. రెడ్జోన్లలో నివాసితులు తమ పని మనుషుల విషయంలో ఆ ప్రాంత సంక్షేమ సంఘాల అనుమతి ప్రకారం నడుచుకోవాలని, వారికేమైనా జరిగితే యజమానులదే బాధ్యత. 17వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించిన హోం శాఖ కొన్ని ఆంక్షలను సడలించిన విషయం తెలిసిందే. (లాక్డౌన్ : మాకు వర్క్ ఫ్రం హోమ్ బాగుంది) కరోనా సాధికారత బృందాల పునర్వ్యవస్థీకరణ కరోనాపై పోరాటానికి ఏర్పాటు చేసిన 11 ఉన్నతస్థాయి అధికారిక బృందాలను కేంద్రం పునర్వ్యవస్థీకరించింది. ఈ బృందాల్లోని కొందరు అధికారులు రిటైర్ కావడమో లేక బదిలీ కావడమో జరిగినందున ఈ మార్పు చేపట్టినట్లు తెలిపింది. ఈ బృందాల విధులు, పరిధులు యథా ప్రకారం కొనసాగుతాయని స్పష్టం చేసింది. (‘ఆరోగ్యసేతు గోప్యతపై అనుమానం’) -
చిన్న వ్యాపారులకు భారీ ఊరట
న్యూఢిల్లీ: చిన్న వ్యాపారులకు ఊరట కల్పిస్తూ జీఎస్టీ కౌన్సిల్ గురువారం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటి వరకు రూ.20 లక్షల వరకు వార్షిక వ్యాపారంపై జీఎస్టీ మినహాయింపు ఉండగా... దీన్ని రెట్టింపు చేస్తూ రూ.40 లక్షలకు పెంచింది. దీనికితోడు ఒక శాతం పన్ను చెల్లించే కాంపోజిషన్ స్కీమ్ టర్నోవర్ పరిమితిని రూ.1.5 కోట్లు చేయాలని గతంలోనే నిర్ణయించగా... ఇది వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని కౌన్సిల్ ప్రకటించింది. భారీ వరదలతో దెబ్బతిన్న కారణంగా... పునర్నిర్మాణ కార్యక్రమాలకు అవసరమైన ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు అంతర్రాష్ట్ర రవాణాపై రెండేళ్ల పాటు ఒక శాతం విపత్తు సెస్సును విధించుకునే అవకాశాన్ని కేరళ రాష్ట్రానికి కౌన్సిల్ కల్పించింది. ఈ మేరకు గురువారం జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం వార్షికంగా రూ.20 లక్షల టర్నోవర్ లోపు ఉంటే జీఎస్టీ రిజిస్ట్రేషన్ నుంచి మినహాయింపు ఉందని, దీన్ని రూ.40 లక్షలకు పెంచామని చెప్పారు. పర్వత ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ పరిమితి రూ.10 లక్షలుగా ఉండగా, ఇకపై రూ.20లక్షలు అవుతుందన్నారు. జీఎస్టీ మినహాయింపును రెట్టింపు చేయడం వల్ల... అన్ని రాష్ట్రాలు అమలు చేస్తే రూ.5,200 కోట్ల మేర పన్ను రాబడి తగ్గుతుందని అంచనా. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు ఎంఎస్ఎంఈలు, ట్రేడర్లు, సేవల రంగానికి మేలు చేస్తాయని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. సులభమైన ప్రజా అనుకూల జీఎస్టీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. కాంపోజిషన్ స్కీమ్ మినహాయింపులు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.కోటి వరకు టర్నోవర్ ఉన్న వారు... కాంపోజిషన్ స్కీమ్ కింద టర్నోవర్‌పై ఒక శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఈ పరిమితిని రూ.1.5 కోట్లకు పెంచుతూ కౌన్సిల్ నవంబర్ నాటి సమావేశంలోనే నిర్ణయం తీసుకుంది. దీన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్టు ప్రకటించింది. సర్వీస్ ప్రొవైడర్లు, వస్తు, సేవల సరఫరా దారులు రూ.50 లక్షల్లోపు టర్నోవర్ ఉంటే, కాంపోజిషన్ స్కీమ్ కింద 6 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. కాంపోజిషన్ స్కీమ్‌లో టర్నోవర్ పరిమితి పెంచటం వల్ల రూ.3,000 కోట్ల మేర ఆదాయం తగ్గొచ్చని అంచనా. ఈ నిర్ణయాలు, సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి వ్యాపారులకు (ఎంఎస్ఎంఈ) ఉపశమనం కల్పిస్తాయని జైట్లీ అభిప్రాయపడ్డారు. కాంపోజిషన్ స్కీమ్‌ను ఎంచుకునే వ్యాపారులు వార్షికంగా ఒకేసారి ట్యాక్స్ రిటర్ను వేస్తే సరిపోతుందని, పన్ను మాత్రం త్రైమాసికానికి ఓ సారి చెల్లించాల్సి ఉంటుందని చెప్పారాయన. ‘‘జీఎస్టీలో ఎక్కువ భాగం వ్యవస్థీకృత రంగం, పెద్ద కంపెనీల నుంచే వస్తోంది. ఈ నిర్ణయాలు ఎంఎస్ఎంఈలకు మేలు చేస్తాయి. వారికి పలు ఆప్షన్లు ఇచ్చాం. సేవల రంగంలో ఉంటే, 6 శాతం కాంపౌండింగ్ పొందొచ్చు. తయారీ రంగంలో ఉంటే రూ.1.5 కోట్ల టర్నోవర్‌పై ఒక శాతం కాంపౌండింగ్ ఎంచుకోవచ్చు. వీరు రూ.40 లక్షల వార్షిక టర్నోవర్ వరకు పన్ను మినహాయింపును కూడా పొందొచ్చు. సరుకుల సరఫరాదారులకు జీఎస్టీ రిజిస్ట్రేషన్, చెల్లింపు విషయంలో రూ.40 లక్షలు, రూ.20 లక్షల పరిమితులు ఉన్నాయి. పరిమితి పెంచుకునేందుకు, తగ్గించుకునేందుకు వారికి అవకాశం ఉంటుంది’’ అని అరుణ్ జైట్లీ వివరించారు. ఇతర నిర్ణయాలు... ⇒ రియల్ ఎస్టేట్‌పై జీఎస్టీ విషయంలో భిన్నాభిప్రాయాలు రావడంతో ఏడుగురు సభ్యుల మంత్రివర్గ గ్రూపును ఏర్పాటు చేయాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ⇒ లాటరీలపైనా ఇదే పరిస్థితి నెలకొనడంతో దీన్నీ మంత్రివర్గ బృందమే తేల్చనుంది. ⇒ ప్రస్తుతం రూ.20 లక్షల్లోపు టర్నోవర్‌కు పన్ను మినహాయింపు ఉన్నప్పటికీ... 10.93 లక్షల మంది పన్నులు చెల్లిస్తున్నారని కేంద్ర రెవెన్యూ సెక్రటరీ అజయ్‌భూషణ్ పాండే తెలిపారు. రూ.40 లక్షల టర్నోవర్ వరకు మినహాయింపు అనేది సరుకుల వర్తకానికి, ఒకే రాష్ట్రం పరిధిలో వాణిజ్యానికి వర్తిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రాల మధ్య లావాదేవీలకు ఇది వర్తించదన్నారు. ⇒ జీఎస్టీ కింద 1.7 కోట్ల వ్యాపారులు నమోదు చేసుకోగా, వీరిలో 18 లక్షల మంది కాంపోజిషన్ స్కీమ్‌ను ఎంచుకున్నారు. వీరు మూన్నెళ్లకోసారి పన్ను చెల్లించాలి. మిగిలిన వారు ప్రతీ నెలా పన్ను చెల్లించాలి. పైగా కాంపోజిషన్ స్కీమ్‌లో వ్యాపారులు రికార్డులను నిర్వహించాల్సిన అవసరం ఉండదు. లక్షలాది వర్తకులకు మేలు: పరిశ్రమ వర్గాల హర్షం న్యూఢిల్లీ: రూ.40 లక్షల టర్నోవర్ కలిగిన వ్యాపారులకూ జీఎస్టీ నుంచి మినహాయింపు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల దేశ పారిశ్రామిక రంగం హర్షం వ్యక్తం చేసింది. ఇది లక్షలాది వ్యాపారులకు మేలు చేస్తుందని, వ్యాపార సులభత్వాన్ని పెంచుతుందని పేర్కొంది. ‘‘జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం ఉత్పత్తుల వ్యయాన్ని తగ్గిస్తుంది. ఎంఎస్ఎంఈల పోటీతత్వాన్ని పెంచుతుంది’’ అని సీఐఐ పేర్కొంది. కాంపోజిషన్ స్కీములో మూడు నెలలకోసారి పన్ను చెల్లింపు, ఏడాదికోసారి రిటర్నుల దాఖలు అన్నది పన్నుల విధానాన్ని మరింత సులభంగా మార్చేస్తుందని, ఎంఎస్ఎంఈ రంగంపై నిబంధనల అమలు భారాన్ని తగ్గిస్తుందని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అన్నారు. లక్షలాది చిన్న, మధ్య స్థాయి వర్తకులకు ఈ నిర్ణయం మేలు చేస్తుందని అసోచామ్ పేర్కొంది.జీఎస్టీ మినహాయింపు రూ.40 లక్షలు చేయడం వల్ల, నమోదిత పన్ను చెల్లింపుదారుల సంఖ్య 50–60% మేర తగ్గుతుందని, వారికి నిబంధనల అమలు భారం తొలగిపోతుందని కేపీఎంజీ పార్ట్నర్ సచిన్ మీనన్ అభిప్రాయపడ్డారు. -
జీఎస్టీ మినహాయింపు వాళ్లకు మాత్రమేనట!
న్యూఢిల్లీ : దేశమంతటినీ ఏకీకృత పన్ను వ్యవస్థలోకి తీసుకొస్తూ గత పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రప్రభుత్వం ఆమోదించిన జీఎస్టీ బిల్లు మినహాయింపులను జీఎస్టీ కౌన్సిల్ ప్రకటించింది. ఈ పన్ను నుంచి మినహాయింపు ఇవ్వడానికి టర్నోవర్ పరిమితిని రూ.20లక్షలుగా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. అదేవిధంగా ఈశాన్య, కొండ ప్రాంతాల్లో ఈ మినహాయింపు లిమిట్ రూ.10 లక్షలని కౌన్సిల్ పేర్కొంది. జీఎస్టీ బిల్లు ఆమోదం తర్వాత తొలిసారిగా ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో జీఎస్టీ కౌన్సిల్ రెండు రోజుల పాటు సమావేశమైంది. 29 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మినహాయింపులపై జీఎస్టీ కౌన్సిల్ చర్చించింది. ప్రామాణిక జీఎస్టీ రేటు, డ్రాప్ట్ నిబంధనలను తర్వాతి భేటీలో ఈ కౌన్సిల్ నిర్ణయిస్తుందని ఆర్థికమంత్రి తెలిపారు. సెప్టెంబర్ 30న, అక్టోబర్ 17-19 తేదీల్లో ఈ కౌన్సిల్ మరోసారి సమావేశం కానుంది. అక్టోబర్ 17,18,19 తేదీల్లో జరిగే మీటింగ్‌లో జీఎస్టీ రేటును స్లాబ్స్‌ను నిర్ణయిస్తామని అరుణ్ జైట్లీ వెల్లడించారు. జీఎస్టీ రేటుపై కేంద్ర, రాష్ట్రాల అభిప్రాయాలు వేరువేరుగా ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా ఇక అన్ని సెసీలు జీఎస్టీ కిందకు వస్తాయని తెలిపారు. టర్నోవర్ పరిమితులతో పాటు మినహాయింపు ఐటమ్స్‌ను కూడా 300ల నుంచి 90కు తగ్గించింది. దీంతో జీఎస్టీ మినహాయింపులపై తెగ ఆశలు పెట్టుకున్న వారికి కొంత నిరాశే ఎదురైనట్టైంది. -
చిన్న ఆభరణ సంస్థలకు శుభవార్త
న్యూఢిల్లీ: చిన్న ఆభరణ తయారీ సంస్థల ప్రయోజనాలకు అనుగుణమైన కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. పన్నులకు సంబంధించి చిన్న తరహా పరిశ్రమ(ఎస్ఎస్ఐ) మినహాయింపు పరిమితిని ప్రభుత్వం పెంచింది. ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత రూ.6 కోట్ల టర్నోవర్ పరిమితిని రూ.10 కోట్లకు పెంచింది. ఇందుకు సంబంధించి కొన్ని నిబంధనలను సైతం ప్రభుత్వం సరళతరం చేసింది. నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థికమంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తయారీ వస్తువుల టర్నోవర్ రూ.100 కోట్లు ఉండి, రూ. కోటికన్నా తక్కువ సుంకం చెల్లించిన యూనిట్ల విషయంలో అటు తర్వాత మొదటి రెండేళ్లూ ఎక్సైజ్ ఆడిట్ ఉండబోదని కూడా ప్రకటన తెలిపింది. వెండి యేతర ఆభరణాలపై 1% సుంకం విధింపు బడ్జెట్ ప్రతిపాదనను నిరసిస్తూ.. ఆభరణ వర్తకుల భారీ నిరసనల నేపథ్యంలో... సమస్యల పరిష్కారానికి కేంద్రం ఒక కమిటీని వేయడం తెలిసిందే.